Previous Page Next Page 
మిస్టర్ క్లీన్ పేజి 10


    అక్కడున్న ఏ గదులకి తలుపులు కిటికిలువున్న ఆనవాళ్ళు లేవు. గాలి వెలుతురు ధారాళంగా వుంది. కొత్త వాళ్ళు ఆ గదుల్లో ప్రవేశిస్తే గోడల్ని తడిమినా తట్టినా దారి ఏర్పడదు దారి ఏర్పడాలంటే చాలా చిన్న ట్రిక్ ఉపయోగిస్తే చాలు. చాలా చిన్న ట్రిక్ కాబట్టే సముద్రంలో జారిన సుదిన వెతికినంతకష్టం.

 

    అంతటా డిజైన్ లువున్న ఈ గదిలో పలురకాల జంతువుల తలకాయల తాలూకా తొడుగు ఆకారాలు వున్నాయి. సగం నలుపు సగం తెలుపుగల డ్రెస్ లు అన్ని సైజుల వాళ్ళకి సరిపోను వున్నాయి.

 

    "మిస్టర్ ఎక్స్! ఏ జంతువు మీకు బాగాయిష్టం!" అతను అడిగాడు.

 

    "మనజాతీయ జంతువు పులి" చక్రపాణి చెప్పాడు కించిత్ గర్వంగా.

 

    ఇక్కడే మొదటిసారిగా అతను రాంగ్ స్టెప్ వేశాడు. "పులి" అని ఒక్కమాటతో చెబితే పోయేదానికి మన జాతీయ జంతువు అన్న మాట పులికిముందు చేర్చటం గాక గర్వంగా చెప్పాడు.

 

    పదినిమిషాల్లో.... చక్రపాణి సగం నలుపు సగం తెలుపు దుస్తులు ధరించి పులి తలకయలోకి మారిపోయాడు. పులితలకాయ తగిలించుకోవటంవల్ల బరువుగా వుండటంగాని మరే విధమైన యిబ్బందికలగలేదు.చూడగలుగుతున్నాడు. మాట్లాడగల్గుతున్నాడు. ముక్కు పని చేస్తునేవుంది.

 

    "మనం యిప్పుడు ఎక్కడికి వెళ్ళుతున్నాం?" అని చక్రపాణి అడగలేదు, చెప్పింది చేయటంతప్ప తిరిగి ప్రశ్నించకూడదు. అతనికి బాగా గుర్తుంది అ నిభందన.

 

    "స్వీట్ బ్రూటల్ పార్టీకి వెళుతున్నాం" గుర్రం తలకాయ తగిలించుకున్న అతను అన్నాడు.

 

    "ఊ" అన్నాడు చక్రపాణి.

 

    ఈ తఫా చమక్ మని లైటు ఆరిపోయింది. కని వెంటనే వెలగలేదు. సరిగా నిమిషం తర్వాత వెలిగింది. ఈ నిమిషమూ లిఫ్ట్ లాంటి దానిలో వెళుతున్నట్టు చక్రపాణి గుర్తించ గలిగాడు.

 

    మళ్ళి లైటు వెలిగేసరికి పార్టి జరిగే హోటల్లో ప్రవేశించారు వాళ్లిద్దరు.

 

    ఆ హాలుని చూసి బిత్తరపోయాడు చక్రపాణి.

 

                                                                       5

 

    "ఇప్పుడైనా నమ్ముతారా?" మహానంద అడిగింది.

 

    "ఇప్పుడే నమ్మాంకదా?" అంది శ్రీవిద్య.

 

    "పరిశోధన యిరవై ఒకటో తారికున రావటం అన్నది నా జన్మలో నేనెరగను." ధైర్య పుస్తకాన్ని ముద్దు పెట్టుకుంటూ అంది.

 

    "నీ జన్మ కాదు తల్లీ నా జన్మలో కూడా ఎరగను" మహానంద చెప్పింది చిరుమందహాసం చేస్తూ.
    "మరి ఈ వింత ఎలా జరిగింది?"

 

    శ్రీవిద్య అడగంగానే మహానంద ఓసారి కళ్ళు మూసుకుని తెరిచి "ఈ మాయా  ప్రపంచంలో కృషి చేస్తే చాలు ఏదైనా సాధించవచ్చు." అంది నర్మ గర్భంగా.

 

    "చాలు తల్లీ విషయంలోకి రా." అంది దైర్య.

 

    "సరిగా ముప్పై తారీకు లేక ఒకటో తారీకు గాని మార్కెట్లోకి రాని పరిశోధన క్రైం మాసపత్రిక పది రోజులు ముందుగా వచ్చింది మార్కెటులోకి కాదు మా యింటికి మిరే డిటేక్టివ్  అయితే" అన్న స్టొరీ పజిల్ లో ఈ నెల నేను ఒక్కదాన్నే విజేతను అయాను.

 

    మహానంద గర్వంగా చెపుతుంటే దైర్య శ్రీవిద్య కలిసి "హాయ్  హాయ్ నాయికి! నిన్ను విజయలక్ష్మి వరించిన ఈ శుభ సందర్భంలో హోటల్లో కడుపుకింత చూపుల్లో సినిమాకి మరికొంత ఆనందంగా తగలేస్తావని మనసా  వాచా కోరుతున్నాము. విజేతవి అయినందుకు అభినందిస్తున్నాం." అంటూ నంది మాగాదుల్లాగ (శ్రోత్రం) మొదలు పెట్టారు.

 

    "నూట పదహారు మీ కోసం సంతోషంగా తగలేస్తాను సరేనా?"

 

    మహానంద మాట పూర్తి చేయకముందే చెరో బుగ్గ ముద్దు పెట్టేసుకున్నారు.

 

    మీసు బుద్ది లేదు. చాలా పత్రికల్లో అంటుకున్న ఎయిడ్స్ వ్యాధి గురించి చదివి కూడా మళ్ళి యిప్పుడి పనేమిటి?" నవ్వుతూ అడిగింది మహానంద.

 

    పరిశోధన అనేది పూర్తి క్రైం మాసపత్రిక సీరియల్స్ కధలు కాక పజిల్స్ పాఠకుల పరిశోధన మీరే డిటెక్టివ్ అయితే! లాంటి మినీ స్టొరీకి మరో పేజీలు. మొత్తానికి మాసపత్రిక త్రిల్లింగ్ గా వుంటుంది.

 Previous Page Next Page