"అంటే కాస్త అన్ సివిలైజ్ డే అంటారు"
"మిమ్మల్ని మీరు కించబరుచుకోవడం మీ సరదా అయితే నాకేం అభ్యంతరం లేదు."
"మీక్కాస్త కోపం ఎక్కువే."
"అయ్యో! అప్పుడే ఏం చూడొచ్చారు. ఇంకో గంట మాట్లాడితే మా ఫ్రెండ్స్ అనే మాటలన్నీ మీరూ అంటారు."
"ఏమిటో అవి?"
"కోపిష్టి- గర్వపోతు ఇంకా......"
"చాలా తెలివైన వాళ్ళకు ఎదుటి వాళ్ళ మూర్ఖత్వం చూస్తే కోపం వస్తుంది. చాలా అందమైన వాళ్ళకు కాస్తో కూస్తో గర్వం ఉండక తప్పదు"
:"అయితే నేను తెలివైన దాన్నీ అందమైన దాన్నీ అంటారు. ఓ.కే! ఒప్పుకుంటున్నాను." అంది నవ్వుతూ.
"మిమ్మల్ని గురించి చెప్పండి"
"నా పేరు లావణ్య అని తెలుసా?"
"చెప్పఖ్ఖర్లేదు. మిమ్మల్ని చూస్తేనే తెలుస్తోంది. " శ్రీహర్ష మెచ్చుకోలుగా ఆమె వైపు చూస్తూ.
"తమాషాగా మాట్లాడతారు" అంది లావణ్య చూపులు పక్కకి తిప్పుకుంటూ. "నేను ఎమ్మే చదువుతున్నానని కూడా తెలుసేమిటి?"
"ఇందాక మీ నాన్నగారు చెప్పారు.'
"మా అమ్మకి, నాన్నకి కొడుకైనా, కూతురైనా నేనొక్కదాన్నే" అంది లావణ్య.
"అది తెలుస్తూనే ఉంది. కూతురుండలన్న ముచ్చట తీరడానికి పొడుగాటి జడా, కొడుకు కావాలన్న ముచ్చట తీరడానికి ప్యాంటు, బనీను- బావుంది" అన్నాడు.
'లేచేళ్ళీపోయి పడుకోనా' అంది లావణ్య చిరుకోపంగా.
"వద్దొద్దు. మాట్లాడండి.'
"పెద్ద అడ్వెంచేర్ లాగా ఉంది కదూ ఇవాళ?"
"అడ్వంచర్స్ అంటే ఇష్టమా మీకు?"
"ఎవరికి కాదు?"
"సాధారణంగా అమ్మాయిలు అడ్వెంచేర్స్ అంటే భయపడతారు. సాదా, సీదాగా జీవితం గడిపెయ్యలని ఆశించారు."
"అందర్లాంటిదాన్ని కాదు నేను. అయినా ఆడపిల్లలు, ఆడపిల్లలు అంటూ తీసేసినట్లు మాట్లాడుతున్నారు ఏం? మొగాళ్ళకంటే ఏం తక్కువ మేము?"
"అదేమిటి? బొద్దింకా? తేలా?" అన్నాడు శ్రీహర్ష కాస్త పక్కకి జరిగి.
"ఎక్కడ? ఎక్కడ?" అంది లావణ్య గాభారగా.
"పక్కకెళ్ళిపోయిందిలెండి. ఆ! ఏమిటంటారు? ఆడపిల్లలు మగాళ్ళ కంటే తీసిపోరని కదూ? నిజమే ఆ మాట! మచ్చుకి మీరే ఉన్నారనుకొండి. మీరు నాకంటే అన్నిట్లో ఎక్కువే. నేనే మీకంటే తక్కువ వాడిని."
"ఆహా! అలా అన్లేదు నేను" అంది లావణ్య నొచ్చుకుంటూ. "మీరు బిజినెస్ చేస్తున్నారు. నేనూ బిసినెస్ చెయ్యగలను. - తలుచుకుంటే మీరు స్పోర్ట్స్ మాన్ లా కనబడుతున్నారు. ఏం అడతారు?" అంది.
"అప్పుడప్పుడొక సెట్టు టెన్నిస్ ఆడతాను."
"చూశారా? నేనూ టెన్నిస్ ఆడతాను. మీకు స్విమ్మింగ్ వచ్చా?"
"చిన్నప్పుడు ఈత స్వేమ్మింగ్ పూల్ లో నేర్చుకున్నాననుకొండి . మీరు పేకాట ఆడతారా?"
"ఆడతాను కానీ డబ్బు పెట్టి ఆడను."
"మరింక ఇంట్రస్టు ఏముంటుంది? థ్రిల్ ఏముంటుంది?"
"మిస్ లావణ్యా! రోజు గడవడమే పెద్ద థ్రిల్ నాకు. పేకాటలో వందరూపాయలు పెట్టె స్థితి ఉంటెం ఆ వందా బ్యాంక్ లో వేస్తాను. ఆ వందలు వెయ్యి అయినప్పుడు బిజినెస్ లో పెడతాను. నా సంగతి సరే! మీరు కార్డ్స్ ఆడతారా?"
"నాకూ పెద్ద ఇష్టం లేదనుకోండి. అయినా సోషల్ సర్కిల్స్ కోసం అప్పుడప్పుడు కొన్ని మర్యాదలు పాటించాల్సి వస్తుంది."
"ఏం అడతారు? బ్రిడ్జ్ అనుకుంటాను. మీలాంటి తెలివైన వాళ్ళకి నచ్చుతుంది."
"బ్రిడ్జి బోరండి! ప్లష్ గానీ, రమ్మీ గానీ ఆడతాం."
భుజలేగరేశాడు శ్రీహర్ష. ఆశ్చర్యంగా చూశాడు.
"మీరు డబ్బున్న వాళ్ళు ఏ పనైనా చేసెయ్యగలరు."
"డబ్బు సంగతి వదిలెయ్యండి. గుండె ధైర్యం, నలుగురిని చూసి భయపడక పోవడం , ఇవి ముఖ్యం."
"అవి మీకు చాలా ఎక్కువ మోతాదులో ఉన్నాయి."
"థాంక్స్!" అంది లావణ్య.
చల్లటిగాలి ఒక్కసారి విసురుగా వీచింది. జడ వేసుకోకుండా వదిలేసిన లావణ్య జుట్టు పిరుదులు దాటి అలలు అలలుగా పడుతోంది. జుట్టు చిందర వందరగా అయిపోయి మొహం మీద పడింది.
సున్నితంగా సవరించుకోవోయింది లావణ్య.
"అలానే ఉండనివ్వండి. జుట్టు మొహం మీద పడుతుంటే ఉన్నారో తెలుసా?"
ఆసక్తిగా చూసింది లావణ్య.
"చంద్రుడు కాలుజారీ ఆకాశంలోంచి కిందికి పదిపోతే , నల్లగా లావుగా ఉన్న తాచుపామో కొండచిలువో గబుక్కున నోటితో పట్టేసుకున్నట్లు ఉంది."