Previous Page Next Page 
మయసభ పేజి 30

    అది నిజంగానే ప్రముఖ పారిశ్రామికవేత్త మైఖల్ రాజు ఫోటో ప్రచిరించబడిన పేపర్ కటింగ్.

    ఫోటో చుట్టూ ఏవో ఇంగ్లీషు అక్షరాలు.......

    బహుశా ఏదయినా ఇంగ్లీషు డైలీలోంచి కట్ చేసి అతికించిందయి వుంటుంది.

    దానిక్రింద మైఖల్ రాజు ఇంటి అడ్రస్ __

    దాని క్రింద మైఖల్ రాజు అఫీసు అడ్రస్ రెండూ పెన్ తో వ్రాసి వున్నాయి . పోటో పై రెడ్ ఇంక్ బాల్ పాయింట్ పెన్ తో ఇంటూ మార్క్ పేట్టి వుంది.

    దాన్ని చూస్తూనే రిషి కనుబొమలు పైకి లేచాయి.

    వెంటనే ఆ పేజీని తిప్పాడు........ దానిలో ఏవో టైమింగ్స్ వేసి వున్నాయి.

    దాని క్రింద ఒక పట్టిక కనిపించింది.

    ఫస్ట్ : అంబాసిడర్ కారు     2000__00

    సెకండ్ : ప్రీమియర్ పద్మిని   1,800 _00

    థర్డ్ : టెంపో ట్రావేలర్           3,000 __00

    విల్ కిన్ సన్                         5000__00

    స్మీత్ అండ్ వేసేన్స్ _38       5,000__00

    కోల్డ్ .45                               4,000 _00

    రైఫిల్ ఎ.కె 47                   7,500 __00
    ____________________________
    మొత్తం                        28,300 __ 00

    ____________________________

    మొత్తము ఇరవై ఎనిమిదివేల మూడొందలు .

    రిషి రెండో పేజీని తిరగేశాడు.

    ఎస్ .కె అనే అంగ్ల అక్షరాలు కనిపించాయి. క్రింద 50,00,000 _ 00 అని వ్రాసివుంది.

    కొన్ని పిస్టల్స్ బొమ్మలు.

    ఆ క్రింద ఒక ఓల్ట్ మేర్సిడస్ కారు బొమ్మ చిత్రించబడి వున్నాయి.

    చిన్న అనుమానం ... విషయం లోతుల్లోకి వెళుతున్న కొద్దీ పెద్దదయిపోతోంది.

    చిన్న అనుమానం పెద్ద పెనుభూతమై పోతోంది.

    చిన్న పిల్ల తెమ్మెర పెనుతుఫానుగా రూపాంతరం చెందబోతున్న సమయంలో ఉండే గంభీరత ..... ప్రశాంతత.

    తీగ కదిలితే ... ఎందరు పెద్ద మనుష్యులు బయటకు వస్తారో......?

    ఆ ఫైల్ ని ప్రక్కనే పేట్టి రిషి ఎస్. ఐ.కి సైగ చేసాడు . ఆ సంజ్ఞను అందుకున్న ఎస్. ఐ. మరింత ఉత్సాహంతో ఆ ఇంటిని సెర్చ్ చేయటం ఆరంభించాడు.

    రిషి కూడా ఆ ఇంటిలోని ప్రతి వస్తువును కళ్ళను ఎక్స్ రేలుగా చేసుకొని సోదా చేయసాగాడు.

                           *    *    *    *   

    మొత్తానికి సుదీర్గమైనా చర్చల తర్వాత నందకిషోర్ ముఖ్యమంత్రి పదవినుంచి తప్పించెందుకె అధిష్టానవర్గం సిద్దమయింది.

    "రాష్ట్ర అసమ్మతి వర్గంలో మంత్రిపదవి రాక తీవ్ర అసంతృప్తితో ఉన్న వ్యక్తివరు ?" అధిష్టానవర్గంలోని ఒక నాయుకుడు అడిగాడు.

    "పెంచలయ్య ...." అని మరొకరు సమధాన మిచ్చారు.

    మిగతావారు ఆ పేరు విని పెదవి విరిచారు.

    "అయన వృద్దుడైపోయాడు. మంచి అనుభవం ఉండవచ్చుకాని __ ఉత్సాహం లేనివాడు, ఊపులేనివాడు. పైగా ఆయనలో గాంధీగారి సిద్దాంతాలపై ఒకింత గౌరవం వుంది. అలాంటి వాళ్ళు ఈ పరిస్థితుల్లో పనికిరారు."

    "మరి _"

    "రౌడీయిజ్జం .... గూండాగిరిని బ్యాక్ గ్రౌండ్ లో ఉంచుకున్న యువనాయుకుడు కావాలి ."
   
    "అయితే వినోద్ కూమార్ .....ఓ.కె. అతన్నీ రాత్రికి ఢిల్లీకి రమ్మని కబురు చేయండి. అంతా రహస్యంగా జరిగిపోవాలి."

    రౌండ్ టేబుల్ సమావేశం పూర్తయింది.

    వినోద్ కూమార్ కి ఢిల్లీకి  ఆహ్వానిస్తూ వర్తమానం వెళ్ళిపోయింది.

                                                                  *    *    *    *   

    మరో గంట సోదా తరువాత వాళ్ళకో పాత డైరీ దొరికింది.

    రిషి దానిలోని ప్రతి పేజీని పరిశీలనగా చూస్తూ ముందుకెళ్ళసాగాడు.

    ఒకచోట, పేజీల మధ్య భాస్కర్ ప్యాలెస్ అశోకా బార్ బిల్లు కనిపించింది.

    రిషి మరికొన్ని పేజీలు తిప్పాడు.

    మరొక భాస్కర్ ప్యాలెస్ లేస్ బార్ బిల్లు కనిపించింది.

    ఆ రెంటిని బయటకు తీసి చూశాడు.

    మొదటి బిల్లు ఎమౌంట్ 760__00

    పైగా క్యాష్ బిల్లు __

    రెండో బిల్లు 680 _ 00

    అదీ క్యాష్ బిల్లే.....

    "పదండి వెళ్దాం. ఇంటికి మన తాళం వేసి, పోలీస్ సీల్ చేయండి " అంటూ రిషి ఫైల్ లోని బిల్లుల్ని , డైరీని తీసుకుని బయటకు నడిచాడు.

    మరికొంత సేపటికి ఎస్. ఐ. ఇంటికి తాళం, వేసి, దానిమీద లక్కని కరిగించి, పోసి, తనతో తెచ్చుకున్న పోలీస్  స్టేషన్ ముద్రని వేశాడు.

    ఆ పైన తెల్లటి గుడ్డతో తాళాన్ని చుట్టివేసి దానిమీద తమ సంతకం చేసిన తెల్ల కాగితాన్ని అతికించాడు.

    మరికొద్ది క్షణాల్లో జీఫ్ బయలుదేరింది

    "కేసు కొత్త మలుపు తిరుగుతుందేమోననిపిస్తోంది" అన్నాడు ఎస్.ఐ .సిగెరెట్ వెలిగించుకుంటూ.

    "మామూలు మలుపు కాదు...... అతి ప్రమాదకరమైన మలుపు తిరగాబోతుమ్ది" అన్నాడు రిషి ఆలోచిస్తూ.

    "ఇఫ్ యూ డోంట్ మైండ్ .... అలక్ నిరంజన్ ఉరఫ్ ప్రిన్స్ మీద మీకు అనుమానం ఎలా వచ్చింది?" ఎస్.ఐ. అడిగాడు.

    అప్పటికే ఆ ఎస్.ఐ. మీద రిశికి నమ్మకం కుదురింది. అందుకే కొన్ని వివరాలు అందించటానికి రిషి సందేహించలేదు...

    "అలక్ నిరంజన్, షానవాజ్ గోవిందరాజుల మనుష్యులు, పులి గడ్డి తినదుకదా? వేటాడి జంతువుల్ని చంపి ఆకలి తీర్చుకోవాలి __ అది దాని సహజ లక్షణం నేటి గూండాలు , రౌడీలు, మాఫీయా సంస్కృతిని జీర్ణం చేసుకున్న ఘరనా పెద్దలు, రాజకీయ నాయుకులు ప్రజల్ని ప్రజా ధనాన్ని వేటాడి బ్రతికేస్తుంటారు. అది సహజమైపోయింది సహజం సహజంలా కాక అసహజంలా కనిపిస్తే పోలీసులకు అనుమానం రావాలి... వచ్చి తీరుతుంది.

    ఎప్పుడూ ఏదో ఉపద్రవాన్ని తెచ్చి పెట్టె షానవాజ్ చాల కాలంగా అవసరానికి మించి సేదతీరుతున్నారు.

    అతని మనిషైన అలక్ నిరంజన్ నేలకు పదిహేను వండలే సంపాదిస్తూ తరచూ ఖరీదయిన భాస్కర్ ప్యాలెస్, కృష్ణా బరాయ్, గేట్ వె హొటల్ అన్ బంజారులో కనిపిస్తున్నాడు.

    దాంతో అనుమానమొచ్చి ముందు షానవాజ్ మీద, ఆపైన అలక్ నిరంజన్ మీద నిఘా వేసాను. దాంతో నా అనుమానం బలబడింది.

    ఏదో తిమింగలానికి పెద్ద గాలాన్ని తయారుచేసే పనుల్లో వీళ్ళు నిమగ్నమయి వున్నారానిపించింది.

    నిర్ణయాలు గోవిందరాజుల లెవల్లో జరిగినా , వాటిని అమలుపరిచేది వీళ్ళే

    పైవాళ్ళే కదలికల్లో గుర్తించదగ్గ మార్పు కనిపించదు. కనిపించకుండా చూసుకుంటారు.

    ఆపరేషన్ ని అమలు పరచావాల్సిన వీళ్ళ కదలికలు వేగాన్ని పుంజుకుంటాయి.

    నెలకు పదిహేను వందలే సంపాదించుకునే అలక్ నిరంజన్ ఒక్క రాత్రి ఏడో౦దల అరవై, ఆరొందల ఎనభై రూపాయల్ని ఖర్చుపెట్ట గలడా? లేదు కాని ఖర్చుపెట్టాడు. అదీ ఈ మధ్య ఒక వ్యక్తి ఎంత తాగినా ఏడో౦దల అరవై రూపాయల మందు తాగలేడు కదా? అంటే తనతో మరేవర్నో తీసుకేలుళుతున్నాడు. ఎవరు వాళ్ళు....?" చటుక్కున చెప్పటం ఆపి ఎవరు వాళ్ళు అనే ప్రశ్న చుట్టే తన ఆలోచనలి కేంద్రీకరించాడు. రిషి.

    జీఫ్ నిశీధి నిశ్శబ్దంలో పెరేడ్ గ్రౌండ్స్ రోడ్ లో బేగంపేట కేసి దూసుకుపోతోంది.

    ఒకోసారి  ఏ వ్యక్తికయినా ఒంటరిగా, నిశ్శబ్దంలో కూర్చుని సమస్య గురించి ఆలోచిస్తే కొంతవరకే వెళ్ళి తిరిగి వచ్చే ప్రమాదం వుంటుంది.

    అలాకాక ఎదుటి వ్యక్తికీ సమస్య గురించి వివరించేటప్పుడు అనుకోకుండా , స్పాంటేనియల్ గా కొత్త అనుమానాలు నోటినుంచి జారిపడతాయి. అప్పుడే ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే కొన్ని నిజాలు బయటకొస్తాయి. ఆలోచనల్లో పదును పట్టుకొస్తుంది. ఇది ప్రతి ఒక్కరి విషయంలో ఎప్పుడూ జరిగుతూనే వుంటుంది. తెలిసి అలోచించేవి కొన్ని.

    తెలీకుండానే సబ్ కాస్నస్ తో ప్రేరేపింపబడేవి కొన్ని.

    ఇప్పుడు రిషి విషయంలో అదే జరిగింది.... రిషి ఎంతసేపు అలక్ నిరంజన్ మీదే దృష్టిని వుంచాడు తప్ప, అతనితో తిరుగుతున్నా వ్యక్తులపై కన్నేయలేకపోయాడు.
   
    తను చేసిన పొరపాటు తనకు తెలిది వచ్చింది. ఆ వెంటనే ఏం చేయాలో కూడా నిర్ణయం తీసుకున్నాడు.

    "జీఫ్ ని బాస్కర్ ప్యాలెస్ కి పోనివ్వు " అన్నాడు డ్రైవర్ తో.

    జీఫ్ అప్పటికే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ చౌరస్తాదాటి ఖైతరబాద్ రోడ్ లో ప్రవేశిస్తుంది.

    కొద్ది క్షణాల తరువాత జీఫ్ మోడల్ కాంప్లెక్స్ ప్రక్కనే వున్న కుడివేపు సందులోకి తిరిగింది.

    ఎస్ .కె ఎవరు....?

    ఫైల్ లోని మూడో పేజీపైన వ్రాస్తున్న ఎస్. కె. దేనికి గుర్తు ....! ఏదైనా వస్తువా? మనిషి పేరా?

    దానిక్రిందయాభై లక్షలు అని వ్రాసి వుందంటే వస్తువు ఖరీదా? ఒక వస్తువు ఖరీదు అంతుండే అవకాశం లేదే? మనిషి పేరే అయివుండవచ్చు.

 Previous Page Next Page