Previous Page Next Page 
యోధుడు పేజి 4

    "అనవసరపు విషయాల్లో తలదూర్చడం ఆటం మంచిదికాదు బ్లీడింగ్ చాలా అయినట్టుంది. కనుక దగ్గర్లో వున్న శుశ్రుత హాస్పిటల్ కి తీసి కెళ్ళడం మంచిది. దాని చైర్మెన్ డాక్టర్ మధురిమ చాలా మంచి మనిషి.లేడికేటెడ్ టు హార్ ప్రోపేషన్" అన్నాడు మొదటి యువకుడు.

    "ఓ.కే అయితే పట్టండి" నలుగురూ వేగంగా ముందుకు కదిలారు.

    గాయపడిన వ్యక్తిని పొదల్లోంచి బయటకి తీస్తుండగా, ఆ పక్కనే పడివున్న ఒక సూట్ కేస్ వారిలో ఒకరి దృష్టిని ఆకర్షించింది. గాయపడిన వ్త్యక్తి శరీరంతోపాటు ఆ సూట్ కేసుని తీసుకుని ఆ వ్యక్తిని, అతని సూట్ కేసుని కారు బ్యాక్ సీట్లోకి చేర్చాక కారు స్పీడందుకుంది.

    "గేరు మార్చనా బాబు. టెన్షన్గా వుంది. ఏనభైలో పోనీ" కంగారుగా అన్నాడు ఒక కుర్రాడు తనపక్కన గిలగిల్లాడుతున్న వ్యక్తి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ.

    కారు హఠాత్తుగా అమిత వేగాన్ని పుంజుకుని ఉప్పల్ కేసి దూసుకుపోసాగింది.
   
                                                 *    *    *    *   

    ఉప్పల్ లో రెండెకరాల విస్తీరణం లో నున్న శుశ్రుత హాస్పిటల్_ ఆ అర్ధరాత్రి సమయంలో మగత నిద్ర పోతున్న గోధుమరంగు కొండచిలువులా వుంది.

    నగరంలో వారంరోజులక్రితం ప్రభుత్వం మార్పిడి కారణంగా జరిగిన అల్లర్లలో గయాపడ్డా జనం యిప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.

    రెండు షిప్టుల స్టాఫ్ మూడు షిప్టుల్లో పనిచేయాల్సి వస్తోంది. మరీ ముఖ్యంగా హాస్పిటల్ చైర్మెన్ డాక్టర్ మధురిమ అప్పటికి ఇంటికెళ్ళి దాదాపు వారంరోజులపైనే అయింది.

    అప్పుడే థర్డ్ ప్లోర్లో రౌండు ని పూర్తీచేసి, తన ఛాంబర్లోకోచ్చి కూర్చుండి మధురిమ నీరసంగా.

    మామూలు సాదాసీదాగా వుండే మధురిమ బయట ఎవరయినా చూస్తె, ఎవరూ ఆమెను ఒక ఫేమస్ డాక్టర్ అనుకోరు.

    చామనచాయ, పెద్ద పెద్ద కళ్ళు, పెదవుల మీద ఎప్పుదిఓ కదలాడే చెరగని చిరునవ్వు, దాదాపు అయిదడుగుల ఎనిమిదంగుళాల పొడవు, ఎలాంటి సమయంలోనయినా ఉద్రేకం చెందని స్వభావం__ అన్నీంటికీమించీ ఒక సిన్సియర్ డాక్టర్ ప్రధానంగా వుండాల్సిన అపారమైన సహానం ఆమె సొత్తు.

    సేవాభావంతో డాక్టర్ మధురిమ పూర్తిగా హాస్పిటల్ అంకితమై పోయింది.

    ఇంజక్షన్లు, మందులు, ఆపరేషన్లు, ఏనాస్థీషియాలు ఇవే ఆమె దినచర్య.

    పాతికేళ్ళ వయస్సులో వున్న ఏ యువతి అయినా, అంత పేరు ప్రఖ్యాతులు పోందాక అలోచించేది ప్రధానంగా పెళ్ళి గురించి.

    కానీ డాక్టర్ మధురిమ ఏ ఓక్క మాగడినయినా తనదగ్గరకు రానివ్వదు. ఎందుకో ఎవరికీ తెలీదు.

    వృత్తి, ఒంటరితనాన్ని మాత్రమే ఆమె కోరుకుంటుంది. హాస్పిటల్ లో ఎంతోమంది డాక్టర్లు పనిచేస్తున్నా వారు ఎవరూ ఆమెను ఒక స్రీగా చూడరు.

    చూడకపోగా ఆమె గురించి రకరకాలుగా చాటుగా అనుకొంటూ వుంటారు.

    ఆవిడలో ఏనాడో అడ లక్షణాలు ఎగిరిపోయాయి... పైకి ఎంత పెద్ద పోస్టులో వున్నా,  ఎంత సంపాదించిన, నల్ల వాళ్ళని ఎవరు పెళ్ళి చేసుకుంటారు?" అని కొందరనుకుంటే__

    'నల్లగా అంటే, మధురిమ మసిబొగ్గులా వుంటుందా? నలుపులో ఎంతో అందముంది_ ఆవిడ్ని పెళ్ళిచేసుకోవాలంటే, ఆ స్థాయి మగవాళ్ళు వుండోద్దూ?" అని మరికొందరనుకుంటారు.

    'ఎప్పుడో ఏం.బి.బి.ఏస్. చదివే రోజుల్లో ఓ కుర్ర డాక్టర్ ని ప్రేమించి మోసపోయిందో, ఇంకేమైనా అయిందో ఎవడికి తెలుసు?' అని యింకొకరు__

    'అలాంటి మంచి మనిషిని అదిపోసుకుంటే కళ్ళు పోతాయి. మనిషి ఎలా వుండాలో, మనస్సు ఎలా వుండాలో ఆవిడ్ని చూసి తెలుసుకోవాలి. తప్పులు అందరూ చేస్తారు. త్యాగాలు కొందరే చేయగలరు. తన జీవితాన్ని పేషెంట్ల కోసం అర్పిస్తున్న త్యాగాశీలీ, ఆవిడ్ని అనుకుంటే కళ్ళుపోతాయి' అని కొంతమంది__

    తీరుబడి టైమ్ లో హాస్పిటల్ స్టాఫ్ అనుకునే మాటలు మధురిమ చెవిని పడకపోలేదు. అన్నిటినీ విని నవ్వుకుంటుందామె.

    ఒకమనిషిని అర్ధం చేసు కోవడానికి ఒక జీవితాకాలం చాలదు. అలంటి సమయాల్లో ఎక్కడో ఎప్పుడో చదివిన ఒక సూక్తిని జ్ఞాపకం చేసుకుని నావుకుంటుందామె. నవ్వుకున్న వెంటనే తిరిగి ఆలోచిస్తుంది. తన గురించి తను సమీక్షించుకుంటుంది.

    అవును_ చాలామంది దృష్టిలో తను స్రీ కాదు. తన జీవితం మోడువారిన మావికొమ్మ__ నీళ్ళులేని ఎడారి, నిజమేనా? ఆ ప్రశ్నకు జవాబు ఏకాంత సమయంలో కనురెప్పల మాటున కదలాడే ఆమె కన్నీటి బిందువులకే తెలుసు.
   
                                                      *    *    *    *
   
    చేతి గడియారం వైపు చూసుకుని భారంగా నిట్టూర్చి 'ఇవాళనయినా త్వరగా ఇంటికెళ్ళాలి' అనుకుని లేచి నిలబడింది డాక్టర్ మధురిమ.

    ఆ సమయంలోనే లోనికొచ్చింది హెడ్ నర్స్ మేరీ.

    "డాక్టర్! చూశారా ఆ థర్టీ సిక్సు తీసుకుంటూ అడిగింది.

    "మెలుకువ వచ్చినప్పుడల్లా ఒకటే గొడవ."

    "ఏమంటున్నాడు నిన్ను పెళ్ళిచేసుకుంటానంటూన్నాడా?" నవ్వుతూ అడిగింది మధురిమ.

    "అది మామూలేలేండి_అర్జంటుగా హస్పిటల్లోంచి డిస్చర్జి చేయమంటున్నాడు. వెంటనే చీఫ్ మినిష్టర్ గా పదవీ ప్రమాణం చేయాలట. తనుటైముకి రాజభవనకి వెళ్ళాకపోతే తన ఎమ్మెల్యేలందరూ ప్లేటు ఫిరాయించేస్తారని తెగ వర్రీ అయిపోతూ నన్ను టెన్షన్ లో పెట్టెస్తున్నాడు."

 Previous Page Next Page