జ్వాలాముకిరావు తల తిప్పి, కొంచెం దూరంలో కూర్చున్న వ్యక్తివేపు చూసాడు.
ఆ వ్యక్తి పేరు భుజంగపతి-
భుజన్గాపత్య్కి నలభయ్ అయిదేల్లుంటాయి. పాతికేళ్ళ నుంచి జ్వాలాముఖిరావును నమ్ముకున్న వ్యక్తి- జ్వాలాముఖిరావు రహస్యాలన్నీ తెల్సిన ఏకైక వ్యక్తి భుజ్ఞ్గాపతి.
జ్వాలాముఖిరావు ఇండస్ట్రియల్ ఎంపైర్ కి భుజంగపతి సర్వసైన్యాధ్యక్షుడు.
జ్వాలాముఖిరావు తన ఆలోచనలన్నీ భుజంగపతి ద్వారా అమల్లో పెడతాడు.
అంతరంగికంగా జ్వాలాముఖిరావును భుజంగపతి బావా అని సంబోధిస్తాడు. కానీ వారిద్దరి మధ్య వున్నా నిజమయిన సంబంధం ఏమిటో ఎవరికీ తెలియదు.
జ్వాలాముఖిరావు చూపుల్ని అర్ధం చేసుకున్న భుజంగపతి తన సీట్లోంచి లేచి తన చేతిలో వున్నా ఫైలుని జ్వాలాముఖిరావు చేతికి అందించాడు.
ఆ ఫైలుని చూస్తూ జ్వాలాముఖిరావు ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించబోతుండగా-
అదే సమయంలో-
భుజంగపతి అసిస్టెంట్, కుంభారావు కంగారుగా లోనికొచ్చి రహస్యంగా చెవిలో ఒక విషయాన్ని చెప్పి వెళ్ళిపోయాడు. అతని వెనకే కాన్ఫరెన్స్ హాల్లోంచి వేగంగా బయటికొచ్చి హోటల్ మేనేజర్ చాంబర్ లోకి వెళ్ళాడు భుజంగపతి.
"ఏంటీ.....జె ఎమ్. సాబ్ కి ఎదురుగా స్టూడెంట్స్ ఊరేగింపా? శవంతో హోటల్ మీదకొస్తున్నారా?" ఆశ్చర్యంగా అడిగాడు భుజంగపతి.....
"అవున్సార్...ఏరియా ఎ సి పి. ఫోన్ చేసి చెప్పాడు. దాదాపు రెండువేల మందికి పైగా కాలేజీ స్టూడెంట్స్....వాళ్ళని మయూష అనేఅమ్మాయి లీడ్ చేస్తోందట."
"మయూష.....ఎవరా అమ్మాయి?" భ్రుకుటి ముడిచి అడిగాడు భుజంగపతి.
"మాకేం తెలుస్తుంది?"
"ఇంతకీ శవం అంటున్నారు శవం ఎవరిది?" సర్వెస్ గా ఫీలవుతూ అడిగాడు భుజంగపతి.
"ఎవరో కాలేజీ స్టూడెంట్ భార్గవట......"
"భా...ర్గ....వి....." ఆ పేరు వినగానే మరేం మాట్లాడలేదు భుజంగాపతి. చీకట్లో తుపాకీ గుండు దెబ్బ తగిలినవాడిలా అయిపోయాడతను.
"భార్గవి__జె ఎమ్ గారు తనకి అన్యాయం చేసారని, ఏదో లెటర్ రాసి స్టూడెంట్ లీడర్ చేతికిచ్చి, సూసైడ్ చేసుకొని చచ్చిపోయిందట__జె ఎమ్. గారిని అరెస్టు చెయ్యాలని కోరుతూ వాళ్ళందరూ శవంతోపాటు వస్తున్నారు. అదీ మా కొచ్చిన ఇన్ ఫర్ మేషన్__" మేనేజర్ మాట వినగానే భుజంగపతికి వళ్ళంతా చెమటలు పట్టేసాయి.
"ఏ ఒక్కరూ హోటల్ లోపలకు రావడానికి వీల్లేదు__ఈ విషయం జె ఎమ్ సాబ్ కు గానీ, డెలిగేట్స్ కుగానీ తెలియడానికి వీల్లేదు. మీ హోటల్ సెక్యూరిటీ స్టాఫ్ తో వాళ్ళందర్నీ బయటకు గెంటేయ్యండి మీకు కోపరేట్ చేయడానికి పోలీస్ ఫోర్స్ ను నేను తెప్పిస్తాను. నేనిప్పుడు కమీషనర్ కు ఫోన్ చేస్తాను" అని కంగారు కంగారుగా ఫోన్ అందుకున్నాడు భుజంగపతి.
ఫోన్ మీద అడ్డంగా చేయి పెట్టాడు హోటల్ మేనేజర్.
"అలాంటి పిచ్చిపని చేయకండి మిస్టర్ భుజంగపతి_ఊరేగింపుగా వస్తున్నవాళ్ళు స్టూడెంట్స్-అందులోనూ శవాన్ని తీసుకొని వస్తున్నారు. వాళ్ళకు నెగెటివ్ గా మనం ప్రవర్తించామంటే హోటల్ ధ్వంసం చేసేసి వెళ్ళిపోతారు. అండర్ స్టాండ్-" కోపంగా అన్నాడు మేనేజర్.
"ఇది జె.ఎమ్ గారి ప్రెస్టేజ్ క్వశ్చన్....అందులోనూ ఫారిన్ డెలిగేట్స్ మీటింగ్ ఆ మీటింగ్ కు ఏ రకమైన డిస్ట్రబెన్స్ ఏర్పడితే ఆయనేం చేస్తాడో నీకు తెలీదు" మరింత కోపంగా అన్నాడు భుజంగపతి.
"ఆయన ప్రెస్టేజ్ గురించి మీరు ఆలోచిస్తున్నారు మాక్కూడా ప్రెస్టేజ్ వుంటుంది. కాలేజీ స్టూడెంట్స్ మా హోటల్ ని ధ్వంసం చేసి వెళ్ళిపోయారంటే కార్పోరేట్ మార్కెట్లో మా ఇమేజ్ ఎలావుంటుందో ఊహించారా?"
ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయాడు భుజంగపతి.
"ఎంత డబ్బు ఖర్చయినా ఫర్వాలేదు. పోలీసుల్ని కాకపోతే రౌడీల్ని పెట్టు....అన్ని విధాలుగా చెపుతున్నాను__" స్వరం తగ్గించి అన్నాడు భుజంగపతి.
"ఒక వ్యక్తి ప్రెస్టేజ్ కోసం మా స్టార్ హోటల్లోకి రౌడీల్ని ఎలౌ చేయడానికి మా మేనేజ్ మెంట్ ఒప్పుకోదు .....అయామ్ సారీ....."
ఇలా ఇక్కడ డిస్కషన్స్ జరుగుతూండగానే సెక్యూరిటీ నుంచి వచ్చిన ఫోన్ ని రిసీవ్ చేసుకుని.....
"ఆ స్టూడెంట్ లీడర్ ని నా దగ్గరకు పంపించు__డోన్ట్ ఇరిటేట్ దెమ్. ఒ.కే....." అని ఫోన్ పెట్టేసి.
"భుజంగపతిగారూ__ఇప్పుడు మనమేం చేయలేం ఆ స్టూడెంట్ లీడర్ తో మాట్లాడాకగానీ మనకు అసలు పరిస్థితి అర్ధంకాదు__ ఈ లోపల....."
"ఈ లోపల ఏం చేయాలో నాకు బాగా తెల్సు__" అనుకుంటూ ఆ రూమ్ లోంచి విసురుగా బయటకువెళ్ళి కాన్ఫరెన్స్ హాల్ వేపు పరుగుతీసాడు భుజంగపతి.
* * * *
గ్లాస్ డోర్స్ లోంచి మెయిన్ గేట్ వేపు చూసాడు హోటల్ మేనేజర్.
స్టూడెంట్స్ నినాదాలు హోరుగా వినబడుతున్నాయి.
రెండు నిమిషాల సేపు సెక్యూరిటీ చీఫ్ తో మాట్లాడిన మయూష ఇంకో ఇద్దరు స్టూడెంట్స్ వెనకరాగా-లాన్ దాటి మెయిన్ డోర్ దాటి మేనేజర్ రూమ్ లోకి అడుగుపెట్టింది.
"మీ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో వున్న జ్వాలాముఖిరావును మేం అర్జంటుగా కల్సుకోవాలి__"మయూష గొంతు తీవ్రంగా వుంది.
"జె ఎమ్. రావుతో మీరు మాట్లాడుకునే పర్సనల్ విషయాలకీ, ఈ కాన్ఫరెన్స్ కూ సంబంధం లేదు. మీరు జ్వాలాముఖి ఎస్టేట్స్ కు వెళితే బాగుంటుందనుకుంటాను...." తన బాధ్యతగా అన్నాడు మేనజెర్-ఎంతో అనునయంగా.
"దిసీజ్ నాట్ ఏ పర్సనల్ ప్రాబ్లమ్.....ఒక లేడీ స్టూడెంట్ సూసైడ్ కు సంబంధించిన పబ్లిక్ ప్రోబ్లమ్ ఇది-ఈ హోటల్లో ఆయనతో మాట్లాడడానికి మాకు హక్కు వుంది....." మయూష పక్కనున్న స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్నాడు ఆవేశంగా.
"అసలింతకూ ఏం జరిగింది?"
"డోన్ట్ వేస్ట్ అవర్ టైమ్__మిస్టర్ మేనేజర్ బయట స్టూడెంట్స్ ను చూశారుకదా అన్ని కాలేజీల నుంచి స్టూడెంట్స్.... మరికొన్ని నిమిషాల్లో హోటల్ దగ్గరకు వస్తున్నారు. అప్పుడు పరిస్థితి మా చేతుల్లో వుండదు ఒక క్రిమినల్ ని మీరు ప్రొటెక్ట్ చేయాలను కోవటం అంత మంచిది కాదు" ఇంకో కుర్రాడు కోపంగా అరిచాడు.
"అయితే మీరేం చేస్తారు?' నుదుటిమీద పట్టిన చెమటను తుడుచుకుంటూ అడిగాడు మేనేజర్.
ఏదో చెప్పబోయిన మయూష ఉధృతంగా నినాదాలు చేస్తూ గేటును తోసుకొని పోర్టికోవరకూ వచ్చేసిన స్టూడెంట్స్ ను అంబులెన్స్ వెనకడోర్ తెరవగా కన్పిస్తున్న భార్గవి శవాన్ని చూసి-
గబగబా మేనేజర్ రూమ్ లోంచే బయటకు వచ్చింది - ఆమె వెనక పరుగు తీసాడు మేనేజర్.
"సెకండ్ ఫ్లోర్లో కాన్ఫరెన్స్ హాల్లో ఉన్నాడట.....శవాన్ని బయటకు తీయండి....." ఒక స్టూడెంట్ స్ట్రెచర్ వేపు నడుస్తూ అరిచాడు.