Previous Page Next Page 
మయసభ పేజి 32

    ఎస్. ఐ. కి మతిబోతోంది, కొత్త వివరాలు తెలుస్తున్న కొద్ది.

    "నాల్గవ వ్యక్తి ఎలా వుంటాడు ....?" తన పరిశోధన ఫలితాన్ని సాధిస్తున్న కొద్దీ రిషిలో ఉత్సాహం రెట్టింపవుతోంది.

    "పాతిక, ముప్ఫయ్ సంతంత్సరాలుండవచ్చు. సమ్మర్ క్రాఫ్ , సన్నగా వున్నాడు చిన్ని చిన్ని కళ్ళు, హిందీ ఎక్కువగా మాట్లాడేవాడు. అప్పుడప్పుడు ఇంగ్లీషు కూడా __ శార్స్ ఫీచర్స్ .....

    షుమారు ఐదడుగుల పదంగుళాలు ఎత్తుండవచ్చు కళ్ళకు ఎప్పుడు గాగుల్స్ ఉండేవి బాడీ స్టిట్  గా వుండేది సస్పీషియస్ గా కనిపిస్తాడు . హైదరాబాద్ కి కొట్టని అతని మాటల్నిబట్టి తెలుసుకున్నాను....." తనకు గుర్తున్నవి చెప్పాడు స్టివార్డ్ .

    అతను తిరిగి ఆలోచనలో పడ్డాడు.

    మురారీప్రసాదు , అనూప్రసాదు కాక ఇక మిగిలింది ముఖ్యమంత్రి నందకిషోర్ కొడుకు అనూస్ వీళ్ళకు హైద్రాబాద్ కొత్తకాదు మరితను ఎవరు....? తిరిగి పరిశోధనకు బ్రేక్ పడింది.

    "ఇప్పుడేం చేద్దాం.....? స్టేషన్ కి వెళ్ళి ప్రిన్స్ ని విచారిస్తే సరిపోతుంది . నాలుగు తన్నితే వాడే చెబుతాడు, ఎవర్ని మర్డర్ చేయాలనుకునేది? ఎవరు చేసేది ? నాల్గవ వ్యక్తి ఎవరనేది దానంతట అదే తెలుస్తుంది. ఇక ఇక్కడ విచారించి ప్రయోజనం లేదనిపిస్తోంది" అన్నాడు ఎస్.ఐ .

    రిషి అదే బెటరనుకుని లేచాడు.

                              *    *    *    *

    ఏమిటి విశేషాలు ?" నందకిషోర్ తన ఎదుట నిలిచినా వ్యక్తిని అడిగాడు.

    అతను ఎయిర్ పోర్టులో పనిచేసే అధికారి.

    "వినోద్ కూమార్  డిల్లీ __ వెళ్ళాడు .... వచ్చాడా? ఆహా...... ఇంకా.....?" సాలోచనగా అడిగాడు నందకిషోర్.

    "ఈ మధ్యకాలంలో అతనొక్కడే సార్" వినయంగా అన్నాడు అధికారి.

    "థాంక్యూ  ... గోపీనాథాన్ని కలిపి వెళ్ళిపొండి. ఢిల్లీ ఫ్లయిట్ బయలుదేరేటప్పుడు మాత్రం అక్కడే వుండాలి . ఎం. పీ. లు ఎమ్. ఎల్. ఏ. లు , మంత్రులు , మా పార్టీ ప్రతినిధులు ఎవరు వెళ్ళినా గుర్తుపెట్టుకుని నాకు ఫోన్ చేయండి " అన్నాడు నందకిషోర్.

    ఆ అధికారి వెళ్ళిపోయాడు.

    మరికొద్ది సేపటికి గోపీనాథం లోపలికి వచ్చాడు.

                              *    *    *    *   

    రాత్రి ఎక్కిన జీఫ్ ఖైతరబాద్ పోలీస్ స్టేషన్ ముందాగింది.

                                                               *    *    *    *

    రాత్రి తొమ్మిది గంటల సమయం........

    ఒక అంబాసిడర్ వెళ్ళి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ పన్నెండులో వున్న ఒక అతి విలాసవంతమైన ప్యాలెస్ ముందాగింది.

    ఆ కారు అక్కడికి, ఆ టైమ్ లో వస్తుందని ముండుగానే తెలుసుకున్న గేట్ మెన్ , గేట్ కి లోపల వేపు వుండే సేక్యూరీటి గార్డ్ కి సిగ్నల్ ఇచ్చాడు.

    మరికొద్ది క్షణాలకి గేట్ తెరుచుకుంది.

    కారు లోపలికి యధావిధిగా మూసుకుంది.

    కారులోంచి వోనోద్ కూమార్ దిగాడు.

    పరిశారాల్ని ఒకసారి గమనించి లోపలికి వెళ్ళాడు. అప్పటికే లోపల ఒక వ్యక్తి సిద్దంగా వున్నాడు. వినోద్ కూమార్ ఆయన్ని చూస్తూనే నమస్కరించాడు.

    ఒకప్పటి స్ట్రీట్ స్మార్ట్ ఆపరేటర్ ......

    ఇండియన్ కార్పోరేట్ హిస్టరీని తిరగవ్రాసిన మేధావి .......

    జాతీయ వాణిజ్య ప్రపంచపు నియమ నిబ౦ధవల్ని రాడికల్ గా ఛే౦జ్ చేసిన కార్పోరేట్ ఎంపరర్ __

    ఫాస్టేస్ట్  గ్రోయింగ్ ఇండస్ట్రీయల్ గ్రూఫ్ అధినేత __

    మోస్ట్ పవర్ పుల్ పర్సన్ ఇన్ ది కంట్రీ.....

    వినోద్ కూమార్ ని చూసి మందహాసం చేసాడు.

    అతనే ది గ్రేట్ శంభుప్రసాద్ .

    "నమస్తే సర్ __ మీకు ఢిల్లీలో నుంచి ఇన్ ఫర్మేషన్ వచ్చి వుంటుందని భావిస్తున్నాను" అన్నాడు వినోద్ కూమార్ భయం, గౌరవం కలగవలసిన కంఠంతో.

    శంభుప్రసాద్ కనురెప్పలు ఒక్కసారి మెల్లగా పైకి లేచాయి.

    రాజకీయాల్లో, రౌడీయిజంలో చిన్ననాటినుంచే తన పూర్తీ కాలాన్ని వినియోగించి వాటిల్లో రాటుతేలిన వినోద్ కూమార్ కేంద్ర __ రాష్ట్ర మంత్రులతో, ఉన్నతాధికారితో, చివరికి ప్రైమ్ మినిష్టర్ తో కూడా ఎంతో చనువుగా మెలిగే స్థాయికి ఎదిగిన వినోద్ కూమార్ సయితం శంభుప్రసాద్ ముందు ఉండవలసి వచ్చేసరికి ఒకింత సర్వేస్ గా ఫీలయ్యాడు . ఆ బంగ్లాలోకి అడుగిడూతూనే అతనిలో భయం ప్రవేశిచింది __ మీరు చెమట పట్టేసింది __ మహామేధావి ముందు నిల్చున్నప్పుడు కలిగే నూన్యతాభావం అతనిలో కలిగింది.

    తన తెలివితేటలతో నేలకు నాలుగువందల జీతంనుంచి కేవలం రెండున్నర దశాబ్దాల కాలంలోనే తొమ్మిదివేల కోట్ల అస్తులకు ఎదిగిన శంభుప్రసాద్ అంటే అతని గురించి తెల్సుకున్న ప్రతి ఒక్కరి మనస్సు లోనూ అతనిపట్ల మేఘో ఇమేజ్ ఏర్పడి తీరుతుంది. అతనికి ఎదురుగా వుండవలసి వచ్చినప్పుడు అప్ట్రాల్ తనెంత అనే భావం అనివార్యంగా వారి మనస్సులోకి ప్రవేశిస్తుంది.

    పి.ఎమ్. ఓ. (ప్రైమ్ మినిష్టర్స్ ఆఫీసు ) లోకి సయితం అప్పాయింట్ మెంట్ లేకుండా ధీమాగా వెళ్ళగల స్థాయి, స్థయిర్యం అయనకున్నాయని తెలిసినప్పుడు ఎవరైనా అలా తప్ప, ఇంకెలా ఫీల్ కాగలరు?

    పథకాలేప్పుడూ ఇమేచ్యూర్డ్ గా వుండకూడదు __ మనం కొట్టిన దెబ్బ ఆనవాళ్ళు ఏ అటాఫ్సీలోనూ కనిపించకుండా మన శతృవు కృంగిపోవాలి __ ఎంత కావాలి?" గంభీరంగా వుంది శంభుప్రసాద్ వాయిస్ .

    కొంచెం తడబడిన వినోద్ కూమార్ అతికష్టంమీద నోరు పెగల్చుకో గలిగాడు __

    "ఒకటి"

    "ఎక్కడినుండి రప్పిస్తున్నావ్ ?" తిరిగి ప్రశ్నించాడు శంభుప్రసాద్ .
   
    "కర్ణాటక  __ గుల్ బర్గా ."

    "ప్రొఫెషనల్సే గదా ?"

    "పక్కా ప్రోఫెషనల్స్ సార్...... చేయవలసింది చేసి పాదరసంలా జారిపోవటం వారికి వెన్నతో పెట్టిన విద్య."

    "మరణాయుధాలు .... వెహికల్స్ ... బస ....?"

    "అన్నీ సిద్దం సార్ __"

    "పొరపాటున పోలీసులకు దొరికితే??"

    "ఎట్టి పరిస్థితుల్లోనూ నోరు తెరవరు __ ఈలోపే ఇన్ ప్లూయన్స్ చేసి విడిపించే ఏర్పాట్లు కూడా చేసాను"

    "శేభాష్ .... భవిష్యత్ భారతదేశపు రాజకీయ నాయుకుడి వుండవలసిన లక్షణాల్ని పుణికి పుచ్చుకున్నావ్ __ పైకిస్తావ్! ముఖ్యమంత్రిని కూడా అవుతావు. రాజకీయాల్లో రాణించాలనుకొనే వ్యక్తి ముందుగా నేర్చుకోవాల్సింది రౌడీయిజం, గూండాగిరి, హత్యలు చేయటం, చేయించటం కుట్రలు కుతు౦త్రాలు , ఎత్తుకు పైఎత్తులు  __ అయితే వేటికీ సాక్ష్యాలు వుండకూడదు. ఇంతకీ ఎలా చేయించాలనుకుంటున్నావ్?"

    నిశ్సబ్దంగా వున్న ఆ బంగ్లాలో ప్రజల, ధన, మన, ప్రాణాలతో ఆటలాడుకొనే హేయమైన చర్యకు ఊపిరి పోయటం ప్రారంభమైంది.

    వెల్ టైమ్ద్ బాంబ్ ఎక్స్ ప్లోజ్ అవ్వటానికి పూర్వరంగం సిద్దమవుతోంది.

    "రప్పిస్తున్న ప్రోఫేషనల్స్ నరరూప రాక్షసులు __ నగరంలో ఎన్ని హత్యలు చేయగలిగితే అన్ని పదివేలు __ కనిపించిన వాడివాళ్ళా నరికేస్తారు. పిల్లా, పాప, ముసలి _ ముతక, స్త్రీలు ఎవరికైనా చంపి అవతల పడేస్తారు. మొదటిరోజు తెల్లవారేసరికి కనీసం రేండో౦దల హత్యల్ని లక్ష్యంగా పెట్టుకున్నాం. ముఖ్యమంత్రి నందకిషోర్ తేరుకునే లోపు మరొకొన్ని వందలు __ నా ఆటస్థలం పాతబస్తీ __ చేయించేది నేను అని, నా వెనుక వున్నది మనపార్టీ పెద్దలే అని బయట వాళ్ళకు తెలీదు __ నందకిషోర్ కి తెలిసినా , చూస్తూ చూస్తూ తనే పార్టీ మూలంగా పదవిలోకి వచ్చాడో ఆ పార్టీ గురించి బ్యాడ్ గా చెప్పుకోలేడు.

    మన అదృష్టం బావుండి దేశవ్యాప్తంగా మతకల్లోలాలు పెచ్చుమీరి పోతున్నాయి. అడ్డం, పెట్టుకోవటానికి __ అయోధ్య ఎలాగూ వుంది. వారం లోపే నగరంలో స్మశాన నిశ్శబ్దం చోటు చేసుకుంటుంది పనిలో పనిగా పాత కక్షలున్న లోకల్ గూండాఫ్ తను ప్రతీకారాన్ని తమ ప్రత్యర్దుల్నీ చంపటం ద్వారా తీర్చుకుంటారు. ఎటు చూసినా హత్యలు.... ఆ పైనే కర్వ్యూ .... కర్వ్యూ లో సయితం ఎలా హత్యలు చేయవలసింది కూడా ఆలోచించే వుంచాను. నందకిషోర్ దిగటం ఖాయం __ మన కేండిడేట్ మాణిక్యం పదవిలోకి రావటం అంతకంటే ఖాయం. రాగానే జరిగిన నరమేధం పై ఎంక్వయిరీ కమీషన్ వేస్తారు. ఆ కమీషన్ లో వుండేది మనవాళ్ళే __ మన అనుకున్న విధంగానే కమీషన్ విచారించి, రిపోర్ట్ తయారుచేస్తుంది. దాని పత్రికల్లో ప్రచురించి ప్రజల్ని మభ్య పెడతాం.

    గొడవలు జరుగుతుండగా నైతిక బాధ్యత తీసుకుని నందకిషోర్ రాజీనామా చేయాలనీ ఒత్తిడి తెస్తాం. కక్కలేక __ మ్రింగలేక పదవికి రాజీనామా చేస్తాడు నందకిషోర్.

    వెయ్యిమంది ప్రజల్ని __ ముఖ్యంగా పసిపిల్లల్ని, స్త్రీలను, వృద్దుల్నీ బలిపెడతాం. కోటి రూపాయలు ఖర్చు చేస్తాం. అంతే __ కధ దానంతట అదే మలుపు తిరిగుతోంది .... డబ్బు ఇస్తే కార్యక్రమం మొదలయిపోతుంది" అన్నాడు వినోద్ కూమార్  ఆనందంగా.

    శంభుప్రసాద్ అంతటివాడే వినోద్ కూమార్ ని చూసి ఒక్కక్షణం ఉలిక్కిపడ్డాడు.

    ప్రజల ఓట్లతో గెలిచి __ ప్రజలకు అని చేస్తాం, ఇవి చేస్తాం అని చెప్పేవాళ్ళు __ పదవుల కోసం, పదవుల్లో తమకు నచ్చిన వాళ్ళు వుండటం కోసం ఇంతకీ తెగిస్తారా ? పసిపిల్లలి, స్త్రీలు వృద్దుల ప్రాణాల్ని కూడా బలి తీసుకుంటారా? ఎలా మనసోప్పుతుంది? వీళ్ళసలు మనుష్యులేనా? కాదు __ మానవత్వం లేనివాళ్ళు __ మనుష్యులు కాని వాళ్ళే రాజకీయ నాయకులావుతారేమో?

 Previous Page Next Page