Previous Page Next Page 
మిస్టర్ క్లీన్ పేజి 8

 

    దాదాపు రెండు రెండున్నర గంటల నిరీక్షణ తర్వాత గాని సినిమా వదలరు, ఈ లోపల గౌతమ్ అలా ఎటైనా వెళ్ళి తిరిగి రావచ్చు. గౌతం ఆ పని చెయ్యలేదు. వీధి చివర కిళ్ళి బడ్డి పక్కనే అరుగు వుంటే అ అరుగెక్కి వాచి చూస్తూ కూర్చున్నాడు. మాటి మాటికి చేతికున్న డొక్కు వాచీలో టైం చూసుకుంటున్నాడు.

 

    ముప్పావుగంట తర్వాత


    
    ఆ సందులోంచి అంటే సినిమా హలులోంచి కొందరు బయటికి వచ్చి ఎవరి దోవన వారు వెళ్ళటం మొదలుపెట్టారు. ఒకరి మొహాలు ఒకరు చూసుకోవటం లేదు  మాట్లాడుకోవటం లేదు. ఎవరి దోవన వారు ఏదో పని మీద  వెళ్ళే వారిలాగా వెళ్ళిపోతున్నారు.

 

    వాళ్ళని లెక్కపెట్టాడు. మొత్తం ఇరవై నాలుగు మంది. ఇరవై నాలుగు మంది తర్వాత ఎవరు రాలేదు.

 

    ఉత్త ఇరవై నాలుగు మందితో హాలు నిండుతుందా నిండదు.

 

    ఏదో పెద్ద కదే వుంది.

 

    అది తెలుసుకోవాలంటే ఇక్కడ మాటువేసి కూర్చోవటం కాదు అనుకున్న గౌతం లేచి వరదరాజులు వెనుక దూర దూరంగా అనుసరిస్తూ బయలుదేరాడు

 

    గౌతం తన వెనకాలే వస్తున్నాడని తెలియని వరదరాజులు తన దారినతాను పోతున్నాడు.

 

    గౌతం జీవితంలో గొప్ప మలుపు తిరగానుందని ఆ క్షణాన అతనికే కాదు ఎవరికి తెలియదు.


    
    ఆ మలుపు వైతరిణి నదిఈదడం లాంటిది.

 

                                          4

 

    లైట్స్ ఆరిపోయాయి వెలిగాయి.


    
    అది అక్కడ గ్రీన్ సిగ్నల్ కి గుర్తు.

 

    చక్రపాణి ఆ రూంలో ఒక్కడే వున్నాడు. రూంకి తలుపులు ఎటు వున్నా యన్నది అతనికి తెలియదు. చమక్ మని లైటు ఆరిపోయి వెలగటం అతని ఎదుట ఓ  వ్యక్తి ప్రత్యక్షమైనట్లు వచ్చి నిలబడటం జరిగింది.

 

    "నీవు జి డబ్ల్యూలో ప్రవేశించి మైల్లాద్ ప్రశంసలు పొందావు. చాలా సంతోషం నీకు యిహ పై సి పోస్ట్ యివ్వబడింది. సి పోస్టులో డ్యూటీ మరింత కఠినతరంగా వుంటుంది. అయినా నీ తెలివితేటలతో సి లో కూడా మెప్పు పోంది మరింత పైకి పోవడానికి కృషి చెయ్యి. నీకు ప్రమోషన్ వచ్చిన శుభ సందర్భంలో స్పెషల్ విందులో పాల్గునే అవకాశం లభించింది. విందు పూర్తి అయిన తర్వాత మళ్ళి కల్సుకుందాం విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్." వచ్చిన వ్యక్తీ అన్నాడు.


    "థాంక్స్ చెపుదామని చక్రపాణి నోరు తెరిచాడు. అతని పెదవి దాటి మాట బయటికి రాకముందే చమక్ మంటూ లైటు ఆరిపోయి వెలిగింది కళ్ళ ఎదుట నున్న ఆ వ్యక్తీ మాయం అయిపోయాడు.

 

    "కూవ్..కూవ్.....కువ్"

 

    శబ్ధం వినంగానే "తను మూడు నిముషాలు అగాలన్న మాట" అనుకున్నాడు చక్రపాణి. నలువైపులా ఒక్కసారి మాత్రమే చూసి వురుకున్నాడు. ఈ చిన్న రూంలో ఎవరూ లేరుకదా అని చక్రపాణి పరిశోధనలోకి దిగలేదు. అది ఎంత ప్రమాదమో అతనికి బాగా తెలుసు.

 

    ఆ రూముకి తలుపులు కిటికీలు లేవు. అయినా గాలి వెలుతురు వుంది. తలుపులు లేకుండా ఎవరూ రూములో ప్రవేశించలేరు. అయితే అవి గోడకి ఎటు వేపున వున్నాయా అన్నది తెలుసుకోవటం చాలా కష్టం. కింద పైన పక్కలా ఎటూ చూసినా లైటు గ్రీన్ కలర్. అ కలర్ పై పెసర గింజంత మొదలు అరచేయి అంత వెడల్పు వరకు ముదురు గ్రీన్ గ్రుం డం టి చుక్కలు అంతటా వున్నాయి. ఎటు చూసినా ఒకే రకం.

 

    మరొకరైతే లేచి వెళ్ళి గోడలని తడిమి పరిశోధనకి దిగేవాళ్ళే. చక్రపాణివి ఎక్సరే కళ్ళు. తన ముఖంలో భావాలు కనపడకుండా కూర్చున్న చోటునుంచి కదలకుండా అన్ని కనిపెట్టగలడు. అందువల్లనే అతి తేలికగా సి పోస్టుదాకా వెళ్ళగలిగాడు. లైటు వెలిగి అరి వెలిగి ఆ మధ్యలో ఓ వ్యక్తీ ప్రత్యక్షమైనట్లు తన ముందుకివచ్చి నిలిచాడు గాబట్టి చుక్కలవల్ల తెలియడం లేదుగాని ఎదుటి గోడకే తలుపులువుండి వుంటాయి ఆటే వచ్చివుంటాడు అనుకున్నాడు.

 Previous Page Next Page