Previous Page Next Page 
యోధుడు పేజి 6

    తనకు ఎదురుగా వున్నా మెడికల్ నోట్స్ చెక్ చేసుకుని, కుర్చీ వెనక్కీవాలి కళ్ళు మూసుకుంది డాక్టర్ మధురిమ.

    హాస్పిటల్ రాగానే రాత్రి తను జాయిన్ చేసుకున్న ఎమర్జన్సీ పేషెంట్ పరిస్థితి గురించి ఎంక్వైరీ చేసి అతని రూమ్ లో కెళ్ళింది.

    "గుడ్మార్నింగ్ మేడమ్! హిఈజ్ ఓకే.." అంటూ శ్రీరామ్  విష్ చేశాడు. పేషెంట్ నుదుటమీద, చేతులమీద బ్యాండేజిలు....
    "టైం కి ఓ పాజిటివ్ బ్లడ్ వుండబట్టి సరిపోయింది. డాక్టర్! లక్కీ పర్సన్... తెల్లవారుజామున అయిదున్నర ప్రాతంలో మెలుకువ వచింది. తనేక్కడున్నని అడిగాడు.... హాస్పిటల్లో అని చెప్పాను.... ఆశ్చర్యపోయాడు. కాసేపటికి మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు" చెప్పాడు డాక్టర్ శ్రీరామ్.

    హాస్పిటల్ అని చెబితే అతనేందుకు ఆశ్చర్యపోయాడు?" ప్రశ్నించింది మధురిమ.

    "అదే మేడమ్! నాకు కూడా అర్ధంకాలేదు" చెప్పాడు డాక్టర్ శ్రీరామ్.

    "అతనికి మెలుకువ రాగానే నన్ను పిలవండి" అని రూమ్ లోంచి బయటికెళ్ళింది డాక్టర్ మధురిమ.

    "డాక్టర్...! అ పిలుపు విన్పించిన దిశావైపు మూడుసార్లు ఫోన్ చేశాడు..." చెప్పింది మేరీ.

    "లాయర్ నీలకంఠన్...?!" డాక్టర్ మధురిమ ఆ పేరు వినడం అదే మొదటిసారి.

    "దేనికట?!" ఆశ్చర్యపోతూ అడిగింది మధురిమ.

    "మీతోనే మాట్లాడాలట! మీ రేసిడేన్స్ ఫోన్ నెంబర్ అడిగాడు. ముందు జాగ్రత్త చర్యగా నేనే యివ్వలేదు..." చెప్పింది మేరీ.

    "గుడ్! ఇంతకీ నీ పొలిటికల్ పేషెంట్ ఎలా వున్నాడు?" ఒక పక్క లాయర్ నీలకంఠన్ గురిచి ఆలోచిస్తూనే అడిగింది మధురిమ.

    "రాజ్ భవన్ .. రాజ్ భవన్ ... అనే స్లోగన్ లో మార్పేమీలేదు మేడమ్..." అంటూ నవ్వింది మేరీ.
    ఎప్పుడూ పెదవుల మీద మందహాసంతో కనబడే మేరీని యిష్టపడటానికి మొదటి కారణం ఆమె నవ్వయితే, రేండో కారణం ఆమె డెడికేడేట్ సర్వీసు...

    ముందుకు నడిచింది డాక్టర్ మధురిమ.
   
                          *    *    *    *
   
    కళ్ళు మూసుకున్న డాక్టర్ మధురిమ గణగణమని అకస్మాత్తుగా మోగిన టెలిఫోన్ శబ్దానికి కళ్ళు విప్పి యధాలాపంగా రిసీవర్ని అందుకుంది.

    అవతల నుంచి ఆస్పష్టంగా ఒక మగ గొంతు_

    "గుడ్ మార్నింగ్! అయాం లాయర్ నీలకంఠన్.... కేన్ అయ్ స్పిక్ టు డాక్టర్ మధురిమ... ప్లీజ్..." అన్నది.

    "ఏస్! డాక్టర్ చావుబతుకుల్లో వున్న కేసుని ధైర్యంగా టేకాఫ్ చేసి అతన్ని బతికించటం... ఇట్స్ ఎరేర్ థింగ్... ఫస్ట్ అల అయ్ హేవ్ టు కంగ్రాట్యులేట్ యూ..."

    "ఇంతకీ మీరు ఎందుకోసం ఫోన్ చేశారో తెలుసుకోవచ్చా?" అని అడిగిందామె.

    "ఆ పేషెంట్ ప్రోగ్రెస్ ని ఎంక్వయిరీ చేయటానికి."

    "హి ఈజ్ ఓ.కే... ప్రస్తుతం ప్రశాంతంగా నిద్రపోతున్నాడు" అని చెప్పింది.

    "గుడ్! వాటే గ్రేట్ రిలీఫ్... అతడ్ని నేను ఎంత త్వరగా కల్సుకునే అవకాశం వుంది?" అత్రుతుగా అడిగాడాయన.

    "చెప్పలేం... గాయాలు కొద్దిగా తగిలినా, అతను ఇంకా షాక్ నుంచి కోలుకున్నట్లు లేదు. ఇరవై నాల్గంతల్లో అతను స్ప్రుహాలోకి రావచ్చు.

    "ట్వంటీ ఫోర్ అవర్స్?! ఇట్స్ ఓ.కే డాక్టర్! తను మంచి డాక్టర్ పర్యవేషణలోకి ఆ మరుగాన్ కి కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను" అన్నాడాయన ఆనందంగా.

    "ఇంతకీ మీరతనానికి ఏమౌతారు?" అప్రయత్నంగా ఆ ప్రశాం డాక్టర్ మధురిమ నోటివెంట వచ్చింది.

    "పాయింట్స్ పోన్లో చెప్పుకోగలం... తప్ప స్టోరీ చెప్పు కోలెం డాక్టర్... మిమ్మల్ని పర్సనల్ గా కల్సుకున్నప్పుడు అంతా చెప్తాను" అని చెప్పి, నీలకంఠన్ చిన్నగా నిట్టూర్చి విడిచి మళ్ళీ మాట్లాడసాగాడు.

    డాక్టర్ మధురిమా! విధి అదే వింతనాటకం చూశారా? అతను మీచేతుల్లోకి రావడం వింటే కదూ? మీ పేరుప్రఖ్యాతుల గురించి విన్నాను. కేసుని మొత్తం మీరే చూస్తారుగా?"

    "ఏస్! అతను పూర్తీ కోమాలోకి జారిపోతాడేమోనని మావుదతభాయపడ్డాను ఇప్పుడా భయంలేదు... స్టాఫ్ రికవరీకి పాజిబులిటీ వుంది...." అందామె.

    "మళ్ళీ ఎప్పుడు నన్ను ఫోన్  చేయమంటారు.
    "ఆప్టర్ ప్యూ అపర్స్ ...."
    "థాంక్యూడాక్టర్ ....." ఫోన్  డిస్కనేక్ట్ అయింది. రిసీవర్ని యధాస్థానంలో పేట్టి. మళ్ళీ కుర్చీ వెనక్కీ వాలింది డాక్టర్ మధురిమ. రూమ్ లో ఏ.సి. శబ్దం మంద్రంగా వి ఆ ఏ.సి. మెషన్ వైపుతదేకంగా చూడసాగింది ఆమె.

    'మనిషి బతుకునంతకాలం నిర్విరామంగా నిమిషానికి 72సార్లు కొట్టుకునే గుండె శబ్దం వినాలంటే స్టేతస్కోఫ్ కావాలి. లేకుంటే బయటకు వినపడదు.

    మరి యంత్రాలు ఎందుకు అంత శబ్దం చేస్తాయి? మనిషిలో కూడా గుండె, లివర్. ఊపిరితిత్తులు వంటివి పెద్దగా శబ్దం చేస్తే? తన విచిత్రమైనాఆలోచనకు నవ్వుకుంది మధురిమ! ఏ రోజుకా రోజు డ్యూటీకి సంబంధించిన నోట్స్ ను, ఇంపార్టెంట్ పాయింట్స్ ను డైరీలో రాసుకోవడం అలవాటు మధురిమకి.

 Previous Page Next Page