"అందరూ లాభం లేదని చేతులైతెసిన స్థితిలో నువ్వు ఆపరేట్ చేసి నా మనుమరాల్ని బ్రతికిమ్చావు తల్లి. నేను చేసేది డి.ఐ. జి. ఉద్యోగమయినా, చేతిలో చిల్లిగవ్వ లేదమ్మ: ఒక దశలో నా మనువరాల్నిఆమెరికా తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించుకొమన్నారు. అది నాకు సాధ్యంకాదని వాళ్ళకేం తెలుసు....?" అయన కంఠం కృతజ్ఞతాభావంతో పూడుకుపోయింది.
"వేయి జన్మలెత్తినా నీ ఋణం తీర్చుకోలేను తల్లి.... ఈ కాలంలో యింత నిజయితీగా ఎవరూ వుండరేమో తల్లి.... తను తినరు, తన క్రింద పనిచేసే వారిని తిననివ్వరు. అంతమాత్రంచేత కష్టాలు, కన్నీళ్ళు రాకుండా పావుగా....? వచ్చాయి . మా మనువరాలి ట్రీట్ మెంట్ కి ఆర్ధిక సహాయం చేయమని హొంశాఖని అర్ధిస్తే మీకు నిజాయితీ ఎక్కువయిపోయిందని ఫైల్ని తిప్పి పంపించారు. ఇక మా చిట్టితల్లి మాకు దక్కదేమోనని కృంగిపోతున్న సమయంలో మెడికేర్ లో చివరిసారిగా ప్రయత్నించమని ఎవరో చెబితే ఆ హాస్పిటల్ లో చేర్పించాం మా అదృష్టం బావుండి మా కూతురు గర్భాకోశాకిగురికాకుండా నీ రూపంలో దేవుడు మమ్మల్ని కరుణించాడు......." అంటూ ఆమె ఉద్వేగానికి ఆపుకోలేక లేచి అవంతి చేతులు పట్టుకుంది.
ఎవరి వృత్తిమీద వారికి మరింత గౌరవం , ఆపేక్ష కలగటానికి ఇలాంటి సంఘటనలే దోహదం చేస్తాయోమో.....
అవమ్తికి ఎంత ఆత్మస్థయిర్యం వుందో అంత సున్నితమయిన మనస్సు కూడా వుంది. అన్నిటికి మించి స్పదించే హృదయం వుంది. అందుకే ఆమె కళ్ళు కూడా అనందాశృవులతో తడిదేరాయి.
"నా మనుమరాలని మాత్రమే నువ్వు రక్షించలేదమ్మ..... నా కూతుర్ని కూడా రక్షించావు. ఏంచేసినా నీ ఋణం తీర్చుకోలేం తల్లి ..." అయన కళ్ళు ఒళ్ళుకుంటూ అన్నాడు.
నేడో, రేపో డైరక్టర్ జనరల్ ఆఫ్ పాలెస్ కాబోతున్న సీనియర్ డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ పః పోలీస్ కేవలం వృత్తిధర్మాన్ని నెరవేర్చిన తనకు కృతఙ్ఞతలు చెప్పుకొనేందుకు రావటమే కాక, పోలీసాఫీసర్స్ అందరి హృదయాలు కాఠిన్యంతో , అధికారంతో కరుడుగట్టుకు పోలేదని రిజువుచేసే సందర్భంలో బెలయిపోయారు......
కృతజ్ఞతా భావంతో కరిగిపోయారు!! అధికారం ఇచ్చే అహంకాని, కాకీ బట్టలు ఆపాదించే కఠినత్వం కాని ఆయనలో మచ్చుకయినా కనిపించకపోవటం అవంతికి ఆశ్చర్యంగానే కాదు అద్భుతంగా కూడా అనిపించింది.
"అది నా వృత్తి ధర్మం అంకుల్... మీరు పెద్దవారు ... నన్ను అదేపనిగా పొగడద్దంకుల్ ... అహంభావం పెరిగిపోయే ప్రమాదం వుంది" అంది భారంగా వున్న ఆ వాతావరణాన్ని టెలికపర్చే ఉద్దేశంతో అవంతి.
"వృత్తిని అమ్ముకొనేవాళ్ళలో, తన మానసిక రుగ్మతుల్ని తృప్తి పర్చుకోవటం కోసం వృత్తిని అడ్డంపెట్టుకునే వాళ్ళలో పొగడ్త నీవంనట్లు అహాన్ని పెంచుతుందమ్మా! కానీ నీలాంటి వాళ్ళలో ఆత్మస్థయిర్యాన్ని . ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింస్తుంది. ఇక ణా తల్లికి ఏ ప్రమాదం లెనట్లేగా ...?" ఆయనలో ఇంకా, పూర్తిగా అందోళన గత్తలేదని అయన మాటలే చెప్పాయి.
"డోంట్ వర్రీ అంకుల్ ! షి విల్ బీ అల రైట్ ! కాకపోతే కంటి వెనుక భాగంలో లేచింది గనుక __ ట్రీట్ మెంట్ మరికొంత కాలం కొనసాగిస్తే చాలు...." అంది అవంతి వాల్ క్లాక్ కేసి చూసి.
"థాంక్సమ్మా!" అంటూ అయన లేచి భార్య వేపు చూశాడు. ఆమె తన కళ్ళ ద్వారానే ఏదో సందేశం పంపింది.
"మాకు చేతనయింది ఒక బహుమతి ఇవ్వలంకుంటున్నాం. కాదనవుగా తల్లీ.....?" అయన మొహమాటపడుతూ అన్నాడు.
అవంతి పెదాలు విడవికుండా మెల్లగా నవ్వింది.
"నా వృత్తి ద్వారా నేను మిగుల్చుకున్న ఆనందాన్ని ఎంజాయ్ చెయ్యనివ్వండకుల్ ... ప్లీజ్ " అంది చిర్నవ్వుతో. .
ఆశ్చర్యపోవటం అయన వంతయిందీసారి.
"మీరెక్కరే నిజాయితీపరులై చెడిపొయారని కష్టాలు వచ్చినప్పుడు అంటుంటావు మరిప్పుడు....? ఇంక నిజాయితీ ఇలా మిగిలి వుండబట్టే పాపం పండి బ్రద్దలవ్వలిసిన భూగోళం మిగిలి వుంది" అన్నాడాయన తన భార్య కేసి గర్వంగా చూస్తూ.
"వస్తాం తల్లీ.... కాని ఒకటి గుర్తుపెట్టుకొమ్మా! నా కుటుంబాన్ని కాపాడిన నీ రుణాన్ని తీర్చుకునే అవకాశం , అదృష్టం రావాలనే కోరుకుంటున్నాను. రుణభారం కన్న, కృతజ్ఞతా భారం చాలా పెద్దద్దమ్మా ... నీకు మేలు చేసినవారికి నువ్వేం చేసావని ఆత్మసాక్షి నిలదీస్తుంది నేనీ వయస్సులో నా ఆత్మసాక్షి ముందు దోషిగా నిలబడలేదు." అంటూ అయన లేచాడు.
ఆమె అవంతిని అక్కున చేర్చుకుని ఆప్యాయంగా సృజించినది.
దంపతలు యిద్దరూ మరోక్షణంలో బయటకు అడుగు పెడుతుండగా అవమ్తికి రిషి గుర్తుకొచ్చాడు.
"అంకుల్...." అవంతి పిలిచింది.
ఆయనో క్షణం ఆగి వెనక్కీ తిరిగాడు.
"చిన్న ఉపకారం చేసి పెడతారా?" నూతిలోంచి వచ్చినట్లున్నాయమె మాటలు.
అప్పుడు భార్యాభర్త లిద్దరూ అవంతి కేసి విస్మయంగా చూసారు.
కొద్ది క్షణాల తరువాత అయన మెల్లగా నవ్వుతూ __
"ఎందుకమ్మ సందేహిస్తున్నావు? అడుగు... నేను నీ తండ్రి లాంటి వాడ్ని " అన్నాడాయన వాత్సల్యంగా.
కొద్దిక్షణాలు సందేహించింది అవంతి.
అయన వెనక్కీ వచ్చాడు.
అవంతి తల మీద చేయి వేసి నిమురుతూ నవ్వాడు.
"అడుగమ్మా" ఆమె కూడా ఒత్తిడి చేసింది అవంతిని.
"నేను ఒంటరిదాన్ని అంకుల్..... మీ మనస్తత్వాన్నికి వ్యతిరేక మనస్తత్వమున్న మా పాదర్ ని కాదనుకొను వచ్చాను ఆత్మాభిమానంతో ఒంటరిగా బ్రతుకుతున్నాను. ఆత్మవిశ్వాసం కూడా వుంది బ్రతగ్గలనని. కాని ఒంటరితనం మూలంగా ఆత్మస్థయిర్యాన్ని కోల్పోతానేమోనని భయపడుతున్న సందర్భంలో రిషి పరిచయమయ్యాడు...." అవంతి తలవంచుకుంది.
రిషి ఎవరనేది ఆయనర్డం చేసుకోగాలిగాడు.
"రిషికి ఆధారం లేదు. ఐ. మీన్. ఉద్యావుగం లేదు. ఈ స్థితి యింకా కొన్నాళ్ళు కొనసాగితే ఇన్ ఫీరియారిటీ కాంప్లెక్స్ రిషిలో వెళ్తూనుకుటుందని నా భయం" అవంతి తడబడుతోంది.
అయన పూర్తిగా అర్ధం చేసుకున్నాడు అవంతిని .అ ఆమె ఎప్పుడైతే తల వంచుకుని , చీర చేరగుని మునిపంట నొక్కుతూ, కాలి వెళ్ళని మడిచి ప్లోర్ ని రాస్తోందో అప్పుడే ఆయనకి అవగతమయింది.
అయన నవ్వుతూ అన్నాడు . "ఇంకా పెద్ద కోరిక కోరాతాడని ఆశపడ్డాను ఇదేనా?"
అవంతి చటుక్కున తలెత్తింది.
"రిషి ఏం చదువుకున్నాడు?" అయన ప్రశ్నించాడు.
"పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసాడు. ఉద్యోగం లేదని, రావటం లేదని, ఇన్ ఫీరియర్ గా ఫీలవుతున్నాడు. దాని మూలంగా బ్యాలెన్స్ కోల్పోతున్నాడు కనుక...." ఆమె ఆ పైన మాట్లాడేందుకు ఇబ్బందిగా ఫీలయింది.
అయన అవంతి మోహమాటాన్ని గుర్తించాడు.
"నా కర్దమయిందమ్మా! నీ హబ్బీ పోలీసు డిపార్ట్ మెంట్ లో పని చేసేందుకు ఒప్పకుంటాడో, లేదో అడిగిచూసి, అంగీకారమయితే వచ్చి నన్ను కలవమని చెప్పమ్మా!" అంటూ అయన తన విజిటింగ్ కార్డ్ ఇచ్చేసి బయటకు నడుస్తూ తిరిగి అన్నాడు "రిషికి చాలెంజి౦గ్ జాబ్ ఇప్పిస్తాను __ ఈ టైమ్ లో వచ్చి యిబ్బంది పెడితే సారీ . వస్తా తల్లీ " అంటూ సాగిపోయారు.
వాళ్ళు కనిపించేతవరకూ చూసి ఆనందంగా లోపలకు నడిచి తలుపులు వేసుకుంది.
* * * *
సరీగ్గా రాత్రి పన్నెండు గంటలకు క్రితం రోజ గార్డెన్ లో రామదాసు చెప్పిందేమీ రేపు దినపత్రికల్లో రాదు. ప్రశాంతంగా నిద్రపోమ్మని చెప్పు " అని మైఖల్ రాజు చెప్పాగ్గాని గోపీనాధం రిలాక్స్ కాలేకపోయాడు.
అదే విషయాన్నీ నందకిషోర్ కి చెప్పాడు గోపీనాధం.
అప్పటివరకు టెన్షన్ తో బుగుసుకుపోయిన నందకిషోర్ మొఖం అప్పుడు ప్రశాంతంగా మారిపోయింది.
ఆ విషయాన్ని చీఫ్ సెక్రటరీ కూడా అర్ధం చేసుకున్నాడు.
"మైఖల్ రాజు అర్చన్ లాండ్ సీలింగ్ పర్మిషన్ కోసం అప్లయ్ చేసాడు గదా. ఆ ఫైల్ ని వెంటనే పంపించు. రేపు ఉదయానికి అది నా టేబుల్ పై వుండాలి" చీఫ్ సెక్రటరీ ఉద్దేశించి ఆదేశించి కుర్చీలోంచి లేచాడు నందకిషోర్.
* * * *
శుభోదయం పత్రికాఫీసులో అసోసియేట్ ఎడిటర్ టేబుల్ మీదున్న ఫోన్ రాత్రి ఒంటిగంటవరకు రింగయింది.
"హలో శుభోదయం అసోసియేట్ ఎడిటర్ ని మాట్లాడుతున్నాను. మీరెవరు?"
"నేను . రిపోర్టర్ రామరాజుని మాట్లాడుతున్నాను."
"ఏమిటో చెప్పు. ఇక నేను ఇంటికి పోబావుతున్నాను. ఎనీ సెన్షేషనల్ న్యూస్ ?"
"ఎస్ సార్ ! ప్రతిపక్ష నాయకులు రామదాసుగారు మిగతా పత్రికల వారికి సాదా సీదా న్యూస్ యిచ్చి, మనకు మాత్రం అద్భితమైన న్యూస్ యిచ్చారు. సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కాఫీలు కూడా ఇచ్చారు. పోటోలు కూడా ఇచ్చారు. ఫ్రంట్ పేజీ క్లోజ్ అయిందా ?"
అయినా పర్వాలేదు న్యూస్ సేన్శానల్ అయితే ఆ పేజీని అపిస్తాను. నువ్వు వెంటనే బయలుద్రి వచ్చీ రామరాజూ! ఆలస్యం చేయవద్దు."
"బయలు దేరుతున్నాను సార్"
లైన్ ఆఫ్ అయింది.
* * * *