Previous Page Next Page 
రీవెంజ్ పేజి 5

    "అతనిక్కడున్నంత కాలం ఎక్కువగా ఎవర్ని కలిసేవాడు. అతనికున్న ఆడ పరిచయాలు లాంటివి."

    "నో...." అని గట్టిగా అరిచాడు త్రివేది. సింహం ఘర్జిస్తున్నట్లుగా ఉంది అతని కంఠం.

    "అతను అందరిలాంటి వ్యక్తి మాత్రం కాదు. అసలు అతనికి ఆడ ధ్యాసే లేదు ఇక అతనికి కొడుకులుగాని కూతుళ్ళుగాని లేరనేది పచ్చి నిజం. నీకో సంగతి తెలుసా ... ?

    "అతను ఇంపోటెంట్......." రెండు మెరుపుల మధ్య ఒరిపిడిలా త్రివేది నోటి నుంచి వచ్చాయి మాటలు.

    "కాని ... నాకెందుకో అతను ఇండియాలోనే వున్నాడనిపిస్తోంది సార్ ! కనీసం పలానా చోట వుండవచ్చన్న అనుమానం వున్న చోటు ప్రయత్నిస్తే మంచిదనిపిస్తోంది." చెప్పాడు వినయంగా.

    "ఈ ప్రయత్నంలో ఇంకా కొంతమంది వున్నారు. అతను తొందరపడి ఏ పోలీస్ ఇన్ఫార్మ్ గానో మారేలోపు మనం పట్టుకోవాలి. లేదంటే అతన్ని ఈ రెండు రోజుల్లో శవంగా మార్చాలి ... అయినా అదంత సులభం కాదు," ఇంతలో కాలింగ్ బెల్ మ్రోగింది.

    ఒక అమ్మాయి నిశ్శబ్దంగా నడుచుకుంటు వచ్చి వినయంగా త్రివేదికి ఏదో చెప్పి తన వెంట తెచ్చిన వస్తువుని అక్కడే వున్న టేబుల్ పై వుంచి వెళ్ళిపోయింది.

    "నువ్ .... రేపు హైదరాబాద్ వెళుతున్నావ్ ... ! నీ దగ్గర నుంచి ఇన్ఫర్ మేషన్ ఎప్పటికప్పుడు నాకు అందుతూ వుండాలి. విష్ యూ ఆల్ ద బెస్ట్ ...." ఇక నువ్ వెళ్ళవచ్చు అన్నట్లుగా చూశాడు త్రివేది.
 
    వెళ్ళడానికి నాలుగడుగులు వేసిన అలెక్స్ కి త్రివేది పిలుపు వినిపించడంతో వెనక్కు తిరిగాడు.

    "కెన్ యూ షూట్ మి ? నన్ను చంపగలవా"

    ప్రశ్నించాడు త్రివేది.

    అలెక్స్ ఒక్కసారిగా అదిరిపడ్డాడు త్రివేది అంటున్నది ఏమి అర్ధంకాలేదు..

    "అలెక్స్ షూట్ మి. నీ రివాల్వర్ తో నన్ను చంపు లేదంటే నిన్ను నేను షూట్ చెయ్యవలసి వస్తుంది."

    త్రివేది ఖంగుమన్న కంఠంతో ప్రశ్నించాడు.

    అలెక్స్ అదిరిపడుతూ త్రివేదిని చూశాడు. అతని కళ్ళల్లో వున్న సీరియస్ ని గమనించిన అలెక్స్ వణుకుతున్న చేతులతో రివాల్వర్ కోసం తడుముకున్నాడు. అతని రివాల్వర్ కనిపించక పోవడంతో కంగారు ఎక్కువైయింది. ఇది గమనించిన త్రివేది...

    "ఒక విషయం గుర్తుంచుకొంటే మంచిది. నువ్ ఎంచుకున్న ప్రొఫెషన్ కి అమ్మాయిలతో ఎంజాయ్ చెయ్యడానికి పడదు ఈ విషయంలో కేర్ ఫుల్ గా వుండగలిగితే మంచిది నువ్ ఇక్కడికొస్తూ హడావిడిలో నీ రివాల్వర్ మరిచిపోయావు. ఆ మరుపు కూడా పనికి రాదు. నువ్ ప్రొఫెషనల్ కిల్లర్ వనేది గుర్తుంచుకొంటే మంచిది వెళ్ళేటప్పుడు టేబుల్ మీద వున్న ణా రివాల్వర్ తీసుకువెళ్ళు."

    అలెక్స్ కి అర్ధమయింది, త్రివేది తన నెంతగా గమనిస్తు ఉన్నది. నీతాతో తను గడిపిన విషయం అప్పుడే త్రివేదికి చేరిందన్న మాట తలచుకుంటే కాళ్ళలో సన్నని వణుకు ప్రారంభమైంది. అదిరే గుండెల్ని అదుపులో పెట్టుకుని టేబుల్ దగ్గరికి వెళ్ళి టేబుల్ పైన వున్న ఒక వెండి పళ్ళెం మీద వున్న క్లాత్ ని జరిపి ఆ రివాల్వర్ ని తీసుకోబోయి షాకయ్యాడు. జీవం లేని చెయ్యి ఒకటి రక్తంతో తడిసి వుంది. చేతి మణికట్టు వరకు మాత్రమే వుంది. చేతికి వున్న డైమండ్ రింగ్ ని చూసిన తరువాత అది నీతాదని అర్ధమై ముచ్చెమటలు పోశాయి. ఆ ఉలికిపాటు కప్పి పుచ్చుకుంటూ మొహం ప్రక్కకి తిప్పుకొని మెల్లగా బయటికి అడుగు వేశాడు అలెక్స్.

    అవినాష్ త్రివేది తన జీవితాన్ని రాళ్ళు కొట్టడంతో ప్రారంభించి గొప్ప పారిశ్రామికవేత్తగా, సంఘ సంస్కర్తగా మారాడంటే ... ? ఈ రోజున అపాయింటుమెంటు లేకుండా దేశ ప్రెసిడెంట్ ని కూడా కలుసుకోగలడంటే ... ?

    ఈ ఒక్క సన్నివేశంలో త్రివేది గొప్పతనం అర్ధమయింది అలెక్స్ కి.

    రూమ్ కి ఎలా చేరాడో అతనికే తెలియదు.

    బలరాజ్ వ్యవహారంలో తను ఫెయిలైతే పరిణామాలు ఎలా వుంటాయన్నది శాంపిల్ గా తనకి రుచి చూపించాడు త్రివేది.

    ఈ సంఘటనతో అలెక్స్ జీవితంలో తొలిసారిగా భయం ప్రవేశించింది. రూమ్ లో ఎక్కడ వస్తువులక్కడ నీట్ గా వున్నాయి ఒక్క నీతా తప్ప. నీతాని త్రివేది చంపించటం ఏదోలా అనిపించింది అలెక్స్ కి.

    రిస్ట్ వాచ్ రేడియం డయల్ సమయం 4-30 చూపిస్తోంది. మరొక అరగంటలో తను ఫ్లైట్ లో వుండాలనుకుంటూ బ్రీఫ్ కేస్ అందుకున్నాడు. అతను ఫ్లైట్ ఎక్కుతుండగా ఎందుకో ఎడమ కన్ను అదిరింది, అపాయాన్ని సూచిస్తున్నట్లుగా.

                        *         *         *

    "ఏమిటి అన్వీ - వర్షంలో తడుస్తూ ఆలోచిస్తున్నావ్ ... ? ఆ ఆలోచన లేవో మాతో పంచుకోవచ్చుగా ... ?" అన్న మిత్ర బృందం మాటలకు ఆలోచన్లకి బ్రేక్ వేసి ఇహ లోకంలోకి వచ్చింది అన్విత.
 
    అన్విత మరో అయిదుగురు అమ్మాయిలు కలిస్తే ! 'మిస్ - 29' కంటే బలమైన శక్తిగా గుర్తిస్తారు హాస్టల్లోని మిగతా అమ్మాయిలు. వీళ్ళు కలిసారంటే మిగతా ఎవరికైనా వీళ్ళ ఎదుట పదాలంటే భయపడతారు పి. జి. లో ఒకే గ్రూప్ ఒకే సంవత్సరం కావడంతో ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా కలిసే చేస్తారు.
 

 Previous Page Next Page