Previous Page Next Page 
మయసభ పేజి 26

    ఇకపై ఏ క్షణంలో ఏదైనా జరగవచ్చు.

    ఏ నిర్భాగ్యుడైనా లేని టెన్షన్. మెన్ ఈటర్ విశృంఖుల విహారానికి సిద్దమవుతోంది...... తమ డిపార్ట్ మెంట్ కి  కావలసినంత పని... లార్జర్ డైమెన్షన్ ......

    సెన్సేషల్స్ టిస్ట్స్ ... ఆరంభం కాబోతున్నాయి.

    షానవాజ్ గోవిందరాజులకు ఆప్తుడు.

    గోవిందరాజులు ముఖ్యమంత్రి నందకిషోర్ కి అత్యంత విశ్వాసపాత్రుడు.

    నందకిషోర్ పవర్ క్రైసస్ లో ఇరుక్కుని గిలగిల లాడుతున్నాడు. పమిధలు... ఎవరో? ఎందరో?

    "ఇంతసేపు ఫోన్ లో ఏమిటి?" ఒక స్త్రీ కంఠంనుంచి వేలుపడ్డ మాటలిని.

    రేవతీ రామన్ కంఠం మృదువుగా , మత్తుగా వుంది.

    షానవాజ్ ఫోన్ పెట్టేసాడా?

    రాష్ట్రరాజకీయాలు విచిత్రమైన మలుపు తిరగబోతున్నాయి __ ఎన్నో కిలోమీటర్లు మన కోసం సిద్దంగా వున్నాయి. చాలా కాలంగా నాకోకోరిక మిగిలి వుంది. పెద్ద హాలు, ఏసీ, పర్షియస్ కార్పెట్ ప్లోరింగ్ , వాల్స్ కి నిలువెత్తు అద్దాలు, ఆ అద్దంలో మన నగ్న శరీరాన్ని చూసుకుంటూ సెక్స్ లో పాల్గొనటం ఒక అద్భుతమైన అనుభూతి.... కానుక తప్పదు " అది షానవాజ్ కంఠం.

    చేసేది నేరాలయినా... వున్నది క్రిమినల్ ప్రోఫేషన్ లోనయినా గొప్ప అభిరుచులున్నాయి. షానవాజ్ కి ? చిత్రమే.

    మరి కొంతసేపటికి సంబాషణ వినిపించటం ఆగిపోయింది.

    మూల్గులు, నిట్టూర్పులు.

    నిస్స్బ్దానికి, నిశీధికి చెమటలు పట్టించే నిట్టూర్పులు... రిషి అరుగుదిగాడు. ఇంటిని ఓసారి చుట్టి వచ్చాడు.

    మరి కొద్దిసేపు అక్కడే తారట్లాడాడు __

    కాలు దువ్వుతున్న భవిష్యత్ కదనరంగానికి ఇదే ఆరంభస్థానం నిఘా తప్పదు.

    ఒక నిర్ణయానికొచ్చిన రిషి అక్కడినుంచి కదిలాడు.

                               *    *    *    *    *   

    "ఇంతవరకు ఆడని డ్రామాని మనం అడబోతున్నాం దాన్ని రక్తికట్టించే బాధ్యత మనందరి మీదా వుంది. ఇకపై మన మాట, మాటతీరు , ప్రవర్తనం కదలికలు, చూపులు అన్ని మనం ముందుగా నిర్ణయించుకున్నట్లుగా, నియంత్రించినట్ట్లుగా వుండాలి. సహజంగా కూడా వుండాలి. యాభై లక్షలు సిద్దమయ్యాయా?" నందకిషోర్ తలకి మత్తు పూర్తిగా ఎక్కినా, ఒక్కమాట ఎక్కువగా అనటం లేదు.

    అప్పుడే గడపవరకు వచ్చిన రాగలతా బిజ్ లానీ ఆ మాటల్ని విన్నది కాని .... వాటిపై ఆసక్తి కనబర్చలేదు.

    మైఖల్ రాజు అంత మత్తులోనూ మెత్తటి ఆమె అడుగుల శబ్దాన్ని పసిగట్టి ఆమెకేసి చూసాడు. సరీగ్గా, అదే సమయానికి అటుకేసి చూసిన బీజ లానీ చిలిపిగా కన్నుగీటుతూ, తమషాగా భుజాల్ని ష్రగ్ చేసింది. చేసింది. అప్పటివరకు తన గుండెల్ని కప్పి పుంచిన చీరని భుజంమీంచి ఓసారి అలవోగ్గా తీసింది.

    ఆమె ఎక్స్ పోజింగ్ ... ఎక్స్ టికీ బ్రేట్స్ పేలో చోళీలు డెలికేట్ గా కట్టివున్నాయి. లోపల బ్రాసియర్లేనట్టుగా వుంది, క్లీనేజ్ లో సన్నటి బంగారపు గొలుసు , శంఖంలాంటి తెల్లటి మెడ, పాలమీగడలాంటి కంఠం క్రింది భాగం, ఆపై బరువుగా, . ఆమె బరువును తామే మోయలేనట్లుగా ఒకింత ఒరిగిపోయి కనిపిస్తున్న బ్రేట్స్ .... ఆ క్రింద గోబీ మైదానంలాంటి నడుం ముందు భాగంలో, మధ్యలో __ సుడులు తిరిగినట్లు కనిపిస్తున్న నాభి.....

    దానికి బెత్తెడు క్రిందుగా కుచ్చిళ్ళు.... మైఖల్ రాజు నరాలు జివ్వున లాగినట్ట్లుగా ఫీలయ్యాడు.

    అప్పటివరకు ఎలాగో నిగ్రహించుకున్న మైఖల్ రాజు సంయమనం కోల్పోయాడు. అతనేసుకున్న సూట్ ట్యెడ్ సూట్ లోపల చెమట పట్టేసింది. మరికొంచెం సేపు అమెలాగే చూస్తూ ఏమీ చేయకపొతే వేట్ కి గురికావలసిందే ... ఏమీ చేయలేక...... చల్లబడిన శరీరంలో వేడి పుట్టటం కోసం మరోఅరగంట అగవలసిందే.......

    శృంగార ప్రపంచానికి కేంద్రబిందువు ... షీ దీ ఫాంటసీ ఆఫ్ డి ఎవ్వేరీ నైట్ షటౌట్స్ ....

    మగవాడి  గుండె  స్పందనని  మెడికల్ సైన్స్ కి అందనంత వేగానికి తీసుకెళ్ళగల అత్యంత అందాల అద్భుత రాశి.....

    ఆమె వైపు ఓ అడుగేసాడు మైఖల్ రాజు......

    పరిస్థిని అర్ధం చేసుకున్నాడు నందకిషోర్.

    తను వెళ్ళవలసిన  సమయం ఆసన్నమయిందని తెల్సుకున్న గోవింద రాజులు కూడా సోఫాలోంచి లేచాడు.

    "మరి నే వెళ్తా.... వెంటనే షానవాజ్ ని కలవాలి....." అన్నాడు గోవిందరాజులు ఓరగా బిజ్ లానీ వేపు చూసి

    నందకిషోర్ అలాగే అన్నట్లు తలూపాడు.

                                                                   *    *    *    *   

    ఓ లారీని పట్టుకుని నగరానికి చేరుకున్న రిషి ఆటోలో ఆఫీసుకి వచ్చి ఒంటరిగా ఆ తెల్లవారు ఝామున నిశ్శబ్దంలో నోట్స్ రాసుకోవటం మొదలెట్టారు.

    నెం . 1. రంగం సిద్దమైంది _ మనమో అవకాశం యివ్వాలి.

    నెం .2. అదే నేను చెప్పేది __ మనం మన పట్టును సడలించాలి.... రవ్వంత గుప్పిటని సడలించాలి __ వాళ్ళు పసిగట్టగానే మూసేయాలి

    నెం 3. కాంట్రాక్ట్స్  కిల్లర్ ఎవరనేది డిసైడ్ అయిందా?

    నెం 4. హైర్ చేసుకున్నారా ? జాగ్రత్త. బొంబాయి అండర్ వరల్డ్ కి చెందిన వ్యక్తులతో వ్యవహారం అంటే తమాషా కాదు __ విషయం అటూ ఇటూ అయిందో తలకాయలు ఎగిరిపోతాయి. ఎంత దూరం?

    నెం 5. యాభై కిలోమీతర్లా? ఎక్కువే? అయినా పని జరిగితే పరవాలేదు. ఇంతకీ కేసత్స్ ఏమైనా?

    పై మాటలు అన్నది షానవాజ్ .

    నెం 6. ఇంతసేపు ఫోన్ లో ఏమిటి?

    ఇది అన్నది రేవతి రామన్.......

    నెం 7. రాష్ట్ర రాజకీయాలు విచిత్రమైన మలుపు తిరగబోతు న్నాయి. ఎన్నో కిలోమీటర్లు మనకోసం సిద్దంగా వున్నాయి. చాలా కాలంగా నాకో కోరిక మిగిలి వుంది. పెద్ద హాలు ... ఏసీ ... పర్శియాస్ కార్పెట్ పొర్లింగ్ ... వాల్స్ కి నిలువెత్తు అద్దాలు...... ఆ అద్దాల్లో మన నగ్న శరీరాల్ని చూసుకుంటూ సెక్స్ లో పాల్గొనటం ఒక అద్భుతమైన అనుభూతి.... కనుక తప్పదు.

    ఇవి తమాషా నవాజ్ మాటలు....

    రాయటం పూర్తీచేశాడు. రిషి.

    ఒకటికి నాలుగుసార్లు పైవాక్యాల్ని తిరిగి చూసుకున్నాడు.

    కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకున్నాడు.

     మొత్తానికి ఏదో జరగబోతోంది.

    ఆ జరగబోయేది రాష్ట్రరాజకీయాలు తిరగనున్న మలుపుకి శ్రీకారం చుడుతుంది. దాన్ని పట్టుకోవాలి. వలవేసి పట్టుకోవాలి.

    అందరిలో ఒకడిగా మిగిలిపోకుండా __ ఎందరిలాగో వెనుకబడకుండా వుండాలంటే తనేదో సాధించాలి.... అది ఇదే కావాలి.....

    ఆఫీసంతా నిశ్సబ్దంగా వుంది. ఎన్నో రహస్యాల్ని... మరెందరో ఘరానా పెద్దమనుష్యుల కిరాతక చట్యల్ని రికార్డ్ చేసుకున్న ఫైల్స్ . ఫార్ యువర్ ఐస్.... ఓన్లీ ... టాఫ్ సీక్రెట్ ... టాఫ్ ప్రయారిటీ ... లాంటి శాఖాపరమైన భద్రతలతో బంధింపబడిన ఫైల్స్ సర్దిన బీరువాలు .... ఖాళీ కుర్చీలు ... పగలంతా రసే లేస గా ఉన్న టేబుల్స్ .... ట్రేలు...... నిశీధిలో నిద్రిస్తున్నట్ట్లుగా వున్నాయి.

    దూరంగా ఏదో చర్చ్ గంట వినిపించింది.

    కేవలం రెండుసార్లే వినిపించింది.

    ఆఫీసు బయట గస్తీ తిరుగుతున్నా సెంట్రీ ఇనుపనాడాల బూట్లశబ్దం స్పష్టంగా వినిపిస్తోంది.

    తను చూడప్పగారి మనిషిగా ముద్ర పడకుండా వుంటే.... ఆ సమయంలో, ఆ గదిలోకి సెంట్రీ రానిచ్చేవాడు కాదు. ఆ ప్రివిలేజ్ ని అడ్డం పెట్టుకుని రంగేసుకోబోతున్న రాజకీయ డ్రామా గ్రీన్ రూమ్ కదలికల్ని పసిగట్టాలి.

    రిషి నెమ్మదిగా లేచాడు....

    పదడుగులు వేసి మరో గదిలోకి బయటకు తీసాడు.

    ఎప్పుడూ తను కూర్చునే గదిలో లైట్ వెలిగితే పరవాలేదుగాని __ ప్రక్కగదిలోకూడా లైట్ వెలిగితే సేమ్త్రీకి అనుమానం రావచ్చు. అదే జరిగితే అతనక్కడికి రావడం. __ గదిలో మీకేం పని అని అడగవచ్చు.... అందుకు తను అవకాశం ఇవ్వకూడదు.

    టార్చ్ వెలిగించి ఒక్కో బీరువానే పరిశీలిస్తూ వెళ్ళసాగాడు.

    క్షణాలు ... నిమిషాలపోతున్నాయి.

    మొత్తానికి ఇరవై నిమిషాలకి ఒక బీరువా దగ్గర ఆగాడు.

    స్టేట్ కేపిటల్ ప్రోఫెషనల్ గుండాఫ్ .... అని వ్రాస్తున్న బీరువా అది.

    అందులో గోవిమ్దరాజులకి సంబంధించిన ఫైల్ ని తను తీసి చూడాలి. అతని మనుష్యు లెవరయిందీ తెలుసుకోవాలి.

    ఒక్క షానవాజ్ మీద నిఘా ప్రయోజనం లేదు.... మాములుగా పగలు ఆఫీస్ అవర్స్ లో కన్వర్డ్స్ ఆఫీసర్ ని అడిగితె ఇవ్వకపోవచ్చు. ఇచ్చినా ఎందుకని అడగవచ్చు. __ తనే ఒక నిర్దారణకు రామ్దే అతనికేమీ చెప్పగలడు.?

    పైపెచ్చు అతనికి సవాలక్ష అనుమానాలు రావచ్చు. పొరపాటున అతను సి.ఎమ్. మనిషయితే విషయం చాలవరకు వెళ్ళవచ్చు. దాని మూలంగా సీక్రెట్ పోతుంది.

    డి.ఐ.జి. చూడప్ప ప్రలోభాలకు , రాజకీయ పలికబడి లొంగే అధికారి కాదు. సి.ఎమ్. అయినా, పి.ఎమ్. అయినా జంకడు __ తన డ్యూటీ తను నిర్భయంగా నెరవేర్చుకుపోగల స్ట్రీక్ ఆఫీసర్! అలా అని చూడప్ప మ్గారి ద్వారా ఆ ఫైల్స్ ని తెప్పించుకుంటే విషయం అనవసరంగా ప్రాధాన్యతను  సంతరించుకుంటుంది.   

 Previous Page Next Page