Previous Page Next Page 
మయసభ పేజి 23

  

     అవంతి క్లినిక్ ఓపెన్ అయింది.

    చుట్టూప్రక్కల నగర సరిహద్దు గ్రామాల నుంచి పేషెంట్స్ అవంతి దగ్గరకు రావటం ఆరంభమైనది.

                            *    *    *    *   

    రిషి ఆ రోజు అనుకోకుండా పహాడీ షరీఫ్ ప్రాంతానికి  వెళ్ళాడు. ఒక కేసు నిమితమై క్రైమ్ బ్రాంచ్ డి.ఎస్. పి ఆశించిన వ్యక్తి ఇంట్లోంచి బయటకు వచ్చి రోడ్దేక్కాడు.

    అతను గోవిందరాజుల కుడిభుజం షానవాజ్ !

    అతన్ని చూస్తూనే క్రైమ్ బ్రాంచి డి. ఎస్. పి. భ్రుకుటి ముడిపడింది.

    "అతను  చాలా డేంజరస్ ... పేరు షాన్ వాజ్ .. గోవిందరాజులకి కుడి భుజం ప్రస్తుతానికి వీడితో మనకు పనిలేదు బట్ ... వీడ్ని దృష్టిలో పెట్టుకో . వీడికి సంబంధించిన ఫైల్ ఒకటి మన కాన్ఫిడేన్షియల్ సెక్షన్ లో వుంది. తీసుకుని స్టడీ చెయ్. నీకు చాలా విషయాలు తెలుస్తాయి...." అన్నాడు డి.ఎస్.పి అ వ్యక్తి కేసే చూస్తూ.

    "మీరు ఇతని కోసమేగదా వచ్చింది.... మరి ప్రస్తుతానికి వీడితో పనిలేదని అంటున్నారేమిటి.....?" రిషి విస్మయపడుతూ అడిగాడు.

    "వీడసలు సిటీలో వున్నాడా లేక వేరే ప్రాంతానికి వెళ్ళాడా అనేది తెల్సుకొనేందుకు మనం వచ్చింది . వీడు రెండు మూడు రోజులు కనిపించకపొతే ప్రమాదకరమయిన పథకానికి ఊపిరి పోస్తున్నట్ట్లుగా అర్ధం చేసుకోవాలి...." మెల్లగా అన్నాడు డి.ఎస్.పి.

    వాళ్ళిద్దరూ ఇప్పుడు శ్రీశైలం రోడ్డుకి వారగావున్న ఒక ముళ్ళపొదల ప్రక్కన, చేకట్లో వున్నారు.

    వాళ్ళు రోడ్డు మెడ వున్నవారికి కనిపించే అవకాశం లేదు గాని __ వీరికి రోడ్డుమీద సంచరించే వారు స్పష్టంగా కనిపించే అవకాశం వుంది.

    షానవాజ్ ఓ బడ్డీ దగ్గర, ఆగి, ఏదో తీసుకుని ఈ ప్రక్కనే వున్న ఇరానీ కేఫ్ లోకి ప్రవేశించాడు.

    "వీడికి ఇక్కడ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. కాస్త ఖాళీ దొరికితే ఈ ప్రాంతానికి వస్తాడు. వీడిలో వాంచ అధికం ఒక పనిని నెత్తిమీద పెట్టుకున్నప్పుడు ఎంత విగరస్ గా వర్క్ చేస్తాడో __ ఖాళీ దొరికితే సెక్సువల్ గా అంతా విజ్రుంభీంస్తాడు. ఒక్కోసారి ఆమె ఇంట్లోకి వెళ్ళి రెండు రోజుల దాకా బయటకు రాడు. సెక్స్ మనియాక్. వీడు ఇక్కడే తిరిగాడుకున్నాడు కనుక పెద్దగా అనుమానించక్కర్లేదు . క్రైమ్ బ్రాంచ్ కదలికలు ఇలాంటి వారిని బట్టే నిర్ణయించబడుతుంటాయి. లా అండ్ ఆర్డర్ డిపార్ట్ మెంట్ కి ఉన్నంత మంది ఇన్ ఫార్మర్స్ మన బ్రాంచ్ కి వుండరు. ఎవరైతే చాపక్రింద నీరులా పాకుతుంటారో వారి మూలంగానే మనకు పని. వీడికి బొంబాయి అండర్ వరల్డ్ డాన్స్ తో మంచి సంబంధాలున్నాయి.

    ఈ మధ్య రాజకీయాలు పరమనీచమైన స్థాయికి చేరుకున్నాయి. అమ్దికరంలో ఉన్న పార్టీ దించేందుకు ప్రతిపక్షపార్టీ యాభై లక్షలు ఖర్చుపేట్టి రౌడీల్నీ, గూండాల్ని రంగంలోకి దింపితేసరి ... వాళ్ళు పిల్లల్ని, వృద్దుల్ని హతమార్చి ఆస్తుల్ని తగలబెట్టెస్తారు. దాంతో అధికారంలోవున్న పార్టీ అసమర్దత మూలంగానే ప్రజల ధన, మాన ప్రాణాలు హరించుకుపోతున్నాయని, శాంతి భద్రతలు క్షీణించి పోతున్నాయని అరిచి, అల్లరి చేసేందుకు అవకాశం వుంటుంది. అధికారంలోకి దింపేందుకు పరిస్థితులు సానుకూల పడతాయి.

    మరీ నికృష్టమైనా స్థాయి ఏమిటో తెలుసా ? అధికార పార్టీలోనే మంత్రి పదవులు రాక కొందరు అల్లాడిపోతుంటారు. వాళ్ళు ముందు ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తెస్తారు.... పని జరగక పొతే అధిశాతన వర్గం మీద విరిచుకు పడతారు. అక్కడికి మంత్రి పదవులు రాకపోతే కోటిరూపాయలు ప్రోగుచేసి కిరాయి గుండాల్ని దింపుతారు. వాళ్ళు దానవుల్లా అమాయక  ప్రజల్ని బలి తీసుకుంటారు. విచక్షణ లేకుండా నగరాల్ని, పట్టణాల్ని పల్లెల్ని వల్లకాదు క్రింద మార్చేస్తారు. 

    ప్రజలు భగ్గుమంటారు.

    పత్రికలు నిరసిస్తాయి.

    ప్రస్తుత ముఖ్యమంత్రి అసమర్ధతిని నిర్ధారిస్తారు. ప్రజలు చస్తే ఎవరికీ? బ్రతికితే ఎవరికీ? తింటే ఎవరికీ? వల్లకాడులో కలిస్తే ఎవరికి?

    ఆశించిన పదవులు వస్తేచాలు ఛీ ... ఛీ... దౌర్భగ్యులైన రాజకీయ నాయకుల మూలంగా ప్రజల బ్రతుకులు నానాటికి దిగజారిపోతూ, అగ్నిగుండపై పోతున్నాయి.

    ప్రజలోప్రక్క ప్రాణాన్ని అరచేతుల్లో పెట్టుకుని, కనీస అవసరాలు కూడా తీరక అలమటించిపోతుంటే ఘనమైన ఎమ్. ఎల్ఏ. లు ఢిల్లీ చుట్టూ ప్రదక్షణాలు చేస్తుంటారు.

    డీగ్రీలు చదివేది ఉద్యోగాల కోసమే అని ఈ దేశ యువత .....

    ఉద్యోగంలో చేరేది లంచాలు తినేందుకు అని ఉద్యోగాలు......

    ప్రజా ప్రతినిధి అయ్యేది మంత్రి పదవిని చేజిక్కించుకొనేందుకే అని రాజకీయ నాయకులు అనుకోబట్టే దేశం ఇలా గతగలబడిపోతుంది.

    ఒకరు మండలాలంటే __

    మరొకరు వల్లకాదంటే....

    ఇంకొకరు ఉంచేస్తే పోలా అనంటారు. వారానికి ఐదు రోజులని ఒకరంటే __ అసలు వారానికి రెండు రోజులు పనిచేసి  ఐదు రోజులు ఇంట్లో పడుకుంటే చాలని ఇంకొకరంటారు __ ఏది ఉండదో,ఎవరికీ తెలీదు. తుగ్లగ్ లు ఎక్కువయి పోయి రాష్ట్రాల్ని . దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. రాజకీయ వెధవల్ చేతుల్లో దేశం వట్టిపోతోంది.

    ఇప్పుడీ వెధవ __ అదే నందకిషోర్ ఎన్ని ఎత్తులు వేసి తన పదవి నిలుపుకుంటాడో __?

    మన దేశానికి పట్టిన వ్రణం __     రాచరకపు __ రాజకీయ నాయుకులే __

    గివిమ్దరాజులు నగరంలో లేడు.

    వీడు తన వాంచను తీర్చుకుంటున్నాడు. కానుక మనం ప్రశాంతంగావున్నాం. లేదంటే మనకు నిద్రలుమ్డవు __" డి.ఎస్.పి కసిగా అంటుంటే రిషి విస్తుపోయాడు.

    "ఎందుకయినా మంచిది. నేనోసారి అటువెల్లి టీ తాగినట్లు తాగి షాననాజ్ మొఖాన్ని గుర్తుపెట్టుకుని వస్తాను. నేనేలాగు అతనికి తెలీదు గదా ?" రిషి అన్నాడు.

    డి.ఎస్.పి. ధైర్యానికి ఆశ్చర్యపోయాడు.

    ఆపైన అలాగే అన్నట్లు తలూపాడు.

    రిషి మెల్లగా లేచి, వెనుకా ముందూ చూసుకుంటూ రోడ్డు మీద కొచ్చి, ఇరానీ హొటల్ వేపు సాగాడు.

                              *    *    *    *   

    బొంబాయి, మలబార్ హిల్స్ __ హే౦గింగ్ గార్డెన్స్ లోని బూట్ హౌస్ ముందు గోవిందరాజులు మరో వ్యక్తితో సమావేశమయ్యాడు.

    వాళ్ళిద్దరి మధ్య చర్చలు వేడిగా, వాడిగా సాగుతున్నాయి.

    "మీరెప్పుడు వెళుతున్నారు __?" ఆ వ్యక్తి గోవిందరాజుల్ని ఉద్దేశించి అడుగుతుండగా గోవిందరాజులు భ్రీఫ్ లోంచి బరువుగా వున్న ఒక కవరు తీసి అ వ్యక్తి చేతికిచ్చాడు.

    "చాలదనుకుంటే చెప్పు  __ లేదా ఫోన్ చెయ్ __ పని మాత్రం జరగాలి. ఎంత ఖర్చయినా ఫర్వాలేదు. ఖలేజా వున్న మనిషిని చూడు __" అంటూ గోవిందరాజులు లేచాడు.

    ఇద్దరూ తిరిగి కమలనెహ్రూ పార్క్ ముందుకొచ్చి టాక్సీ ఎక్కారు .

    టాక్సీ జస్క్లో క్ హాస్పిటల్ రోడ్ లోకి మలుపు తిరిగింది.

                             *    *    *    *   

    "ఎస్ __ ఏమిటి మీ సమస్య  __?" ఎదో మెడికల్ మెగ జైన్ తిరగేస్తూ అడిగింది. వమతి.

    "పెదవులు అదురుటున్నాయండి. మెడికల్ ఒకటే బాధ. నిద్ర పట్టత్డం లేదు __ మనస్సంతా దిగులుగా లోకమంతా శూన్యంగా తోస్తోంది __ అన్నం సహించటం లేదు . నేనేమయిపోతానో అని బెమ్గాగా వుంది __" మాటలు వినిపించి తలెత్తి చూసింది అవంతి.

    ఎదురుగా రిషి నవ్వుతూ కనిపించదు.

    "ఒహో ... తమరా తమరికొచ్చిన జబ్బు చిత్రమైంది. జాగ్రత్త పడకపోతే పిచ్చికి దారి తీస్తోంది...." అంది అవంతి సీరియస్ నేస్ ని అభినయిస్తూ.

    "అదేకదండీ నా భయం __ మీరే ఏదో చేసి పుణ్యం కట్టుకోవాలి " అర్దిస్తున్నట్ట్లుగా అన్నాడు రిషి.

    అప్పటికింకా పేషంట్స్  ఎవరూ రాలేదు.

    "ఏం పుణ్యం కట్టుకుంటాం __ ప్రాణాలు తీసే వృత్తి మీది, ప్రాణాలు పోసే వృత్తి మాది. ప్రాణాలు తీసే వృత్తిలో వున్న వారికి విచిత్రమైన జబ్బులు రావటం ఖాయం మరి ఏం చేస్తాం పాపం?" ఆమె వస్తున్న నవ్వును పెదాల మాటున దాచుకుంటూ అన్నది.

    అప్పుడు సమయం సాయంత్రం ఆరున్నర గంటలు.

    నా జబ్బుకి మందు మీ దగ్గరుంది __ ఇస్తే పోలా?" రిషి టేబుల్ కి కుర్చీకి మధ్యలో చూస్తూ అన్నాడు.

    అతనేటు చూస్తున్నాడో అర్ధం చేసుకుని. చటుక్కున తల వంచి తనకేసి చూసుకుంది. ఆపైన సిగ్గుపడింది.

    "ప్రక్క చూపులు కూడా పెరిగాయే __"

    "మరేనండి __ రేపు ఐ స్పెషలిస్టు కూడా కలవాలి. ముందు మీ ట్రీట్ మెంటయిపొతే __ తరువాత అది __ ఆలస్యమయితే పేషెంట్స్ వస్తారు. త్వరగా ముందు ఇచ్చేయండి __" బతిమాలాడుతున్నట్ట్లుగా అన్నాడు రిషి.

    "నీ జబ్బుకి నా దగ్గర మందు వుంది. కాని __ అది నేను ఇచ్చేది కాదు...." అవంతి అంటుండగానే రిషి సడన్ గా ఆమె తల మీదకు వంగాడు. సరీగ్గా ముప్పి క్షణాలకి వెనక్కీ తగ్గాడు.

    ఆమె పెదవులు మరింత తడిచేరి మెరిసాయి.

     కళ్ళు అరమోడ్పులయ్యాయి.

 Previous Page Next Page