అలా నడుస్తూ గౌతమ్ తనకు తెలియకుండానే ఓ చిన్న సందులో ప్రవేశించాడు! ఎదురుగా డొక్కుహాలు "దుర్గామందిర్" కనిపించింది. దానిలో ప్రస్తుతం ఏదో తమిళంపిక్చరు ఆడుతున్నది. ఇంతవరకూ తమిళం పిక్చరుఅతను చూడలేదు. ఎలా వుంటుందో చూడలనుకునికూడా ఏనాడూ చూడలేకపోయాడు. చిత్రంలో బొమ్మలు చూస్తుంటే పరమ డొక్కు సినిమాఅని తెలిసిపోతునేవుంది. గేటు పక్కగావున్న బుకింగ్ కౌంటర్ తెరిచేవుంది. హాలు ముందు పిట్టపురుగులేదు.
దుర్గామందిర్ పవిత్రమైన గుదిఅన్నా కాకపోయింది దానికితోడు పరమ వీరడోక్కుహాలు! అంత మహాపట్టణం లో దాదాపు అన్ని ఏ. సి. హల్సే. జనసంచారం అంతగాలేని చోట ఊరికి దూరంగా చిన్న గొందిలోవుంది అన్నీ బిసీనాటి సినిమాలు పైగా అవి మాటలు పాటలు అరిగిపోయి రిళ్ళు తరిగిపోయి తెర అలుక్కుపోయి, చిత్రం మొదటిసారి విడుదల అయినప్పుడే రెండో ఆట ఎత్తేసినవి ఏరుకొచ్చి ఆ హాలులో ప్రదర్శిస్తుంటారు. కొందరు పాపాత్ములు మాత్రమే ఆ హలుముఖం చూస్తుంటారు.
నిరుద్యోగి గౌతమబుద్దకి ఈలోకంమిద కసి అసమర్ధపు ప్రభుత్వంమీద అంతులేనికోపం. ఏదో దిక్కు మాలిన పనిచేయాలన్న ఉక్రోషం అన్ని వున్నాయి. "ఈ హాలు ప్రొప్రయిటరు మేనజర్ అంతా నాలాంటి దరిద్ర దామోదర చక్రవర్తులే. వీళ్ళని భారతీయ దౌర్భాగ్య పౌరుడిగా ఎంతోకొంత ఆదుకుంటారు" ఎవరిమిదనో కోపంతో అనుకుని జేబులోకి చేతిని పోనిచ్చాడు.
జేబులో వున్నది మూడు రూపాయల ముప్పావలా, పది రోజులదాకా అవే తన టి నీళ్ళకు గతి, గతి గురించి మతి గురించి గత్యంతరం లేని పరిస్టితి గురించి ప్రస్తుతం ఆలోచించదల్చుకోలేదతను. డొక్కు హాలులో పరమ డొక్కు (పరభాషది) చిత్రం చుదలనుకున్నాడు. జేబులో చేతిని అలాగే వుంచుకుని కౌంటర్ వేపు వడివడిగా నడిచాడు.
"రెండున్నర టిక్కెట్లు" అంటూ ముడురుపాయలు తీసి బుకింగ్ లో చేయి పెట్టాడు గౌతమ్.
బుకింగ్ లో అతనికి కాస్త చెముడులాగుంది "ఏమిటి?" అన్నాడు.
"కిలో వంకాయలు" అందామని ఆ జోక్ అంత బాగుండదని విరమించుకుని "టిక్కెట్టు" అన్నాడు గౌతమ్.
"టిక్కట్ట?" అన్నాడతను.
"కాదు టి నీళ్ళు" ఒళ్ళు మండి అన్నాడు గౌతమ్.
"అయిపోయాయి" అన్నాడతను.
"నిరుద్యోగి అంటే నీకు కూడా లోకువేనా బ్రదర్" అనుకున్న గౌతమ్ బుకింగ్ లోంచి చెయ్యి తీయకుండానే "టిక్కట్" అన్నాడు మళ్ళి.
౩)
"మీరేం అడుగుతున్నారో నా కర్ధం కావడంలేదు. టిక్కట్టేనా! ఈ రోజు అనుకోకుండానే హాలు నిండింది. అది మా అదృష్టం. బుకింగ్ క్లోజ్ చేయబోతున్నాను మీరొచ్చి అడిగారు. నాకు కాస్త చెముడు. ఏమి అనుకోకండి" అన్నాడు అతను కాస్త సిగ్గుతో."
ఈ మాట చెప్పడానికి అంత సిగ్గు పడే పనేముంది?" ఇంత కాలం తరవాత హాలు నిండినందుకా ఈ సిగ్గు. లేక తనకి చెముడు వున్నందుకా! ఆ విషయం చెప్పాల్సి వచ్చినందుకా! దరిద్రుడు ఎక్కడ కాలుపెట్టిన చుక్కెదురవుతుంది. తను సినిమా చూద్దామనుకుంటే జన్మలో హాలు నిండనిది ఈ రోజు నిండింది" అనుకుంటూ అతను బుకింగ్ లోంచి చేయి బయటికి తీసి "నా కన్నా అదృష్టవంతుడివి బ్రదర్! చెముడు కూడా ఓ అర్హతగా నీకి ఉద్యోగం ఇచ్చారు" పైకే అన్నాడు. ఎలాగూ అతనికి చెముడు వినపడి చావదుకదా అని.
గౌతమ్ ముఖానే అతను బుకింగ్ తలుపులుమూశాడు.
గౌతమ్ కాళ్ళిడ్చుకుంటూ హాలు బయటికి వచ్చాడు. హలులోంచి బయటకువచ్చి నాలుగడుగులు వేయంగానే అవసరం అతనికి గుర్తుచేసింది. అటూ ఇటూ చూశాడు. రోడ్డు వారగా చెత్తకుండి కనిపించింది. మున్సిపలిటివారి కళ్ళింకా దానిమీద పడలేదేమో! కుండి పైదాకా నిలువెత్తున చెత్త వుంది. అటు నడిచాడు.
"ఈ విషయంలో మగవాడు అదృష్టవంతుడు. నిరుద్యోగి అయినా ధైర్యంగా గోడవారగా యూరినల్ కి వెళ్ళ వచ్చు" అనుకుంటూ ఫ్యాంటు జిప్ తీసి మునివేళ్ళమీద చెత్తకుండి చాటుగా గోడవారగా కూర్చున్నాడు.