అతి ముఖ్యమైన సంచారాన్ని అందిస్తాను __ పది లక్షలు పంపిసతారా? అని ఆ పోన్ వ్యక్తి స్ట్రెయిట్ గా అడిగాడు.
మాణిక్యం డన్ అన్నాడు.
ఇన్ ఫర్మేషన్ పాస్ అయింది.
మాణిక్యం ఎత్తుగడ తన రూపు మార్చుకుంది.
* * * * *
అవంతి ఇంటి ముందు రాత్రి తొమ్మిది గంటలకు ఒక కారు వచ్చి ఆగింది. అందులోంచి యాభై ఏండ్లున్నా ఒక వ్యక్తి దిగి లోపలకు వెళ్ళి అవంతి పోర్షన్ తలుపు తట్టాడు.
నిముషం తరువాత అవంతి వచ్చి తలుపు తీసి ఎదురుగా ఉన్న వుఅక్తిని చూసి ఎవరన్నట్టు కనుబోమ్మల్ని ఎగురవేసింది.
"ఐయామ్ చూడప్ప..... సి ఎస్ చూడప్ప ...." అన్నాడా వ్యక్తి.
"ఆహా ... వాటన్ కేన్ ఐడూ ఫర్ యూ?" అంది మర్యాడుగా అవంతి
"నీవు చేయవలసింది ఈ రోజు ఉదయమే హాస్పిటల్ లో చేసేవమ్మ. కృతఙ్ఞతలు చెప్పుకుందామని వచ్చాను " అన్నాడతను.
అప్పుడు కనిపించింది అవంతికి, ఆ వ్యక్తి వెనుక ఒక మధ్య వయస్కురాలైన స్త్రీ ఉన్నట్లు. అప్పటికే అవంతి కొద్దిగా అర్ధం చేసుకుని ఉండటంతో తను తప్పుకుని దారిచ్చింది వాళ్ళకి.
ఇద్దరూ లోపలకు వచ్చారు.
"ఈవిడ నా భార్య....." అన్నాడతను తనతో వచ్చిన స్త్రీని పరిచయం చేస్తూ.
"కూర్చోండి" అంటూ సోఫా చూపించి లోపలికి వెళ్ళింది అవంతి.
ఉన్నవి రెండే గదులైనా ముచ్చటగా ఉన్నాయి. ఎంతో అభిరుచి ఉంటే తప్ప ఆ రూమ్ లోకి అలాంటి వస్తువులు రావు. మూలగా ఉన్న టేబుల్ పై ఎల్ .....ఒ.....వి....ఇ..... అనే ఇంగ్లీషు అక్షరాలతో చేసిన పెన్ స్టాండ్ __ దానికి ప్రక్కనే స్వామి వివేకానంద కంచువిగ్రహం ఉన్న గోడపై జనపనారతో చేసిన హేంగింగ్ మేట్ .... ఆ మేట్ మీద ఒక నిర్జన ప్రదేశంలో కొండవాగు నడిచివెళ్తున్న జంట......."
అన్నిటికన్నా ఆయన్ని బాగా ఆకట్టుకున్న విశేషం వేరే ఉంది.
కాలతీతమైనా సౌందర్యాన్ని, పకృతిలో సజీవమై నిలిచే సాహసో పెతమైన సృష్టి కార్యాన్ని ప్రధానంగా తీసుకుని పదిహేడవ శతాబ్దంలో అద్భుతమయిన కళాఖండాల్ని సృష్టించిన అభినవ బ్రహ్మ జాకోట్ వాన రూయిస్ డేయిల్ పెయింటింగ్ కి ప్రతిరూపమది ... అయన దానికేసే చూస్తుండగా అవంతి హార్లిక్స్ కలిపినా కప్పులతో వచ్చింది.
ఏమ్మా..... డచ్ లాండ్ స్కేఫ్ పెయింటర్ జాకోబ్ వాన్ నీ అభిమాన పెయింటరా ...?" అయన హార్లిక్స్ కప్పు అందుకుంటూ అన్నాడు.
అవంతి అయన కేసి విస్మయంగా చూసింది. తైలవర్ణ చిత్రాలపై ఎంతో అవగాహాన ఉంటే తప్ప దూరంగా ఉండే, దాన్ని చిత్రించిన పెయింటర్ పేరు చెప్పటం కష్టం.
"మీకు పెయింటింగ్స్ అంటే ఇష్టమా....?" అవంతి విస్మయం నుంచి తేరుకుంటూ అడిగింది.
"ఆయనకు చాలా పిచ్చమ్మ.... చేసేది పోలీసు ఆఫీసర్ ఉద్యోగం.... ఆరాధించేది తైలవర్ణ చిత్రాల్ని " అందామె అందుకుంటూ.
"నీకూ బాగా ఇష్టమా.....?" అయన ప్రశ్నించాడు. తన్మయంగా కళ్ళను వాల్చి నెమ్మదిగా తెరుస్తూ తన భావాల్ని తెలియపరచింది. అవంతి.
"నీ వయస్సుకు తగ్గ చిత్రాన్నే ఎన్నుకున్నావు"
అయన మాటలు అవంతికి అర్ధం కాలేదు.
అది అయన అర్ధం చేసుకున్నాడు.
"ఈ పెయింటింగ్ ని జాకోబ్ వాన 1650 లో వేసాడమ్మ. 1650 లో జాకోబ్ డచ్ జర్మన్ బోర్డర్ ని సందర్శించాడు. రోలింగ్ హిల్స్....... ప్లీటి౦గ్ స్ట్రీమ్స్ ..... పచ్చటి పర్వత శ్రేణుల్ని , వాటి మధ్య నుంచి గలగలా పారే సెలఎరుల్ని చూసి తన్మయం చెంది, తనలో కలిగిన రోమాటింక్ పీలింగ్ వర్ణచిత్ర రూపం కలిగించాడట. పర్వశ్రేణులు ప్రేయసికి ప్రతీకయితే __ పారే ప్రియుడుకి ప్రతీక ...." అంటూ తనకు తెలిసింది చెప్పాడాయన.
"చిన్నలోపం అంకుల్.... సారీ" అవంతి తడబాటుగా.
అయన నవ్వాడు.
"అలాగే పిలువమ్మ" అన్నాడాయన ఆప్యాయంగా.
"వెనుక పర్వతశ్రేణి, దాని ప్రక్కన చిన్న గుడిసె...... దానిముందు నుంచి ప్రవహించే సెలయేరు .... ఆ సెలయేరు పైన కర్రల వంతెన .... అంతా బాగానే ఉంది. కాని ప్రేయసీ.ప్రియుడ్ని చిత్రించలేదేమిటా అని అప్పుడప్పుడు ఒక కోపంగా భావిస్తుంటాను" అంది అవంతి డ్రీమిగా .
"నా దగ్గర మరో రెండు పెయింటిగ్స్ చాయానిట్రాలున్నాయమ్మ __ కావాలంటే ఇస్తాను" అన్నాడాయన .
అప్పుడు ఉలిక్కిపడింది అవంతి.
ఇంతకీ ఎవరాయన....? ఎందుకొచ్చారు.....? అనే ఆలోచన వచ్చింది.
"జాకోబ్ పెయింటింగ్ ని చూడగానే ఎలా ఫీలవుతావమ్మ ....?"
"It haunts my and clings to my heart" అంది అవంతి తిరిగి డ్రీమ్ గా.
అయన అవంతివేపు పశంసగా చూసాడు. ఆ తరువాత కొద్ది క్షణాలు నిశ్శబ్దం అలుముకుందా గదిలో .
* * * *
సరిగ్గా రాత్రి పదిగంటలకు రోజ్ గార్డెన్ దగ్గర కారు దిగాడు రామదాసు అయన కోసమే ఎదురుచూస్తున్న జర్నలిస్టు అత్రుతుగా ఆయనకు ఎదురేగి ప్రశ్నల వర్షం కురిపించసాగారు.
వాళ్ళ హడావుడి అంతా పూర్తయ్యేదాకా వుండి అప్పుడన్నాడు నెమ్మదిగా రామదాసు . "పెట్రోలుకి బదులు ప్రత్యామ్నాయ ఇంధనం ఉత్పత్తినే చేసే భారీ పరిశ్రమ మన రాష్ట్రానికి రప్పించిన ముఖ్యమంత్రి నందకిషోర్ ప్రశంసా పాత్రులు " అని.
జర్నలిస్టు షాక్ తిన్నారు.
ఒకరి మేఖాలు ఒకరు అర్ధంకానట్లు చూసుకున్నారు.
ఆపైన చిద్విలాసంగా నవ్వడు రామదాసు .
ముఖ్యమంత్రి పదవి ఊడిపోయే స్కాండల్ ని బయట పెడతాడని, రాష్ట్రా ప్రజల్లో సంచలనం సృష్టించే వార్తని అందిస్తాడని వచ్చిన పాత్రికేయులకు ఏం చేయాలో తోచలేదు కొద్దిసేపు. మాణిక్యం ఎత్తుగడ మారినట్లు వాళ్ళకేం తెలుసు?
"ఇది.... కేవలం ఇది చెప్పటానికే ఈ టైమ్ లో యిక్కడికి పిలిపించారా?" ఒక సీనియర్ జర్నలిస్టు షాక్ నుంచి తేరుకుంటూ అడిగాడు.
"మరేమనుకొని వచ్చారు......? తిదతాననా....? ఎంతసేపు ఎవరు ఎవర్ని తిట్టుకుంటారని ఎదురుచూట్ట మేనా మీ వృత్తి ....? మంచి చేస్తే మంచి చేసాడని చెప్పాలి. చెడు చేస్తే చెడు చేసాడని చెప్పాలి. మంచి చేసినప్పుడు కూడా తిడితే ఇంకేవరికయినా భవిష్యత్తు భవిష్యత్తులో మంచి చేయాలనిపిస్తుందా....? ఉండదు సరికదా __ ఇరిటేషన్ వస్తుంది. ఒకర్ని ఒకరు తిట్టుకుంటే దాన్ని పేపర్స్ లో వస్తే పాఠకులు బాగా కొంటారనే మీ అభిప్రాయం పాఠకుల్ని కించపర్చేదిగా వుంది.
మంచిచేసినా ఇందులో ఏదో రాజకీయముందని తిడుతుంటారు కొందరు ప్రతిపక్ష సభ్యులు .మంచికోసం రాజకీయ చేస్తేమటుకు నష్టమేముంది? గద్దె మీదున్నవాడు పట్టించుకోవాలి.
అనవసర విషయాలకి __ వ్యకిగత విషయాలకి ప్రాధాన్యత యిచ్చే స్థాయికి దిగజారిపోయాయి పత్రికలు.
ఎప్పుడయినా మీ పత్రికలు ఎలక్షన్స్ అయిపోయాక, పదవిలోకి వచ్చిన పార్టీ చేసిన ఎన్నికల వాగ్దానాల పట్టిక వేసారా.....? అందులో ఎన్ని నెరవేరాయి? ఎన్ని నేరవేర్చలేదని బేరీజు వేసిప్రజల ముందుకు తీసుకు వెళ్ళారా? లేదు.
అధికారంలో వున్నవాళ్ళు ఫలానా పార్టీ , పాలనా సి.ఎమ్ ఫలానా ప్రాజెక్ట్ కి ఇంతే పెంక్షన్ చేసారు. మేం చూడండి ఎక్కువ చేసాం అంటారు.ఎవరమ్మ మొగుడి సొమ్ము......? ఈ పార్టీ పోమ్మా....? ఈ ముఖ్యమంత్రి ఇంట్లో డబ్బా ....? ప్రజల సోమ్మేగా .....? ప్రజల ఆస్థులేగా? ఇలాంటివి ప్రజలకి తెలియజెప్పారా? లేదు.... మరీ.... అందుకని రాజకీయ నాయకులు అన్నీ తప్పులే చేస్తున్నట్లు, మీ పత్రుకల వాళ్ళు అన్నీ మంచి రాస్తున్నట్టుస్వకుచ మర్దనం చేసుకోండి ఇక వెళ్ళిరండి......" అన్నాడు రామదాసు తను చెప్పదలచుకున్నది ముగిస్తూ.
చిరుబురలాడుతూ జర్నలిస్టు ఆ ప్రాతంనుంచి నిష్క్రమించారు.
శుభోదయం దినపత్రిక నుంచి వచ్చిన రిపోర్టర్ మాత్రం వెనకగా మిగిలిపోయాడు
అతను రామదాసు నవ్వును అర్ధం చేసుకుని వెళ్ళి కారులో కూర్చున్నాడు.
కారుకున్న కూలింగ్ గ్లాసెస్ పైకి లేచాయి.
కారు బయలుదేరింది ఆ నిశీధిలో .
* * * * *
"సార్..... రామదాసుగారు చెప్పిందేమిటో చెప్పానా?" ఇండియన్ టైమ్స్ రెసిడెంట్ ఎడిటర్ కి రాత్రి పదిన్నరకొచ్చిన తెలీపోన్ లో వినిపించిన మాటలవి.
"నో... నో... నాకేం చెప్పనక్కర్లేదు. ఆయనేం చెప్పినా రేపటిపేపర్స్ లో రాకూడదంతే ...." రెసిడెంట్ ఎడిటర్ ఎడిటర్ తెగేసి చెప్పాడు.
రామదాసు రోజ్ గార్డెన్ లో ముఖ్యమంత్రి గురించి మంచిగానే చెప్పాడని ఆ వ్యక్తి చెబుదామనుకున్నాడు కానా అవకాశం ఇండియన్ టైమ్స్ రెసిడెంట్ ఎడిటర్ ఇవ్వకపోవడంతో చిరాకుపడుతూ ఫోన్ పెట్టెశాడా వ్యక్తి.
* * * *