Previous Page Next Page 
మరో ప్రస్థానం పేజి 7


                                          సుప్రభాతం

రాత్రి చీకట్లో రాలిన శిరస్సు
    తెల్లారేసరికి 'గుడ్ మార్నింగ్' అంటుంది
రాత్రివెన్నెల్లో రాలిన నక్షత్రం
     తెల్లారేసరికి 'గుడ్ మార్నింగ్' అంటుంది
రాత్రి నిద్దర్లో కారిన రేతస్సు
    తెల్లారేసరికి 'గుడ్ మార్నింగ్' అంటుంది
రాత్రి సాహిత్యంలో పారిన బూతు
    తెల్లారేసరికి 'గుడ్ మార్నింగ్' అంటుంది

                                                                             

                                                                            ముద్రణ : లే! కవితా సంకలనం
                                              ప్రచురణ : చిత్తూరు జిల్లా, విరసం యూనిట్, ఫిబ్రవరి, 1971.

 

                                     వెంపటాం!

వెంపటాం1
అదో ఊరు కావచ్చు
ఇంటిపేరు కావచ్చు
అయినా అదో కార్చిచ్చు
ఆ పక్కనే సత్యం    
అదో మనిషి పేరు కావచ్చు
మనిషి మహిమ కావచ్చు
అందుకే అదో వర్చస్సు
వెంపటాం
కాదు సంచులు నింపటం
సొంతాస్తులు పెంచటం
వెంపటాం
ఔను అన్యాయాన్ని గుండు పేల్చి చంపటం
అధర్మాన్ని గద్దెమీంచి దించడం


                                                                                      రచన: 1- 2- 1973
                                                ముద్రణ : మరో ప్రస్థానం, విరసం ప్రచురణ - మే, 1980

 

1. వెంపటావు సత్యనారాయణ

 Previous Page Next Page