"శత్రుదేశాల మూలంగా కాక, అంతర్గత కలహాల మూలంగానే ఎక్కువగా ప్రజలు కొట్టుకు చచ్చిపోతారు. అగ్గిపెట్టెలో పట్టేంత చీరని తయారు చేస్తారు .... విధవరాలు దేశాన్నిపరిపాలిస్తుంది ... ఏ మాత్రం చరిత్రలేని ఒక అనామకుడు దేశాధినేతపోతాడు. ముప్ఫై ఐదెండ్ల యువకుడు దేశాదినేతయిపోతాడు..... అంటూ చాలా చెప్పారు బ్రహ్మంగారు. ఆయనకంటే మనం గొప్పవాళ్ళం కాదుగా ? చవనివ్వండి ..." నందకిషోర్ వేదాంత ధోరణీలో అంటుంటే యేగేంద్రాసిన్హా మాన్పడిపోయాడు.
"శాంతి భద్రతల విషయంలో ఫేయిలయ్యారని, రాష్ట్రపతి పాలన పెట్టె ప్రమాదం వుంది సార్ !"
"వడ్డించేవాడు మనవాడయితే బంతి చివరలో కూర్చున్నా కమ్మని పిండివంటలు అందుతాయి. కేంద్రంలో మన పార్టీ వున్నా, మన పార్టీ సపోర్టు చేసే పార్టీ వున్నా, కొన్ని వేలమంది వచ్చినా, శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించిపోయినా, రాష్ట్రపతి పాలన పెట్టడం జరగదు. అదే వేరే పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో అయితే వీధి పోరాటాలు జరిగినా రాష్ట్రపతి పాలన పెడతారు.
చెడిపోయిందమ్మా ... దేశం రాజకీయనాయుకుల మూలంగా పూర్తిగా చెడగొట్టబడిందయ్యా... అదలా వుంచి ముందు నా పదవి సంగతి చూడు.... తరువాత మిగతావన్నీ చూడవచ్చు. మనకి పూర్తిగా సపోర్టు చేసే ఎం.ఎల్. ఏ. లు ప్రలోభపడుతున్నట్లు తెలుస్తోంది.
శంభుప్రసాదు డబ్బుతో , మాణిక్యం పదవుల్ని ఆశచూపి మన వాళ్ళను లాగేస్తున్నట్లు తెలుస్తోంది ఏ క్షణాన ఎవరుఇ ఎటు దూరతారో తెలీటం లేదు. కనుకమన ఎమ్ . ఎల్ . లు మన ప్రక్కన లేకపోయినా, మానమ అధికారంలో వుండాలి ...." నందకిషోర్ గంభీరంగా అంటూ దీర్ఘాలోచనలో పడ్డాడు.
పూర్తిగా ఓడిపోయే స్థితిలో కూడా సంపూర్ణ విజయం సాధించి పదవిని చేజిక్కించుకోవాలనుకుంటున్న నందకిషోర్ ని చూసి యేగేంద్రసిన్హా భయంతో వణికిపోయాడు.
"భారతదేశ రాజకీయ నాయకులకు ఎలాంటి వాళ్ళో తెలుసా? రోమ్ తగలబడిపోతుంటే ఫడేల్ వాయిమ్చుకునే నీరో చక్రవర్తుల్లాంటి వాళ్ళు...... మీరెందుక౦డి ఊరికే వర్రీ అయిపోతారు? రోడ్డ్లు బాగాలేకపొతే మేర్పిడస్ లో తిరిగుతారు మనవాళ్ళు. వారదలోచ్చి దేశం కొట్టుకుపోతుంటే హెలికాప్టర్ లో పర్యటింస్తారు.
మత కలహలు వచ్చి మనుష్య జాతి మసి అయిపోతుంటే, పోలీసు రక్షణలో ఆ ప్రాంతాలకు వెళ్ళి పరామర్శించి వస్తారు. మీ పదవి మీకుండాలంటే మా నందకిషోర్ జీ పదవి దక్కటం గురించి ఆలోచించండి " గోపీనాధం సర్ కాస్టిగ్గా అన్నాడు.
"అదే నాకూ అనూహ్యంగా వుంది ఎప్పటిలా కాక ఈసారి మన గ్రూఫ్ లో ఎమ్. ఎల్.ఏ లు ఊగిసలాడుతున్నారు. వార్ని ఆపటం వృధా ప్రయాసే అవుతుంది. ఒకవేళ మనవాళ్ళు కూడా మాణిక్యాన్ని సపోర్టుచేస్తే ఏమిటి పాలు పోవటం లేదు.
మరి కాసేపు ఆ ఛాంబర్ లో నిశ్శబ్దం చోటుచేసుకుంది.
"గోవిందరాజులు బొంబాయి వెళ్ళాడా....?" నందకిషోర్ ప్రశ్నించాడు బెస్ వాయిస్ లో
"మార్నింగ్ ప్లయిట్ కి వెళ్ళిపోయాడు. ఏ క్షణాన్నయినా మనకు ఫోన్ చేయవచ్చు " గోఫీనాధం సమాధానమిచ్చాడు.
"ఈ రోజు ఎవరయినా ఢిల్లీనుంచి ఎవరయినా వచ్చారా?"
"లేదు అసలేం జరుగుతుందో తెలీటంలేదు. ఈసారి అంతా గుంభనంగా జరిగిపోతోంది....." గోపీనాధం డిజ్ గస్టింగా అన్నాడు.
"శంభుప్రసాద్ కొడుకులు మురారి ప్రసాద్, అనూప్రసాద్, బావమరిది సుకీర్తి లక్షలకు లక్షలు మాణిక్యం క్యామ్పుకి చేరవేస్తున్నారట." అనూస్ వారిమీద తనకున్న కోపాన్ని వ్యక్తం చేస్తూ అన్నాడు.
సుకీర్తి ... సుకీర్తి ఎలాంటివాడు ....?" నందకిషోర్ సడన్ గా అడిగాడు.
"సుక్తీర్తి స్వయానా శంభుప్రసాదు బావమరది" గోపీనాధం ఇంకేదో చెప్పబోతుండగా నందకిషోర్ అందుకున్నాడు.
"సుకీర్తికి యిద్దరు ఆడపిల్లలున్నారు. వాళ్ళకు పెళ్లీడు వాచ్చిమ్ది. సుకీర్తి తన కూతుర్లకు పెళ్ళిచేయాలంటే చాలా డబ్బు కావాలి. అది అతని దగ్గర లేదు. సుకీర్తి తన కూతుర్లకు శంభుప్రసాదు కొడుకులకిచ్చి చేయాలని వుంది. కాని అడిగే ధైర్యంలేక ఆగిపోయాడు. సుకీర్తి విశ్వాసానికి గాను నేలకు పాతిక వేలిస్తున్నాడు శంభుప్రసాద్. అవి సరిపోతాయా? సరిపోకపోవచ్చు అవసరాలు, విశ్వాసానీయతల మధ్య సుక్తీర్తి నలిగిపోతున్నాడు. శంభుప్రసాద్ శిభిరంలో అతి ముఖ్యమైనా వాడు సుకీర్తి ...... అవునా ....?"
ముగ్గురూ నందకిషోర్ నెట్ వర్క్ కి , ముందుచూపుకి దిగ్భాంతి చెందారు.
"అవునవును ... అయితే ...?" గోపీనాధం, నందకిషోర్ స్ట్రాటజీ ఏమిటో అర్ధంకాక పిచ్చెక్కిపోతూ అడిగాడు.
తలూపాడు తప్ప నందకిషోర్ ఏం మాట్లాడలేదు.
కొద్దిక్షణాల నిశ్శబ్దం తరువాత అక్కడున్న ఫోన్ రింగ్ అయ్యింది.
* * * *
అన్నివేపుల నుంచి ఉపద్రవాలు కమ్ముకు రావాలి. కనుక మీరు మంత్రిపదవికి రాజీనామా చేయాలి ...." మురహరి బ్లాక్ అండ్ వైట్ విస్కీని పెగ లోకి వంపుతూ అన్నాడు.
"తెలివి కలవాళ్ళు పరిస్థితుల్ని ముందుగానే అంచనా వేసి రాజేనామా చేస్తారు. పదవిలోకి ఎక్కబోయే నాయుకుడి అభిమానాన్ని , ఆ తరువాత తిరిగి మంత్రి పదవిని పొందుతారు. ఇది మన దేశపు సీనియర్ రాజకీయ నాయుకులు ఎన్నోసార్లు రుజువు చేసిన నగ్న సత్యం. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎలాగు శంకరగిరి మాన్యాలు పట్టక తప్పదని తెలిసినప్పుడు టక్కున ప్లేట్ ఫిరాయించాలి.
మరో నెలో, రెండు నెలలో పదవిలో వుందే ముఖ్యమంత్రిగాని, ప్రధాన మంత్రినిగాని గుద్ది విశ్వాసంతో సపోర్టు చేసి పదవి పోగొట్టుకునే బదులు __ రెండు నెలలు పదవిని త్యాగం చేయగలిగితే , శాశ్వతంగా తిరిగి మంత్రిపదవిని గతంలో ఎంతమంది రుజువు చేయలేదు ? ఇంకొంతమందయితే ఒడిపోయే తన పార్టీని వదిలి, రాబోయే ఎలక్షన్స్ లో గెలవబోయే పార్టీలో చేరిపోయి, భవిష్యత్త్ పదవికి బేరం పెడతారు.
మనకేమన్నా మన నాయుకులు, పెద్దవాళ్ళు నీతులు నేర్పుతున్నారా? వాళ్ళు నేర్చేవి ఏవయినా నేర్చుకోనేగదా పైకి రావాలి. విలువలెక్కడున్నాయి. ఈ దేశంలో ...? 1950 ప్రాంతంలోనే అవి సమాధి అయిపోయాయి. బాగా ఆలోచించుకో...... నందకిషోర్ ని దింపటం ఖాయం. మాణిక్యంగారు వ్చీఫ్ మినిష్టర్ కావటం అంతకంటే ఖాయం మహా ఐతే నాలుగయిదు వారాలకంటే నందకిషోర్ పదవిలో వుండరు.
మాణిక్యంగారు ముఖ్యమంత్రి అయితే మిగతా మూడున్నర ఏండ్లు పదవిలో వుంటారు. మీకు ఐదారు వరాలు కంటిన్యూస్ గా కొనసాగాలని వుందా? ఐదారు వరాలు పదవి వదులుకుని, మూడున్నర ఏండ్లు కేబినేట్ ర్యాంక్ లో సెటిలవ్వాలని ఉందా....?" మరప్ప మెస్మరైజ్ చేసాడు.
ఆ మంత్రి ఆలోచనల్లో పడ్డాడు.
"కేబినేట్ ర్యాంక్ మినిష్టర్ రాజీనామా అన్నది చిన్న విషయం కాదు. స్టేట్ లో . సెంట్రల్ లో కలకలంరేపుతుంది. కర్ణుడు చావుకి అరవైఆరు శాపాలని __ ఒక్కసారి కష్టాలు రావాలి . సి,ఎమ్. అధిష్టానవర్గం కదిలి పోవాలి, బెదిరిపోవాలి మీకూ అవసరాలుంటాయి. మీ వెనుక వున్న మీ జిల్లా ఎమ్. ఎల్ ఏ. లకు అవసరాలుంటాయి అందుకే పదిలక్షలు సిద్దం చేసాం. ఇంకా కావాలంటే చెప్పండి. ఇంక మీరేం ఆలోచించకండి ...." మురహరి టిక్కా కబామ్ అందిస్తూ అన్నాడు.
ఇక్కడిలా జరుగుతుండగా మరోచోట మాణిక్యం పదిహేనుగురు మనవేపుకి రాబోతున్నారని మురారి ప్రసాద్ సుక్తీర్తితో అంటున్నాడు.
* * * *
జుహూతారారోడ్, శాంతాక్రుజ్ లో ఒక వ్యక్తిని కలుపుకుని గోవిందరాజులు కారేక్కాడు. అది బెండి బజార కేసి షరావేగంతో దూసుకుపోసాగింది.
"ఈసారి నందకిషోర్ దిగట తప్పదేమో రాజులు " శాంతాకృజ్ లో కారేక్కిన వ్యక్తి గోవిందరాజులతో అన్నాడు.
"పరిస్థితులు అలాగే ముంచుకోస్తున్నాయి. కాని అయన స్ట్రాటజీ ఏమిటో అర్ధం కావటం లేదు ఏమాత్రం భయం లేకుండా నిమ్మకు నీరెత్తి నట్లుగా వున్నారు. అటు ఢిల్లీ వెళ్ళి వార్ని నెమ్మదింపజేయుదు __ ఇటు హైద్రాబాద్ లో వుండి ఎమ్ . ఎల్. ఏ లను కూడగట్టడు. అయన ధైర్యమేమిటో నాకే కాదు ఎవరికీ అర్దః కావటంలేదు " గోవిందరాజులు బయటకు చూస్తూ అన్నాడు.
కారు మరింత వేగాన్ని పుంజుకుంది.
* * * *
నందకిషోర్ లో ఎలాంటి కదలికలు లేకపోవటం , పై ఎత్తులు వేస్తూన్నట్లు కనిపించక పోవటంతో మంత్రివర్గంలోని సభ్యులు సెకండ్ థాట్ లో పడిపోయారు. అవసరమయితే మాణిక్యం వేపుకి దూకేందుకు మానసికంగా సిద్దం కాసాగారు.
ఆ విషయమూ నందకిషోర్ చెవిన పడింది.
అయినా చెక్కు చెదరలేదు.
ఒక చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు.
నందకిషోర్ గుండె నిబ్బరానికి ప్రతి ఒక్కరూ అబ్బురపడుతున్నారు.
* * * *
అధిష్టాన కార్యాలయంలో నందకిషోర్ వ్యతిరేఖంగా ఫిల్ తయారు కాసాగింది.
* * * *
శంభుప్రసాద్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చాడు. మాణిక్యం బలం మరింత పెరిగిపోయింది.
* * * *