"మనిద్దరం అలా వెళ్ళి గుహా చూసి వద్దాం" కమల్ అన్నాడు.
"మరి నేనేం చేయాలిరా ?" సుబ్బారావడిగాడు.
"ముందు ముందు చాలా కష్టపడాలి : అప్పటికే సగం బొజ్జ కరిగింది. ఇక్కడే కూర్చుని వీళ్ళకి సహాయ౦చెయ్యి అటు విశ్రాంతి ఇటు మీ సోదరీమణులకు తోడుగాను.వుంటావ్.
"ఇక్కడెవరూ మీకోసం వంటలు పిండివంటలు చేయటంలేదు మహాశయా! వెళ్ళి గుహా చూసివద్దాం . ఆ తర్వాత అందరం కలసి వుడ్ సేవించి బెడ్ ఎక్కుదాం." కృతి అంది.
"అక్కడిదాకా మళ్ళీ ఈసామానులు మోసుకెళ్ళటం దేనికిరా మీరెళ్ళి చూసిరండి నె వీటికి కాపలావుంటాకు .మీరోచీసరికి పుడ్ సర్ది రెడీగా వుంచుతాను"
సుబ్బారావన్నది నలుగురికి నచ్చింది చేయవలసింది చెప్పి నలుగురూ బయల్దేరారు.
"ఇంట్లో మనగురించి ఏమను కుంటున్నారో!" కమల్ టార్చి లైటుని ఎడమచేతిలోంచి కుడి చేతిలోకి మార్చుకుంటూ అన్నాడు.
"అవును ఏమనుకుంటూ వుంటారు!" నిశ్చల జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఆలోచనలో మనసు ఇంటిపై మళ్ళించింది.
నలుగురూ మౌనం వహించారు. వాళ్ళ మౌనం వెనుక ఇళ్ళు తన వాళ్ళు గుర్తుకోస్తున్నారు. తాము తిరిగి క్షేమంగా వాళ్ళ దగ్గరకు వేల్లకెలపొతే ! వాళ్ళ ఆలోచనలు పరిపరివిధాల పోతున్నాయి.
విజయ్ పెళ్ళివిషయంలో ఇంట్లో గడువు పెట్టటం వల్ల వాళ్ళు ముందే ప్రయాణం కాక తప్పలేదు . ఈ అద్భుత దీర్ఘయాత్రముగింపుకి నెలలే పడుతుందో ఇంకా ఎక్కువ టైము తీసుకుంటుందో తెలియదు. వెంట ఎన్నో తీసుకెళ్ళాలి అన్ని పరికరములు సేకరించటం రోజుల్లో అయ్యేపని కాదు పైగా చెదలు తిని ఎలుకలు కొట్టివున్న ఆ కాగితాలతో కుస్తీ పట్టడానికి నాలుగు రోజులు పట్టింది. విషయ సేకరణ అయితే చాలావరకు చేయగలిగారుగాని. దీర్ఘాప్రయాణ సాధనాలు కొనటం కాలేదు. ఇక్కడికి రావతానికే పది రోజులు పట్టింది.
తెలివిగా ఆపని చేశారు . వున్న అయిదుగురి డబ్బుకోలోటులేదు. పెద్ద మొత్తాలతో డబ్బు మాత్రం తీసుకుని ఇంట్లోంచి బయలుదేరారు. ఎర్రకోండలకి దగ్గరగా వున్న చిన్న పట్టణంలో హొటల్లో రూం తీసుకున్నారు. హొటల్లో నాలుగు రోజులుండి ప్రయాణానికి కావాల్సిన అతి ముఖ్యమైన తక్కువ సామాను వుపయోగం ఎక్కువగల వస్తువులను కొన్నారు. పేరుకి రెండు చీరలు వుంచుకుని కృతి నిశ్చల పాంట్లు షర్టులుకొన్నారు. రైన్ కోట్లు వుతక్కక్కరలేని రబ్బరు గుడ్డలు వగైరా వగైరా కొనుక్కుని ఎవరి సామాను వారు వీపుకి కట్టుకుని మోసేవిధంగా ప్యాక్ చేసుకున్నారు. ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని జర్నీకి కావాల్సినావన్నీ సేకరించామనిఒక్కటీ మర్చిపోలేదని నిశ్చయించుకుని తర్వాతే హొటల్ గది ఖాళీ చేశారు వాళ్ళు.
తెల్లవారు ఝామున కొండ ఎక్కటం మొదలుపెడితే మధ్యాహ్నం నికి సగం ఎక్కారు.
సూర్యుడు నిప్పుడు గక్కుతున్నాడు.
ఆహారం తీసుకున్నాక ఓ గంట విశ్రాంతి తీసుకుని మళ్ళీ కొండ ఎక్కటం మొదలు పెట్టారు.
సరీగ సాయంత్రం అయిదు గంటలకి కొండ ఎక్కటం పూర్తీయింది.
టైమును విశ్రాంతిని క్రమపద్దతిగా పాటిస్తూ ఒక తీరుగా వెళితే జర్నీలో అలసటవుండడు. అర్ధంలేని వురుకులు పరుగులతో ముఖం బద్దలు కొట్టుకోదల్చుకోలేదు. పైగా తాతాగారు ఓ కాగితంలో రాసిన మొదలు చివర వాక్యాలు ఎగ్రిపోయినా మధ్యలో చక్కగా వున్నాయి.
తూచి తూచి అడుగు వేస్తూ వేయి కళ్ళతో పరిసరాలను గమనిస్తూ ముందుకు సాగటం .........
ఆ తర్వాత చాలా అక్షరాలు ఆగిరి పోయాయి.
ఈ చోటనే బహుజాగ్రత్త వహించాలి. మృత్యుద్వా __ ఆ తర్వాత చాలా టెలిక,
ఈ చోటునే అని రాసిన చోట ఏదో బొమ్మవేసి వుందిగాని ఎలుక సరీగ అక్కడే కొట్టేయటంవల్ల జెర్రిగొడ్డు లేకుండా దాని కాళ్ళు వున్నాట్లుగా వుందా బొమ్మ మృత్యుద్వా....... తర్వాత అక్షరాలుండేవి ఎగిరిపోయాయి ఒక చెట్టు మాత్రం సగం బొమ్మవేసి వుంది. అలా సగం చెట్టు ఎక్కడైనా వుంటుందా? నిలువునా సగం చెట్టు వుండేవి ప్రపంచంలో వుంటాయా? లేకా ఆ చెట్టుని నరికారా? అది అర్ధంగాక దాన్ని గురించి ఆలోచించటం మానేశారు.
"అదిగో గుహా"
కృతి ఆనందంతో అరిచింది.
అందరూ రెట్టింపు ఉత్సాహంతో నాలుగంటల్లో గుహా దగ్గరకు చేరారు. మరో రెండంగల్లో గుహలోకి వెళ్ళారు నలుగురూ.
రెండు గదులంత వెడల్పుగా వుంది. ఆ పెద్ద గుహా తుఫాను వచ్చినా చీకూ చింతా లేకుండా రెండు సంసారాలు హాయిగా దానిలో తడవకుండా తలదాచుకోవచ్చు.
నలుగురూ నాలుగు మూలలకీ కలయ తిరుగుతూ ఆ గుహని పరీశీలించారు.
"ఉహూ ఈ గుహాకాడు . దీంట్లో౦చి మార్గంలేదు" విజయ్ నిరాశగా తల విదిలిస్తూ అన్నాడు.
"బహుశా మూసుకుపోయిందేమో" రవంత ఆశతోఅందికృతి.
"కొండన్నతర్వాత ఒకే గుహా వుండడు. ఎన్నో గుహలుండవచ్చు. ఇంకా గుహలున్నాయేమో వెతికి చూద్దాం " నిశ్చల అంది.
"యూ ఆర్ కరెక్ట్ నిచ్చూ!" అంటూ ఆనందంగా ఈలవేశాడు కమల్.
నిశ్చలని నిచ్చూ. నిచ్చల్ నాచల్ అంటూ అప్పటి ఆనందాన్ని బట్టి పేరు మార్పుచేసి పిలుస్తుంటాడు కమల్.......
"యూ మనం గుహలున్నాయేమో వెతకాలి పదండి" విజయ్ ముందుకు దారితీస్తూ అన్నాడు కొంతదూరాన మరో గుహా కనిపించింది . పీతబొక్కంత అంటూ సామెత మనవాళ్ళు వాడుతుంటారు. అలా అతిచిన్న గుహా అది. దానికి తోడు ఎవరో తోలచినట్లు ఆ గుహాలో ముప్ఫైఆరు కంతలు.
"చత్ ఇదసలెకాదు" ముందే అన్నాడు కమల్
"కమల్! మనం ఒక పనిచేద్దాం మనం తెల్లరుఝామునే బైలుదేరాలంటే ఆ రాత్రికే మనకి కావాల్సిన గుహా ఏదో వెతికిపెట్టాలి అదెక్కడుందో వెతికిగాని మనం వెళ్ళవద్దు" విజయ్ కి మొదటే ఆటంకం ఎదురుకావటంతో చిరాకుగానువుంది. ఇప్పుడే ఈక్షాణానే తేల్చుకోవాలన్న పట్టుదల ఏర్పడింది.
"విజయ్ ! మునమొక పనిచేద్దాం నలుగురూ కలసి వెతకటం టైమ్ వేస్ట్ .
సరీగ ఇరవైనిమిషాలు టైము తీసుకుందాం........"
క్రుతిమాట పూర్తీచేయకముందే నిశ్చల అందుకుంది "నాతల్లే! ఇరవైనిముషాలలో మహా అయితే ఇలాంటి గుహే తగలవచ్చు. కొండను తవ్వి ఎలుకని పట్టిన చందంలా యీతఫా పందికొక్కులు తవ్విన గోతిని చూసి గుహ అనుకోవాల్సి వస్తుందేమో?"
"ఏయ్ ? నీకంతా తొందరే . సాంతం మాటవిని తగలడు. ఇరవై నిమిషాల టైము తీసుకుందా౦. ఒకరు ఇటుపైకి ఒకరు అటుపైకి నేను ఇటుపక్కకి నీవు అటుపక్కకి బయలుదేరి నడుద్దాం. వాచీలో టైము చూసుకోవటం ముఖ్యం ఇరవై నిముషాల లోపు మనకి తగిలిన గుహ అనుకోవాల్సి వస్తుందేమో?"
"ఏయ్ ! నీకంతా తొందరే. సొంతం మాటవిని తగలడు. ఇరవై నిముషాల టైము తీసుకుందాం . ఒకరు ఇటుపైకి ఒకరు అటుపైకి నేను ఇటుపక్కకి బయలుదేరి నడుద్దాం .వాచీలో టైము చూసుకోవటం ముఖ్యం ఇరవై నిముషాలలోపు మనకి తగిలిన గుహా గాలిమ్చటం బైటికి రావటం చేయాలి. అలా ఎన్ని గుహాలు తగిలితే అన్ని. ఏడీ తగలపోతే వెనక్కీ మరలిద్దాం రానూపోనూమనకి నలభై నిముషాలు పడుతుంది. మళ్ళీ మనం సుబ్బారావు దగ్గరకు మరలి వెళ్ళేసరికి ముప్పావు గంట. వెరసి గంటన్నర కనుక......"
"గుడ్ ! గుడ్! నీ అయిడియా బాగుంది కృతీ !" కృతి భుజం మీద చేయివేసి ప్రేమగా నొక్కి వదిలేశాడు విజయ్ .
"నా మాటకూడా వినుభయ్యా ! మన నలుగురి జేబుల్లో ముందు జాగ్రత్తకి పెట్టుకున్న ఈలాలున్నాయ్ అందరూ ఇరవై నిముషాలు ముందుకు నడిచి మరో ఇరవై నిముషాలు వెనక్కినడిచిటైము వృధా చేసేబదులు ఓపని చేద్దాం. మనకేదైనా అపాయం జరిగినా! ఆపదఎదురైనా ! లేక మనకి కావాల్సిన గుహని చూడగాలిగినా వెంటనే దగ్గరుంచుకున్న విజిల్ తీసి వుంచాలి. ఆ వూదటం ఆపకుండానే వాళ్ళు మరలి వచ్చేయాలి టైమ్ కలిసి వస్తుంది" నిశ్చల అంది.
"వెరీగుడ్ అయిడియా! ఆడదాని సలహా వినవద్దంటారు గాని ఆడవాళ్ళ సలహాతో ముందు చూపు వుంటుందిరా విజయ్!" అన్నకమల్ మాటకి "ముఖ్యంగా నీ నిశ్చల్ సలహకి అవునా?" అంటూ విజయ్ తేలికపడ్డ మనసుతో నవ్వాడు.
"మనవద్దవున్న విజిల్ ధ్వని అరమైలు దూరం వినపడుతుంది. భయంలేదు . ఓ.కే. ఇంక బైలుదేరుదాం . వన్. టు.త్రీ ఫోర్......"
మరో మాటకాస్కారం లేకుండా నలుగురూ నాలుగు దిక్కుల వేపు బైలుదేరారు.
సరీగ పన్నెండు నిమిషాలయింది.
తూర్పు వేపుగా పైకివెళ్ళిన చోటునుంచి విజిల్ ద్వని ఆగకుండా వచ్చింది. యీ ద్వని ......!
అపాయానికి గుర్తా?
అపదకి సంకేతమా?
ఆనందానికి చిహ్నమా?
"నిశ్చల ఎటువేపు బయలుదేరింది?" తిరుగుముఖం పడుతూ కమల్ ఆలోచించాడు.
"కమల్ వెళ్ళింది తూర్పు వేపా పడమటివేపా?" నిశ్చల చకచక అడుగులేస్తూ అనుకుంది.