Previous Page Next Page 
మరో ప్రస్థానం పేజి 9


                                       కలగాపులగం

  

మా అమ్మ చచ్చిపోయిం
   దన్నా డొకడు
ఇవాళ నేను సమర్తాడే
  నన్న దొకతె
నా పలకపుల్ల పొయిం
   దన్నా డొకడు
ఇవాళే నేను పరీక్షలో ప్యాసయి
    నా నన్నా డొకడు
సీతాకోకచిలుక నయానంది
    గొంగళీ పురుగు
ఇవాళ నేను ఎళ్ళుండి అయా
   నంది నా వాచీ
కన్నీళ్ళు కడుపుతో వుండి
   కత్తుల్ని ప్రసవిస్తున్నాయి
ఇవాళ కత్తులన్నీ కడుపులో దించుకొని
   కన్నీళ్ళు ప్రసరిస్తున్నాయి

                                                                            రచన : 29 - 3 - 1973
                                                  ముద్రణ :స్వాతి వారపత్రిక - 12 సెప్టెంబర్, 1986

 Previous Page Next Page