Previous Page Next Page 
నింగిలోని సిరిమల్లి పేజి 13

    "ఎప్పటికీ జాబ్ వదిలెయ్యకండి ఈ కాలంలో అడవాళ్ళకి జాబ్ కి మించిన సేక్యూరీటి లేదు. ఆడవాళ్ళకి ఆర్ధిక స్వాత్రంత్రాన్ని మించిన అరిగ్యం మరేది లేదు __"
    "యస్సర్!" అంది క్లుప్తంగా.
    "నువ్వు బాగా వర్క్ చేస్తావని రామలింగయ్యగారు కూడా చెప్పారు ఆయనే చెప్పి లీవ్ శాంక్షన్ చేయించారు. లీవ్ ఎక్స్ తెక్షన్ కి కూడా అయన రికమెండ్ చేశారు. అయన మాట కూడా నేను విశ్వసిస్తాను"
    "తన లీవ్ ని రికమెండ్ చేసింది రామలింగయ్యగారా? మరి సుధాకర్ అలా చెప్పడే౦?" అనుకుందామె.
    "మా అమ్మాయి లిద్దర్నీ బ్యాంక్ లో చేర్పించాను. ఇద్దరూ కమస్ర్ గ్రాడ్యుయేట్స్ . టైఫ్ షార్ట్ హేండ్ పాసయ్యారు. కవల పిల్లలు.  ఇక పెళ్ళిళ్ళు చేసెయ్యాలి__"
    సుజాత మృదువుగా నవ్వేసింది. ఆమె పైకి నవ్వినా ఆమె మనసులో కొద్దిగా బాధ కదలాడింది. అతనిని గురించి తన తండ్రి యిలా అనుకుమ్తాడా? అయన కెప్పుడూ డబ్బుయావ. జీతం మొత్తం ఆయనకే పంపించి, తనెలా గడిపినా అక్కర్లేదు ఆయనకి. చేల్లిపై తమ్ముడిపై ఉన్న ప్రేమలో అణుమాత్రం ప్రదర్శించినా తనెంతో సంతోషించేది. ఆ విషయంలో పిన్నెనయం. ఎలా వున్న పైకి ప్రేమ నటిస్తుంది".              
    "పెద్దమ్మాయ్యకి ఓ ఐ.ఏ. యస్ పాసైన అబ్బాయి సంబంధం వచ్చింది. దాదాపు ఖాయం అయింది"
    "మంచి సంబంధం సర్" అని పైకి అనేసింది. కాని తన మానసులో మళ్ళీ ఆలోచనలు "తన తండ్రి తన పెళ్ళి గురించి అలోచిస్తొన్నాడా? ఊహు౦"
    "రెండో అమ్మాయికి ప్రొబేషనరీ ఆఫీసర్ __ఇన్ కంటాక్స్ డిపార్ట్ మెంట్ సంబంధం చూశాను అదీ దాదాపు నిశ్చయమైనట్టే __ అన్నట్టు యిద్దరూ దూరపు బంధువులే!"
    "బావుంది సర్ __ మీ అమ్మాయి లిద్దరూ అదృష్టవంతులు " అంది. పైకి సంతోషం వెలిబుచ్చుతోంది. మళ్ళీ మనసులో తపన. తన అనుబంధం తనే వెదుక్కుంటుంది. తను పద్మం అయినా సుధాకర్ చుట్టూ తన మనస్సు తిరుగుతో౦ది అతని ఐశ్వర్యానికి, వాళ్ళ హొదాకి తను తగదు. కానీ తనని తానుగా స్వీకరిస్తే తన కంటె అతనికి మంచి అమ్మాయి దొరుకుతుందా? అతని మనస్సేలా వుందో! పైకి ప్రేమ నటిస్తోన్నడా? నిజంగా ప్రేమిస్తోన్నాడా?
    ఎక్కడైనా మగవాళ్ళే బయటపడి ప్రేమని వెలిబుచ్చుతారు. తన విషయంలో తారుమారవుతుందా అది. తనే అడగాలా?"
    ఆఫీసరుగారేదో చెబుతున్నారు సుజాత చెవులు వింటున్నా మనస్సు కేక్కటంలేదు అవి. ఆమె అలోచనలు ఆమెవి.
    అంతలోనాగరాజు వచ్చాడు.  రక్షించేందుకు అన్నట్టుగా.
    "వస్తానండీ!" అంటూ లేచింది సుజాత.
    "వెళ్ళిరామ్మా!" అన్నాడు ఆఫీసరుగారు.
    లేచితన సీట్లోకి వచ్చింది.
    సాయంకాలం టపాల్లో శుభలేఖ వచ్చింది. విప్పి చూసిందామె. తన ప్రెండ్ చందన __ తనతో పాటే డిగ్రీ చేసి బి. ఎడీ చేసి మునిసిపాలటీలో చేరింది. వరుడు విశ్వనాథ్. సెట్స్ లో కెమికల్ ఇంజీనీర్ .
    అదృష్టవతురాలు __ పెళ్ళయి పోగానే అత్తారింటికంటూ అమెరికా వెళ్ళిపోతుంది" అనుకుంది.
    ఓ అరగంట ముందుగా పర్మిషన్ అడిగి బయటపడింది. మెల్లిగా నడుస్తూ దగ్గరలోవున్న ఓ హొటల్లో దూరి టిఫిన్ కి అర్దరిచ్చింది.
    ఏదో తెలియని కోపం __ మరేదో చేసెయ్యాలనే ఆవేశం __ ఏడీ స్పష్టంగా తెలియటంలేదు.
    "హలో__"
    సుధాకర్ గొంతు విని ఉలికిపడింది చప్పున ఆలోచనల నుంచి బయటపడింది.
    సుధాకర్, అతని ప్రక్కనే మరో అందమైన అమ్మాయి మెడ ఫార్ యీచ్ ఆదర్ అన్నట్టుగా వున్నారు.
    ఒక్క క్షణం మనస్సులో అసూయ జర్రిపోటులా కదలాడింది "హల్లో" అంది నవ్వుతూ__
    "అలా వున్నరేం?" ఎదురుగా ప్రక్కనే వచ్చి కూర్చుంటూ
    ఆ అమ్మాయీ అతని ప్రక్కన్నే వచ్చి కూర్చుంది. పూల గుత్తుల్ని కుర్చీలో అమర్చినట్టుగా కూర్చుంది. కట్టు కున్న చీరకే అందాన్ని సంతరించి పెట్టెటంతా సుకుమారి తనం.
    "ఏమిటి?" అన్నాడు మళ్ళీ నవ్వుతూ.
    "ఏం లేదు ! ఈ మధ్య తలనొప్పి తరచుగావస్తోంది.
    "ఊరు మారింది కదా! వాటర్ చేంజ్ అచేయి అందుకుని చూశాడు.
    "ఊహూ" మృదువుగా అతని చేయి విడిపించుకుంది.
    ఓ అపరచిత యువతి ముందు అతనలా చనువుగా తన చేతిని పట్టుకోవడం అదోలా అనిపించింది.
    "షి యిజ్ మృదుల, ఎం. బి, బి. యస్. మాకజిన్ ఇక్కడ జి.హెచ్. కి. పోస్టింగ్ యిచ్చారు. ఈ రోజే డ్యూటీలో తను జాయినై౦ది. అందుకే యీ రోజు సెలవు పెట్టాను" అన్నాడు.
    "నమస్కారం "
    "నమస్కారం!" తన పేరుకి తగినట్టుగా మృదువుగా వుంది మృదుల కంఠస్వరం
    చెప్పానుగా మృదులా __ మా ఆఫీసు కంతటికీ ఏకైక నమస్కారం. ఈవిడే మిస్ సుజాత. బి.ఏ.నా బెస్ట్ ఫ్రెండ్"
    మృదుల మృదు గంభీరంగా నవ్వింది. తనకి ముందే చెప్పినట్టుగా ప్రతి వందనం చేసింది.
    సుజాతకి ఉడికిపోయింది. ఆమె కళ్ళు వేగంగా చలించాయి. కోపంతో.     
    అతని కళ్ళు కొంటెగా నవ్వుతూన్నాయి.
    ఖరీదైన సూతుతో రాజాలాగా వున్నాడు. స్ప్రే చేసుకున ఇంటిమేట్ సువాసనల్ని వెదజల్లుతుంది.
    ఆవిడ ఖరీదైన పట్టుచీర కట్టుకుంది.
    "ఈవిడ హాస్పిటల్ కి వెళ్ళిందా? పేరంటానికి వెళ్ళిందా?" అనుకుంది. "ఇంతటి సుకుమారి టైపిస్టో __ లెక్చరరో __ ఆపరేటరో __ అయితే అందంగా వుంటుంది. యాక్టరయినా ఫరవాలేదు __ కానీ డాక్టర్ గా వూహించుకోవటం కష్టం __"
    అంతలో బేరర్ వచ్చి ముగ్గురి ముందూ స్వీట్స్ పెట్టేడు.

 Previous Page Next Page