మధ్యాహ్నం నాలుగు గంటలు....
దసప్పకి థాంక్స్ చెప్పి, మాండ్యా ప్రైవేట్ బస్టాండ్ కెళ్ళి, బెంగూళూర్ నుంచి ఊటీ వెళ్ళే బస్సెక్కాడు మైత్రేయ. అంతకుముందు ఫారెస్ట్ డిపార్టుమెంట్ క్లర్క ద్వారా గిరిజన గ్రామాల్లోకెళ్ళే దారి కనుక్కుని, చిన్న పేపర్ మీద ఆ గ్రామాల పేర్లు రాసుకున్నాడతను.
* * *
మరో గంటన్నర తర్వాత ముదుమలై ఫారెస్ట్ లో వున్న ఫారెస్ట్ గెస్ట్ హౌస్ దగ్గర దిగిపోయాడు.
* * *
అక్కడనుండి కాలినడకన నడుచుకుంటూ వెళితే పాలార్ నడి పాయ వస్తుంది. ఆ నడి వెంబడి అయిదుమైళ్ళు నడిస్తే కట్టంగుడి అనే గూడెం వస్తుంది.
ఆ గూడేనికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఎర్రమట్టి దిబ్బలు. ముందు తను కట్టంగుడి వెళ్ళాలి.
అరగంట తర్వాత టేకుల గూడెం దగ్గరికొచ్చాడు మైత్రేయ.
ప్రకృతి అందాలను చూస్తూ నడుస్తున్నాడు. దూరంగా ఎత్తయిన శిఖరాలు, లోయలు.....
వింత వింత పూల పరిమళాలు.... రకరకాల రంగుల పక్షులు....
కొండల పక్కనుంచి పారుతున్న పాలార్ నది....
నడక ఎప్పుడూ అలవాటు లేకపోవడంవల్ల బాగా అలిసిపోతున్నాడతను. మధ్య మధ్యలో ఆగి, తనతో తెచ్చుకున్న బిస్కెట్లు తిని, థమ్స్ అప్ బిగ్ బాటిల్లోని థమ్స్ అప్ తాగుతున్నాడు.
సమయం ఆరుగంటలు దాటింది.
అడవిలోకి చీకటి నెమ్మదిగా పాక్కుంటూ వస్తోంది.
దూరంగా కొన్ని గుడిసెలు కనిపించాయి. మరో అరగంటకు ఆ గుడిసెల దగ్గరకు చేరుకున్నాడతను.
అక్కడినుంచే కట్టంగుడిలోని గిరిజన గ్రామాలు ప్రారంభం.
పట్నానికి దగ్గరగా వుండడం అక్కడ గిరిజనుల్లో కొంత నాగరికత కనబడుతోంది. వంటినిండా రంగు రంగుల దుస్తులు, పూసలతో గిరుజన మహిళలు అడవిపూలల్లా వున్నారు.
పట్నం వ్యక్తిని చూడగానే ఇద్దరు గిరిజన యువకులు ముందుకొచ్చారు.
"ఎవరు కావాలి బాబూ?"
"ఇది కట్టంగుడి గూడెమేనా?"
కాదు బాబూ.... దూరంగా కొండలు పక్కన కనిపిస్తున్నదే అదే కట్టంగుడి గూడెం" చెప్పారు వాళ్ళు.
"అక్కడ నుండి జలపాతానికి ఎంత దూరం?"
"జలపాతమా...? ఏ జలపాతం?"
"జలపాతం పేరు తెలీదు నాకు."
"ఒక్కటే వున్నట్టు విన్నాం.... అదెక్కడో నెమళ్ళకోన దగ్గరుందట......మేం ఎప్పుడూ చూడలేదు. మా పెద్దాళ్ళు చెప్పగా వినడమే!"
"ఇక్కడనుంచి నెమళ్ళకోన ఎంత దూరం?"
"పాతిక మైళ్ళు వుండొచ్చు. ఎర్రమట్టి దిబ్బలు, పిల్లిగడ్డ దాటాలి."
"అక్కడికి వెళ్ళాలంటే ఎంత టైమ్ పడుతుంది?"
"ఒక రోజు.... అయినా రాత్రిపూట ప్రయాణం ప్రమాదం బాబూ! రాత్రి కట్టంగుడి గూడెంలో వుండి, ఉదయం బయలుదేరండి బాబూ....!" సలహా ఇచ్చారు వాళ్ళు.
వాళ్ళకు థాంక్స్ చెప్పి, ముందుకు నడిచాడు మైత్రేయ.
మరో అరగంటకు కట్టంగుడి గూడెం చేరుకున్నాడతను. అప్పటికే పూర్తిగా చీకటిపడింది.
కట్టంగుడి గూడెంలో కేవలం పదిగుడిసెలు మాత్రమే వున్నాయి.
గుడిసెల మధ్యన అమ్మవారి చిన్న గుడి.
ఊరి పెద్ద డెబ్భై ఏళ్ళ వృద్ధుడు. పాండ్యానాయక్ మైత్రేయకి ఎదురొచ్చి వివరాలు కనుకున్నాడు.
చెట్టుకింద నులక మంచంమీద కూర్చున్నాడు మైత్రేయ.
రొట్టెలు తిని, పాలు తాగాక, సిగరెట్ వెలిగించుకున్నాడు.
"ఈ రాత్రికి ఇక్కడే వుండు బాబూ..... తెల్లవారుజామున బయలుదేరితే, సాయంత్రం వేళ నెమళ్ళకోన చేరిపోతావు.... జలపాతం అక్కడే వుంది. పులిగడ్డ మాత్రం జాగ్రత్త..... పెద్దపులి తిరుగుతోంది..... నరమాంసం రుచి చూసిన పులి...... ఫారెస్ట్ రేంజర్ ని చంపేసింది......" చెప్పాడు వూరిపెద్ద పాండ్యానాయక్.
పాండ్యానాయక్ చెప్పగా, ఓ గిరిజన యువతి మంచంమీద దుప్పటి వేసి, తలగడ సర్దింది.
"వనలక్ష్మీ..... ఈ బాబుకి ఏం కావాలన్నా చూడు....." అని తన గుడిసెలో కెళ్ళిపోయాడు ఆ వృద్ధుడు.
కొంతమంది గిరిజన స్త్రీలు గుడిసెలు ముందు చాపలమీద, నులక మంచాలమీద పడుకుని కబుర్లాడుకుంటున్నారు.
రాత్రి తొమ్మిదిన్నర దాటింది.
అందరూ నిద్రలోకి జారుకున్నారు.
ఆకాశం వేపు చూస్తూ ఆలోచిస్తున్నాడు మైత్రేయ. మబ్బుల మధ్యనుంచి కనిపిస్తున్న చంద్రుడు, ఆకాశంలో వేలాడదీసిన లాంతరులా వున్నాడు. చల్లటి గాలి, అడవి గాలి స్పర్శ మత్తుగా వుంది.
పదే పదే మోహిత గుర్తుకు వస్తోంది.
మరో గంటన్నర గడిచింది.
రకరకాల ఆలోచనల వలన నిద్రపట్టడంలేదు. లేచి కూర్చుని, సిగరెట్ వెలిగించాడు.
"ఏం పట్నం బాబూ..... నిద్రపట్టడం లేదా?" ఆ మాటకు తలతిప్పు పక్కకు చూశాడు.
వనలక్ష్మి! ఆమెకు ఇరవై ఏళ్ళుంటాయి. నల్లటి దృఢమయిన దేహం, పెద్ద కళ్ళు, బిగుతు రవిక, ఎర్రరంగు సాదా చీర.
"నీకు పెళ్ళయిందా బాబూ?" అడిగిందామె.
"లేదు.. మరి నీకు....."
"అయింది...."
"మరి గుడిసెలో పడుకోకుండా, ఇక్కడ పడుకున్నావేం...."
"రోగిష్టి మనిషి... ఏడాదైంది చనిపోయి....."
"మళ్ళీ పెళ్ళి చేసుకోవా?"
"ఊరి పెద్దలు నిర్ణయం చేయాలి గదా...." తలదించుకుని చెప్పింది వనలక్ష్మి.
దూరంగా వున లాంతరు వెల్తురు ఆమెమీద పడుతోంది.
దాహంగా వుంది మైత్రేయకి.
"కొంచెం మంచినీళ్ళు తెస్తావా....." అడిగాడతను. గబగబా గుడిసెలోకెళ్ళి, గ్లాసుతో నీళ్ళు తెచ్చి అతనికిచ్చింది. ఆ సమయంలో కావాలనే తన చేతివేళ్ళను అతడి వేళ్ళకు తగిలించిందామె.
ఆ స్పర్శ వెచ్చగా వుంది.
ఎదురుగా కూర్చుని అతనివేపే చూస్తోంది. మంచినీళ్ళ గ్లాసు కింద పెడుతూ, అప్రయత్నంగా ఆమె గుండెలవేపు చూశాడు. గాలికి చీరకొంగు పక్కకు తప్పుకోవడం వల్ల, జాకెట్లో ఇమడలేని ఆమె ఎత్తయిన గుండెలు, లాంతరు వెలుగులో నల్లగా కనిపిస్తున్నాయి.
అమ్మవారి గుడివెనక కొంచెం దూరంలో చెరువు, ఆ చెరువులో పడుతున్న వెన్నెల, చెరువు చుట్టూ పెద్ద పెద్ద లైట్లు.
వెన్నెల్లో చెరువుగట్టుమీద కూర్చొని, నీటిపాయలవేపు చూడడం ఎంత బావుంటుంది.
'చాలా బావుంది....!' తనలో తాను అనుకున్నట్లుగా అనుకున్నాడు మైత్రేయ.
"ఏమిటి బాబూ! నీలో నువ్వు గొణుక్కుంటున్నావ్....." అడిగింది వనలక్ష్మి.
"ఆ చెరువు..... వెన్నెల..."
"దగ్గర నుంచి చూస్తే ఇంకా బావుంటుంది.... పద తీసుకెళతాను" అందామ్మాయి.
"ఇంత రాత్రి.... నువ్వు రావడం....." సంశయంగా అన్నాడు మైత్రేయ.
అందరూ పడుకున్నారు గదా...." పడుకున్న వాళ్ళవేపు చూస్తూ, చనువుగా అతనిచెయ్యి పట్టుకుంది.
తుప్పలు, డొంకలమధ్య నుంచి చెరువుగట్టు దగ్గరకు వెళ్ళేసరికి పదినిముషాలు పట్టింది.
వాతావరణం హాయిగా వుంది.
పెద్ద బండ పక్కన గడ్డిమీద కూర్చున్నారిద్దరూ. వనలక్ష్మి మెల్లగా అడవిలోని సంగతులు చెప్తోంది. అతని కళ్ళవేపే చూస్తూ.
పావుగంట గడిచింది.
"నీకు పెళ్ళి కాలేదన్నావ్ కదా బాబూ.... మరి ఇంత వయసొచ్చిన ఏ ఆడపిల్ల జోలికీ వెళ్ళలేదా....?" అకస్మాత్తుగా ఆ ప్రశ్న వేసి, అతని కుడిచేతిని తన కుడిచేత్తో పట్టుకుంది.
ఆ చేతిని ముందుకు లాక్కుంటూ "లేదు" అన్నాడు మైత్రేయ.
"ఎందుకంత భయం.... నువ్వు నాకు నచ్చావు...." అంటూ అతని కుడిచేతిని తన గుండెలకేసి అదుముకుంది వనలక్ష్మి.
వెన్నెల మంచుగా మారి, ఒక్కసారిగా మీద పడ్డట్టయిందతనికి. నరాల్లో ప్రకంపన.
వనలక్ష్మి అతనికి బాగా దగ్గరకి జరిగి, చెవిలో గుసగుసలాడుతోంది.
"నేన్నీమీద మనసుపడ్డాను.... కాదనకు.... మాలో ఇది తప్పు కాదులే" పైటను పక్కకు తప్పించి, మైత్రేయ చేతుల్ని తన గుండెలమీద వుంచుకుని గట్టిగా అదుముకుంటోంది.
మైత్రేయలో ఏదో తపన అగ్గిలా రాజుకుంటోంది. ఆ చేతుల్ని అలా ముందుకు తీసుకెళుతోంది.
"వద్దు.... బాగోదు....." బలంగా తనచేతిని వెనక్కి తీసేసుకున్నాడతను.
"నేను.... నిన్నీవేళ..... నేను వదలను" అతన్ని గట్టిగా కౌగిలించుకుంటూ అందామె.
ఆమె వంట్లోని వేడి, అతని వంటికి నిప్పులా తగిలింది.
అతను గబుక్కున లేవబోయాడు. అతని రెండు చేతుల్నీ పట్టుకుని ముందుకు లాక్కుంది.
ఆమెమీద పడిపోయాడతను.
"నాకిష్టం లేదు..... నన్నొదిలెయ్" అన్నాడతను భయంగా.
"ఏం నీకు నేను నచ్చలేదా?" ఆమె బాధగా ప్రశ్నించింది.
"లేదు...." ఆమె మీద నుంచి లేస్తూ అన్నాడతను. ఆమె కోపంగా అతనివైపు చూసింది.
"కాదు అబద్ధం చెప్తున్నావ్..... నీకంతా భయం కదూ.... నీ మీదకేం రాకుండా నేను చూసుకుంటాను కదా.... ఊరి పెద్ద తప్ప, ఇంకెవరు చూసినా భయంలేదు. నా కోర్కె తీర్చు....." అతని గెడ్డం పట్టుకుని ప్రాధేయపడుతోందామె. గబగబా చీరను విప్పేసిమ్ పక్కన పడేసి, అతని షర్టు గుండీల్ని తీస్తోంది.
"ఊరిపెద్ద చూస్తే కంగారుగా ప్రశ్నించాడతను.
"నీలాంటి పిరికివాడికి, ఊరిపెద్ద చూడడమే మంచిది లాగుంది..... చిన్నగా నవ్విందామె.
అలా నువ్వుతున్నప్పుడు, ఆమె ముఖంమీద ఆకుచాటు వెన్నెల పడింది.
ఆ వెన్నెల వెలుగులో ఆమె ముఖంలో కన్పించిన కాంక్షకు అతను సందిగ్ధావస్థలో పడిపోయాడు.
"ఆలస్యం చెయ్యకు.... రా....." అతన్ని పెనవేసుకుంటూ అంది ఆమె.
సరిగ్గా అదే సమయంలో-