"తీసుకొండి" అన్నాడతను.
సుజాత ఏదో చెప్పాబోయింది.
"ప్లీజ్ టికెట్ __" అంది మృదుల స్వీట్ వాయిస్ తో .
మరో అరగంట టిఫన్ తీసుకోవటంతో గడచిపోయింది. స్వీటు __కారా __ఐస్ క్రీం __
మృదుల మంచి మాటకారి. సంస్కారయుతంగా మాట్లాడుతుంది. నీట్ గా మాట్లాడుతుంది.
బయటకి రాగానే "రండి! కార్లో డ్రాఫ్ చేస్తాను" అన్నాడు సుధాకర్.
"నోథాంక్స్!" ముక్తసరిగా అంది సుజాత.
"బెట్టు చేయకు __ నేను రోజూ ఆఫీసుకి కారు తీసుకురాను. నాన్నగారు ఇండస్ట్రీయల్ ఎస్టేట్ కి తీసికేళతారు లేదా గ్రేఫ్ గార్డెన్ కి వెళతారు. లేదా థియేటర్ కాంప్లెక్స్ కు వెళతారు. ఎదోయిలా ఎప్పుడో నాకు అవకాశం వస్తుంది __ రండి" అన్నాడు హుందాగా.
సుజాతకి ఆ "లిస్టు" వినగానే మండిపోయింది. మృదుల ముందు తన గొప్ప చెబుతున్నాడా? లేక తనస్థాయి ఎంత గొప్పదో తనకి వివరిస్తోన్నాడా అనుకుంది.
తను యీ ఆడంబరాలు __ యీ అత్తాహాసాలు __ యీ గోప్పతనపు పోకిళ్ళు సహించదు.
అంతలో అతను కారెక్కి కూర్చుని వెనుక డోర్ తెరుస్తూ "కమాన్" అన్నాడు దర్భంగా.
యువరాజులా ప్రవర్తిస్తోన్న అతని ఠీవికి బదులు చెప్పాలేక పోయింది సుజాత.
పైగా మృదుల ముందు తిరస్కరించి అతన్ని అవమానించలేక పోయింది, కూర్చుంది.
కారు రివ్వున దూసుకుపోతున్నది.
సుజాత ఏమీ మాటాళ్ళేదు.
కనీ మృదుల అతని స్పీడ్ డ్రైవింగ్ పై ఏదో జాక్ చెప్పి నవ్వింది మృదువుగా.
ఫక్కున నవ్వింది ఆమె.
అంతలో కారు సుజాత వాళ్ళింటి కౌంపౌండ్ గేటు ముందు ఆగింది.
"ఎప్పుడైనా కలుస్తూ వుండండి" సుజాత చేయి మృదువుగా నొక్కుతూ అంది మృదుల.
"థాంక్స్! ఎపుడయినా వస్తాను"
"ఆమెని కలవాలంటే హాస్పిటల్ కి వెళ్ళాలి. అక్కడికి మీ రిపుడే వెళ్ళలేరు" కొమ్తిగా నవ్వుతూ అన్నాడు సుధాకర్.
యూ నాతీ బాయ్! ఏమిటా సిల్లి మాటలు __ మీరేం పట్టించుకోకండి సిస్టర్ __ నేనుండేది మేతర్నీటీ వార్డులో _"
ఆ మాటలు వినగానే సిగ్గు ముంచేసుకుని వచ్చింది. అతని మొరటు హాస్యానికి కోపమూ వచ్చింది. అంతలో బుగ్గల్లోకి వెచ్చని అవిర్లీ వచ్చేయి సిగ్గే జయించింది కోపాన్ని __
తలవంచుకుంది.
"బై"
కారు కదిలిస్తూ వీడ్కోలు చెప్పాడతను.
స్వర్గ ద్వారం దాకా వెళ్ళి తిరిగొచ్చినట్టుగా గేటు తీసుకుని కాంపౌండ్ లోకి అడుగు పెట్టింది.
నేరుగా తన గాడికి వెళ్ళకుండా జానికమ్మగారింటివైపు నడిచింది. గేటు దాటగానే ఉదయం నించీ మనస్సునీ ఆవరించుకున్న నిరాశ అలసట నిస్స్ప్రుహా ఎటో ఎగిరిపోయి నట్లయింది.
టైఫాయిడ్ రోగికి పద్యం పెట్టినట్లుగా వుంది. తన మనస్సులోని ఛీకకునంతా పోగొట్టాడా సుధాకర్!
వెన్నెలకంటె చల్లగా వుండే తన మనస్సుతో, మాటలతో కవ్వింపులతో తన "డే" సీరియస్ సంతా ఒక్క అరలతో కవ్వింపులతో తన "డే" సీరియస్ నంతా ఒక్క అరగంటలో మాయం చేశాడు అనుకుని, ఆ సంతోషంతో మల్లేశ్వరిచూడాలని నేరుగా అక్కడికి వెళ్ళింది.
9
రాఘవయ్యగారూ, జానికమ్మా ఏదో విషయం తీవ్రంగా చర్చించుకుంటున్నట్లున్నారు. రాఘవయ్యగారి గొంతు కొంత దూరానికే స్పష్టంగా వినబడుతోంది.
వాకిలి వద్దకి వెళ్ళేసరికి మాటలు వినిపించాయి.
సుజాత చప్పున ఆగిపోయింది.
"అందుకే అమ్మాయిని యిల్లు ఖాళీ చేసేయ్యమని చెప్పు అంటున్నాను. విపపళ్ళేదా?"
"ఎందుకండీ అంత పట్టుదల? ఆ అమ్మాయి తప్పేంవుంది. ఇందులో. బాగా ఆలోచించకండి" జానికమ్మగారు సర్ది చెబుతోన్న ధోరణిలో అంది.
"జానీ __ నలుగురిలో పరువుగా బ్రతుకుతున్నాం మనం. ఆస్తిపోయినా ఐశ్వర్యం పోయినా ఫరవాలేదు. పరువుని కాపాడుకోవాలి. మన కౌంపౌండ్ లోగిల్లో అలాటి అమ్మాయి వున్నదంటే మనం మన పరువూ ఏం కావాలి? మనం_"
"ఎలాటి అమ్మాయి?" జానికమ్మగారి గొంతులో కోపం ధ్వనించింది.
"చెడిపోయిన అమ్మాయి_"
"హూం చేడిపోవటానికి ఆ అమ్మాయి ఎవరు ఎవరు చెప్పారండీ మీకీ విషయం? ఎవరు నేర్పారండీ యీ బుద్దులు? ఎప్పుడూ మీ నోట యిలా మాటరాలేదు. చాలా వింతగా వుంది,
ఆయనేం అనలేదు ఆ మాటలకి
ఎక్కడ ఎ అమ్మాయి దగా పడినా ఆ దగా వెనుకు ఓ దుర్మార్గుడు, మోసాగాడూ అయిన పురుషుడుకన్నాడండీ __ మోసం తన వూపిరిగా, అన్యాయం తన ఆశయంగా బ్రతికే మీ మగవాడున్నాడండీ చూసి చూసి ఏ ఆడపిల్లా తనకి తన గొంతుక కోసుకొదు. ఉచ్చులు బిగిస్తూ ఆశలురగిలిస్తూ కబర్లు చెబుతూ గోతుల్లో దించుతారండీ మనకి తెలియదా? మీరు ఒక్కసారి గుర్తుచేసుకోండి __ మన మీ వూరెందుకోచ్చామా?
"జానీ బాధగా అన్నడాయన. అయన గుండెల్లో ఏవో జ్ఞాపకాల దిగుళ్ళు. పరుపుపై మెరిసి పడిన నిగుళ్ళు. హొదాని తగ్గించిన దిగుళ్ళు.
"కవిత..."
"జానీ __" గద్దించాయన
భార్య నోటంట ఆ మూడు అక్షరాలూ విని సహింఛలేనంత ఉద్వేగంతో అరిచాడాయన, వినలేని మాట విన్నట్లు భరించలేని అవమానం పొందినట్టు బాధ పడ్డారు అయన ఒక్కక్షణం నిశ్శబ్దం.