శరీరం చిన్నగా కంపించింది
గుండె వేగం పెరిగింది.
గొంతు తడారిపోయింది.
మున్నెన్నడూ ఎరుగని విచిత్రమయిన అనుభూతి ఆమెను వివశురాల్ని చేసింది.
"నీకున్న జబ్బు లక్షణాలే వున్న పేషంట్స్ వచ్చి ఇదే మందు కావాలని అడిగితె ?" ఆమె కవ్విస్తూ అడిగింది.
"లవర్స్ శాంఫిల్ __ వాట్ ఫార్ సెల్ __ వాట్ అదర్స్ ట్రీట్ మెంట్. షెడ్యూల్ ఎల్ డ్రగ్ అని చెప్పాలి __" అన్నాడు తన క్రింది పెదవిని నోట్లోకి లాక్కుని తన్మయత్వ్గం చెందుతూ.
"సిగ్గు లేకపోతె సరి...." ఆమె కోపాన్ని అభినయిస్తూ అంది.
"ఎవర్ని చూసినా సిగ్గు ముంచుకొస్తుంది. అదేమిటో నిన్ను చూస్తే సిగ్గు మాయమైపోతుంది...." అంటూ రిషి లేచి క్లీనిక్ ని నలువేపులా చూసాడు.
"బాగుందా?" ఆమె ప్రశ్నించింది.
"బాగుందా? బ్రహ్మాండంగా వుంది __ బ్రహ్మాండం బ్రద్దలయఎలా వుంది ."
"ష్ ... నేను అడిగేది నా క్లినిక్ గురించి "
"ష్ __ ష్ __ నేను చెప్పేది నా ప్రియురాలి పెదవుల గురించి. అవునూ... ఇంగ్లీషు మందులు చేదుగా వుంటాయి. కాని ఇంగ్లీషు ముద్దు లేమిటి తియ్యగా ఉంటాయి ?"
"ఇంగ్లీషు ముద్దులా?"
"హితోస్మీ ..... భాషా సౌలభ్యం లేక అలా అనేసాను. ఇంగ్లీషు ముద్దే బహువచనమా? ఎంత సాహసం?"
ఆమె నవ్వింది ఆపైన ఒకింత దిగులుపడింది.
"పోలీస్ డిపార్ట్ మెంట్ లో చేరిన వారి గుండెలు పాషాణంగా మారిపోతాయట __ నిజమేనా ?"
"పోలీసు డిపార్ట్ మెంట్ లో కాదు, రాజకీయాల్లో చేరినవారి గుండె కూడా " రిషి కేజువల్ గా అన్నా, అవంతి ఉలిక్కిపడింది.
"ఇలారా ... కూర్చో __ రాజకీయాలంటున్నావేమిటి ?" అవంతి అనుమానంగా అడిగింది.
"ఏం లేదు __ నందకిషోర్ __అదే ముఖ్యమంత్రికి పదవీ గండం వచ్చి పడింది. దాన్ని దక్కించుకునేందుకు ప్రమాదకరమైన ఎత్తుల్ని వేయబోతున్నాడట __ అదేమిటో తెలీక మా డిపార్టుమెంట్ ప్రాణాన్ని అరచేతుల్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటో౦ది"
ఆమె ఏం మాట్లాడలేదు.
కొద్దిక్షణాలు నిశ్శబ్దం అలుముకుంది. "కళ్ళేమిటి అలా ఎర్రగా మండిపోతున్నాయి? నిద్రపోలేదా? అవునూ రాత్రి ఎన్నింటికి వచ్చావ్ ఇంటికి?" ఐ డ్రాప్స్ బాటిల్ తీసుకుంటూ అడిగింది.
"లేనివాళ్ళు పదవుల కోసం __ వున్నవాళ్ళు వాటిని దక్కించుకోవటం కోసం ఎంత సహసానికయినా , మరెంత దారిణానికయినా తెగిస్తారు. నందకిషోర్ ను దించాలనుకునేవాళ్ళు __ నందకిషోర్ పదవిలో ఉండాలను కొనేవాళ్ళు ఏ అరాచకాలు సృష్టిస్తారో ... లా అండ్ ఆర్డర్ ని ఎలా బ్రేక్ చేస్తారో అని మా డిపార్ట్ మెంట్ అంతా నిద్ర మానేసి జాగారం చేస్తున్నాం __" అన్నాడు రిషి.
"బెడ్ మీద పడుకో..... " అంది అవంతి లేస్తూ.
ఆమెలో అప్పటికే కల్లోలం చెలరేగింది.
ఎవరినుంచి అయితే తను దూరంగా వుండలనుకుంటుందో __ వేటినుంచయితే పారిపోవాలలనుకుందో ఆ వ్యక్తే __ వాటికే దగ్గరవుతున్నాడేమో ? కాదనుకున్న కన్నతండ్రి __ అసహ్యించుకున్న రాజకీయాలు తిరిగి రిషి ద్వారా దగ్గరవుతున్నాయా?
భయంతో ఒక్కక్షణం భయపడింది.
"ఛీ __ ఇక్కడ బాగోదు. పేషంట్స్ వస్తే __ చూస్తె బాగుంటుందా ?" చిలిపిగా కన్నుగీటుతూ అన్నాడతడు.
"ఏమిటో బాగాలేంది!" ఆశ్చర్యపోతూ అవంతి.
"అదే __ ఇక్కడ పడుకో అన్నావుగా?" రిషి మాటలు పూర్తవుతూనే అతని భుజాన్ని మేలిపెట్టింది.
"బొత్తిగా సిగ్గు లేకుండా పోయింది " అంది బాటిల్ మూట తెరుస్తూ.
"అదే నేనూ ఆశ్చర్యపోకున్నాను. నువ్వేమిటీ రెచ్చిపోయి అలా అనటం ఏమిటి? నామీద ఎంత ప్రేమ వుంటేమటుకు __ ఎంత కోరిక వుంటే మటుకు __"
"చంపెస్తాను __ కళ్ళలో డ్రాప్స్ వేస్తాను __ నాదే బిద్ధితక్కువ పడుకోఅనవసరంగా అన్నాను. కూర్చుని తలని వెనక్కీ వంచు " అంది అవంతి అతని చిలిపితనానికి మురిసిపోతూ.
"దూరంగా వుండి డ్రాప్స్ వేసే బదులు కళ్ళల్లో కళ్ళు పేట్టి చూస్తె ఎరుపుజీర అదే తగ్గిపోతుంది. ఎంత దగ్గరగా అంతే నా కనురెప్పలు __ నీ కనురెప్పలు టచ్ అవ్వాలి. ఆ సందర్భంలో ఏం అడ్డు వచ్చినా లెక్క చేయకూడదు. జబ్బు తగ్గటం ముఖ్యం కదా?" అంటూ రిషి కుర్చీలో కూర్చున్నాడు.
"వేషాలేయవద్దు....." అంటూ అవంతి బాటిల్ కేఫ్ మూత తీసి అతనికి దగ్గరగా వచ్చింది.
రిషి దగ్గరగా వున్న అవంతిని రెండు చేతుల్ని ఆమె వెనక్కీ వేసి మరింత దగ్గరగా తీసుకున్నాడు.
"ఈ చేష్టలకేం తక్కువలేదు " అంటూ అతని కళ్ళల్లో డ్రాఫ్స్ వేసింది అవంతి.
"సి.ఎమ్ . ఏం చేయబోతున్నారు? ఎలా తన పదవిని దక్కించుకుంటారు?" అవంతి తన కంఠంలో పెద్ద ఆసక్తి కనబరచకుండా అడిగింది.
"అదే ఎవరికీ అంతుబట్టడం లేదు. చూడాలి __ మొత్తానికి ఈ వారంలో ఆయన్ని ఆడుకునే సంఘటన ఏదో జరగవచ్చుని అందరి ఊహా" అన్నాడతను కళ్ళు మూసుకునే.
"నందకిషోర్ జీ దిగిపోతేనే బావుండు" అంది అవంతి రిషి చేతుల్ని తప్పించుకుని వెళ్ళి సీట్లో కూర్చుంటూ .
"కళ్ళు తెరవనా __ అందాల రాశిని ఎదురుగా పెట్టుకుని ! యిలా కళ్ళు మూసుక్కూర్చోవటం దురదృష్టమోతెలుసా....?" అంటూ స్టూల్ మీద లేచి గుడ్డివాడిలా చేతుల్ని ఆసరా అటూ ఇటూ కదిలిస్తుండగా "వేషాలేయకు __ నువ్వేం చేయాలనుకుంటున్నావో నాకు తెలుసు. బుద్ధిగా కూర్చుని కాస్సేపాగి కళ్ళు తెరువు" అంది అవంతి.
నిట్టూరోస్తూ కూర్చున్నాడను.
* * * *
ఒక వారం గడచిపోయింది.
ఏం జరుగుతుందో __ ఏం జరగబోతుందో ఎవరికీ తెలీకుండానే వారం గడచిపోయింది. ఎనిమిదో రోజు రాత్రి పన్నెండు గంటలకు రిషి పహడీ షరీఫ్ లో సిటీబస్ దిగాడు.
కొత్తగా ఉద్యోగంలో చేరినవాళ్ళు అపరిమితమైన ఆత్మవిశ్వసముతో తమ విధుల్ని ఖచ్చితంగా నేరవేర్చాలనే ఆశిస్తుంటారు. రూల్స్ ని అతిక్రమించటానికి ససేమిరా ఇష్టపడరు.
భవిష్యత్ లో బాగా తినాలనుకొనేవాళ్ళు ఎలాగు స్ట్రిక్ గానే వుంటారు.
ఏ రెండు కోవలకు చెందినవాడు కాదు రిషి ... తను తీసుకునే జీతానికి న్యాయం చేయాలనుకుంటాడు __ ఫలితాన్ని సాంధించాలనుకుంటాడు. తద్వారా ఒక అవగాహనకు వస్తాడు కరిక్ట్ ఎసేస్ మెంట్ చేసుకుంటాడు.
ముఖ్యంగా నందకిషోర్ ప్రవర్తనపై రిషి బాగా స్టడీ చేస్తాడు పాత పేపర్స్ అన్నీ తన దగ్గర పెట్టుకుని, నందకిషోర్ పదవిలోకి రాకముందు నుంచి అతని ప్రవర్తన , స్ట్రాటజీ, జీవన విధానం, ఆశలు ప్రత్యర్దుల్ని మట్టిగురిపిమ్చే విధానాల గురించి బాగా స్టడీ చేసాడు. ఇటు ఎమ్. ఎల్. ఏల్ని ప్రలోభ పెట్టడంలేదు __ బుజ్జాగించటం లేదు.
అటు అధిష్టానవర్గాన్ని చేరదీయటం లేదు. నిమ్మకు నీరెత్తునట్లుగా వుంటున్నాడు.
మరోప్రక్క మాణిక్యం శంభుప్రసాద్ సహకారంతో ప్రతి ఎమ్. ఎల్. ఏ కి ఐదు లక్షలు , ఒక మారుతీకారు యిచ్చేస్తున్నాడు.
ఏ విధంగా చూసినా మొగ్గు మాణిక్యంవేపే వుంది. అయినా నందకిషోర్ పదవిలోంచి దిగేందుకు ఇష్టపడడు. మరెలా తన పదవిని కాపాడుకుంటాడు? ఈ అనుమానం దగ్గరే ఆగి ఆలోచించడం మొదలు పెట్టాడు. రిషి.
తను ఏదో సాధించాలి ....?
అందరి ప్రశంసలు పొందాలి......
వృత్తిపరమైన సంతృప్తిని సొంతం చేసుకోవాలి.... అంటే తను చిల్లర దొంగల్ని , గూండాగిరిని శోధిస్తే చాలదు.
పెద్ద త్రిమి౦గలాన్నే పట్టాలి.
ఈ ఆలోచనలు వచ్చాక డిపార్ట్ మెంటు కి తెలీకుండా తన ప్రయత్నాలు చేయటంప్రారంభించాడు. అందులోని భాగంగానే పహాడీ షరీఫ్ సెంటర్ లో దిగాడు.
మామూలుగానే చూస్తె, చాప క్రింద నీరులా అవసరమయిన చోటుకి చేరుకునే అండర్ వరల్డ్ డాన్స్ మూమెంట్స్ కనిపించవు. ఎక్కడో, ఎప్పుడో ఒకచోట చాపని కదిలించి చూడాలి.
అంటే షానవాజ్ మీద నిఘా వేస్తె ప్రయోజనం వుండవచ్చు __ వుండకపోవచ్చు . అయినా ప్రయత్నించక తప్పదు.
నేటి రాజకీయ భూకంఫాలకు గూండాలే మీటలుగా ఉపయోగపడుతున్నారు.
అప్పుడు సమయం అర్దరాత్రి దాటి అరగంటయింది. చలికి భయపడి ప్రజలు ఎవరూ బయటకి రావటంలేదు. సాధారణంగా శ్రీశైలం రూట్ లో వున్న పహాడీ షరీఫ్ అంత త్వరగా విశీదిని, నిశ్శబ్దాన్ని ఆశ్రయించదు.