నెత్తిమాడుతున్నా ఎండని లెక్క చేయకుండా కాళ్ళు ఎటు లక్కెళుతుంటే అటు వెళుతున్నాడు గౌతమ్. ఆ సమయంలో అతని మనసు ఎండకన్నా తీక్షణంగా మండిపోతుంది. చాతగాని కోపం నిలువెల్లా దహిస్తుంటే కసిగా పళ్ళు నురుకున్తున్నాడు. గౌతమ్ అర్భకుడు కాదు ప్రస్తుతం అసహాయుడు.
గౌతమ్ ఫస్ట్ క్లాసులో ఎం.యస్ సి పాస్ అయాడు. టైపులో లోయర్ హయ్యారు అయింది. ఎన్.సి సి ,లో కూడా ఓ సర్టిఫికేట్ ముక్క సంపాదించాడు. అదనంగా మరికొన్ని అర్హతలు వున్నాయి. ఎత్తుకి తగిన లావుతో ఆకర్షించే ముఖవర్చస్సుతో హేండ్ సమ్ గా వుంటాడు. "మగాళ్ళకే ముద్దోస్తూ బాగుంటావురా గౌతమ్!" అని ఫ్రెండ్స్ అంటే "ముద్దోస్తూ బాగుండటము దోకోస్తూ వికారంగా వుండటము కాదు భాయ్! మగవాడు వుండాల్సింది సంపాదనా పరుడిగా, మగవాడి గౌరవంఅల్లా అతను ఉద్యోగస్తుడు అయినప్పుడే" అనేవాడు అతను.
ఇంట్లో తల్లి తండ్రి వయోవృద్దులు, రోజులు నెట్టుకు వస్తున్నారు. తండ్రికి వచ్చే పించనురాళ్లు ఆయన మండులకే చాలవు. గతంలో ముగ్గురు ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసి ఆయన పూర్తిగా చితికిపోయాడు. అన్న సూర్యనారాయణ చేసేది గుమస్తా ఉద్యోగం. పెళ్ళీయింది. ఏడాది పిల్లోదికితోడు మళ్ళి కడుపు, సంపదన చూడబోతే మా ఆయన వక్కడిది తినేది పదిమంది. అదృష్టం అడ్డెడు తప్పాలాది. అది పోయ్య ఎక్కనిరోజు లేదుకదా?" అని అన్నపూర్ణతల్లి సాదించని రోజులేదు.
వదిన అన్నని సాధిస్తుంది. అన్నీ వుడిగిన అత్తా మామా అని చూడక వాళ్ళని సాధిస్తుంది. కమతానికి పనికి రాని ఎద్దు వున్నావకటే వుడినావకటే అన్న సాధింపు మరిది గౌతమ్ గురించి. అతను వదిన సాధింపులు భరించ లేకుండా వున్నాడు. తల్లి చాటుగా కళ్ళనీళ్ళు పెట్టుకుని "నాయనా గౌతమ్! చిన్నదో పోన్నదో ఏదో ఒకదాంట్లో చేరరా, ఉద్యోగం రావాలని కూర్చుంటే కుదురుతుందా!" అంటుంటే అతని ప్రాణం గిలగిలలాడేది.
అన్ని అర్హతలువున్న తనకి జాబ్ ఎందుకు రావటం లేదు? ఒక్కో జాబ్ కి ఒక్కో అప్లికేషన్ ఫిలప్ చేసి పంపిస్తూ పాతికలు యభైలుకావాలంటే ఎక్కడనుంచి వస్తాయి? ఈ ప్రభుత్వం నిరుద్యోగులకేమన్నా అప్లికేషన్ ఫారాలకి సరిపోను డబ్బన్నా యిస్తూ నిరుద్యోగిభ్రుత్తి అంటూ కాస్తో కూస్తో యిస్తున్నదా!" అసలుకే ఎసరాయే కోసరేమి కోరుదు మగడా!" అని ఓ ఇల్లాలు వగచినట్లు తయారయింది నిరుద్యోగ సమస్య.
అతను ఆ ఉదయంనుంచి కాళ్ళరిగేలా తిరిగి పచారి కొట్లో గుమస్తాకాదుకదా లారి క్లీనర్ గా కూడా నీవు తగవబ్బయీ! అనిపించుకుని పన్నెండుగంటలకి ఇంటికి వచ్చాడు, తల్లి లేచొచ్చి అన్నం వడ్డించింది. "ఏవేల్టికి వచ్చిన నా అక్షయ పాత్ర కదిగిపెట్టి వుంచము అన్న లాగా గానుగెద్దు జీవితం కాదు. సరదాగా నాలుగు వీధులు సర్వేచేసి ఇల్లంటూ ఒకటి ఏడ్చింది కాబట్టి ఇల్లుగుర్తుకొచ్చినప్పుడువస్తే తిండి కేమి డోకా లేదు" అని పక్క గదిలోంచి వదిన సణుగుడు వినిపించింది.
అన్నం తినకుండా లేస్తే తల్లి భాధపడుతుందని ఏదో తిన్నాననిపించి కంచం ముందునుంచి లేచాడు గౌతమ్. ఆ తర్వాత ఇంట్లో ఉండబుద్దికాలేదు. పనుందంటూ ఇంట్లోంచి బైలుదేరి వీదినపడ్డాడు. కాళ్ళు తీసుకెళుతున్న వేపు వెళుతున్నాడు.
ఏం చేయాలి?
ఎక్కడికెళ్ళాలి?
అసలు నిరుద్యోగికి ఏం పనివుంటుంది?
రోడ్డులు సర్వే చేస్తున్నందుకైనా ప్రభుత్వం పది రూపాయలు చేతిలో పెట్టదు.
"ఇదేనా మా దేశం! ఇదా భారతదేశం?" ఆ పాట పాడుకుంటూ దారికడ్డంగా లావుపాటి కంకరరయివుంటే బలంకొద్దీ కసిగా....ఈడ్చి తన్నాడు అతను.
రోడ్డుకడ్డంగావున్న రాయి సగం భూమిలో కూరుకుపోయి ఉండటంవల్ల అతని తన్నుకి ఎగిరి అల్లంత దూరం పడకపోగా హేమాన్ కాలివేళ్ళు కూడా ముద్దురావడంతో గట్టిగా ముద్దుపెట్టేసుకుంది. ఆ దెబ్బతో "అబ్బా" అంటూ కాలూ గట్టిగా పట్టుకున్నాడు. "కంకరరాయీ! నిరుద్యోగి అంటే నీకుకూడా లొకువటోయీ!" స్వగతంగా అనుకుని మున్డుకుసాగాడు.