Previous Page Next Page 
అసిధార పేజి 3

  

  అందరేదుటా చెపితే ఇంట్లో అడ్డు తగులుతారు . నా కాలంలో కంప్యూటర్లు లేవు సాహసయాత్రలకి కావలసిన సరంజామా లేదు. వంటరిగా వెళ్ళటంవల్ల ఏదైనా ఆపదవస్తే వెనక్కీ మరలిరావాల్సి వచ్చేది నీపలా చేయకు నమ్మకమైన తోడు  కావాల్సిన పరికరాలు తగుజాగ్రత్తతో.......

    రఘురామయ్యగారికి ఎక్కిళ్ళు వచ్చాయి. ఆయాసం అధికం అయింది. "నన్నా! నీవు మంచి తెలివికలవాడివి . బుద్ధిమంతుడువి . అయినా యీ వెధవ కంప్యూటర్లు పేపర్లుదిద్ది నీకు అత్తెసరు మార్కులు ఇచ్చి నిన్ను సామాన్యుడిగా నలుగురిలో నిలబెట్టాయి. ఇంజీనీరింగ్ లో సీటు రాకపోవటం బి.ఏస్సీ లో క్లాసు రాకపోవడంవల్ల నీవు వాళ్ళ కళ్ళకి సామాన్యుడిలా అతి సాధారణమైన వాడిలా కనిపిస్తున్నావు. నీ కృషి పట్టుదల నాకు ..... నాకు .... తెలుసురా  నాన్నా! నేను నిన్ను మనస్పూర్తిగా దీవిస్తున్నాను నీ తెలివిలో లోపం లేకపోయినా విధి విషయాలలో దెబ్బతీసింది. నేచ్చేపిందిచేసి ప్రపంచానికి చాటు గొప్పవాడిగా మిగిలిపో .

    ఈ గొప్పవాళ్ళంతా  ...... గొప్ప విషయాలు కనిపెట్టిన వాళ్ళంతా గొప్ప విజ్ఞానులు వీళ్ళంతా ఆ గొప్ప అద్భుతం కనిపెట్టకముందు అతిసామాన్యులు వారు సాధించింది ప్రపంచానికి చాటిం తరువాత నేరానాన్నా! గొప్పవారాయింది నీవు నీవు గో .....    

    రఘురామయ్యగారికి పెదవులు కదులుతున్నాయి . అంతే ఆ పెదవుల కదలికలో ద్వనిలేదు.

    విజయ్ తలుపులు తీసుకుని బైటికి పరుగెత్తాడు.

    "తాతగారు మాట్లాడటంలేదు."

    ఈ మాట వింటూనే అందరూ గదిలోకి పరుగెత్తారు.

    కొద్దిసేపు అయాసపడి అంతిమశ్వాస విడిచారు రఘురామయ్యగారు.

    అది చూస్తూనే ఓ గావుకేకవేసి విరుచుకు పడిపోయింది. పార్వతమ్మ మళ్ళీ లేవలేదు ఆమె.

    "అదృష్టువంతురాలు అయన వెనకనే వెళుతున్నది " ఓ పక్క కళ్ళనీళ్ళు గారుస్తూ అన్నారు అంతా.

    విజయ్ తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు.

                                                                            2

    పుష్కలంగా డబ్బే వుండాలిగాని ఆ కొండమీద కోతినైనా సరే దిగిరా అంటే దిగివస్తుంది. అన్నాడట వెనకటికొకడు అలాగే పది మందికి పెట్టగల స్తోమతు వుండబట్టి రఘురామయ్యగారి దినవారాలు గొప్పగా జరిగాయి. పీకలదాకా తిన్న బంధుమిత్ర ఊరిజనం "ఈ వూరిమొత్తంమీద నూటపద్డానుగేళ్ళు బతికింది మన రఘురామయ్యగారు ఒక్కరే మహానుభావుడు. అలాంటి మనిషి మరి పుట్టాడు __ పుట్టినా ఇన్నేళ్ళు జీవించటం ఆసాధ్యం " అంటూ అయనగురించి చెప్పిందే మళ్ళీ చెప్పుకున్నారు.

    రఘురామయ్యగారి ఘటం వెళ్ళిపోయింది.

    ఇప్పుడు వచ్చిన పెద్దచిక్కు విజయ్ కి .

    "తాతగారు మరణించే౦దుకు నిన్ను ఒంటరిగా పిలిచి మాట్లాడారుకదా! నీతో ఏం చెప్పారురా అయన" ఇంట్లో అంతా అడిగారు.     

    ఆ దేవరహస్యం ఏమిటో వింటే తప్ప నిద్రపట్టదనుకున్నట్లు వుంది అందరి ప్రవర్తన .

    నిజం చెబితే ఫలితం తనకి అనుకూలంగా వుండదు. కాబట్టి అబద్ధం ఆడాలి నిశ్చయించుకుని ఏ మాత్రక కంగారుపడకుండా "నన్ను పెళ్ళి చేసుకోమన్నారు నాకు పుట్టిన మొదటి బిడ్డకి తన పేరు పెట్టుకొమన్నారు. తాతగారు నా గురించి మాట్లాడారు. మీ అందరికి తెలిసిందే కదా నేనంటే తాతగారికి ప్రాణం అని ......"

    విజయ్ మాటలు పూర్తికాలేదు. అందరి ముఖాలు ఆనందంతో విస్తరించాయి గోలగోలగా అందరూ మాట్లాడారు.

    "నేముందే వూహించా. ఇది విజ్జి పెళ్ళి విషయమేనని .....!"

    "సరేలే. అసలదేనే వూహించాను. మా నాన్నగారి గుణం నాకు తెలుసుగా మా అమ్మాయి గీతని తప్ప మరొకరిని పెళ్ళాడవద్దని విజ్జితో చోవరిసారిగా అని వుంటారు." విజయ్ పెద్ద మేనత్త అంది.

    "అదేంకాదు విమల. విజ్జీ ఈడు జోడూ బాగుంటుందని నాన్న గారు తరచూ నాతో అనేవారు" మూడో మేనత్త తన కూతురు తల నిమురుతూ అంది.

    అప్పుడే పెళ్ళయిపోయినట్టు ఆ పిల్ల సిగ్గుతో అష్టవంకర్లూ తిరిగి పరుగున గదిలోదూరి తలిపులేసుకుంది.

    "మీ ఇద్దరూ ఇద్దరేనే. అక్కా! నువ్వు పెద్దదానివి నీకూ యూ పాటి తెలియకపోయే చెల్లాయ్ నువ్వెంత వెర్రిదానివే. విజ్జీ హాస్యాలు పట్టించేది జోకులేసి ఏడిపించేది మా రాధనికదూ! విజ్జీ నా అల్లుడు" అంది రెండో మేనత్త దీనికి తిరుగులేదు సుమా అన్నట్లు ధీమాగా పోజుపేట్టి.

    "నేరక అబద్దమడానురా దేముడా! ఇంతకన్నా అబద్హం ఆడటానికి ఇంకేం తోచిచవలేదే౦. యీ గండం గడిచేదేలా?" కుడితితొట్లోపడ్డ ఎలుకలా నీళ్ళగ్లాసులోపడ్డ ఈగలా గిజగిజలాడాడు విజయ్.

    ప్రప్రధమంగా ఆ ఇంట్లో రఘురామయ్యగారు మరణించిన తరువాత అందరి మనుషుల్లో బేధాభిప్రాయాలు కలతలు ఏర్పడ్డాయి.

    తమ్ముడు సీతారాముడు నీవు చెప్పరా విజ్జీకి విమలకి ఈడూజోడూ అవునా కాదా!" అంటూ మూడో ఆమె తమ్ముడితో గుసగుసలాడింది.

    "ఇదేదో తేల్చుకొనే వెళదాం " అన్నాడు పెద్దమేనత్త మొగుడు.

     రెండో ఆమెకి వదినగారికి దోస్తీ ఎక్కువ "నీవు చెప్పు వదినా! అన్నయ్యగాని విజ్జీగాని నీ మాట కాదనరు . రాధ ఆశలన్నీ నీ కొడుకుమీదనే . ఇప్పుడు కాదంటే రాధ ఏ ఆత్మహత్య అయినా చేసుకోవచ్చు" అంటూ కళ్ళనీళ్ళు కాకపట్టటం లాంటి కార్యక్రమంలోకి దిగింది.

    విజయ్ మేనత్తలు అలా వుంటే విజయ్ అక్కయ్యలిద్దరూ పెద్దత్తయ్యకి ఓటెయ్యమని వకరు మూడో అత్తయ్యకి ఓటెయ్యమని మరికరు చాటుమాటు బలవంతంలోకి దిగారు.

    "తాతగారు విజ్జీని పెళ్ళి చేసుకోమని చెప్పిపోయారు. బహుశా ఆ పెళ్ళికూతురు ఎవరో కూడా చెప్పి వుంటారు. తాతగారికి నేనంటే ఇష్టం. బావ చూపలన్నీ నా మీదే నే గ్రహించులేదుగాని!" ఇలా ఎవరికివారే ఆలోచించుకుని వూరికే సిగ్గుపడిపోతూ . అలా పడిపోతూ కూర్చుంటే లాభంలేదని రంగంలోకి దిగారు నడుంబిగించి.

    "బావా! సబ్భిదిగో!"

    "బావా ! టవలిదిగో!"

    "బావా! బావా! ఏం తోచటం లేదు. నీ గదిలో చాలా నవలలు వున్నాయి కదా ? ఏదోకటి యివ్వు చదువుతాను"

    "నాక్కూడా ఓ నవల యివ్వు బావా!"

    "మనిద్దరి అభిప్రాయాలూ ఒకటేకదా బావా! కానుక నీకు బాగా నచ్చిన నవల నాకూ బాగా నచ్చుతుంది కాబట్టి అలాంటి నవల చూసి నా కోసం యివ్వు బావా!"

    రామనామంలాగా బావనామం ఎక్కువయి౦ది. కావాలని ఓ అడుగు ముందుకు వేస్తున్నారు మరదళ్ళు.

    కరవమంటే కప్పకు కోపం. విడమంతే పాముకు కోపంలా వుంది సీతారామ్ పరిస్థితి .

    "పెళ్ళి అన్న రెండు అక్షరాలు తన ప్రాణంమీదకి వచ్చింది." తన గదిలో తనతలే పట్టుకుని విచారిస్తూ కూర్చున్నాడు విజయ్ ఎరుగడు . ఇది ముందే గ్రహిస్తే తల అప్ట్టుకుని "అబద్దం ఎందుకాడానురాదేముడా!" అని విశారిస్తూ కూర్చునేవాడు కాదు. ఎంతమాత్రం.

    ఈ పెళ్ళి విషయం ఏదో తేల్చుకుని పోదాం అని అందరూ ప్రయాణం మానేసి వుండిపోయారు.

    "వరేయ్ విజ్జీ! ఈ ఇంట్లో యింతవరకూ పొరపచ్చాలు లేవు. మాలో మాకు బేధాభిప్రాయాలు లేవు. అత్తయ్య కూతుళ్ళలో వేవరిష్టమో నాన్నగారు ఏ పిల్లని చేసుకోమని చెప్పరో చెప్పు. దాంతోనే నీ వివాహం అవుతుంది. ఇది నాన్నగారి ఆగ్న కాబట్టి అయన ఆగ్న శారసావహించి అందరమూ అమోదిస్తాము అందరూ నీ పెళ్ళికి ఆనందంగా అక్షింతలు చల్లుతారు" సీతారామ్ ఇంట్లో మధ్య హాలులో అందరినీ సమావేశపరచి విజయ్ ని పిలిచి అడిగారు.

    ఇలా చేయటం అందరికీ నచ్చింది. ఆమోదసూచికంగా అందరి తలలూ ఆడాయి.

    "వరంరోజులు టైము ఇవ్వండి తాతగారి ఆజ్ఞ శిరసావహిస్తాను ద్వందార్డంగా మరోమాట అని విజయ్ తన గదిలోకి వెళ్ళి తలుపులేసుకున్నాడు.

    "పెళ్ళికూతురు ఎవరో చెప్పటానికి వారంరోజులు దేనికి?"

    "వీడికి పెళ్ళి యిష్టంలేదా?"

    "ఒక్కమాట చెప్పటానికి వారంరోజులు గడువా! కానియ్యి."

    "విజ్జీ ప్రవర్తన చాలా వింతగా వుందే!"

    విజయ్ వెళ్ళింతరువాత ముఖముఖాలు చూసుకుని తలోరకంగా అనలేదు. ఎవరికీ వా రు అనుకున్నారు.

 Previous Page Next Page