తాతగారు వెళ్ళిన చోటుకే నే వెళుతున్నాను కాబట్టి తాతగారిలా నేనూ ఏదో ఆనాడు క్షేమంగా తిరిగి వస్తాను. మీరు నాకోసం కంగారు పడవద్దు వెతికించే ప్రయత్నం చేయవద్దు. ఫలించని ప్రయత్నం వృధా, శ్రమ చేటు.
మరో విషయం .
నేనోక్కడీనీ వెళ్ళటంలేదు. నాతో కమల నాథ్ . సుబ్బారావు కృత్తిక , నిశ్చల వస్తున్నారు. మేమంతా ఒకరి కొకరం సాయంగా వున్నాము.
ముఖ్యమైన విషయం.
నేను వెంకట్రావుగారి అమ్మాయి కృత్తికను ప్రేమించాను .
నా పెళ్ళంటూ జరిగితే కృత్తికతోనే.
క్షమించండి. అత్తయ్యలూ మావయ్యలూ నేనాడిన అబద్ధ౦తోనాపై చాలా ఆశలు పెంచుకుని వుంటారు. గీత, రాధ, విమల, ఎవరికీ వారే బావ స్థానం నుంచి భర్త స్థానానికి లాకెళ్ళి నాపై ఆశపెంచుకుని వుంటారు. గీత, రాధ, విమల వాళ్ళ ముగ్గురూ నా ప్రాణంకాని నా అర్దాంగిగా కాదు. కృత్తిక నా కంటపడినానాడే నా భార్యగా ఏ అమ్మాయి అర్హులో తెలిసిపోయింది.
గీత, రాధా, విమలలకి మంచి భర్తలు రావాలని మనసావాచ కోరుతున్నాను. దయచేసి ఎవ్వరూ నాపై కోపగించుకోకండి. దూషించకండి. తాతగారు కోరిన కోర్కె తీర్చటానికి మేమంతా సంప్రదించుకుని ఒక పథకం ప్రకారం వెళుతున్నాము. మీరందరూ మా ప్రయాణానికి అవరోధం కలిగించే ప్రయత్నానికి పూనుకోక మనసావాచా ఆశీర్వదించండి. మీ అందరి దీవనలే మాకు శ్రీరామరక్ష.
మరోమాట .
నాకుమల్లె మిగతావారు కూడా వాళ్ళవాళ్ళకి లెటర్స్ రాసి పెట్టారు. ఎవరూ దిగులు పడనవసరంలేదు. తగు జాగ్రత్తవహించి మాకు కావలసినవి మా వెంట తీసుకెళతున్నాం .
చివరిసారిగా ఓ మాట .
సుబ్బారావువుకి ముసలి బామ్మా తప్ప ఎవరూ లేరు. ఆ బామ్మగారు దిగులు చెందుతారేమో బామ్మగారిని మనింట్లో మేము తిరిగివచ్చిందాకా వుంచండి.
అమ్మా.
నీ కంట నీరు నాకు జయంకాదు. అందుకుని నా కోసం కంటనీరు పెట్టక విచారించక అక్కడనుంచే ఆశీర్వదించు నీ ఆశీర్వాదం నాకు వెయ్యి ఏనుగుల బలం చేకూరుస్తుంది.
ఇది తాతగారి కోరిక ప్రకారం ప్రయాణం కాబట్టి ఎవరూ విచారించవద్దని మరోమారు చెబుతున్నాను. మేము తిరిగి రావటం ఖాయం అదెప్పుడన్నదీ మేము మీముందుకు వచ్చినవాడు తెలిసే విషయం మూరాకకోరకు ఎదురు చూడండి. ఇంకేం రాయాలో తెలియక ముగిస్తున్నాను.
ఇట్లు
విజయరామతారక్
( విజ్జీ)"
లెటర్ చదవటం పూర్తిచేసి "ఇదర్రా విషయం" అన్నాడు పెద్దమావయ్య.
"పెద్దతనంలో చివరి క్షణాలలో అతనకి మతిపోయి ఏదో వాగివుంటాడు. వీడి మతి ఏమయిందట! బుద్ధిలేకపోతే సరి. అయన కోరాడు ఈయనగారు బైలుదేరి వెళ్ళాడు. ఎక్కడికెళ్ళినట్లు చెపితే ఈ కంగారు మూకుండేది కాదుకదా! ఇప్పుడేమి చెయ్యటం?" సీతారామ్ కంగారుపడుతూ ఎవరిమీద అరవాలో తెలియక వూరికే అరిచివూరుకున్నాడు.
సీతారామ్ భార్య కళ్ళనీళ్ళు పెట్టుకోబోయిందిగాని అది ఆశుభం అని తలుపుకురాంగానే ఆ ప్రయత్నాన్ని అప్లేసింది.
అందరూ ఒక్కనిమిషం ఆలోచించారు. ఆ యింట్లో విజయ్ అంటే అందరికీ ప్రేమే. ఎవరూ కోపగించుకోక ఏంచేయాలి అన్న విషయంలో మునిగిపోయారు.
బావమీద అసలు పెంచుకున్న గీత, రాధ,విమల, బావ మనసుని దోచిన ఆ కృత్తిక అనే అమ్మాయిని చూడకపోయినా కృత్తిక మీద కోపంతో కుతకుతలాడిపోయి మళ్ళీ అంతలోనే సర్దుకున్నారు గీతని చేసుకుంటే రాధ. వుమలకి కోపం వచ్చేది. అదే విమాలని చేసుకుంటే గీతకి, రాధకి కోపం ఈర్ష్యావగైరాలు వచ్చేవి. వాళ్ళలో వాళ్ళకి ఆ ప్రమాదం తప్పించి.
"వీళ్ళకోసం ఎక్కడని గాలిస్తాం?" ఎవరికీ వారే యిదేమాట అన్నారు.
తప్పిపోవటానికి పసిపిల్లలు కారు. అలకతో ఇల్లువదిలి వెళితే నాయనా! మీ అమ్మ మంచమెక్కించి మీ నాన్న దిగులుతో కృంగిపోతున్నాడుఇంకెప్పుడూ కోప్పడదు తిరిగివచ్చెయ్యి ఎక్కడున్నావో తెలియజేస్తే ప్రయాణాలుఖర్చులు పంపిస్తాము ' అని పేపరులో వేసే ప్రమాదం ఏమీ రాలేదు.పరీక్ష తప్పితే చెరువులు బావులు రైలుపట్టాలు పలు ప్రదేశాలలో గాలించవలసి వచ్చేది. ఆ అవసరమూలేదు.
గుండె రాయిచేసుకుని వాళ్ళ రాకకోసం ఎదురుచూడటం తప్ప ఏం చేయగలం అనుకున్నారు అంతా.
ఆ సమయంలో సందూకాపెట్టే విషయం అందరూ మర్చిపోయారు. ఓవేళ గుర్తుకు వచ్చి ఆ పెట్టెని తెరిచినా అది ఖాళీగా దర్శనం యిచ్చేది.
అదీగాక పోయినా ఆ సందూకాపెట్టేలో వున్న రహస్యం ఏదో పైపైన తప్ప ఎవరికీ అసలు విషయం తెలియదు.
అన్నింటికన్నా పెద్ద రహస్యం.
విజయ్ సందూకా పెట్టెలో వున్న అన్నింటినీ ఫోటోస్టాట్ తీయించి వాటిని వెంట తీసుకువెళ్ళాడు తరతరాలనుంచీ వస్తూవున్నశిధిలావస్తలో వున్న రాతియాకుల్నీ కాగితాలని ఇంట్లో ఎవరికీ కానరాని చోట భద్రపరచి వెళ్ళాడు. ఫోటోస్టాట్ గాక కొన్ని విషయాలు రాసుకుని మరీ తీసుకెళ్ళాడు.
ప్రస్తుతం అందరూ తీరుబండిగా కూర్చుని అనుకుంటున్నమాట.
"వెళితే వెళ్ళారు . ఆ వెళ్ళేది ఎక్కడికన్నది చెప్పి వెళ్ళకూడదా?"
వెళ్ళేటప్పుడు వుపాయంగా ఫలానా చోటుకి ప్రయాణమై వెళుతున్నాము వివరాలు యివి.
వివరంగా రాసి ఆ కాగితం ఇంట్లో వాళ్ళకి అందటానికి కొంత టైము పెట్టారు.
ఆ టైము గంటయి రోజులు నేలలు కాదు. ఇంకాచాలా చాలా ...... టైముంది దానికి.
ఆ టైముకి వాళ్ళు పెట్టిన గడువుకి లేక ఆ లోపలే వాళ్ళు క్షేమంగా తిరిగిరావచ్చు. కాలమే నిర్ణయించాలి. యిది.
ఆ సాయంత్రమే సీతారామ్ గారేళ్ళి సుబ్బారావు బామ్మకి నచ్చజెప్పి ఇంటికి తీసుకువచ్చారు.
6
"కొండ ఎక్కేసరికి ఆయాసం వచ్చిందిరా?" ఆయాసపడుతూ ప్యాంటుకుంటుకున్న ఎర్రమట్టిని దులుపుకుంటూ అన్నాడు సుబ్బారావు.
"ఒళ్ళు పెంచుకోకురా నాయనా అని నెత్తీనోరూ కొట్టుకు చెప్పాను విన్నావా?" కమల్ , బామ్మగారిలా కంఠస్వరం ఒనికిస్తూ అన్నాడు.
అది నాతప్పుకాదురా మా బామ్మ పని. తాతయ్యకిదిష్టం అడిష్టం అంటూ రకరకాల పిండివంటలు చేసి మీగడపెరుగుతో సహా దగ్గర కూర్చుని తినిపించేది ఇప్పుడు మా బామ్మ ఏం చేస్తున్నదో ఏమో. నేను క్షణం దూరం అయితే భరించలేదురా!"
"ముందు నీవు బ్యార్ మనకురా తండ్రీ! ఇంకా ప్రయాణం ప్రధమ పాదంలోనే వున్నాము" విజయ్ భుజానవున్న సామాను కింద పెడుతూ అన్నాడు.
"అటు చూడు ఆడపిల్లలు ధైర్యంగా వున్నారు" కమల్ కవ్విస్తూ అన్నాడు.
చూడుసామీ! కాలం మారింది ఆడపిల్ల ఈడుపిల్ల అన్నావంటే వూరుకోము ఇక్కడనుంచి తావుసేస్తాను" నిశ్చల తల ఎగరేసి అంది.
"ఆడపిల్ల ఆడపిల్లగాక మొగపిల్ల అవుతుందా! అలా అయితే ఆడామగాగాని ....... బాబోయ్ చేయఎత్తకు తల్లీ కృత్తిక అని ఏ నిముషను పేరు పెట్టారోగాని మాటకు ముందు కృత్తికా కార్తెలాగా కుతకుతలాడుతుంటావ్! ముందు ముందు నీతో ఎల ఏగాలో తెలియటంలేదు" విజయ్ తలపట్టుకున్నాడు
పెదవి బిగించి మునిపంటితో పెదవి నైక్కిపెట్టి నవ్వాపుకుంది కృతి.
కిసుక్కుమంటూ నవ్వి ఆడాళ్ళిద్దరూ కళ్ళెర్రజేయుటంతో నోరుమూసుకున్నాడు సుబ్బారావు."
"ప్రధమ కర్తవ్యం!"
"వేరేసింపుల్ . ఓపక్క పొద్దుగూకుతున్నది. చలి ప్రారంభ౦ అయింది. ఈ కొండమీద పులులు సింహాలు లాంటి క్రూరజంతువులు లేవు గాబట్టి అ అభయం లేదు. ఈ పూటకి ఆహారం తీసుకుందా౦. మరేమన్నా మరచిపోయామేమొ ప్రయాణంలో సాధక బాధలు వగైరా అలోషిస్తూ విశ్రాంతి తీసికుందాం. తెల్లవారు ఝామున ఇంక ముందుకు సాగటమే" విజయ్ అన్నాడు.