సిగరెట్ వాసన కొడుతూ వుంటే భర్తతో ఎలా మాట్లాడటం? ఆ భర్తని ఎలా ప్రేమించడం! ఛా! ఛా! అలాంటి భర్తని శిక్షించయినా మార్చెయ్యాలి. మార్చాలిఅది వాళ్ళ ధ్యేయం.
అలా అని ప్రతిజ్ఞలు కూడా చేశారు. ఒకరి కొకరు వాగ్దానం చేసుకున్నారు.
మీ పెళ్ళి రోజున మీరు కాఫీ బాగా నాల్గాయిదు సార్లు త్రాగటం, ఓ రెండు పేకెట్ లు సిగరెట్లు కాల్చటం చూసి యిద్దరూ విస్తుపోయారు. నిస్పృహ నవ్వేసి అలాంటి భర్తని మార్చితే గొప్ప కాని, ఏ దుర్గుణము లేని భర్త దొరికితే ఏమంత సంతోషం అంది అక్క.
అసలు ముందుగా మీకీ అలవాట్లున్నట్టు తెలిస్తే, ఈ పెళ్ళే చేసుకోవద్దని హెచ్చరించింది ఆ వనజ! కానీ మా అక్క మిమ్మల్ని చూసి అవన్నీ తాత్కాలికంగా మరిచిపోయి ఒప్పేసుకుంది.
వంజ తిరిగి ఆ రోజు మళ్ళీ హెచ్చరించడంతో ఓ ప్రతిజ్ఞ చేసింది. పంతం పట్టింది. ఎలాగైనా మీ చేత కాఫీ, సిగరెట్స్ మన్పిస్తానంది. అలా మన్పించలేని స్థితిలో కాపురానికి నీళ్ళు వదులుకుని వచ్చేస్తానంది. ఓ రెండేళ్ళు టైమ్ అడిగింది. బెట్టుగా వనజ ఒప్పుకునే వేళ మాధవ్ అక్క కళ్ళల్లో నీళ్ళు చిమ్మటం చూశాను నేను. కానీ జోక్యం కల్పించుకోలేదు. వాళ్ళ మూర్ఖత్వానికి భయపడ్డాను.
నాన్నగారికి తెలిస్తే ఏమవుతుందోఅని ఎప్పుడూ భయపడేదాన్న. అక్కకి అలాంటి విషమ పరిస్థితి రాకూడదని కోరుకునేదాన్ని.
ఎలాగైతేనేం అన్నీ సరిపోయాయి. మా అక్క తన పంతం చెల్లించుకుంది చివరికి.
ఇది బావా కధ!
చెప్పటం ముగించి నిట్టూర్చింది సరోజ.
అదంతా విని నిరిణుడయ్యాడు మాధవ్.
మళ్ళీ అంది సరోజ "కానీ నాకు యిది ఏమాత్రం సరిపోదు బావా? సొసైటీలో తిరిగేవారు మీరు, అలాంటి మీకు యిలా బంధాలు వేయకూడదు బావా!"
ఒక్కసారిగా అత్యున్నత శిఖరాగ్రాన్నుండి జారీ పాతాళానికి జరిపోయినట్టుగా వుందతనికి.
అయిదారు నిమిషాలు సందిగ్ధంలో పడ్డాడు.
తర్వాత తేరుకుని అనొద్దు! "అలా అనొద్దు సరోజా! భార్యా భర్తలు ఒకరిని ఒకరు అర్ధం చేసుకుని, ఒకరు సహింపనివి మరొకరు మానుకుని యిష్టం అయినవి అలవర్చుకోవాలి, దీని వెనుక యింత కధ వున్నా, మరెంత కధ వున్నా నాకేమి బాధలేదు. మీ అక్క కోర్కె తీర్చటం మాత్రం మంచిది కాదా? ఆవిడయినా నా శ్రేయస్సుని, నా ఆరోగ్యాన్ని దృష్టిలో వుంచుకునే యిలా చేసింది కదా? మార్గాలు ఏవైనా ధ్యేయం ఒకటే అయినపుడు ఫలితం మంచిదయినపుడు మనం ఒప్పుకోవాలి సరోజా!"
అపారమయిన భక్తి ప్రవత్తులతో గౌరవ పూర్వకంగా అంది సరోజ "మీరు దైవ స్వరూపులు బావా! వీళ్ళ పంతాలు తెలుసుకున్న నేను ఎప్పుడూ దేవుడిని ప్రార్ధించేదాన్ని-- వెంకటేశ్వరా! ఎలాగైనా మా అక్క బుద్ది మార్చు, లేదా మా అక్కకి సరిపోయే భర్తని ప్రసాదించు, ఆమె అభిష్టాలకి వ్యతిరేకంగా నడిచే వారిని ప్రసాదించకు, జత కూర్చకు, మా అక్క మూర్ఖత్వం పోగొట్టు--అని"
మాధవ్ నవ్వి ప్రేమగా అన్నాడు.
"పోనిలే సరోజా! ఆ వెంకటేశ్వరుడే నీ ప్రార్ధనని మన్నించాడనుకుందాము. అందుకే యిలా అయిందనుకో"
పేలవంగా నవటం తప్ప అతని మాటలకి జవాబు యివలేదు సరోజ.
మరో అయిదునిమిషాల తర్వాత మెల్లగా లేచి వెళ్ళి పోయింది. "మళ్ళీ వస్తా" నంటూ
ఒంటరిగా వున్న అతన్లో ఆలోచనలు అనేక విధాలుగా సుళ్ళు తిరగసాగాయి.
'మాస నామం, నక్షత్ర నామం నిర్ణయించాం. ఇహ మీ యిష్టం వచ్చిన వ్యవహారనామం నిర్ణయించుకొండి" కార్యక్రమాన్ని పూర్తిచేసి అన్నాడు పురోహితుడు సుందర్రామయ్య సాభిప్రాయంగా మాధవరావువేపు చూస్తూ.
వ్రేలి నున్న ఉంగరం తీసి పళ్ళెం తీసుకుని బియ్యంలో పేరు వ్రాయబోతున్నమాధవ్ ని ప్రశ్నించింది శ్రీదేవి మెల్లిగా "ఏం ప్రేరు వ్రాయబోతున్నారు?" అని.
"మా నాన్నగారి పేరు" వినిపించి వినిపించనట్టుగా జవాబిచ్చాడు.
అతని ముఖంలోకి సూటిగా చూసి అంది "ఆ పేరు నాకిష్టం లేదు"
"ఎందుకు?"
"ఈ రోజుల్లో యింకా ఆ పాత పేర్లు ఎవరు పెట్టుకుంటున్నారండి! ఏదో మీకు తోచిన పేరే ఫేషన్ బుల్ గా వున్నది చూసి వ్రాసెయ్యండి."
"అది నాకిష్టంలేదు"
"కానీ మీ నాన్నగారి పేరు పెట్టడం యిక్కడేవరికి యిష్టం లేదు. అది కూడా గ్రహించండి."
రాబోతున్న కోపాన్ని నిగ్రహించుకుంటు అన్నాడు "సరే ఇంకేం. ఇక్కడ నేను నాకొడుక్కి నా యిష్టం వచ్చిన పేరు పెట్టుకునే స్వతంత్రం కూడా లేదన్నమాట. అదే కాదూ నీ ఉద్దేశం?"
"అలా ఎందుకనుకోవాలి. మీ యిష్టం వచ్చిన పేరే పెట్టండి. ఆ రోజులకి తగ్గట్టు- కానీ మీ నాన్నగారి పేరు మాత్రం వద్దు- అంతే!"
"అంతే అని ఎంత తేలిగ్గా అనేశావు శ్రీదూ! మనిషి యిష్టానిష్టాలని కూడా పాలించాలనుకోవటంయీ నాటి ఫేషన్ అయింది కదూ?"
"సరే ఇహ మీ యిష్టం"
"ఏమిటి బాబూ ఆలోచిస్తున్నారు?" చిన్నగా మాట్లాడుకుంటున్న వారిని ప్రశ్నించేడు సుందర్రామయ్య కంగారుగా అన్నాడు మాధవ్ అలా హటాత్తుగా ప్రశ్నించటంతో "ఎమిలేదండి" అని.
"మరి కానివండి బాబు. మళ్ళీ పొద్దు పోతుంది. అనవసరంగా" అతని వ్యావృతి అతనిది.
సాభిప్రాయంగా శ్రీదేవి వైపు చూసేడు మాధవ్.
కానివు మాధవ్ మికిష్టమయిన పేరే వ్రాయండి. అన్నాడు మామగారు మాధవ్ ని చూస్తూ.
"చెప్పామ్మా" అంది - అతని అత్తగారు.
"రవి కుమార్ అని వ్రాయండి." మాధవ్ వేపు చూస్తూ అంది శ్రీదేవి.
ఓ క్షణం మామగారిని అత్తగారిని, భార్యని పరికించి ఇప్పుడు నలుగుర్లో అవమానంపాలవటం కన్న యిదే మంచిదనుకుని మౌనంగా వ్రాశాడాపేరుని.
తర్వాత తతంగమంతా అయింది.
నామకరణ కార్యక్రమాన్ని ముగించుకుని బాబుని ఎత్తుకు వెళ్ళిన అక్కగారి వెంటే వెళ్ళి గదిలో ప్రవేశిస్తూనే అంది సరోజ "నీ ప్రవర్తనేంబావులేదక్క!"
చురుక్కుమని వెనక్కి తిరిగి చూసి అంది. శ్రీదేవి "ఏమిటి