Previous Page Next Page 
నింగిలోని సిరిమల్లి పేజి 12

    ఆడుతూ, పాడుతూ పాపని నిద్రపోనివ్వకుండా ఆడిస్తూ, ఆ బుజ్జిముండకి కబుర్లు చెబుతూ వంట చేసేసుకుంది అది ఏడవ కుండా నవ్వుతూ వుంటే చకచకా తయారై భోజనం ముగించుకుంది.
    టిఫిన్ సిద్దం చేసుకుని ఠంచన్ గా తన మామూలు వేళకి తయారై పోయి మల్లీశ్వరీని జానికమ్మగారికి అప్పగించేసింది. బస్తాపుకి వెళ్ళి నుంచుంది.
    మామూలుగానే ఎవరూ పలకరించలేదు.
    ఈ రోజు ఎవరినీ లెక్కచేయనంత ధైర్యం వచ్చిందామెకి. ఆ స్థయిర్యంతోనే బస స్టాపులో నిబ్బరంగా నుంచుంది.
                                                                  8
    పదయింది!
    ఉదయం పూట ఎండలో చిరువెచ్చదనం యింకా బాగా ముదరలేదు. సుజాత ఆఫీసు వరండాలో నుంచుని వాళ్ళంతా కళ్ళు చేసుకుని చూస్తోంది. అయితే సుధాకర్ పాలకువేలెదు __ నించుని నించుని కాళ్ళు, చూసి చూసి కళ్ళు లాగేయి. అసహనంగా మరోసారి ఆఖరు సారిగా గేటువైపు చూసి తన సీట్లో కూలబడింది ఆమె.
    మరో పదినిముషాలకి వచ్చారు రామలింగయ్యగారు. "నామస్కారం" చేసింది సుజాత.
    నమస్కారమమ్మ! నమస్కారం! నిన్ను చూస్తె నాకు చాల ముచ్చటేస్తుంది సుబ్బరంగా నమస్కారం అంటావు. మిగతా అంతా గుడ్ మాణింగ్ గాళ్ళే. ఎంత ఇంగ్లీషు చదువుకున్నా, ఎంత అంగ్ల సాంప్రదాయాన్ని పోటిస్తోన్నా మనం తెలుగు వాళ్ళం. మనది తెలుగు దేశం. మన బాష తెలుగు భాష. కన్నడ రాయడైన కృష్ణ రాయడే దేశ భాషల్లో తెలుగు బాషలేస్సయిన భాష అన్నారు.
    మనం ఆ విషయం కూడా గుర్తుంచుకో౦. మనం మన బ్రతుకు తెరువుమన ఉరుకలు పరుగుల్లో ఆ రాయలవారి మాట ఎవరికీ గుర్తుచేసుకునే వెసలుబాటుంది.
    పోనీలే __ ప్రొద్దున్నే ఆ బాధ ఎందుకు__
    ఇటు రామ్మా __ నీతో పనుంది. ఈ పూట సుధాకర్ సెలవు పెట్టాడు. అతని సీటుకి సంబంధించిన ఫైళ్ళు రెండున్నాయి. కొంచెం చూసి జవాబులు రాసిపెట్టు, అన్నాడు.
    హతాశురాలైంది సుజాత. తన ప్రాబ్లం అతనితో చెప్పి, అతనెలా చెబితే అలా నడుచుకోవాలని నిశ్చయించుకుని, వచ్చింది. తన ఊహకి పురిట్లోనే సంధి కొట్టినట్లు అతనీ పూట రానేలేదు.
    రేపు రాడనికాదు_ రేపు చెప్పాకూడదనీ కాదు. కానీ యీ రోజే రేపే_ ఈ రోజు కలిగిన నిరాశ తీరేదెలా ?
    ఫైళ్ళు అందుకుని సీట్లో వెళ్ళి కూర్చుంది. సీట్లో కూర్చుని మనస్సు మరల్చుకుని ఫైలు తెరిచింది. దాన్ని తెరచీ తెరవగానే అతని దస్తూరీ కనిపించింది. ఆ దస్తూరీలో అతని ముఖం కనిపించినట్లయింది. ఆ దస్తూరీలో అతని ముఖం కనిపించినట్లయింది. అతని లాగే అతని అక్షరాలూ పొందిగ్గా అందంగా వుంటాయి.
    తనెంత ఆశతో వచ్చిందో అంత నిరాశ ఎదురైంది ఈ రోజు అతనితో అన్నీ నిశ్చయించుకోవాలని వచ్చింది. ఏడీ కుదరలేదు __ నిశ్చంతనగా గడిచి పోవలసిన యీ రోజు మళ్ళీ ఆలోచనలతో నిండిపోతోంది.
    అందోళన __ నిరాశ మళ్ళీ గూటికి చేరుకునే పక్షుల్లా తిరిగి వచ్చాయి.. ప్చ్! తన అదృష్టం కంటె దురదృష్టమే ఓ అడుగు ముందుగా వుంది. ఏం చేయగలదు తను?
    నిట్టూర్చి ఆలోచనలని పక్కకి పేట్టి ఫైలు చదివింది. ఓ గంటలో ఆ రెండు ఫిల్లా పనీ పూర్తీ చేసి తీసి కెళ్ళి రామలింగయ్యగారికిచ్చింది.
    అయన చాలా సంతోషించారు.
    "చూడు సుజాతా! నీలాటి వాళ్ళు సెక్షను కొక్కరున్నాసరే దేశం యీ రోజు యిలా వుండేది. కాదు __ అయ్యో ప్రభుత్వం సొమ్ము రోజుకింత తింటున్నా మే __ అనే ఆలోచనే వుండడు.
    రోజంతా శ్రమపడినా రిక్షా వాడికి, కూలీ మనిషికి పదిరూపాయలు మిగలవు. హాయిగా ఫేన్ల క్రింద, కూర్చీల్లో కూర్చుని బల్లమీద రాసేందుకి బద్ధకం. పనిచేసే అరుగంతల్లో సిగరెట్టు కాఫీలని గంట ఫైన్నే గతలేస్తారు.
    ఒక్క ముక్క పని పూర్తీ చెయ్యరు. దీనికి తోడు శనివారాలు. శనివారం వస్తే ఆ మరుసటి రోజు ఆదివారాన్ని తలచుకుంటూ పని చెయ్యరు. అయినా మిగతా వాటితో పోలిస్తే మన ఆఫీసు, మన సెక్షన్లు చాలా మెరుగునుకో __ ఏమయినా యు అరె జీనియస్ __"
    సుజాత ఆ కాంప్లెమెంటుకి సంతోషించలేదు.
    నిస్సత్తుగా సీట్లోకి వచ్చేసింది.
    లంచ్ దాకా ఆలోచనలతో గడచిపోయింది కాలం.  లంచ్ వేళలో టిఫిన్ తీసుకోబుద్ధి కాలేదు. కాంటీన్ కి వెళ్ళ కుండా సీట్లోనె విశ్రాంతి ముగించింది. టిఫిన్ శాస్రీకి యిచ్చేసింది. అతనితో టీ తెప్పించుకుని తాగింది. తలనొప్పిగా వుంటే టాబ్లెట్ మింగింది. ప్రపంచమంతా తనని ఏకాకిని చేసేస్తొన్న భావన అంతులేని వేదన.
    అలాగే కూర్చుంది.
    మూడు గంటల తర్వాత ఆఫీసరువద్దకి వెళ్ళింది. ఏదో ఫైలు మీద అయన "స్పీక్" అని రాస్తే వెళ్ళింది. అంతకుముందు తను రాసిన "నోట్" ని కాదన్న అయన యీమేమాటలు విన్నాక ఓ.కే అన్నాడు.
    అదితృప్తి!
    "కూర్చోండి!" అన్నాడు బట్టతల సవరించుకుంటూ
    "థాంక్స్!" అంటూ కూర్చుంది.
    బెల్ కొట్టేడు అయన. శాస్రీ టీ తెచ్చి ఇద్దరిముందూ కప్పుల్లో ఆరెంజ్ చేశాడు, అంతకు ముందే అర్డురిచ్చిరా అన్నట్టుగా.
    "తీసుకొండి!"
    "థాంక్స్!" అంటూ కప్పు తీసుకుంది, "ఈ రోజున్న తలనొప్పికి బండ్ల కొద్దీ టీ తాగాలనిపిస్తోంది" అనుకుంది తనలో
    "మీరు బాగా వర్క్ చేస్తారు ఎకౌంట్ స్ట్ కి రాయండి తప్పకుండా ప్రమోషన్ వస్తుంది. మీరెలాగూ జాబ్ కంటిన్యూ చేస్తారు కదా! లేకపోతె మీ హబ్బీ కాదంటే మానేస్తారా?"
    ఆ మాటలకి సమాధానం యివ్వాలనిపించలేదు. ఊరకే నవ్వేసింది సింపుల్ గా.

 Previous Page Next Page