"ఉంటుందుంటుంది. నీకా సబ్జెక్టంటే మక్కువ కదా!"
"అవును!" అన్నాడు అభిరాం.
"నువ్వీ జనరేషన్ లో పుట్టవలసినవాడివి కాదురా"
"నిజమే! ఏ వందేళ్ళో, రెండొందలేళ్ళో ముందు పుట్టున్నా బాగుండేది నేను."
"ఎందుకు?" ఆశ్చర్యంగా అడిగాడు మహదేవ్.
"నాకెంతో ఇష్టమైన మంత్రశక్తుల్ని నేర్చుకొని వుండేవాడిని" అన్నాడు.
"ఫూలిష్ గా మాట్లాడకు"
"ఏం? ఎందుకని?"
"అసలు మంత్రాలూ లేవూ, గింత్రాలూ లేవు"
"అని నువ్వెలా చెప్పగలవు?"
"పోనీ వున్నాయని నువ్వు చెప్పగలవా?" రెట్టిస్తూ అన్నాడు మహదేవ్.
"ఎస్" దృఢంగా అన్నాడు అభిరాం.
"ఎలా?" అడిగాడు మహదేవ్.
"మం... ఆనంది మంచికి సూచన త్ర... అనేది సర్వలోకాన్ని సూచిస్తుంది. మనదేశం ఎన్నో కళలకీ, సంస్కృతులకీ, శాస్త్రాలకీ పుట్టిల్లు. మనదేశంలో 'బాబా' అనగానే సాధువు జౌలియా, పంత్ ఫకీరు, బ్రహ్మచారి అనే ప్రత్యామ్నాయ పదాలు స్ఫురిస్తాయి. వీరు మంత్ర, తంత్ర శక్తులలో అఖండులు.
వీరిలో రకరకాలైనవారు వుంటారు. కొందరు ధార్మికులైతే, మరికొందరు ఆధ్యాత్మికులు ఇంకొందరు హఠయోగులు.
వీరిలోనే మాంత్రికులూ, తాంత్రికులూ వుంటారు. ఇదేవిధంగా 'పంధ్' సంప్రదాయాలున్నాయి. కొంతమంది అవతార పురుషులూ వున్నారు..."
"వారిలో కొందరి పేర్లు చెప్పగలవా?" అభిరాం మాటలకి అడ్డు వస్తూ అన్నాడు మహదేవ్?
"పురాణ కాలంనుంచీ తీసుకుంటే హిరణ్యకశిపుదు అతడు ఎముకలు మాత్రమే విరిగేలా శరీరాన్ని కృశింప జేసుకుని ఘోర తపస్సు చేసి ఎన్నో శక్తులు పొందాడు. రావణుడు తన పదితలలు తరిగి హోమం చేశాడు.
ఇక కలియుగంలో రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి వంటి వారెంతో కఠోరమైన దీక్షతో ఎన్నో మహత్తులు సంపాదించారు.
'ఓం' అనే మంత్రశబ్దాన్ని బొడ్డునుంచి పరిపూర్ణంగా ఉచ్చరిస్తే, కంఠనాళములు, హృదయము, ఉదరము, మెదడు మొదలయినవి ఉత్తేజిత మవుతాయి.
'హ్రాం' అనే మంత్రం వలన వాయునాళము, గుండె, పొట్ట, మెదడు శక్తిని పుంజుకుంటాయి. ఇది హృదయం నుండి వెలువడుతుంది. దాంతో పరిశుద్దమైన రక్తం శరీరమంతటికీ వ్యాపిస్తుంది.
'హ్రీం' అనే మంత్రం కంఠం నుండి వెలువడి ముక్కు, రొమ్ము, గుండె, జీర్ణకోశాలకు పుష్టినిస్తుంది.
'హ్రూం' అనేది నాభి నుండి వెలువడి లివారుకి, ఉధరనైకీ, పొత్తి కడుపుకీ శక్తిని ప్రసాదిస్తుంది. 'హ్రైం' అనే మంత్రోచ్చారణ మూత్రపిండాలకి పుష్టిని చేకూరుస్తుంది. హ్రః' అనేది మనిషి శరీరంలో అన్ని భాగాలనీ వివిధ వ్యాధుల నుంచి రక్షించి, గుండె దడ, నీరసం మొదలైన వాటిని నివారిస్తుంది. ఇవి శాస్త్రీయంగా కూడా నిరూపించబడ్డాయి.
మనల్ని మనం ఆరోగ్యంగా వుంచుకోవటానికి మంత్రాలివి. ఇతరులకి హాని చేసే మంత్రాలు క్షుద్రమైనవి. ఈ మంత్రాల ద్వారా కేవలం మనిషి పేరుని ఉచ్చరిస్తూ ఎన్నో మైళ్ళ దూరంలో వున్న వారిని కూడా చంపవచ్చు.
మంత్రశక్తుల వలన సంభవించే మరణాలు అతి భయంకరంగా వుంటాయి. దీర్ఘకాలంపాటు మనిషి కృశించి, క్షీణించి చివరికి మృతి చెందుతాడు.
1964లో ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ లో "పండిట్ జవహర్ లాల్ నెహ్రూ" పై ఇటువంటి మంత్ర ప్రయోగం జరిగింది. మీర్జాపూర్ లో వున్న ఒక గుడిలో యీ ప్రయోగం నలభై తొమ్మిది రోజులపాటు జరిగింది.
ఆ తరువాత తొంభై రోజులకి పండిట్ జీ అస్తమించారు...."
"బుల్ షిట్" తల అడ్డంగా వూపుతూ అన్నాడు మహదేవ్.
"ఇదేమి కాకమ్మ కథ కాదు. ఆ విషయాన్ని మనదేశంలోని చాలా పత్రికలు ప్రచురించాయి. అప్పటి ప్రముఖ రాజకీయ వ్యాసకర్త. "టాయ్ పాసీ" ఆ ప్రయోగాన్ని తాను స్వయంగా చూసినట్టు "లండన్ టైమ్స్" లో రాశాడు..."
"1964లో జరిగిన సంగతి నీకెలా తెలుసు? అప్పటికి నువ్వుగాని, నేనుగానీ పుట్టలేదుగా?"
చిన్నగా నవ్వుతూ వెటకారంగా అన్నాడు మహదేవ్.
"నిజమే! కానీ కొన్ని పత్రికల్లో ఆ వార్త నేను చూసి దాదాపు రెండు మూడేళ్ళు అవుతుంది. ఇలా మంత్ర తంత్రాలు వున్నాయా లేవా అన్న విషయమై చర్చిస్తూ పండిట్ జీ వార్త కూడా రాసారందులో..." అన్నాడు అభిరాం.
అతని మాటల్ని మహదేవ్ తేలిగ్గా కొట్టిపడేస్తున్నట్టు నిట్టూర్చాడు.
అది గమనించిన అభిరాంకి ఉక్రోషం వచ్చింది.
"ఆటో రైటింగ్ గురించి విన్నావా నువ్వు?" అనడిగాడు అభిరాం.
"విన్నాను...." అన్నాడు మహదేవ్.
"అంటే ఏమిటి?" అంటూ అడిగాడు అభిరాం.
"ఆతోలమీద రాసే స్లోగన్స్" చిలిపిగా నవ్వుతూ అన్నాడు మహదేవ్.
"జోక్ లొద్దు" విసుగ్గా అన్నాడు అభిరాం.
"సరె సరే! ఏమిటో చెప్పు" కూలాయిపోతూ అన్నాడు మహదేవ్.
"ఆటో రైటింగ్ అంటే ప్రేతాత్మలని ఆవాహన చేసుకొని వాటి ద్వారా జరగబోయేవి తెలుసుకొనే పద్దతి ఈ మధ్యే ఓ ఆంగ్ల పత్రికలో మరణించైనా భర్త ఆత్మ యొక్క ఆటో రైటింగ్ సహాయంతో నలుగురికీ వుపయోగపడుతూ, ధనవంతురాలైన ఓ మహిళ గాధ చదివాను"
"ఆహా...!" అన్నాడు మహదేవ్.
"అమెరికాకి చెందిన లూసీ బర్ధన్ అనే మహిళ భర్త మరణించాడు. అతని పేరు విల్లీ బర్ధన్ వారిది ఎంతో అన్యోన్య దాంపత్యం వారికి పిల్లల్లేరు. ఆ భార్య భర్తలే ఒకరికొకరు ఆలంబవగా జీవించేవారు.
విల్లీ బర్ధన్ ప్రమాద వశాత్తు మరణించాడు. లూసీ ఒంటరితనంతో, భర్త జ్ఞాపకాలతో పిచ్చెక్కిపోయింది. అప్పుడే ఆమెకి తెలిసింది- ఆటో రైటింగ్ ద్వారా చనిపోయినవారితో మనసులోని భావాలని పంచుకోవచ్చని దాంతో రోజూ కాగితం మీద కలం వుంచి రాత్రంతా వేచి చూస్తూండేది.
రోజులు గడిచేవి కాని ఏ ఫలితమూ వుండేది కాదు. అయినా ఆమె నిరాశ చెందకుండా ప్రతిరోజు క్రమం తప్పకుండా అలా వేచి చూస్తూనే వుంది.