Previous Page Next Page 
మయసభ పేజి 21

 

    నందకిషోర్ ని సపోర్ట్ చేసే ఎమ్. ఎల్. ఏ. లను ఎంతపెట్టయినా కొందాం. రాజకీయ నయుకులకు డబ్బు ఒక్కటే సంతృప్తి నివ్వదు పదవులు కూడా కావాలి. అని రాణి వాళ్ళు నందకిషోర్ వర్గంలో వున్నారు....

    వార్ని దువ్వితే చాలు __ నేను డబ్బు , మెరు పదవులు ఆశ చూపితే చాలు __ పదవి వున్నంత వరకే అతని వెనుక వుంటారు. పోగానే ప్లేట్ పిరాయించి పదవుల కోసం మీ వెనుక , మాణిక్యం వెనుక పడతారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి.

    మా అబ్బాయి వాళ్ళ మేనమామ సుకీర్తి సహకారంతో ఎమ్. ఎల్. ఏ. లను కొనటం ఆరంభించారని వర్తమానం వచ్చింది పరిస్థితుల్ని అప్రమత్తంగా పరిశీలిస్తూ నిర్ణయం తీసుకోవాలి లేదంటే పార్టీ మీది __ మనది __ అనుభవించేది ఆ నందకిషోర్ అనేది శాశ్వతమైపోతుంది " శంభుప్రసాద్ తన విడిదికి బయలుదేరుతూ అన్నాడు .

                            *    *    *    *   

    రాత్రి తొమ్మిది గంటల సమయం....

    సెక్రటేరియేట్ లోని ముఖ్యమంత్రి కార్యలమ్యం నిశ్సబ్దంగా , గంభీరంగా వుంది.

    సి.ఎమ్.ఛాంబర్లో ప్రస్తుతం నందకిషోర్ , అయన కొడుకు అనుస, మరివ్యక్తి మాత్రమె వున్నారు.

    ఆ మూడో వ్యక్తి కావటానికి ఎమ్ .ఎల్. ఏ  అయినా మాజీ గూండా. ప్రస్తుతం కూడా ఆ వృత్తిని కొనసాగిస్తూనె తెరవేనుకే పరిమితం చేసుకుపోతున్నాడు.

    అతని పేరు గోవిందరాజులు.

    అతనికి బాపట్ల నుంచి బొంబాయి వరకు వరల్డ్ డాన్స్ తో సంబంధాలున్నాయి. అతను స్వయంగా పాతికపైగా హత్యలు చేసాడు. కొన్ని వందల హత్యల్ని ఇతరులతో చేయించాడు. ఎవరికీ జంకడు....

    మరెవర్నీ లెక్కచేయడు . తను చేయదలచుకుంది ఎంత ప్రమాదకరమైన దయినా సునాయంసంగాచేసేయగల సమర్దుడు.

    అతనిలో గూండాగిరిని చూసే నందకిషోర్ అతనికి ఎమ్. ఎల్. ఏ సీటిచ్చి గెలిపించుకున్నాడు.

    హత్యా రాజకీయాల అవసరం వచ్చినప్పుడు నందకిషోర్ నుంచి ముందుగా కబురు గోవిందరాజులకే వెళుతుంది.

    గోవిందరాజులు పెద్దగా చదువుకొకపోయినా పోలీసులతో , చట్టంతో ఐ.పి.సి. తో తెలివిగా అతలాదుకోగల సమర్దుడు. అతని మీద ఇంతవరకు పక్కాగా ఒక సాక్ష్యం కూడా రాష్ట్రం మొత్తం మీద ఏ పోలీసు స్టేషన్ లోనూ రికార్డ్  కాలేదు. కాని అందరికి తెలుసు అతని కార్యాకలాపాలుగురించి.

    అలాంటి గోవిందరాజుల్ని పిలిపిమ్చటం అనూస్ కి కూడా ఆశ్చర్యమ౦గా వుంది.

    ఏమిటి ప్రతి వాడు చెలరేగి పోతున్నాడు __ ఇంటూ మార్క్ పెట్టించేయమంటారా?" గోవిందరాజులు కంఠం పీలగానే వుంటుంది. కాని నిర్ణయం సీరియస్ గా , గంభీరంగా వుంటుంది.   
   
    "తప్పదు ... ఒక్కొక్కరికి అంటూ మార్క్ పెడితే న పదవి బ్నిలిచిపోతుంది ...." బెస్ వాయిస్ లో అన్నాడు నందకిషోర్ .
   
    "చెప్పండి ..." అంటూ గోవిందరాజులు ఒక పైల్ ని చేతిలోకి తీసుకున్నాడు.

    ఫైల్ ని పూర్తిగా తిరగేస్తుండగా ... "మన ప్రత్యర్ధులు వీల్లే.... వీళ్ళల్లో ఎవరయింది మార్క్ చేస్తే చాలు. రేపీపాటికి స్మశాన వాటిక లో ఆరడుగుల స్థలం రిజర్వ్ అయిపోతుంది. ..." గోవిందరాజులు కసిగా అంటుండగా నందకిషోర్ ఆ ఫైల్ లో జే.కే. బోర్డ్ షీట్స్ మీద అతికించి వుయ్న్న పోతావుల్ని తిరగవేసి ఫైల్ ని ప్రక్కన పెట్టేసాడు.

    నందకిషోర్  ఏ పోటో మీద కూడా మార్క్ పెట్టకపోవటంతో గోవిందరాజులు ఆశ్చర్యపోయాడు.

    "ఈసారి మనం వేయవలసింది మామూలు ఎత్తు కాదు..... కానుక ఈ ఫైల్ లోని ఎవర్ని మార్క్ చేయనక్కర్లేదు."

    "మరి?"

    "ఇంతవరకు మన ఫైల్ లోకి ఎక్కని .. ఎక్కే అవకాశం ఎంత మాత్రం లేని వ్యక్తి పోటోకే మార్క్ పెట్టాలి... ఈసారి హత్య నువ్వు నీ మనుష్యులు చేయటం లేదు చేయిస్తున్నావు ..."

    "ఎవరితో ....?!"

    "బొంబాయి వెళ్ళి నువ్వే దాన్ని డిసైడ్ చేసుకురావాలి......"

    గోవిందరాజులు కొత్తగా మట్లాడుతున్న నందకిషోర్ చూసి విస్తుపోయాడు. ఆపైన అసంస్త్రుప్తిగా చూసాడు ... అసహాన్మ్గా సీట్లో కదిలాడు .

                                *    *    *    *   

    నాలుగు రోజులకి రిషి సి.బి.సి.డి. క్రైమ్స్ విభాగంలో ఎస్. ఐ. గా జాయినయ్యాడు.

    అవంతి రిషి గుట్టల బేగం పేటలో వున్న డి.ఐ.జి. చూడప్ప ఇంట్లో మకాం చేసారు.

    "నేను ఖాళీగా వుండటం నాకు బాధగా ఉందకుంల్. రిషికి చెప్పి నేను చేస్తున్నాదేమిటనే గుంజాటన మొదలయింది ఏదో ఒక హస్పిటల్ లో జాయినయిపోవాలి " అని అంటున్న అవంతి వేపు చూడప్ప నవ్వుతూ చూసాడు.

    "ఖాళీగా  ఎక్కాడున్నవంమా మన ఇంట్లోని ఒక పేషెంట్ వుంది. అదే .... మా మనవరాలు ... ఇకపోతే నీకు జాబ్ రావటందేముంది ....! ఎక్ద్దయినా , ఎప్పుడయినా వస్తుంది. జాబ్ చేయాలనీ వుందా? సొంతగా క్లినిక్ పెట్టుకోవాలనుందా...?" అయన కన్న తండ్రిలా తనను చూస్తున్న ప్పటి నుంచి అవమ్తికి దుఃఖ భాజకమైన భావన అలలా వచ్చి హృదయాన్ని తాకివెళ్తోంది.

    "నీ మనస్తత్వానికి ఒక క్లినిక్ పెట్టుకుని ఇండిపెండెంట్ గా నిర్వహించుకోవటమే బావుంటుంది. నీ కిష్టమయితే చెప్పమ్మా ... అన్ని ఏర్పాట్లు చేస్తాను "

    చూడప్ప ప్రపోజల్ అవంతికి బాగా నచ్చింది.

    కాని క్లినిక్ అంటే డబ్బు కావాలి.

    తను కూడబెట్టుకున్న డబ్బులో ఐదువేళే మిగిలాయి వాటితో క్లినిక్ ఏర్పాటు చేసుకోవటం సాధ్యమావుతుమ్డా అనే మీమాసంతో ఆమె ఊగిస లాడుతోంది. దాన్ని చూడప్ప మేసేస్ గ్రహించగలిగి౦ది.

    "సందేహి౦చకమ్మా ... మా ఇళ్ళు నీ ఇళ్ళు కదా....? ఇంటి ముందున్న కారు గ్యారేజ్ లో క్లినిక్ పెట్టుకునెందుకు లక్షలు అవసరం లేదుగా ...? క్లినిక్ కి అవసరమయ్యే వైద్య పరికరాలు పదివేలు పెడితే చాలు...." ఆమె       తలను నిమురుతూ అంటుంటే అవంతికి తన తల్లి గుర్తుకొచ్చి కళ్ళు చెమర్చాయి.

    "అడగటం మర్చాను __ మీ అమ్మ , నాన్న ఎవరు ? ఎక్కడున్నారు ?" అప్పుడే లోపల్నుంచి వచ్చిన చూడప్ప కూతురు ప్రేమగా అడిగింది.

    అవంతి మరింతగా తల వంచుకుంది.

    "వద్దులేమ్మ వారి జ్ఞాపకాలు నిన్ను బాధిస్తే క్షమించమ్మ. ఒక అక్కలా అడిగానంతే, మా అమ్మ. నానా నీకు మాత్రం అమ్మ, నానా కారా? రేపే నీ క్లీనిక్ ఓపెన్ చేస్తున్నాం ..." అని అవంతి  మీద నుంచి తన దృష్టిని తండ్రి మీదకు మరల్చి "అవంతి అవసరమైన పరికరాలు రాసిస్తుంది తెప్పించండి నాన్నగారు " అంది చూడప్ప కూతురు.

    "అలాగేనమ్మ ... నాకు టైమవుతోంది. అవమ్తిని కనుక్కొని పోన చేసి నాకు చెబితే సాయంత్రమే నేను వచ్చేటప్పుడు తీసుకొస్తాను ..." అంటూ చూడప్ప కారు కేసి సాగిపోయాడు.

    రిషి ఉదయమే ఆఫీసు కెళ్ళిపోయాడు.

    కావాలనే రిషిని టాస్ సీక్రెట్ సెక్షన్ లో ఎస్. ఐ గా పంపించాడు.

    పైగా రిషి నిజాయితీ, హార్డ్ వర్క్, క్రమశిక్షణ , ఇంటిలిజేంస్ చూడప్పకి బాగా నచ్చాయి.

    నిజానికి డి.ఐ.జి కేటర్ ఉన్నతాధికారి ఎదుట నిలబడే ధైర్యం అవకాశం మామూలు ఎస్. ఐ కి వుండవు.

    అవంతికి రిషి మీద వున్న ప్రేమని చూసే, చూడప్ప రిషిని అంత దగ్గరకి తీసుకున్నాడు చిన్న చిన్న దిమ్గాతనాలు, వీధి రౌడీల పోరాటాల గురించి పరిశోధించటం పెద్ద అవకాశం కాదు. హైలెవెల్ లో , పొలిటికల్ ఇండస్ట్రీయల్ స్టాల్ వార్డ్స్ అదే డ్రామాలని టేకఫ్ చేయటం క్రైమ్ బ్రాంచ్ అధికారులకు ప్రివిలేజ్ .

    మంచి కేసు ఒకటి త్వరలోనే అప్పగిస్తాను ... ప్రస్తుతానికి ప్రొసీజర్స్, నేర పరిశోధన పద్ధతుల్ని, ప్రపంచస్థాయి కేసుల్ని స్టడీ చేయమని చూడప్ప చెప్పటంతో రిషి తన దృష్టిని పూర్తిగా వాటి మీద కేంద్రీకరించాడు.

    అతి ప్రమాదకరమైన గోవిందరాజులు తను వెళుతున్న దోవలో తనకు అభిముఖంగా వస్తున్నట్లు రిశికిగాని, చూడప్పకి గాని తెలిసే అవకాశం లేదు.

                                                              *    *    *    *   

    "సార్ ... మత కలహాలు పెచ్చుమీరి పోతున్నాయి __ శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపొయాయి. అమాయకులు బలై పోతున్నారు. మీ దృష్టిని అటువేపు " చీఫ్ సెక్రటరీ మాటలు పూర్తీకాకుండానే కసురుకున్నాడు నందకిషోర్.

    "అవన్నీ నా పదవిని దక్కించుకోవటం కన్నా గొప్పవా? ఒళ్ళు కాలి ఒకడు ఏడుస్తుంటే , చుట్ట అంటించుకొనేందుకు నిప్పు అడిగాడట మరొకడు __ చావనివ్వయ్యా బాబు ... చావనియ్యి ... జనాభా ఎక్కువయి పోతోంది. బ్రహ్మగారి కాల జ్ఞానం చదివావా?"

    ఎక్కడో నార్తి౦డియా నుంచి వచ్చిన చీఫ్ సెక్రటరీ యేగేంద్రసిన్హా కి బ్రహ్మగారి గురించి, అయన వ్రాసిన కాలజ్ఞానం గురించి తెలిసే అవకాశం ఎక్కడిది ...? అందుకే అయన బ్రహ్మ౦గారెవరో తెలీక విస్తుపోయాడు.

 Previous Page Next Page