"మిస్టర్ చక్రపాణి." ఈతఫా లైటు ఆరిపోయి వెలగంగానే దానితో పాటు వెనుకనుంచి పిలుపు వినిపించింది.
కుర్చిలోంచిటక్కున లేచి గిరుక్కున వెనుతిరిగాడు చక్రపాణి.
ముందుకొద్ది ఉలికిపాటు ఆ తర్వాత ఆశ్చర్యం అతని ముఖంలోకాదు మనసులో చోటు చేసుకున్నాయి. అతని పిలుపుకి "ఊ" అనిమాత్రం అన్నాడు.
వచ్చినతను వేసుకున్న డ్రస్ సగం నలుపు సగం తెలుపులో వుండి వంటికి పట్టేసినట్ట్లున్న ఫాంటు ఫుల్ చేతుల బనీను ధరించాడు. అందులో పెద్ద వింత లేకపోయినా ముఖం తలా పూర్తిగా కప్పేస్తూ గుర్రం ముఖం తగిలించుకున్నాడు. అది పిల్లలు తగిలించుకునే ఆటబొమ్మలాకాక నిజం గుర్రం ముఖాన్ని తెచ్చి అతికించినట్లువుంది. మనిషి గుర్రం తలకయతో పుట్టినట్లుగా వుందంటే చక్కగా మాట సరిపోతుంది. అలా పుట్టలేదు కాబట్టి ముఖం ఆనవాలు తెలియకుండా గుర్రం తొడుగు ధరించాడు అనుకోవాలి. అపరతుంబురుడు.
"మిస్టర్ చక్రపాణి! ఈ క్షణంనుంచి మీ పేరు మిస్టర్ ఎక్స్ ఎవరన్నా మి పేరు అడిగితే మిస్టర్ ఎక్స్ అని చెప్పాలి. అంతేకాదు ఎట్టి పరిస్టితులలో మీ అసలు పేరు బైట పెట్టకూడదు. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు యివి." అంటూ జాగ్రత్తలు వివరించి "మనం కొద్దిసేపటిలో వింతలోకంలో పార్టికి వెళ్ళబోతున్నాము. మీరు రేడియే కదా?" ఆ వ్యక్తీ స్టిరంగాను గాంభీర్యంగాను మర్యాదగాను కలిసి మాట్లాడాడు.
చక్రపాణి మర్యాదగా తాల వుపాడు.
అతను మాట్లాడేటప్పుడు ఓ రకమైన లిఫ్ట్ లాంటి ఆ గది కదిలి మరింతకిందకి వెళ్ళింది. కదలిక తెలియకపోవటం వల్ల చక్రపాణి ఆ విషయం కనిపెట్టలేదు.
"మిస్టర్ ఎక్స్! నాతో రండి" అంటూ గుర్రంతల వ్యక్తీ అతడి చేయ్యిపట్టుకున్నాడు.
మరొక్కసారి చమక్ మని లైటు ఆరిపోయి వెలిగింది.
లైటు వెలిగేసరికి ఎదురుగా దారి ఏర్పడింది.
మౌనంగా అతను చక్రపాణితో సహా ఆ గదిలోంచి కాలు బైట పెట్టాడు. అక్కడంతా గాడాంధకారం అతను చక్రపాణి చెయ్యిపట్టుకుని నడిపించుకు వెళ్ళాడు చీకట్లోకి.
కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి అయినా వేగంగా ముందుకు నడుస్తున్నారు. దారిలో ఏ అడ్డము రాలేదు. మలుపులు తిరగలేదు కాబట్టి ఇది పొడవాటి నడవా (వరండా) కవచ్చుననుకున్నాడు చక్రపాణి. తన అమోఘమైన తెలివి తేటలతో ఎ బి దాటి సి పోస్ట్ దాకా రాగలిగిన అతను సి పోస్ట్ చేరక ముందే పప్పులో కాలేశాడు. తనూ అతను నడవటంలేదని......ఎస్క్ లేటర్ లాంటి మిషన్ మీదవున్నామని దానిమీదనే వున్నమనిను....ఎస్క్ లెటర్ వల్ల నడిచి వెళ్లినట్టు భ్రమ అనీను.
అది అద్దం కాదు తలుపు. చేయి వేయంగానే తెరుచుకుంది. ఇరువురు పక్కగదిలో ప్రవేశించారు. అద్దం తలుపు అటోమేటిక్ గ మూసుకుంది. ఈ గదిలోంచి అద్దాల గదిలోకి దారివుంది అని తెలియని విధంగా గోడకి డిజైన్ వుంది. అలా డిజైన్ గదంతావుంది.