Previous Page Next Page 
మయసభ పేజి 25

    రాత్రి రెండు గంటలవరకు మేల్కొని, తిరిగి తెల్లవారుజాముననాలుగు గంతలకీ నిద్రలేచే హైవే హొటల్స్ అన్నీ మూసేసి వున్నాయి.

    ఒక్క పంజాభి డాబా హొటల్ మాత్రం చలిలో మునగదీసుకున్న ట్లుగా, బిక్కు బిక్కుమంటూ మేల్కొనే వుంది

    తను దిగింది ఆఖరీ సిటీ బస్సు ____

    తిరిగి ఉదయం ఐదు గంటలవరకు నగరంలోకి ఏ బస్ వెళ్ళదు __ ఏ బస్ రాదు.

    మర్డర్ ని తీసి తలకి గట్టిగా చుట్టుకుని చీకట్లో చిన్నగా షానవాజ్ విశ్రాంతి గృహం వేపు నడక సాగించాడు రిషి.

                                                         *    *    *    *

    మైఖల్ రాజుది విలాసవంతమయిన గెస్ట్ హౌస్ .....

    చుట్టూ చీకటి.... లోయయిన నిశ్శబ్దం.......

    లోపల మాత్రం మధ్యహాల్లో నందకిషోర్ , మైఖల్ రాజు, గోవిందరాజులు సమవేశమై వున్నారు.

    సాధారణంగా బయట నిరీస్ఖిమ్చవలసిన ముఖమంత్రి అఫీషియల్ కారు కాని, సెక్యూరిటీ ఫైలట్ వెహికల్స్ కాని లేవు.

    కుట్రలు కుతంత్రాలకు ఊపిరి పోయాలనుకుంటున్నప్పుడు నందకిషోర్ కుదురయిన స్థలాన్ని అందుకు ఎన్నుకుంటాడు అప్పుడు ప్రోటోకోల్ ని వదిలేసి, ఏ మిత్రుడి కారులోనో, వేనుకసీట్లో, ఒదిగిపోయి, కూలింగ్ గ్లాసెస్ ని పూర్తిగా పైకి లేపి రహస్య స్థలానికి వెళ్ళిపోతాడు.

    అలాంటి సందర్భాల్లో నందకిషోర్ అక్కడికి వెళ్ళింది __ ఎందుకు వెళ్ళింది __ ఎప్పుడు వెళ్ళింది వచ్చేది ఎవరికీ అంతుపట్టదు.

    అదే భవంతిలో వేరే హాల్లో గోపీనాధం , యోగేంద్రసిన్హా వున్నారు.

    "అన్ని ఏర్పాట్లు పకడ్భందిగా పూర్తయ్యాయా?" నందకిషోర్ రేండో రౌండ్ లోకి వెళుతూ అడిగాడు.

    "బ్రహ్మాండంగా పూర్తయ్యాయి. కదలిక మొదలయింది. బాంబ్ ఎప్పుడు బ్రద్దలవుతుందనే దాని కోసమే ఇక మనం ఎదురుచూడాలి. ఇంతకీ అధిష్టానవర్గ సమాలోచనలెలా ఉన్నాయి ...?" గోవిందరాజులు మీసాల్ని నిమురుకుంటూ అడిగాడు.

    "నన్ను తీసేయాలనే స్థిరమైన నిర్ణయాని కొచ్చారు. ఎమ్. ఎల్. ఏలు అంతా ఏకగ్రీవంగా మాణిక్యానికి సపోర్టు చేస్తే, చూసేవారికి అక్షేపణ ఉండవని ఇంతకాలం ఆగారు. ఆ పని పూర్తయిందని మాణిక్యం అధిష్టాన వర్గానికి తెలియచేయగానే దూతలు దిగిపోతారు. పావులు కదిలిపోతాయి. ఆ వేపు మనకేం సపోర్టు లేదు. ఆశ వదులుకోవటం బెటర్ ...." నందకిషోర్  గంభీరంగా అన్నాడు.

    మైఖల్ రాజు మనసిక్కడ లేదు . అందుకే మౌనంగా వుండిపోయాడు.

    జూబ్లీహిల్స్ కొండల మధ్య విసిరేసినట్లుగా వున్న ఆ గెస్ట్ హౌస్ లో  ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా, ఏ దేశంలో జరగని అద్భుత మయిన, అత్యంత ఆసక్తికరమైన పథకం రూపుదిద్దుకుంటోంది.

    వరల్డ్ పిలితికల్ హిస్టరీలో గ్రీన్ ఇంక్ తో  రికార్డ్ చేయవలసిన పతకం నందకిషోర్ మెదడులో పూర్తిగా రూపుదిద్దుకుంది.

    ఆ కళారాత్రి మూడో జాము ముగించటానికి మరికొద్ది క్షణాలు మాత్రమే వుంది.

    ప్రక్కగదిలో సౌందర్య ప్రపంచాన్ని శాశించే అందాల సామ్రాజ్జిరాగలతా బిజ్ లాని అప్పటికే రెండు పెగ్గుల వైన్ ని తీసుకోవటం పూర్తీచేసింది.

    ఆమెలో తెలీకుండా ఆమె తాగిన వైన్ లో కలిపినా ద్రవం ఆమె మశ్కిష్కంపైన తన ప్రభావాన్ని చూపిస్తూ, క్రమంగా ఆమెను వశపరచుకుంటోంది.

    ఆమె కళ్ళు మత్తుగా వాలిపోతున్నాయి.

    తీరని కోరికను తీర్చుకొనేందుకు బలవంతంగా తెరచి హల్ కి ఆ గాడికి మధ్యనున్న ద్వారాబంధవేపు చూస్తోంది.

    ఆమె ముందు నందకిషోర్ మనిషి ద్వారా వచ్చిన ప్రపోజల్ కి అయిష్టతనే చూపింది. కాని మెరుపులా ప్రపంచంలో దృవతారలా వెలగాలనే ఆశతో ఆమె అప్పటికే కొన్ని మైలు రాళ్ళను దాటివేసింది. అందుకే ఆమె ప్రాక్టికల్ గా ఆలోచించింది.

    తన పరువాల కోసం, అత్యున్నత పదవిలో వున్న, అతి ముఖ్యమయిన వ్యక్తి దాసోహం కాబోవటంతో ఆమెలో అహం సంతృప్తి పడింది. ఆపైన మెటీరియలిస్టు గా ఆలోచించి, తనతో వచ్చిన వ్యక్తితో బయలుదేరింది.

    మైసూరు మహారాజు లలిత అనే మద్రాసు అందగత్తె కోసం పరితపించి పరుగులు పెట్టాడట పద్దెనిమిదవ. శతాబ్దంలో  ( లలిత మాజీ నటి వైజయంతి మాలకి అమ్మమ్మ అవుతుంది ) కొన్నాళ్ళు బిగాదీసుకున్న ఆమె చివరికి లోగిపోయిందట. ఫలితంగా కోట్ల ఖర్చుతో మైసూర్ లో ఆ మహారాజు లలితమహల్ అనే ప్యాలెస్ ని నిర్మించి ఇచ్చాడట.

    సర్వధికారాల్నితన గుప్పెట్లోకి పెట్టుకున్న ముక్యమంత్రి నందకిషోర్ ఆ మైసూర్ మహారాజు కేం తీసిపోడు. ఈయన తలుచుకుంటే అలాంటివే చేతకాక ఆడుకున్నాడు.

    అలాంటి స్థితినుంచి తన అందాల కోసం ఆరుకోట్ల రాష్ట్రప్రజలకు అధినాయుకుడైన వ్యక్తి కోరుకోవటం ఆమెకు అయిష్టంకన్నా, గర్వంగా వుంది.

    అప్ట్రాల్ దిస్ బాడీ......

    ఎరగా వేస్తె పోలా....?

    ఆమె లేచింది.

    సరీగ్గా అదే సమయానికి షానవాజ్ ఇంటి దగ్గర ఆగాడు రిషి.

    నిర్మానుష్యంగా వున్న ఆ వీధి చివరకు వెళ్ళాడు రిషి.

    అతని ఆదృష్టం బావుండి కుక్కలు లేవక్కడ.

    ఉండివుంటే రిషి ఉనికి బయటపడేది.

    మంచు పొగలో ముడుచుకుని వున్న ఒక ఇంటి  దగ్గర ఆగాడు.

    నలువేపులకు ఒకసారి చూసి ఒక ఇంటి అరుగుమీద ఎక్కాడు.      

    అతనికి తెలుసు __ ఆ ఇంట్లోనే షాన్ వాజ్ పేద తీరేదని.

    లోపల లైట్ వేలుగుతున్నట్లు కిటికీకి వున్న సన్నని రంధ్రం ద్వారా గ్రహించాడు.

    మరో అడుగు వేసి కిటికీ దగ్గరకు వెళ్ళాడు. చుట్టూప్రక్కల్ని జాగ్రత్తగా గమనిస్తూ కిటికీ తలుపు దగ్గర తన చెవి నుంచాడు.

    లోపల ఏదో సంబాషణ నడుస్తోంది.

    చెవులు రిక్కి౦చాడు.

    ఆ అపరాత్రి వేళ షానవాజ్ ఎవరితో మాట్లాడుతున్నట్లు....? అతని నిజానికి విరుద్దంగా అ సమయంలో సంబాషణకి ఎందుకు దిగినట్లు?

    షానవాజ్ ప్రియురాలు రేవతీ రామన్.....

    ఒక తమిళ వనిత........

    ఆమె కంఠం వినిపించటంలేదు. మరెవరితో షానవాజ్ మాట్లాడుతున్నాడు? మరో వ్యక్తి ఆ ఇంట్లో ఉన్నాడా? వుంటే ఒక్కసారాన్నా మాట్లాడకుండా వుంటాడా ?

    తలకు చుట్టుకున్న మఫ్లర్ జారిపోయింది. రిషి ఒక్కసారి ఒణికి పోయాడు చలికి . రక్తం గడ్డకట్టుకుపోతుందా అన్నంత చలి..... గజగజ వణికిపోయాడా ఎముకలు కోరికేసే చలికి.

    తనకా చలి భరించలేనిదిగా వున్నా.... అందుమూలంగానే ఎవరైనా బయటకు వచ్చే అవకాశం లేనందుకు ఆనందించాడు. గుసగుసల్ని వినాలంటే చెవులకు తిరిగి మఫ్లర్ చుట్టూకోకూడదు.... చలిని పళ్ళ బిగివునా భరిస్తూ సర్వెంద్రియాల్ని షానవాజ్ మాటల్ని వినేందుకు కేంద్రీకరించాడు.

    "రంగం  సిద్దమైంది . మనమో అవకాశం ఇవ్వాలి...." అది షాన వాజ్ కంఠం.

    కొద్దిక్షణాలు నిశ్శబ్దం ... తిరిగి.....

    "అదే నేను చెప్పేది మనం పట్టు సడలించాలి. __ రవ్వంత గుప్పటిని సడలించాలి. వాళ్ళు పసిగట్టగానే మూసేయాలి....."

    తిరిగి నిశ్శబ్దం......

    రిషి ఒకసారి పైకి చూసాడు......

    ఆ ఇంటికి ఒకింత దూరంలో టెలిఫోన్ స్థంబం కనిపించింది . దాని నుంచి ఒక వైర్ అ ఇంటికేసి వచ్చింది.

    విషయం అర్ధమైపోయింది రిషికి మాట్లాడుతున్నాడు.

    ఈ టైమ్ లో ....?!

    ఎవరితో ....?

    "కాంట్రాక్టర్ కిల్లర్ ఎవరనేది డిసైడ్ అయిందా?" రిషి ఉలిక్కిపడ్డాడు.

    "హైర్  చేసుకున్నారా? జాగ్రత్త ... బొంబాయి అండర్ వరల్డ్ కి చెందిన వ్యక్తులతో వ్యవహరం అంటే తమాషా కాదు __ విషయం అటూ ఇటూ అయిందో తలకాయలు ఎగిరిపోతాయి. ఎంత దూరం?"

    నిశ్శబ్దం.......

    "ఏభై కిలోమీటర్లా? ఎక్కువే! అయినా పని జరిగితే పర్వాలేదు. ఇంతకీ కేసబ్స్ ఏమైనా ....?"

    నిశ్శబ్దం.......
   
    టెన్షన్స్ తో రిషి బిగుసుకుపోయాడు.

    ఓ చిత్రమైన అనుభవం.... ప్రమాదాల వెంట పరుగెత్తువలసిన డేంజరస్ ఎక్స్ పీరియన్స్ ......

    స్కూఫ్ ... బిగ్ స్కూఫ్ .....

    ప్రమాదకరమైన పథకం ......

    అదీ షాన వాజ్ నోటివెంట........ నిద్రపోతున్న కొండచిలువ మేల్కోబోతుంది. చిన్న చిన్న బక్క జీవాలు దాని వాతన పడబోతున్నాయి.

    అలా పని చేయవలసి రావటం రిషికి ఎక్సై౦టి౦గ్ గా వుంది.

    మాటలు వినిపించటం ఆగిపోయింది.

 Previous Page Next Page