"అదే నా నమ్మకమూనూ! మీ మాటలు, మీ ప్రవర్తన ఎందరినో, ఎన్ని విధాలో గాయపరుస్తున్నాయి. దయచేసి మీరు నిజం చెప్పండి"
"నేను నిజమే చెప్పాను" అంది మళ్ళీ.
ఒక్కక్షణం మౌనంగా గడిచిపోయింది.
"సుజాతగారూ! మీరు యీ అమ్మాయిని వదల్చుకోండి. ఎ అనాధ శరణాలయానికో యిచ్చేయ్యండి. లేదా ఎవరికయినా పెంపకానికి యిచ్చేయ్యండి. కానీ మీతో వుంచుకోకండి, అది మీకు మంచిది కాదు"
ఆమె మాటళ్ళేదు
"నా సహాయం కావాలిస్తే చెప్పండి నా ప్రెండ్ ఒకడు అర్భవేజ్ మేనేజరుగా వున్నాడు. అక్కడ వదిలేద్దాం. పాపకి భద్రతా వుంటుంది. భవిషత్తు బాగుపడుతుంది. మీ జేవితానికీ యిబ్బంది వుండడు. ఇద్దరూ సుఖపడతారు." అన్నాడుఅప్యాయంగా.
"థాంక్స్!" పొడిగా అంది సుజాత. అతనితో ఆ విషయంలో అంతకంటె ఎక్కువగా మాట్లాడాలనిపించలేదు. నిజానికి అతను ఆ సానుభూతి వాక్యాలే మాటాడకపోయివుంటే ఆమె యింత సేపు అతని నీడని కూడా సహించేది కాదు.
"ఆలోచించకండి, నే వస్తాను మరి, గుడ్ నైట్ ."
"గుడ్ నైట్ "
అతను వెళ్ళిపోయాడు.
బయటకి రాగానే అతని పెదాలపై చిరునవ్వు వెలిసింది "షో" రక్తికడుతోంది. అనుకున్నాడు.
అతను వెళ్ళిపోగానే బయటకి వచ్చి అటూ యిటూ చూసి తలుపులు గట్టిగా మూసేసి భగవాన్ అనుకుంటూ మంచంపై వాలిపోయింది.సుజాత.
ఆమె మనస్సులో తుఫాను చేలరేగుతోంది.
7
వేకువవే లేచి తండ్రిగారికి ఉత్తరం రాసింది. సుజాత
ప్రియమైన నాన్నగారికి,
నమస్కరించి వ్రాయునది.
నేను నిన్న క్షేమంగా వూరు చేరాను. దార్లో ఇబ్బందీ కలగలేదు. డ్యూటీలో కూడా చేరాను. ముందు చెప్పకుండా అన్నిరోజులు ద్సేలవు పెట్టినందుకు మేనేజరు రామలింగయ్యగారు కొంచెం కోప్పడ్డారు. ఇంకేమీ అనలేదు.
నా సెలవు జీతం యింకా శాంక్షన్ కాలేదు ఎలాగో నేనూ సర్దుబాటు చేసుకుంటాను.
పిన్ని ఆరోగ్యం జాగ్రత్త.
మీరు ఎక్కువశ్రమ పడకండి. వయస్సు వచ్చేసింది విశ్రాంతి తీసుకోవలసిన యీ వయసులో మీరు యింకా శ్రమ పడుతున్నారు. తొలిసంతానం ఆడపిల్ల కావటం మీకు ఇక్కట్లు కలిగించింది.
తమ్ముడిని బాగా చదువుకోమని చెప్పండి. వాడు డిగ్రీ తీసుకుని ఉద్యోగం సంపాదిస్తే మీకు రీలిఫ్ __ చెల్లాయిని కూడా బడికి పంపుతూ వుండండి. పిన్నికి యిష్టం లేకపోయినా సరే చదువు కొనసాగించండి. మీకు చేప్పేపాటి దాన్ని కాకా పోయినా ఆలోచనలో పాలుపంచుకోవాలని రాస్తున్నాను.
మళ్ళీ రాస్తున్నాను.
పిన్ని ఆరోగ్యం జాగ్రర్త.
నమస్కారాలతో
మీ కూతురు
సుజాత.
ఉత్తరం పూర్తయింది.
రైల్లో పరిచయమయిన ఆ వ్యక్తి విషయం కానీ, అతను హఠాత్తుగా ఓ పాపని తనకి వదిలివెళ్ళటం కానీ ఆ పాప తనకి బరువుగా సమస్యగా తయారవటం రాయలేదు.
తనే యింకా పాప విషయమై ఓ నిర్ణయం తీసుకోలేదు. రెండు రోజులకే ఆ పాపని విడిచి వుండలేని ఆత్మీయత ఏర్పడింది. ఆ పిల్లని ఆశ్రమంలో వదలటమా? తనతోనే వుంచుకుని పెంచుకోవటమా? లోకాన్ని యీ విషయంలో ఎదరించక తప్పదా? అన్ని చిక్కు సమస్యలే. దీంతో ఎన్నో చిక్కులు రావచ్చు.
సుధాకర్ తనకి మధ్య మంచి పరిచయం వుంది. అది ప్రేమ అనుకొంటుంది తను అవునో, కాదో,
అతనూ మామూలు మూగవాడిలా ప్రవర్తించి తనని అనుమానిస్తే __
తను యిన్నాళ్ళుగా తన మనస్సులో నిర్మించుకున్న ప్రేమమూర్తి చిన్నా భిన్న మవుతుంది. దాన్ని తను భరిస్తుందా?
సుధాకర్ తనని దూరం చేసుకుంటాడా?
తను దూరమవుతుందా?
ఊహూం ఆ ఊహే బాధాకరంగా వుంది. అందరూ వున్నా ఎవరూలేని తనకు తన ఓంటరి మనస్సుకి అతను రాగబంధువు అయ్యాడు. అతనేనాడూ నోరు తెరచి తనని ప్రేమింస్తున్నానని అనలేదు.
కానీ__
ఆ చూపులు __ ఆ కళ్ళలో కనిపించే ఆత్మీయతానురగాలు, ఆ అనురాధనూ భావం, ఆ ఎటకసీ తనకు ప్రేమ బాష్యం చెబుతున్నాయి.
తను ఆ బాషని చదువగలదు.
మరి యీ సమస్య ఎలా?"
అతనికి విడమరచి చెప్పాలి వివరంగా చెప్పాలి. వీలయితే యీ రోజు చెప్పాలి. అతని సలహా తీసుకోవాలి . అతనెలా చెబితే అలా నడుచుకోవాలి, అతనిదే తుది నిర్ణయం. అంతే!
అతను పాపని పెంచుకుందామంటే పెంచుకోవటం __ అర్ఫనెజ్ లో వదిలేద్దామంటే పదిలేయ్యటం __ మరో ఆలోచనకి తావివ్వకూడదు.
నాగారాజంటే తనకి గిట్టదు. అతన్ని చూస్తె పాముని చూసినట్టుగా వుంటుంది. కానీ అతనేదో శరణాలయం మేనేజరు తన ఫ్రెండన్నాడు. ఆ విషయంలో అతని హెల్ప్ తీసుకోవాలి. తప్పదు, చేదయినా పద్యంగా స్వీకరించాలి.
అలా అనుకోగానే ఆమె మనస్సు టెలికపడింది. ఏదో బరువు దిగిపోయినట్టయింది.
తెల్లగా తెల్లారేసరికి ఇళ్ళు శుభ్రం చేసుకుని, ఇంటి పనల్లా చేసేసుకుని, తను స్నానం, చేసింది.
కాఫీ తాగేసి, పాపని లేవగొట్టింది. స్నానం చేయించి, బజార్లో జానికమ్మగారు తెప్పించిన కొత్తగౌను తొడిగింది. పాపకిపాలు పట్టింది.