Previous Page Next Page 
మయసభ పేజి 13

   

  "మీరు చెప్పినట్లుగానే చెప్పాను. రోజ గార్డెన్ లో సి.ఎమ్. గురించి మంచిగా చెప్పను. ఆ తరువాత రామరాజుని నా కారులో  ఎక్కించుకుని దారిలో విషయమంతా చెప్పి, మీరిచ్చిన ఫోటోస్టాట్ కాఫీలు, ఫోటోలు అతని కందించాను. మూడో కంటికి తెలీకుండా పని జరుగుతోంది. రేపు ఉదయం శుభోదయంలో సి.ఎమ్. మీద బాంబు పడుతుంది. ఆ తరువాత మీరెలా కథని మలుపు తిప్పుకోవాలంటే . అలా తిప్పుకోండి నాకిస్తానన్న లాండ్......" ఆపైన రామదాసు మాటల్ని మింగేసాడు.

    మాణిక్యం, మారప్ప, మురహరి ముగ్గురూ ఒక్కసారే చిన్నగా నవ్వారు.

    "దాన్ని ప్రతిరోజూ పేపర్స్ లో రభస చేయవలసిన పని ఇంకా మిగిలి వుంది. అప్పుడే నీ పని అయిపోలేదు. రామదాసు ఇక నీకు రిజిస్ట్రేషన్ చేస్తానన్న పొలం ఖచ్చితంగా నీకు రిజిస్ట్రషన్ అవుతుంది.  డోంట్ వర్రీ కాకపొతే నోరుని కాస్త కంట్రోల్ లో వుమ్క్ష్చుకొవాలి. పొరపాటున నోరు జారినా మేం బయటకోస్తాం.... అది మాకు మంచిది కాదు. అర్ధమైందా?" మారప్ప అనునయంగా చెప్పాడు.

    రామదాసు పరమానందభరివూతు తలూపాడు.

    సి.ఎమ్. నందకిషోర్ సీట్ ని పెకలించే ప్రయత్నం శుభోదయం ఫ్రంట్ పేజీలో ఊపిరి పోసుకోసాగింది.

                                                                  *    *    *    *   

    ఇటీవల కాలంలో పోలీసు శాఖని, విభాగాన్ని సమాజ శ్రేయస్సుకన్నా ఎక్కువగా వ్యక్తిగత అవసరాలకే వాడుకుంటున్నారు. అధికారంలో వుందే నాయకులూ. అందులో భాగంగానే రామదాసు ఇంటి మీద ఒక అధికారి, మాణిక్యం, ఇంటి మీద మరో అధికారి నిఘా వేసారు. అయినా వారికి సంబంధించిన మూమెంట్స్ ని ఏమాత్రం గ్రహించ లేక పోయారు.

    రామదాసు ఆ రాత్రి ఇంటికే రాలేదు.

    మాణిక్యం గూఢచారివిభాగపు అధికారికన్నా నాలుగాకులు ఎక్కువ  చడువుకున్నవాడే గనుక, అలాంటి ప్రమాదాన్ని ముఖ్యమ్మత్రి నుంచి ఎదురు కావచ్చునని తలచే, ఇంటి ముందున్న తన కారుని అలాగే ఉంచి, ఇంటి వెనుక నుంచి నిశ్సబ్దంగా నిశీధిలోకి జారుకుని ఆటో ఎక్కి తను చేరవల్సిన గమ్యస్థానానికి చేరుకున్నాడు. 

    దాంతో నిఘా కోసం వినియోగించిన ఈ ఇద్దరి అధికారుల వైర్ లెస్ సెట్స్ ముక్యమంత్రికి ఎలాంటి సమాచారాన్ని అందించలేక పోయాయి.

                            *    *    *    *    *

    పవర్ లాభి పగటి పనులతో, సాయంత్రపు ముచ్చట్లతో అలసిపోయి ఆదమరచి వుంది.

    శుభోదయం అసోసియేట్ ఎడిటర్ ఆ రాత్రికి ఇంటికి రావటం  లేదని ఫోన్ చేసి భార్యకు చెప్పేసాడు.

    ఆయనకు ఎదురుగా ఉన్న రోపోర్తర్ రామరాజు శరవేగంతోన్యూస్ స్టోరి రాస్తున్నాడు. అయిన కాగితాన్ని అయినట్లు చదివి చిన్న చిన్న కర్శక్షన్స్ చేసి ఫోటో కంఫోజి౦గ్ సెక్షన్ కి పపిస్తున్నాడు. అసోసియేట్ ఎడిటర్ .

    క్షణాలు..... నిమిషాలై పోతున్నాయి.

    ఆఫీసులో ఎవరన్నా ప్రలోభపడో, కక్కు ర్తిపడే ముఖ్యమంత్రి రెసిడెన్స్ కి పోన చేసి జరిగింది చెబుతారని, చైర్ మెన్ అంగీకారంతో శుభోదయం ఫోన్ కనెక్షన్ ని డిస్కనేక్ట్ చేయించాడు రిపోర్టర్ రాజు.

    ఓ అరగంటకు రామరాజు రాయటం ముగించి వెంటనే పేజీ మేకఫ్ రూమ్ కి వెళ్ళాడు. అప్పటికే మాస్టర్ హెడ్ క్రింద 'భూ బకాసురుడైన ముఖ్యమంత్రి ' అనే బ్యానర్ పార్టీ ఎయిట్ పాయింట్ లో అతికించి కనిపిస్తోంది. లే అవుట్ ఆర్టిస్ ప్రకక్కు వెళ్ళి నించున్నాడు రామరాజు. ఆర్టిస్ డేట్ లైన్, బ్రాకెట్లో ఉన్న రామరాజు అనే బ్రోమైడ్ ని అతికిస్తున్నాడు.

    "రైట్ సైడ్ ఒక పోటో , లేఫ్ట్ ఒక పోటో పేట్టి, క్రింద మరో ఫోటో రైటఫ్ వచ్చిందా" రామరాజు ఎక్సైట్ అవుతూ అడిగాడు.

    ఆర్టిస్ తలూపి ప్రక్కనే వున్న, పోటోల్ని , రైటస్ బ్రోమైడ్ ని రామరాజు చేతికిచ్చాడు.

    నిర్మాణంలో వున్న ముప్ఫై అంతస్థుల అపార్ట్ మెంట్స్ భవనపు పోటో ఒకటి..... పునాదులు లేచి వున్న మరో నిర్మాణం పోటో, ముఖ్యమంత్రి నందకిషోర్ నోరు తెరచి మాట్లాడుతుండగా తీసిన పోటో ఒకటి ఉన్నాయందులో

    వాటి కింద అర్భన్ లాండ్ సీలింగ్ ఫిల్ పోటో వుంది. డనిమీద ఒక వ్యక్తి పేరన పర్మిషన్ ఇస్తూ కామెంట్ రాసి సంతకం చేసిన ముఖ్యమంత్రి చేతి వ్రాత స్పష్టంగా కనిపిస్తోంది. ఒక ధర్మాసుపత్రి కట్టించబోతున్నాను __ దానికి  అనుబంధంగా కొన్ని అపార్ట్ మెంట్స్ కట్టి, వాటిమీద వచ్చేలాభాన్ని ,ఆ ధర్మాసుపత్రి నిర్వహణకు ఉపయోగిస్తానని, తనకున్న తొమ్మిది వేల గజాల స్థలానికి అర్భన్ లండ్ సీలింగ్ పర్మిషన్ ఇవ్వమని కోరుతూ ఒక వ్యక్తి పెట్టుకున్న అర్జీ 'సంఘశ్రేయస్సుకు ఆ స్థలాన్ని వినియోగిస్తానంటున్నాడు గనుక పర్మిషన్ ఇవ్వటం సముచితమని నేను భావిస్తున్నాను' అని వ్రాసి సంతకం చేసాడు నందకిషోర్.

    ప్రిన్స్ ముకరమ్ జూహీ వారసుడు రాష్ట్రా, కేంద్ర ప్రభుత్వాలకు పెద్ద మొత్తంలో పన్ను బకాయిపడ్డాడు గనుక. ఆ కబాయిల్ని అతను తీర్చటం ప్రభుత్వాలకు మేలు, గనుక, అర్భన్ లాండ్ సీలింగ్ లో ఇరుక్కుపోయిన అతని స్థలంలో నాల్గవ భాగానికి సీలింగ్ పర్మిషన్ ఇస్తున్నానని కామెంట్ వ్రాసి మరో ఫైల్ మీద సంతకం చేసాడు ముఖ్యమంత్రి నందకిషోర్ .

    ప్రభుత్వధినేతలు తలిచుకుంటే రాత్రికి రాత్రి కోట్లు వచ్చపడతాయి. ప్రజా సంక్షేమం కోసం ఏ చట్టాన్ని ప్రభుత్వ తీసుకొచ్చినా, ఆ చట్టం మూలంగా ప్రజలకన్నా ప్రభుత్వాధినేతలకే లాభం ఎక్కువ వనగూడుతుంది. ఏ చట్టమూ ప్రజలకు ఆశించినంత మేలు చేయదు పైకి మాత్రం ప్రజల సంక్షేమం అనే ముసుగు కనిపిస్తోంది.

    ప్రీన్స్ ముకరం జూహీ స్థలం ఖరీదు ప్రభుత్వ అంచనా ప్రకారం గజం ఆరువందలు. బయట గజం రెండు వెలుంటుంది. ఎన్ని గజాలమ్మితే అన్ని ఆరువందలు ప్రభుత్వాలకు బకాయిక్రింద చేల్లిస్తాడు. ప్రతి గజానికి బ్లాక్ లో పద్నాలుగువందలు అటు ముకరం జూహీ వారసుడికి, ఇటు ముఖ్యమంత్రికి చేరిపోతాయి. పైకి మాత్రం ప్రభుత్వ బకాయిలు పేరుకుపోతే ప్రజా సంక్షేమ కార్యక్రమాల్ని నిర్వహించటం కష్టం __ అసలే మది ప్రజా ప్రభుత్వం, అనే కబుర్లు.....

    తొంభై తొమ్మిది శతం భారతదేశపు రాజకీయ నాయకులు పంది కొక్కులు. పదవి కోసం ఏ నీచానికైనా దిగజారే పరం నిక్రుష్టలు ..... ఇలా సాగిపోయింది రామరాజు వ్రాసిన న్యూస్ స్టోరీ......

    ఆ తెల్ల వారుఝాము శుభోదయం పత్రికలో పనిఒచేస్తున్న అందరూ రామరాజు ధైర్యానికి , ముఖ్యమంత్రి అవినీతి పనులకు ఆశ్చర్యపోయారు.

    సరీగ్గా తెల్లవరుఝామున మూడుగంటలకు సిటీ ఎడిషన్ ప్రింటింగ్ మొదలయింది.

                                *    *    *    *   

    అదే తెల్ల వారుఝాము ఐదు గంటల సమయం.....

    "రిషీ ..." నిద్ర నుంచి లేచిన అవంతి కనురెప్పల్ని మృదువుగా రబ్ చేసుకుంటూ రిషి పడుకున్న చోటుకి వచ్చి పిలిచింది.

    రిషిలో ఏ మార్పు  లేదు.

    "రిషి " అంటూ అతని ప్రక్కనే కూర్చుంది.

    అయినా ఫలితం లేకపోయింది.

    తన కుడి చేత్తో అతని భుజాన్ని తడుతూ రెండు మూడుసార్లు పిలిచింది.

    అప్పటికి కొద్దిగా కదిలాడు.

    ఆ పైన మూల్గాడు బద్దకంగా.

    "నేను ఈ రోజు త్వరగా హాస్పిటల్ కి వెళ్ళాలి. నువ్వు త్వరగా లేస్తే బ్రేక్ ఫాస్ట్ రడీ చేసి వెళతాను...." అంది అవంతి అతని మొఖం మీద అల్లుకుపోయిన జుట్టుని మృదువుగా పైకి నెడుతూ.

    "అబ్బ..... కొంచెం అగు..... నిద్ర ముంచుకోస్తోంది. ...." అన్నాడు కళ్ళు తెరవకుండానే .

    "నేను అగనే ఆగను....." అంది అవంతి చిన్నపిల్లల్లా మారం చేస్తూ.

    అవంతి ఇక తను నిద్ర లేవందే ఒదిలిపెట్టడని రిషికి తెలుసు

    "సరే.... లేస్తాను. కాని బెడ్ కాఫీ ఇవ్వాలి" అన్నాడు ఆమె అరచేతిని తన ముఖానికేసి రుద్దుకుంటూ. 

    "అలాగే.... మరి త్వరగాలే" అంటూ వంటగదికేసి నడిచింది.

    రిషి బద్దకంగా తిరిగి నిద్ర కుపక్రమించాడు.

    ఐదు నిమిషాల్లో కాఫీ రడీచేసి తిరిగి వచ్చింది అవంతి.

    అప్పటికీ నిద్రపోతున్న రిషిని చూసి ఆమెకి కొద్దిగా కోపం వచ్చింది.

    అవంతి అడుగుల చప్పుడు కాకుండా మెల్లగా రిషిని సమీపించి అతని చెవిని మేలి పెట్టింది.

    చురుక్కుమనటంతో ఒక్క ఉదుటున లేచి కూర్చున్నాడు రిషి.

    "నీ కంటె పనుంది నాకేం పనుంది..... ఏం పని లేదని మర్చిపోవటానికే పానికి మాలిన నిద్ర పోతున్నాను. నన్ను ఒదిలేసి నువ్వెళ్ళు చిన్ని" చాప మీద కూర్చుని బ్లాంకెట్ ని ముసుగులా కప్పుకుంటూ అన్నాడు రిషి.

    "త్వరలో నీకూ పనుంది....." అంది అవంతి బ్లాకేంట్ ని లాగేసుకుంటూ.

    "నాకా? పనా....?! నాకు పనిచ్చే పనికిమాలిన వాడేవడు ...?" కొంటెగా ప్రశ్నించాడు రిషి. 

 Previous Page Next Page