Previous Page Next Page 
కాలనాగు పేజి 9

 

    ఇటు ఒక బలమైన ప్రాణి!విషపూరితంగా చూసే నరరూప సర్పం! ఈ కాటుకి మందు లేదు! ఈ విషానికి విరుగుడు లేదు.

    సంధ్య భయం రెట్టింపైంది అప్పుడు

    'హాలో! ఏమిటిలా చీకట్లో వున్నావు?'

    ఆమె జవాబివ్వలేదు   

    'షికార్లు పూర్తయ్యాయా?'   

    ఆ కంఠంలో హేళన !అనుమానం!అధికారం

    "ఎవరు వాడు?"

    "ఎరైతే నీకేం?" తిరస్కారంగా జవాబిచ్చింది. అంత భయంలో అంత ఆందోళనలో, ప్రాణాలు పోతాయే మో ననుకునే ఆ విపత్కర పరిస్థితుల్లో కూడా నాగరాజు' ఆదిత్యని కించపరచటం ఆమె సహించలేక పోయింది.

    'సంధ్యా! నాకు కాకపోతే యింకెవరిక్కావాలి నీ గొడవ,

    నువ్వు నా మనిషిని! నేను నీ మనిషిని! మనం పెళ్ళిచేసుకుకోవాలి

    బుస్ మన్న శబ్దం. ఎదో మహా సర్పం కసిగా శిలాఖండాన్ని కాటువేసినంత శబ్దం.

    'ష్!'అన్నాడు నాగరాజు

    ఆ శబ్డం ఆగిపోయింది. ఏదో జరజర పాకుతున్న చప్పుడు

    'అటుచూడు రాజూ!'

    'ఎటు?'

    'ఆ వైపు!'వేలు చూపించింది.

    ఏముందక్కడ?ఎదీ లేదు! అంతా శూన్యం !చీకటి !ఏదీ కనిపించటం లేదు. అదే అన్నాడు 'ఏముందక్కడ?'

    'పా...పాము....పా  ము....లు'

    ఫక్కున నవ్వేడు నాగరాజు_'అక్కడా? పాములా? ఏవీ? కనవడవేం?' అన్నాడు జోక్ వేసినట్టుగా.

    'అవిగో_అక్కడే_రెండూ పెనవేసుకుని మసకలాడుతున్నాయి. నిన్నూ నన్నూ మహా కసిగా చూస్తున్నాయి_' అదో ధోరణిలో అంది సంధ్య ఆమె కంటికి ఏవో దృశ్యాలు కనిపిస్తున్నట్టుగా అంది.

    ఆ మాటలు నాగరాజుకి మరో అర్ధాన్నిచ్చాయి. అతనేదో ఊహించుకున్నాడు. మనస్సులో ఆనందం కట్టలు తెంచుకుంది.

    చప్పున ఆమె చేయి అందుకున్నాడు.

    అంత భయంతో_అంత ఆలోచనలో కూడా సంధ్య ఎలర్టుగా వుంది.

    అందుకే అతను చేతిని పట్టుకోగానే చప్పున తన చేతిని లాక్కుని 'ఇడియట్?బిహేవ్ వెల్?' అంటు చెంప చేళ్ళు మనిపించింది.

    నాగరాజు నిర్ఘాంతపోయాడు

    సంధ్య కుబుసం విడిచిన పాములా వెళ్ళింది సరసరమంటూ ఆమె కొత్త చీర  అదో వింత శబ్దం చేసింది

    అప్పుడు వినిపించిదతనికి 'వెధవ సన్యాసి' అన్నమాట
   
    చప్పున తల తిప్పాడు

    వీధి గడపలో విశాలాక్షి.

    ఆమె కన్నులు నిప్పులు చెరుగుతున్నాయి.

                                             8

    ఆ రాత్రంతా మగతలో వున్నాడు ధర్మరాజు

    అరుంధతి కంటికి వత్తులు వేసుకున్నట్టుగా మేలుకుంది. ఆమెతో పాటే ఆదిత్య కూడా మేలుకున్నాడు.

    సరిగ్గా రేడియోలో వార్తలు ముగిసే సమయానికి ధర్మరాజుకి మెలుకువ వచ్చింది. మంచంపై అటూయిటూ అసహనంగా కదిలాడు.

    కళ్ళు తెరిచాడు.మసక మసకగా కనిపించింది అంతా 'అరూ!' ఎన్ని సంవత్సరాలుగానో అలవాటైన మార్దవంతో పిలిచాడు భార్యని.

    ఆయన కదలిక చూసి సంతోషించిన అరుంధతికి, యిప్పుడు ఆయన తనని మామూలుగా పిలవటం ఎంతో ఆనందాన్నికల్గించింది. చప్పున ఆయన ఛాతిపై చేయివేసి 'ఏమండీ!' అంది.

    ఆ చేతిని అలాగే పోదువుకున్నారాయన. 'అరూ!' అన్నారు. బాధగా! నాకు అంతా మసక మసగ్గా కనిపిస్తోంది అబ్బాయి ఎక్కడ!' అన్నారు.

    గుండె జల్లుమంది ఆమెకి'ఏమండీ,' అంది అదుర్గాగా'మీకు.. మీకు..నేను కనిపించటం లేదా?' అని అడిగింది

    'నాన్నా!' ఆదిత్య తండ్రి చేతిని స్పృశిస్తూ పిలిచాడు.

    'బాబూ!' పిలుపు వినిపించిన వైపు చూపు మరల్చాడు. మంచు తెరల మధ్య, మసక వెలుతురులో బింబం కనిపించినట్టు ఒక మూర్తి కనిపించింది. అంతేకాని ఆ మూర్తికి రూపుకట్టి అది 'ఆదిత్య'లాగా కనిపించలేదు.

    ఆయని కళ్ళల్లో నీళ్ళు నిండాయి.

    'ఎలా వుంది నాన్నా!'

    'నా కిప్పుదేం పర్లేదు బాబూ! అప్పుడేదో పీల్చాను. ఆ ఘాటుకి స్పృహ తప్పాను స్మృతి కోల్పోతున్న సంగతి తెలుస్తూనే వుంది. కానీ యిప్పుడు అంతా మసక మసగ్గా వుంది. ఏదీ స్పష్టంగా కన్పిచటం లేదు. మీ అమ్మ... నువ్వు...పై కప్పు...గోడలు.... అన్నీ అంతే! అవును నేను ఓ గంటయినా స్పృహ తప్పేనా?'

    'నాన్నా!' మీరు రాత్రంతా స్పృహలోలేరు, ఇపుడే మెళుకువలోకి వచ్చారు' అన్నాడు ఆదిత్య.

    'రాత్రంతానా?ఇప్పుడు టైమెంత?'

    'ఏడున్నర కావస్తోంది!'

    'పన్నెండ గంటలకి పైన్నే నన్నమాట!'

    'ముఖం కడుక్కోండి! కాఫీ తెస్తాను. డాక్టర్ గారు వస్తారు!' అంది అరుంధతి. ఆమెకి అంతా గాబరాగా వుంది. "ఎందుకిలా జంగిరిది ఆయనకి స్పృహ ఎందుకు పోయింది? తెలివిలోకి వచ్చాక చూపు కనిపించకపోవటం ఏమిటి?

    ఎందుకిలా జరిగింది?

    అసలు ఫోన్ చేసిందెవరు?

    "ఫోన్లో ఏమ్మాటాడేరు?" లేచి వెళ్ళిందామె

    ఆదిత్య తండ్రిని కూర్చోపెట్టాడు. మెల్లగా మంచం దిగారాయన బాత్ రూందాకా తీసుకెళ్ళేడు ఆదిత్య, ఆయన కాలకృత్యాలు తీర్చుకోగానే పేస్ట్ వేసి బ్రష్ అందించాడు. బేసిన్ లో ముఖం కడుక్కుని ఇవతల వచ్చారు. అంతా మసక మసగ్గా కనిపిస్తొంది.

    వేడివేడి కాఫీ తెచ్చింది అరుంధతి.

 Previous Page Next Page