Previous Page Next Page 
అసిధార పేజి 5


    మరో నెలరోజులు ఆ పెట్టె తెరవకుండా ఉన్నట్లయితే ఎలుక దాని పిల్లకాయలూ కలిపి దానిలో కాగితాలు పూర్తిగా గుటకాయస్వాహా చేసేవే.

    రఘురామయ్య తాతగారు రాసిన తన అపూర్వ అనుభవాల కాగితాల కట్టని అదేదో విచిత్రదేశం న్యూస్ లావా కొట్టిపెట్టింది. ఎలుక.

    విజయ్ ప్రాణం వుసూరుమంది.

    ముందుగా తాటిఆకుల్ని పరీశిలించాడు. అణుమాత్రం కూడా అర్ధంకాలేదు కానీ ఓ ఆకుమీద రూపురేఖలు స్పష్టంగా లేని ఓ బొమ్మ ఉంది. అది మనిషో వింత జంతువో తెలీని విధంగా  వుంది. మరి రెండు బొమ్మలు కూడా వున్నాయి. అది ఏ చెట్టు ఆకూ అయినా కావచ్చు లేక డిజైన్ కావచ్చు. మరొకటి ఏమిటో దేంతో పోల్చుకొని విధంగా వుంది.

    విజయ్ వాటినిచూసి పక్కన పెట్టేసి కాగితాలు అందుకున్నాడు. ఆ కాగితాలలోంచి గుప్పెడు నుసి రాలింది! నల్లకప్పేసి వున్న కాగితాలలో రాసి వున్నది సంస్కృతం .

    సంస్కృతం ఆ రత ఎలా వుంటుందో ఒకేఒక్కసారి చూశాడు విజయ్ "ఇది సంస్కృతం నాకేం వచ్చు అయినా ఈ కాగితాలు ముట్టుకుంటే నామరూపాలు లేకుండా పోతాం అని బెదిరిస్తున్నాయే. వీటితో జాగ్రత్తగా వ్యవహరించాలి" అని జాగ్రత్తగా పక్కన పెట్టాడు.

    మరో కాగితాల కట్ట అందుకున్నాడు. రఘురామయ్యగారి తాతగారు గ్రాంధికం కలిపిరాసిన తెలుగు అది. కాగితాలు మూడొంతులు ఎలుక కొట్టేయ్తం వల్ల ఆ కాగితాల్లో రాత మధ్యమధ్య ఎగిరిపోయి ఇలా ఉంది.

    (వదిలేసినా అక్షరములు పెట్టవలెను)

    ఇలా తలకట్టు తోకలు తెగిన అక్షరాలుపట్టుకుని కుస్తీపడితే ఏమాటలు తయారవుతాయోగాని ప్రస్తుతం తలాతోకా లేనిమాటలు తయారాయి మాత్రం, అందుబాటులో వున్నాయి.

    మరోసారి విజయ్ ప్రాణం వుసూరుమంది "తాతగారూ! మాట మాత్రం ఇదివరకే చెపితే నాకీ అవస్థ వుండేది కాదు. తాతలనాటి కాగితాలు కూడా పాడుకాకుండా భద్రపరిచే విధానాలు ఎన్నో వున్నాయి. జాగ్రత్తపరిచేవాడిని లేకపోతె ఫోటోస్టాట్ తీయించి పదిలపరిచే వాడిని" అనుకుంటూ రఘురామయ్యగారు రాసిన కాగితాలు ఎలుక ధర్మమా అని న్యూస్ ఆకారంలో తయారయిన వాటిని అందుకున్నాడు.

    ఎలుకమ్మగారు ప్రసవించింది. కాలకృత్యాలు తీర్చుకుంది ఆ కాగితాల మీదనే కాబట్టి కొన్ని కాగితాల్లో అక్షరాలూ కానరాకుండా పోయాయి.

    సందూకా పెట్టెఅడుగున తాటిఆకులూ ( తళాపత్రములు) ఆ పైన మళ్ళీ తాటి ఆకులూ దానిమీద సంస్కృతంలో రాసిన కాగితాలు దానిమీద పెట్టిన కాగితాలలో గ్రాంధికంతోకూడిన తెలుగు, దానిపై కాగితాలు అచ్చమైన తేట తెలుగులో రఘురామయ్యగారు రాసింది. అలా వరసక్రమంలో పేర్చివున్నాయి.

    తాటి ఆకుల్ని చేదలు తీనేసింది.

    కాగితాలు నల్లబడి మసికాబోతున్నాయి.

    ఆపై కాగితాలు కొన్ని యాక్సిడెంట్ లో అవయవాలు ఎగిరి పోయిన మొండెల్లా వికృతరూపం ధరించివున్నాయి.

    తాతగారు రాసింది. చదవటం మొదలుపెట్టాడు విజయ్.

    ఆ కాగితాలు నోట్ బుక్ సైజులో కాగితాలంతవి పదిహేను వున్నాయి. మ్యాఫ్ ఆకారంలో మారటంవల్ల అరచేతి వెడల్పులో ప్రస్తుతం వున్నాయి.

    ఆ మాటలు వరసక్రమంలో ఇలా వున్నాయి.

    నే _ రోజు _ అమా _ స్య _ నిండు _ నడి _ ణు _ సరీగ_ డు _ రా _ చాలా _ రం _ అప _ దగ్ద _ అది _ చాలా _ భ _

    (గమనిక : ఈ డాష్ లు _ వున్నచోట అక్షరాలు ఎగిరిపోయాయని కొన్ని తడిసి చేరగిపోయాయని గుర్తించుకోవలసింది)

    విజయ్ రెండుమూడు కాగితాలు తిరగేసి ఎలాగో అలా ఆ మాటలు చదివాడు మధ్యలో పజిల్ లాగా అక్షరాలు పలురకాలు పేర్చుకుంటూపొతే వాక్యం తయారయివిషయం కొంతవరకూ తెలుస్తుంది. కానీ మొదలూ చివరా కాగితాలు కొట్టేయబడటం వల్ల ఎగిరిపోయాయి. అక్కడ ఏ మాటలు వుండేవో వూరించాలంటే చాలాకష్టం కేవలం వూహతో వూరించాలంటే చాలాకష్టం. కేవలం వూహతో పూర్తించాల్సిందే.

    ఉదా: __

    నే_ రోజు _ అమా _ స్య _ నిండు ......

    దీనిని పలురకలుగా పూరించవచ్చు.

    నేనారోజు వంటరిగా అమావాస్య అయినా  నిండు మనసుతో .......

    నేను రోజు నడిరాత్రి అమావాస్యనాడు కుండనిండుగా .......

    నే ఆ రోజు తెళ్ళారితే అమావాస్య అనగా నిండు చూలాలుని .....


    ఇలా మాటలు పలురకాలు మధ్య మార్చి మర్చి చూసినా అసలు విషయం తారుమారు కావచ్చు.

    అదెలా అంటే ...... పాపి అని వుండి తర్వాత తూర్పు అని వుండి మధ్యనుండి __ మాటలు ఆగిపోతే . పాపికొండలనుంచి తూర్పుదిశగా బైలుదేరి నది మధ్యనుండి అంటూ వాక్యం పూరించి బైలుదేరితే కావాల్సిన ప్రదేశం రావచ్చు. దానికి సంబంధంలేని ప్రదేశం తగలవచ్చు. అదెలా అంటే. పాపి తూర్పు కనుమల మధ్యనుండి  ప్రయాణి౦చి ప్రమాదస్థలంలోకి వెళ్ళాడు. నడిసముద్రం మధ్యలో పాపి ప్రయాణం సమాస్తం అయింది. ఇలా అధ్వాన్నంగా అయోమయంగా మాటలు తయారయే ప్రమాదం చాలావుంది.  

    ఆ పరిశోధన యీరాత్రి చేయదల్చుకోలేదు విజయ్. కాగితాలు వూరికే తిరగేసి మళ్ళీ భద్రంగా పెట్టెలో పెట్టాడు.

    నందుకాపెట్టె మంచంకింద దాచేశాడు వచ్చి మంచంమీద చార్లగిలపడ్డాడు.

     తుప్పు పట్టిన ఆ తాళంతీసి పెట్టేతెరచి అవన్నీ చూసి మళ్ళీ పెట్టె మూసేసరికి తెల్లవారుఝామున మూడున్నర అయింది.

    విజయ్ దీర్ఘంగా ఇదే విషయం ఆలోచిస్తూ పడుకున్నాడు.

    సమయం గడిచిపోతున్నది
   
    "తాతగారూ! మీరు చివరిక్షణాలలో లేని ఓపిక ఎలాగో అలా తెచ్చుకుని కొంత చెప్పారు. మీకు ప్రాణప్రదమైన సందూకాపెట్టెలో కొంత సమాచారమే అందింది. ఈ కొంత భాగాన్ని పట్టుకుని నేను ముందుకు సాగగలనంటారా? మీకు ఓపికవున్న రోజుల్లో యీ విషయంచెప్పి నాతో చర్చించివుంటే మీ కోరిక తీర్చగలిగి వుండే వాడినేమో! మీ చేత భేష్ అనిపించుకోతమావు, మీ చేతకూడా నాన్నగారు తిట్టినట్లు ప్రయోజకుణ్ణి అనైనా అనిపించుకునేవాడిని . నాన్నా అని ముద్దుగా పిలుస్తూ ప్రాణం పెట్టేవారే. ణా దగ్గర చివరి క్షణాలవరకూ ఈ విషయం ఎందుకు దాచారు? ఎందుకు దాచారు?"

    బాధపడుతూ పదేపదే అనుకున్నాడు విజయ్.

    కొద్ది నిముషాలు గడిచాయి.

    విజయ్ ఆలోచనలు మరోవేపు సాగాయి. అవేసహ్మ్తావు హృదయం వుప్పో౦గింది. పిడిగిళ్ళు బిగుసుకున్నాయ్. కళ్ళల్లో పట్టుదల చోటుచేసుకుంది. "అవును అలాగే చేయాలి అవును అలాగే చేయాలి"

    ఒక స్థిరనిర్ణయానికి రాంగానే తృప్తిచెందాడు. అలాగే నెమ్మదిగా నిద్రాదేవి వడిలోకి జారిపొయ్యాడు.

 Previous Page Next Page