Previous Page Next Page 
మయసభ పేజి 31

    దానిక్రింద పిస్టల్స్ బొమ్మలు.....

    వాటిక్రింద ఓల్ట్ మేర్పిడిస్ కారు బొమ్మ......

    వింటేజ్ కారు.... 1920 చెందిన మెర్పిడిస్ కారు బొమ్మ.... అంటే కారు ఖరీదు నలభై, యాభై లక్షలదాకా ఉండవచ్చు.

    యాభై లక్షలు ఆ కారు ఖరీదేనా? 

    అదే అయితే పిస్టల్స్ బొమ్మలు ఎందుకు వేసారు? జీఫ్ భాస్కర ప్యాలెస్ అశోకా దగ్గర అగేవరకు రిషి ఆలోచిస్తూనే ఉన్నాడు.

                                                              *    *    *    *   

    అధిష్టానవర్గం సమావేశమైన హాల్లో సంభ్యులతోపాటు వినోద్ కుమార్ కూడా వున్నాడు.

    "సూటిగా విషయంలోకి వస్తాం. ఈమధ్య రాష్ట్రంలో జరుగుతున్నా పరిమాణాల్ని నువ్వు గమనించే వుంటావు. అవునా?"

    అధిష్టాన వర్గంలోనే సీనియర్ సభ్యులొకరు ప్రశ్నించారు వినోద్ కుమార్ ని ఉద్దేశ్యించి.

    వినోద్ కూమార్ తలాడించాడు గమనించానన్నట్లు.

    "మన పార్టీకి నందకిషోర్ జీ పెద్ద తలనొప్పయిపోయాడు. అతన్ని ముఖ్యమంత్రి పదవిలోంచి తప్పించాలి. తప్పించగలం కూడా . కాని మేము ప్రత్యక్షంగా ఆ పనికి పూనుకాకూడదు. మీ ఎమ్. ఎల్. ఏ ల్లోంచే అతని పట్ల అయిష్టం వ్యక్తం కావాలి కాని ఈసారి అదీ ప్రమాదమే .  ఈ రెండు మార్గాల, ద్వారా కాక, అతను కక్కలేక, మ్రింగలేక పదవిని ఒదిలేసి వెళ్ళాలి. అలాంటి పరిస్థితుల్ని నువ్వు తీసుకురావాలి. నువ్వేం చేస్తావో చెయ్యి, ఎంత డబ్బు ఖర్చయినా ఫర్వాలేదు."

    వినోద్ కూమార్ కొద్ది క్షణాలు మౌనంగా ఆలోచిస్తుండిపోయాడు.

    "చేయగలవా?" మరొకరు ప్రశ్నించారు.

    "చేయగలను. కాని ప్రజల ప్రాణాలు, ఆస్తులు పోతాయి."

    "ఫర్వాలేదు"

    "అయితే చేయగలను ఒక కోటి రూపాయలదాకా ఖర్చవుతుంది."

    "నో.... ప్రాబ్లం"

    "మరి..... నాకేమిటి?"

    "కొత్త మంత్రివర్గంలో  నువ్వు కేబినేట్ రేంక్ మినిష్టర్ గా ప్రమాణస్వీకారం చేస్తావు."
   
    వినోద్ కూమార్ పూర్తీ సంతృప్తి కలగలేదు.

    "హొమ్ శాఖ ఇప్పిస్తాం......"

    వినోద్ కూమార్ కళ్ళల్లో మెరుపు.

    "బట్..... ఒన్ కండిషన్ ..."

    "చెప్పండి" ఉత్సాహంగా  అన్నాడు వినోద్ కూమార్ .
   
    "నువ్వేం చేయించినా అది ప్రతిపక్షలా మీదకు వెళ్ళాలి. లేదా మతకల్లోలా క్రిందనే  ప్రజలు గుర్తించాలి . మనమీదకు  గాని, నీమీదకు గాని, మన పార్టీమీదకు గాని రాకూడదు నందకిషోర్ జీ తేరుకుని ఎత్తు వేసేలోపే అంతా జరిగిపోవాలి జాగ్రత్త ... అంతా పకడ్బందీగా జరిగిపోవాలి.....  డబ్బు కావాలంటే  శంభుప్రసాద్ జీ నుంచి తీసుకో, మేము కబురు చేసే వరకు నువ్వు తిరిగి ఢిల్లీకి రావద్దు. ఇప్పడోచ్చిన విషయాన్ని కూడా సాధ్యమైనంతవరకూ గోప్యంగా వుంచాలి."

    వినోద్ కూమార్ అలాగే అన్నట్లు తలూపాడు ఆనందంగా.

                             *    *    *    *    *

    చూడప్ప ఇల్లు .... ఆ ఇంట్లోని  సభ్యులంతా హాల్లో సమావేశమయ్యారు.

    "మీరెన్ని చెప్పినా అబ్బాయి రిషి దూకుడుగా  వేళుతున్నాడనిపిస్తోంది. ఆ గోవిందరాజులు  ముఖ్యమంత్రి నందకిషోర్ మనిషి రిషి పట్టుకొని ఇంటరాగేట్ చేస్తున్నా అలక్ నిరంజన్ ఆ గోవిందరాజులుకి కుడిభుజం లాంటివాడు. మొన్నటిదాకా వెంటబడిన షానవాజ్ ఆ గోవిందరాజులకి ఎడమ. భుజం. ప్రత్యేకంగా ఇదీ అని చెప్పలేకపోయినా ఏదో ప్రమాదం పొంచివుందనే  అనిపిస్తోంది నాకు. ఎందుకయినా మంచిది __ రిషిని వెనక్కి లాగకూడదూ?" చూడప్ప భార్య ఒకింత వ్యక్తపరుస్తూ అంది.

    అవంతి ఏం మాట్లాడలేదు.

    చూడప్ప కూతురు కూడా ఏం చెప్పాలో తోచక ఆగిపోయింది.

    "మొత్తానికి ఆడదానివినిపించుకున్నావే రిషి ఎంతో కష్టపడి పెద్దస్కూఫ్ ని పట్టుకోగాలిగాడు. దాన్ని  మొత్తంగా బయటకు లాగితే ఎంత పేరోస్తుందో తెలుసా? వెంటనే ప్రమోషన్ కూడా వస్తుంది. ప్రొఫెషనల్ సాటిస్ ఫెక్షన్  అంత తేలిగ్గా లభించేది కాదు. రిస్షికి ఏం జరక్కుండా నేను వెనుకలేనా?" చూడప్ప భార్యకి నచ్చజెప్పే ప్రయత్నం చేసాడు.

    అయినా ఆమె సంతృప్తి పడలేదు.

    అదే తన నిర్ణమయన్నట్లు చూడప్ప లేచాడు.

    "నువ్వేం భయపడకమ్మా....... అంతా నే చూసుకుంటాను. రిషికి ఏ ప్రమాదం రాదు .... రానివ్వను " అన్నాడు చూడప్ప అవంతికేసి చూస్తూ.

    అయన హామీతో అవంతి ధైర్యాన్ని ప్రోది చేసుకుని క్లీనిక్ కేసి వెళ్ళిపోయింది.

                            *    *    *    *    *   


    భాస్కరప్యాలెస్ బార్ లోని స్టివార్డ్  ని కలిపి తన ఐడింటిఫికేషన్ కార్డ్ చూపించి ప్రశ్నలు వేయటం ఆరంభించాడు రిషి.
   
    ఖైతరాబాద్ పోలీస్ స్టేషన్ ఎస్.ఐ మౌనంగా వారి సంబాషణ వింటున్నాడు.

    "అలక్ నిరంజన్ తెలుసా నీకు?"

    "పేర్లను మేం పట్టించుకొం....... ఆ అవసరం మాకు సాధారణంగా రాదు. మొఖాల్ని చూస్తే గుర్తుపట్టగలం."

    "ఈ పోటో చూసి చెప్పగలవా" అంటూ రిషి షర్ట్ జేబులోంచి అలక్ మొఖాల్ని చూస్తే గుర్తుపట్టగలం."

    "ఆ స్టిరావ్ ఆ పోటోని చూస్తూనే తలూపాడు.

    "ఇతను చాలాసార్లు మా బార్ కి వచ్చాడు " అన్నాడు స్టివార్డ్ .

    "అదిసరే ... ఇతనితోపాటు మరెవరు వచ్చేవారు ఎక్కువసార్లు?"

    "మీరు అనుమానిస్తున్న వాళ్ళ ఫోటోలు చూపిస్తారా?"

    "లేవు .... పోలికలు, గుర్తులు చెప్పగలవా?"

    "నడివయస్కుడు .... బాల్డ్ హెడ్ ... పొట్టిగా .... బొద్దుగా వుంటాడు."

    తన పరిశోధనకి బ్రేక్ పడిపోయిందనుకున్నాడు రిషి.

    రివాల్వింగ్ రెస్టారెంట్ నిండు గర్భీణీలా మెల్లగా తిరుగుతోంది.

    పరిశోధనలో ఎలా ముందుకెళ్ళాలో అర్ధం కాలేదు.

    ఫలానా వాళ్ళమీద అనుమానముంటే వాళ్ళలో స్టివార్డ్ చెప్పిన పోలికలు ఎవరికున్నాయని అలోచించొచ్చు. ఆ ఛాన్స్ లేదు. అసలు ఎవరి మీద వలపన్నారో? ఎందుకు పన్నారో తెలీలేదు.

    మోర్ ప్లాసిబుల్ కేస్ ......

    అలక్ నిరంజన్ ఖచ్చితంగా ఫిక్చరే .....

    బొంబాయి అండర్ వరల్డ్ క్రిమినల్స్ తో వైడ్ స్పేడ్ కాంటాక్ట్స్ వున్నవాడు.

    నిర్ణయం గోవిందరాజులు తీసుకుంటే దాన్ని ఎలా అమలు చేయాల్సింది చెప్పేది షానవాజ్ . అమలుపర్చేది అలక్ నిరంజన్. అమలుపర్చే సందర్భంలో అతనేవరి సహాయం తీసుకుంటున్నాడు.....? మైఖల్  రాజు కటింగ్ అలక్ నిరంజన్ ఫైల్ లోకి ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? అతని ఫోటో మీద రెడ్ ఇంక్ తో ఇంటూ మార్క్ పెట్టటమేమిటి ....?

    రిషి ఆలోచిస్తూ ఒక  టేబుల్ ముందు కూర్చుని టీకి ఆర్డరిచ్చాడు ఎస్.ఐ కూడా ప్రక్కనే కూర్చున్నాడు.

    మైఖల్ రాజునే లక్ష్యంగా పెట్టుకుని ఉంటారని భావిస్తే ....?

    మైఖల్ రాజుకి శత్రువులెవరు?

    శంభుప్రసాద్

    ఎస్ .కే లెటర్స్ శంభుప్రసాద్  కి సరిపోవు.

    ఇంకా ...? శంభుప్రసాద్  కొడుకులు.

     మురారీప్రసాద్ ..... ఎమ్. పి.

    అనూప్రసాద్ ...... ఎ.పి

    ఎస్ .కే ...?!

    వాళ్ళకు బాగా క్లోజ్ గా వుంటూ వాళ్ళ వ్యవహారాల్లో పాలు పంచుకోనేదేవరు?

    సుకీర్తి .... వాళ్ళ మేనమామ.

    సుకీర్తి ... అంటే ఎస్.కే

    ఆ ఆలోచన వస్తూనే రిషి ఉలిక్కిపడ్డాడు.

    చటుక్కున తన జేబులోంచి ఒక పేపర్ కటింగ్ ని బయటకు తీసాడు.

    దాన్ని టేబుల్ మీద పర్చి స్టివార్డ్ ని పిలిచి దానిలో ప్రింటయిన సుకీర్తీ ఫోటోని చూపించి "ఇతనేమో చూడు " అన్నాడు.

    స్టివార్డ్ పేపర్ కటింగ్ ని చేతుల్లోకి తీసుకుని కళ్ళ దగ్గరకు పెట్టుకొని చూసి "ఎస్.... ఇతనే" అన్నాడు ఉద్వేగంగా.

    ముందు స్టివార్డ్ అన్నదేమిటో అర్ధం కాలేదు.

    అర్ధం కాగానే షాక్ తిన్నాడు రిషి.

    "బాగా చూసి చెప్పు .... " అతను నమ్మలేకపోతూ అన్నాడు.

    "ఇతనే సార్ .... ఖచ్చితంగా ఇతనే ...." స్టివార్డ్ కటింగ్ ని టేబుల్ మీద పెడుతూ అన్నాడు.

    సుకీర్తి ....?! అంటే శంభుప్రసాద్ వర్గం సుక్తీర్తిద్వారా డీల్ మాట్లాడుకొని మైఖల్ రాజుని అంతమొందించే పథకం వేసారా?

    "ఈ ఇద్దరితోపాటు మరో ఇద్దరు వ్యక్తులు కూడా వచ్చేవారు సార్" స్టివార్డ్ మాటలతో ఉలిక్కిపడి ఆలోచనలనుంచి తేరుకున్నాడు రిషి.

    కొద్ది క్షణాలు ఆలోచించి పర్స్ లోంచి పాస్ పోర్ట్ పోటోని బయటకి తీసి దాన్ని స్టివార్డ్ చూపించాడు. "ఆ యిద్దరిలో ఇతనున్నాడా?" అని ప్రశ్నిస్తూ.

    స్టివార్డ్ దాన్ని చూసి "అవును సార్" అన్నాడు ఉత్సాహంగా.

    "షానవాజ్ కూడా ఈ గ్రూఫ్ లో  వున్నాడనిమాట?" స్వగతంతో అనుకున్నాడతను.

 Previous Page Next Page