అది కూడా తన పరిశోధనలకు అడ్డు తగలవచ్చు. కనుక తప్పయినా, అన్ ఎథికల్ అయినా తను రహస్యంగానే ఆ ఫైల్స్ ని తిరగేయాలి.
బీరువాని లాగి చూసాడు __ రాలేదు.
లాక్ చేసి వుంది __ వుంటుంది.
కీస్ రూల్స్ ప్రకారం డి.ఐ. జి. కస్టడీలో వుంచి వెళ్ళాలి.
అంటే ... ఆ బీరువా కీస్ చూడప్పగారిఛాంబర్ లో ఉండి వుండాలి.
ఆ కీస్ ని చూడప్పగార్కి కూడా తెలీకుండా సంగ్రహించాలి.
లేదా.... ఆ బీరువాని దొంగా తాళం చెవులతో తెరవాలి.....
ఎలా ...? ఏం చేయాలి ....? ఆలోచిస్తూ రిషి పెస్ టార్చ్ ని బీరువా పైకి తిప్పాడు.
అదో చెక్క బీరువా ......
రెండు తలుపులున్నాయి.
మధ్యభాగంలో కుడివేపు తలుపు కొక్కెం ఎడంవేపు తలుపుకున్న రింగ్ కి వేసి, ఆపైన లాక్ వేసి వుంది.
అది వాటి మీదకే టార్చ్ ఫోకస్ చేసి చూస్తున్నంతలో మెరుపులా ఒక ఆలోచన తట్టింది.
కొక్కెం ఐరెన్ బెస స్క్రూస్ తో తలుపుకి బిగించి వుంది.
ఆ స్క్రూని ఊడదీయగలిగితే చాలు.....
వెంటనే జేబులోంచి కొత్తగా వచ్చిన పదిపైసల నాణేన్ని తీసి దాన్ని స్క్రూడైవర్ గా ఉపయోగించి కొద్ది క్షణాల్లోనే దానికున్న రెండు స్క్రూస్ ని ఊడదీయగలిగాడు.
దాన్ని పైకి ఎడంవేపుకి నుంచి తలుపుని తెరిచాడు.
ఆపైన మెషిన్ కన్న వేగంగా ఫైల్స్ ని తిరగవేసి గోవిందరాజులు ఫిల్ ని బయటకు తీశాడు.
ఫ్లోర్ మీద కూర్చుని ఆ ఫైల్ లోని ఒక్కో పేజీని తిరగవేయ సాగాడు.
పది నిమిషాలకు అతని ప్రయత్నం ఫలించింది.
గోవిందరాజులకు ఆప్తుడు ... అత్యంత సన్నిహితుడు ..... కుడి, ఎడం భుజం. కాకపోయినా ముఖ్యమైన మనిషి పేరు కనిపించింది అతని ఫోటో కూడా అక్కడ అతికించి వుంది.
పేరు : అలాక్ నిరంజన్
వయస్సు : ఇరవైఆరు
అడ్రస్ : 1-1-10, గన్ రాక్ ఎంక్లేవ్ , సికింద్రాబాద్.
ఎత్తు : 5.10
రంగు ఎరుపు
బరువు : 75 కిలోలు.
అలాక నిరంజన్ కి సంబంధించిన వివరాల్ని తన ఫోటోగ్రాఫిక్ మేమేరీలో నిక్షిప్తం చేసుకున్నాడు. టార్చ్ లైట్ ని అతని ఫోటో మీదనే కొద్దిక్షణాలు కేంద్రీకరించి అతని మొఖాన్ని తన జ్ఞాపకాల అరల్లో రికార్డ్ చేసుకుని ఫిల్ ని మూసివేసి . యధాస్థానంలో వుంచి, కొక్కేన్ని యదాస్థానంలో బిగించివేసాడు.
చక చకా వెనక్కీ తిరిగి వచ్చి సీట్లో కూర్చున్నాడు.
చర్చ్ గంట మూడుసార్లు మ్రోగింది.....
ఉలిక్కిపడి లేచి నించున్నాడు రిషి......
* * * *
"ఏం కావాలో కోరుకో ...." తల్లవారుఝామున మూడు గంటలకు బాగా అలసిపోయి రాగలతా బిజ లనీ ప్రక్కన సేద తీరుతూ అన్నాడు నందకిషోర్ .
"మీ ఇష్టం.... ఏదైనా " నందకిషోర్ లోకి ఒదిగిపోతూ అందామె.
"సిటీలో రోడ్డ్లు వేసే కాంట్రాక్ట్ ఇప్పిస్తాను . మెనేజ్ చేసుకోగలవా?"
"నాకేం మిగిలుతుంది.అందులో."
"రోడ్లేస్తే మిగలదు.... నిజమే . రోడ్డ్లు ఎవరేయ మన్నారు? పేపర్ మీ దవేస్తావంతే " తాఫీగా అన్నాడు నందకిషోర్.
బిజ్ లానీ నవ్వింది.
"కాని... అంతా మీరు పదవిలో ఎక్కువకాలం ఉండరని అంటున్నారు...." సందేహంగా అందామె.
ఈసారి నందకిషోర్ నవ్వాడు.
"అందరూ అనుకునేదాన్ని కాకుండా చేయటమే నాకు సరదా __"
"మీరుండలనే నేను కోరుకుంటున్నాను నాకో సినిమాలో హీరోయిన్ గా వేషం ఇప్పించగలరా?" అతని గుండెల మీది వెంట్రుకలతో ఆడుకుంటూ గోముగా ఇప్పించగలరా?" అతని అదృష్టం ...." ఆవలిస్తూ, నిద్రలోకి జారుకుంటూ అన్నాడు. నందకిషోర్.
ఆమె లేచి బట్టలు కట్టుకుంది.
* * * *
"రిషి ఏమిటి ఇంకా రాలేదు....?" తెల్లవారు ఝామున మెలుకువ వచ్చిన చూడప్ప భార్య భర్తని కుదుపుతూ అడిగింది.
ఆయన మత్తుగా మరో ప్రక్కకు ఒరుగుతూ "ఇంకా నీకు మా డిపార్ట్ మెంట్ సంగతి భోధపడలేదో .....! తనేదో పనిమీద రెస్ట్ లేస గా తిరుగుతున్నాడు. కుర్రాడు తెలివిగలవాడు __ మంచి చురుకైనవాడు ఏదో స్కూఫ్ ని డిగ్ చేసే ప్రయత్నంలో వున్నాడు. అలాంటివి చేస్తేనే గదా హీరో.... ప్రమోషన్ ... నేనూ అందుకే చూసీ, చూడనట్లుగా వుంటున్నాను. వయస్సులో వున్నవాడు __ బాగా కష్టపడాలి __ పైకి రావాలి. నువ్వు పడుకో" అన్నాడు చూడప్ప ఆవలిస్తూ.
"నిజమే అనుకోండి .... కాని పాపం అవంతి కళ్ళలో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తుంటుంది. అదే నా బాధ" ఆమె మాటలు పూర్తవుతూనే చూడప్ప లేచి కూర్చున్నాడు బెడ్ మీద .
కొద్దిక్షణాలు తరువాత బెడ్ దిగి, తలుపు తీసుకుని వెళ్ళి అవంతి రూమ్ ముందాగాడు.
ఆ గది తలుపులు దగ్గరకు వేసున్నాయి.
లోపల ఇంకా లైట్ వెలుగుతోంది.
ఆయనకు ఒక్క క్షానం బాధనిపించింది.
చిన్నగా తలుపుని నెట్టి చూసాడు.
అవంతి కుర్చీలో కూర్చుని టేబుల్ మీద తల వాల్చుకుని నిద్రపోతూ కనిపించింది.
శబ్దం కాకుండా లోపలకు నడిచాడు.
ఆమె తర్వాత కూడా కదలలేదు.
గాఢ నిద్రలో ఉందని అర్ధం చేసుకుని __ అంతరాయం కలిగించటం ఇష్టంలేక వెనక్కీ వచ్చి , తలుపులు దగ్గరకు వేసాడు.
* * * *
ఎప్పుడో తెల్లవారుతుండగా ఇంటికి చేరుకున్న రిషి పిల్లి లాగా లోపలకు ప్రవేశించి నిద్రలోకి జారుకున్నాడు.
* * * *
గోవిందరాజులకు ఎదురుగా షానవాజ్ , అలక్ నిరంజన్ కూర్చుని వున్నారు.
అప్పటికే వాళ్ళొక విషయాన్ని చర్చించుకున్నట్లు __ సరైన పరిష్కారం లభించక మనసికమయిన అలసటకు గురయినట్ట్లుగా వున్నాయి వాళ్ళ ముఖాలు అంతలో మరి వ్యక్తి లోపలకు ప్రవేశించాడు.
అతను ... అనూస్....
"ఏమైంది.....?" అనూస్ కంఠం వింటూనే షానవాజ్ , అలక్ నిరంజన్ లేచి నించున్నారు.
గోవిందరాజులు మాత్రం అలాగే కూర్చుని, కళ్ళతో విష్ చేసాడు.
"చేప గాలానికి తగిలింది. ఒకటి రెండు రోజుల్లో కథ రాక్తి కట్టబోతోంది....." అన్నాడు షానవాజ్ వినయంగా.
"మరిక ఆలస్యం మంచింది కాదు.... అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి __ మీదే ఆలస్యం " అనూస్ కూర్చుంటూ అన్నాడు.
గోవిందరాజులు మందహాసం చేసాడు.
* * * *
ఆదమరచి నిద్రపోతున్న రిషిని లేపాలని అనిపించలేదు. అవంతికి .
ఆమెకు తెలుసు .... రిషికి ఏ దుర్వసనాలు లేవని, ఒక పని అనుకుంటే దాన్ని సాధించే వరకు నిద్రపోడని
అప్పుడు ఉదయం తొమ్మిది గంటలు... కాళ్ళ దగ్గర అస్తవ్యస్తంగా పడున్న బ్లాంకేట్ ని రిషి మీద కప్పి తను క్లినిక్ ని ఓపెన్ చేసేందుకు వెళ్ళి పోయింది.
ఏదో పనిమీద నిమగ్నమయి వున్నాడు రిషి......
ఏమిటా పని?
రాష్ట్ర రాజకీయాలు విచిత్రమైన మలుపులు తిరగబోతున్నాయని అన్నాడు ..... ముఖ్యమంత్రి నందకిషోర్ వేయబోయే ఎత్తు ఎంతో ప్రమాద కరమై౦ది కావచ్చని కూడా అన్నాడు.
ఒకవేళ ఆ పని మీద వున్నాడా?
పొరపాటున రిషి తీగని కదిలిస్తే?
తను ఎవరయింది తెలీకుండా వుంటుందా? అవంతి అన్యమస్కంగానే వెళ్ళి క్లినిక్ ని ఓపెన్ చేసి అప్పటికే వచ్చి ఉన్న పెష్మేత్స్ ని పరీక్షించటంలో మునిగిపోయింది.
* * * *
పదకొండు గంటలకు నిద్రలేచిన రిషి హడావుడిగా తయారయిక్లినిక్ దగ్గరకు వచ్చాడు.
పేషంట్స్ తో క్లినిక్ లోని ముందు భాగం నిండిపోయి వుంది.
ఏ డాక్టర్స్ అయితే యాభైశాంతం ట్రీట్ మెంట్ కి... మరో యాభైశతం రోగులకు మానసికమైన స్వాంతన చేకూర్చటానికి తమ కాలన్ని వినియోగిస్తారో ..... వారి ప్రాక్టీ సే బాగుంటుందేమో అని స్వగతంలో అనుకుంటూ తన పనిమీద బయలుదేరి వెళ్ళిపోయాడు.
* * * *