Previous Page Next Page 
అసిధార పేజి 4

 

    అప్పుడే వాళ్ళంతా ఓ నిర్ణయానికొచ్చారు.

    "ఈ ఇంట్లో అందరం ఇంతవరకూ ఒకే తాటిమీద నడుస్తున్నాము. విజ్జీ వివాహం చేసుకున్నా సరే తతిమావాళ్ళూ సంతోషంగా ఆశీర్వదించాలి"

    ఈ నిర్ణయం అందరికీ నచ్చింది అలాగే అన్నారు . అందరూ ఆ నిముషాన .

    వాతావరణం చల్లబడింది ఒక్కసారిగా.

    తేలికపడ్డ హృదయాలతో లేచారు అంతా.

    ఈరోజు మొదలు సరీగ్గా వారం.

    వారం తర్వాత ..........!

                                                                                      3

    అర్దరాత్రి సరీగ్గా ఒంటిగంట అయింది.

    విజయ్ తన గదిలో మంచంకింద దాచిన సందూకా పెట్టె తెరిచాడు.

    ఇంతలో అంతా  ఆ సమయంలో గాఢనిద్రలో వున్నారు.

    రఘురామయ్యగారు మరణించగానే అయన శవాన్ని వీధివరండా లోకి చేర్చారు ఇంట్లోవాళ్ళు.

    తాతాగారి మరణానికి ఓ పక్క విచారిస్తూనే విజయ్ వెంటనే ఎవరికంటా పడకుండా రఘురామయ్యగారి గదిలో ఆటకమీద వున్న సందూకాపెట్టెను తీసుకెళ్ళి తన గదిలో మంచంకింద భద్రపరిచాడు.

    రఘురామయ్యగారికి ఆ సందూకా బహు ఇష్టం అని ఆ యింట్లో ఎత్తలేదు. అయన గుణగుణాలు కధలుగా చెప్పుకున్నారు అంతేవిజయ్ ఎంతో కష్టపడి కొద్ది సేపటికి తుప్పుపట్టిన తాళం తీశాడు.

    విజయ్ పెట్టె తెరచి చూసి నిర్ఘాంతపోయాడు.

    విజయ్ ఏమిటి ఎవరైనాసరే ఆ దృశ్యంచూసి నిర్ఘాంతపోకతప్పదు. అనుకున్నదొకటి అయినదొకటి అయినది మరొకటి అయినప్పుడు ఏ మనిషి అయినా ముందుగా చేసేది నిర్ఘాంతపోవటమే.

    ఆ పెట్టెలో కడులాడుతున్న ఆ సజీవ రూపాలు నాలుగింటిని చూస్తూ వుండగానే వాటి మాతృమూర్తి ఎగిరి విజయ్ మీదకి దూకి అదే స్పీడ్ తో మళ్ళా  పక్కకి ఎగిరి దూకి మంచం పక్కగా వెళ్ళి పోయింది.

    ఇంతకీ ఆ జీవి చాలామంది ఇళ్ళల్లో వుండేది. అందరికీ తెలిసిందే.

    ఆ జీవి ఎలుక
   
    పెట్టెలో కదులాడే ఎర్రటి బుల్లి ప్రాణులు ఎలుకమ్మగారి నలుగురు పిల్లలు.

    అసలు జరిగింది యిది. కొన్ని ఏళ్ళక్రితం ఆ సందూకాపెట్టె మూలగదిలో వుండేది. అప్పటికింకా యిల్లు మట్టినేలతోనే వుండేది. గచ్చు చేయలేదు ఆనాడు దాని పతనం మొదలై౦ది తాటి ఆకులమీద రాసింది పూర్తీ దేవనాగార లిపికి. అ తర్వాత దానిని పూర్తీ అదీ సంస్కృత౦లో వేరే ఆకులమీద యింకో అయన రాశాడు దానిని గ్రాంధికంకలసిన తెలుగులో రఘురామయ్యగారి తాతగారు తన అనుభవాలతో సహా రాశారు. ఆ తర్వాత జరిగింది.

    ఆ దారుణం

    చెదలు నెలకిందనుంచి బయలుదేరి పెట్టె ఆడుగుభాగాన్ని సరీగా అరచేతి వెడల్పు తినేశాయి.

    రఘురామయ్యగారు తన తాతగారు రాసిన అనుభవాలు ఆధారాలతో ఆ విచిత్రలోకం చూసి రావడానికి ఇళ్ళు విడిచి వెళ్ళి కొన్ని నెలలు తిరిగి విసిగివేసారి వస్తూ వుండేవారు. ఓ సారి అలా వచ్చినప్పుడు పెట్టె అడుగు భాగాన్ని చెదలు పాడుచేయటం చూసి బాధపడి అర్జంటుగా ఇంట్లో ప్రతి గదిలో నాపరాళ్ళు పరిపించారు.

    చెదలమ్మగారు దేవనాగిరిలోపిలో వున్న తాటియాకుల్ని కాస్త కాస్త రుచి చూడటం గూడా జరిగింది.

    ఆ దారుణం జరిగింతర్వాత __

    రఘురామయ్యగారు పెట్టెని బాగా దులిపి పెట్టె అడుగు భాగాన చెదలు తిన్న కంతకి అడ్డంగా పల్చని పేట్టి మళ్ళీ అన్నీ యధావిధిగా సర్దారు.

    రఘురామయ్యగారు అదే చివరిసారి మూడునెలలు ఇళ్ళువదిలివెళ్ళివచ్చారు. అయన ఇంట్లో కాలు పెట్టిన సమయంలో ఇంట్లో వాళ్ళు ఆ సందూకాపెట్టేచుట్టూ చేరి దానికేసిన పెద్ద తాళాన్ని తియ్యటానికి విఫల ప్రయత్నం చేస్తున్నారు.

    అది చూసి రఘురామయ్యగారు "ఏమర్రా మీకేమొచ్చిందిరా?" అంటూ  ఓ పెద్ద గావుకేక పెట్టారు ఇంట్లో అందరినీ ఓ దులుపు దులిపేశారు" ఆ పెట్టెలో వెండి బంగారాలు లేవు తాతల నాటి నుంచీ వాళ్ళు రాసిన వాళ్ళవాళ్ళ చేతి వ్రాత వుంది. వాటిని నేను భద్రపరిచాను మన తాతల రూపురేఖలు ఎలా వుంటాయో చిత్రాలు గీసి లేవు. ఆనాడు . కెమెరాలు లేవు కాబట్టి ఫోటోలులేవు . కనీసం వారు చేతిలో రాసిన రాతలున్నాయి వారి జ్ఞాపకార్దం  నేను వాటిని భద్రపరిచాను కావాలంటే చూడండి అదీ నన్నడిగిచూడండి. అంతేగాని నేయింట్లో లేని సమయం చూసి పెట్టె కేలకటానికి ప్రయత్నించకండి వాళ్ళ రాతలు నాపాలిట బంగారు రాతలనుకుంటున్నాను. ఆ అంతే" అన్నారు అంతే కాదు వెంటనే మొలతాడుకి కట్టుకుని తనతో తీసుకెళ్ళిన తాళం చెవి తీసి దాంతో తాళం తీసి వాళ్ళు చదవటానికి కాకుండా కళ్ళకి మాత్రమె చూసి మళ్ళీ పెట్టెలోపేట్టి తాళం వేసేశారు.

    అక్కడితో  ఇంట్లో అంతా  నోరు మూసుకున్నారు. ఆ పెట్టె జోలికి వెళ్ళటం మానేశారు. కాని ఆ పెట్టెకి రఘురామయ్యగారి ప్రయాణానికి ఏమన్నా సంబంధం వుందా? అన్న అనుమానం వారికి రాకపోలేదు. అయినా పెదవి కదిపే సాహసం ఎవ్వరూ చెయ్యలేదు.

    ఇంక ఆ ప్రదేశానికి తాను ఒంటరిగా వెళ్లి రావటం అసాధ్యం అని విరమించుకుంటూ ఆ అపూర్వ నగర విశేషాలు తన అద్భుత అనుభవాలు కాగితాల మీద రాసి అది సందూకాపెట్టెలో భద్రపరచి తాళంవేసి ఆ పెట్టెని ఆటక ఎక్కించారు. రఘురామయ్యగారు.

    ప్రతి మనిషికీ  తీరని కోర్కె అంటూవుంటుంది. అలాగే రఘురామయ్యగారికి అది తీరని కోర్కెగానే మిగిలిపోయింది. కాపోతే ఆ కోర్కెని తనతోనే తీసుకుపోవటం ఇష్టంలేక తన తదనంతరం అయినా తీరితే బాగుండునని విజయ్ కి చెప్పిపోవటం జరిగింది.

    ఈ మధ్య కాలంలో ఆ పెట్టెని రఘురామయ్యగారు ముట్టుకోటం జరగలేదు. ఆటకమీద భద్రంగా వుండనే ధీమాతో వున్నరాయే.

    రఘురామయ్యగారు ముందు సామాన్య మనావుడిలా స్వార్ధంతో ఈ రహస్యం మనవడితో చెప్పలేదు . తనకి మరణం అతి సమీపానికి వచ్చింది అని తెలుసుకున్న తర్వాతే ఈ విషయం విజయ్ తో చెప్పుటం, జరిగింది. కాని ఇక్కడ విజయ్ చేసిన పెద్ద పొరపాటు ఒకటుంది. అది .......

    ఆ చోటుకి వెళ్ళే మార్గం రఘురామయ్యగారు చెపుతున్నప్పుడు విజయ్ పరధ్యానంగా ఆలోచిస్తూ వినిపించుకోకపోవటం.

    దట్సాల్ అదిచాలు మొదటికే మోసంజరగటానికి పట్టాలు స్థానం తప్పితే ట్రైను పడిపోతుంది. ఇంజన్ ట్రబులిస్తే విమానం కూలి పోతుంది. కూరలో పప్పు ఎక్కువయితే ఆ కూరకన్నా కాల కూత విషం బాగుంటు౦దని పిస్తుంది.

    చెప్పేది వినిపించుకోకుండా ఆలోచించటం ఒక్కోసారి ఈ ప్రమాదాలు లాంటివే

    విజయ్ మొదటే ప్రమాదంలో పడ్డాడు.

    ఎలుక ఎగిరి మీద దూకంగానే ఆ దూకిందేమిటో తెలియక విజయ్ కూడా వెనక్కి దూకినట్ట్లే జరిగాడు. తనమీడుకి దూకింది ఎలుక అని చూసి గ్రహించి నవ్వుకున్నాడు. అంతకుక్రితం తుప్పు పడ్డ తాళం తీయటానికి . ఎంత శ్రమ పడ్డాడో మర్చిపోయి మరోసారి మనసారా నవ్వుకున్నాడు.

    అది ఏరకంజీవి అయినా పుట్టిన పిల్లలు బాగుంటాయి. విజయ్ ఎలుకమ్మగారి నాలుగు పిల్లలని పెట్లోంచితీసి భద్రంగా అల్లంత దూరాన పెడుతూ  'బుజ్జి ముండలు , ఎంత బాగున్నాయో!" అనుకున్నాడు.

    అది జాజి చేక్కపెట్టే కాదు. గంధం చెక్క పెట్టె అంతకన్నా కాదు. సందూకాపెట్టే. మామూలుగా అయితే ఏ సువాసనలూ విరజిమ్మదు. ఇప్పుడు మాత్రం ఆ పెట్టెలోంచి పలురకాల వాసనలు వస్తున్నాయి. పాతకాగితాల వాసన ఎలుకమ్మగారి ఎరువుల వాసన ఫలానా యిదీ అని చెప్పలేని వాసనలవి.

    విజయ్ పెట్టెలోని జాగ్రత్తగా తీసి ఒక్కొక్కటీ యివతల పెట్టాడు.

    ఓ కాగితాల కట్ట తడిసిపోయి వుంది.

    మరో కాగితాల కట్టలోంచి నుసిరాలుతున్నది.

    తాటియాకులయితే వాటి రూపు రేఖలు మారి పలురకాల క్రోటన్స్ ఆకులూ తుంచి వేసినట్లు రూపు దిద్దుకుని వున్నాయి. వాటి మీద లిపికూడా అంతంతమాత్రంగానే వుంది.

    అన్నీ తీసాం తరువాత పెట్టె ఖాళీ అయింది.

    ఒకనోకనాడు చెదలు తిన్న చోట పల్చని చెక్క అడ్డు పెట్ట బద్ద బాగా గ్రహించిన ఎలుక ఆ ద్వారం తెరచి సరాసరి అటు నుంచే సందూకా పెట్టెలో దూరి దానిని తన నివాస యోగ్యంగా ఏర్పరుచుకుంది. జరిగింది. అది.

 Previous Page Next Page