Previous Page Next Page 
యోధుడు పేజి 5

    "అతను తెలిసి మాట్లాడుతున్నడా? లేక కలవారిస్తున్నడా?" అడిగింది నర్స్ మేరీ.

    "రక్షించావ్. అతని కండిషన్ బాగానే వుందికదా! లేకపోతే మెంటల్ హాస్పిటల్ కి పంపాలి."

    "అంత ప్రమాదం లేదు డాక్టర్. ఆ కేండిడేట్ కి పాలిటిక్స్ పిచ్చి ఎక్కువులా వుంది" అంది మేరీ.   

    "అలాంటి పిచ్చివాళ్ళని నువ్వే జాగ్రత్తగా డీల్ చేయగలవు_ కాబట్టే నీకా బెడ్ యిచ్చాను. నీ బాధలు నీవు_ఎర్లీ మార్నింగ్ వస్తాను" అని మేరీవైపు చూసి నవ్వి బయటికెళ్ళి హాస్పిటల్ పార్టి కోలో వున్న తనజెప్సీ ఎక్కి స్టార్ట్ చేయబోతూ లోపలి ఒకఫియట్ కారు వేగంగా రావడం గమనించి క్రిందకు దిగింది డాక్టర్ మధురిమ.

    "డాక్టర్ మధురిమగారూ! మేమంతా ఉస్మానియాలో మెడిసిన్ చదువుతున్నాం. ప్రెండు పెళ్ళికి వరంగల్ వెళ్ళివస్తుంటే బీబీనగర్ రైల్వేక్రాసింగ్ దగ్గర వున్న పొదల్లో ఒక వ్యక్తిగాయబడి అపస్మారక స్థితిలో వుండగా కనిపించాడు.యాక్సిడెంట్ కేసో, మెడికో లీగల్ కేసో తెలీలేదు. హెవీ బ్లేడింగ్_ వెంటనే రక్తం ఎక్కించకపోతే ప్రామడం.చప్పున మీరే గ్నపాకనికి వచ్చారు. వెంటనే యిక్కడికి తీసుకొచ్చాం" అన్నాడు ఒక యువకుడు వుద్వేగంగా.

    మెడిసిన్ స్టూడెంట్స్ కి తన పేరు గుర్తుకురావడం ఆనందంగా వుందిమధురిమకు. ప్రోఫేషనల్ సేటిస్ ఫేక్షన్ అంటే ఇదేనేమో?" "యాక్సిడెంట్ కేసయినా, మెడికో లీగల్ కేసయినా ముందు మనిషి బ్రతకడం ముఖ్యం. చాలా మంచిపని చేశారు. పోలీసులకు రిపోర్టు చేసినా కలిసోచ్చేది ఏమీలేదు" అని వెంటనే డ్యూటీ డాక్టర్ శ్రీరామ్ కోసం కబురు పెట్టింది. అతను రాగానే "ఏమర్జీన్సి కేస్ ట్రీట్ ఇమ్మేదియత్లీ" అంది మధురిమ శాసిస్తున్నట్టుగా.
 
    శ్రీరామ్ హడవిడిగా స్టాఫ్ ని పిలవడం, వాల్లోచి కారులోని యువకుడ్ని స్తేక్చార్ పై పడుకోపేట్టి, లోపలి తీసికెళ్ళడం క్షణాల్లో జరిగిపోయింది.

    "సాధారణంగా నైట్స్ లో జరిగిన ప్రమాదాల్లో ఊపిరితో వున్నవారికి కూడా ఎవరి హీల్స్ అందదు_ ఎందుకొచ్చిన రిస్కు అని ఎవరూ పట్టించు కోరు. చూసినా చూడనట్లుగా వెళ్ళిపోతుంటారు. మానవత్వాని మర్చిపోయి. అలాంటిది మెరు అతడ్ని యిక్కడకు తేవడం రియల్లీ ఐ అప్రీషిఎట్ యూ!అతడకి బెస్ట్ ట్రీట్ మెంట్ యివ్వాబదేలా నేను చూస్తాను" చెప్పింది మధురిమ వారికేసి ప్రశంసగా చూస్తూ.

    "చట్టప్రకారం పోలీసుల దగ్గర కేసు రిజిస్టర్ చేసి ఉస్మానియా హాస్పిటల్ కు పెషింట్ ను తీసికేల్లెసరికి చాలాఆలస్యం జరిగేది ఇమ్మీడియేట్ గా కేసు టేకాఫ్ చేసినందుకు థాంక్స్ డాక్టర్" మరో కుర్రాడన్నాడు.

    "దీన్ని మెడికో లీగల్ కేసేనే ఎందుకనుకోవాలి? నిజంగా యాక్సిడెంట్ నేస్...." లోపలకు నడుస్తూ అంది డాక్టర్ మధురిమ.

    అప్పటివరకు ఆమెలో ప్రోది చేసుకుని వున్న నిస్సత్తువ,అలసట స్థానంలో ఆ ఆక్షణమే వృత్తి పరమైన సిన్సియారిటీ చోటు చేసుకుంది.

    "గుడ్ నైట్ మేడమ్" చెప్పేసి కుర్రాళ్ళందరూ ఫియేట్ కారువైపు నడిచారు. కాసేపటికి కారు స్టార్ట్ కాబోతుండగా గయాబడ్డ వ్యక్తి తాలూకూ సూట్ కేస్ తమ దగ్గరే వుండటం గుర్తుకొచ్చిన ఒక యువకుడు_ కార్లో వున్న సూట్ కేసుని తీసుకెళ్ళి హాస్పిటల్ రిసేప్షన్ యిచ్చి తిరిగి వెనక్కొచ్చి కారేక్కాడు.

    కారు హాస్పిటల్ గేటుదాటి కొద్దిదూరం వెళ్ళాక స్టీరింగ్ ముందు కూర్చున్న యువకుడు, పక్కనున్న తన ప్రెండ్స్ ని కసురుకున్నాడు.

    "యాక్సిడెంట్ కేసని చెబితే సరిపోతుందా? యాక్సిడెంట్ కేసో? మెడికో లేగల్ కేసో అని అవతల వాళ్ళలో అనవసరమైనా అనుమానాల్ని కేత్తించటం ఎందుకు? అధిక ప్రసంగం అంటే యిదే."

    "ఇంతకీ ఆ గాయబడ్డ వ్యక్తి ఎవరంటావ్?" పక్కనున్న యువకుడడిగాడు.

    "ఎవరో మనకెలా తెలుసు?"

    "ఏ టెర్రరిస్టో అయితే?" వెనకనుంచి ఇంకో కుర్రాడు భయంగా అన్నాడు.

    "టెర్రరిస్టా?" మరో కుర్రాడు నోరెళ్ళబెట్టాడు.

    అతని సూట్ కేసు తెరచి, అతను ఎవరు అయింది తెలుసుకునిగానీ ప్రాణాల్ని కాపాడే ప్రయత్నం చేయమా? మనం కాబోయే వైధ్యులం. ప్రాణాలు తీసేవాడికి నయితం ప్రాణాలు పోయాల్సిన వ్రుత్తి మనది. ఏం కాదు పదండి, మనం చేయవలసింది మనం చేశాం. ఈ విషయాల్లో ఇరుక్కుపోతాం. మనం ఉస్మానియా మెడిసిన్
మని చెప్పటం కూడా అధిక ప్రసంగమే నా దృష్టిలో" మొదటి కుర్రాడు తిరిగి కసురుకున్నాడు.

    "ఈ కేసుని టేకాఫ్ చేసిన డాక్టర్ మధురిమ కష్టాల్లో పడుతుందని నా సిక్త్స్ సెన్స్ చేప్తోందిరా..." అని మరొకతనున్నాడు.

    "కష్టాల్లో పడుతుందో... గట్టెక్కుతుందో... కానీ మనం ఇబ్బంది పడకుండా వుంటే చాలు..." స్త్రీరిమ్గ్ ముందు కుర్రాడు సాలోచనగా అన్నాడు. అప్పుడు సమయం రాత్రి2.45నిమిషాలు దాటింది.

    ఫియేట్ కారుని నడుపుతున్న మొదటి యువకుడు, మిగతా ముగ్గుర్నుమ్చి తను కళ్లారా చూసిన విషయాన్ని దాచేశాడు. పొరపాటున అదే మేడికోలీగల్ కేసయితే ఆమెకు చుట్టుకుంది.

    అయినా అతనికి సూత్రం స్పష్టంగా అర్ధమైంది. ఎవరో ఆ వ్యక్తిని మారుతీ వ్యాన్ లో ఎక్కించుకుని తేవ్రంగా గాయపరచి, ఎక్కడికో తీసుకేళుతుండగా బీబీనగర్ రైల్వేక్రాసింగ్ దగ్గర గేటుపడిపోవటంతో ముందుగా అనుకున్న పధకాన్ని విరమించుకుని అతడిని కుప్పల్లోకి విసిరేసి వెనక్కీ వెళ్ళిపోయారు. ఇంతకీ వాళ్లెవరు? అతనెవరు? కాసేపు ఆలోచించి ఆ ఆలోచనలు ప్రమాదకరమైనవి భావించి డ్రైవింగ్ పై దృష్టిని కేద్రికరించాడా యువకుడు.
   
    ఇంతకీ వాళ్ళెవరు? అతనెవరు? కాసేపు ఆలోచించి ఆ ఆలోచనలు ప్రమాదకరమైనవని భావించి డ్రైవింగ్ పై దృష్టిని కేంద్రీకరీంచాడాయువకుడు.
                           *    *   *    *

 Previous Page Next Page