Previous Page Next Page 
మిస్టర్ క్లీన్ పేజి 4

 

    మహానంద తన సీటులోంచి లేచి నిలబడి చెప్పింది. బొద్దింక సార్!"

 

    "వాట్!" లెక్చరర్ ఎర్రజీరళ కళ్ళతో అడిగాడు.


    
    మహానంద అన్న తీరు ఎలా వుందంటే "బొద్దింక సారూ!" అని ఆయన్ని పిలిచినట్లు వుంది. క్లాసు రూములో వున్న అందరికి నవ్వు వచ్చింది. పెదవి బిగింపులో అందరూ నవ్వుని నొక్కి పట్టారు.

 

    "బొద్దింక అదేసార్! కాక్రోచ్. నా కాలి మీదకి ఎక్కింది భయంతో విదిలించాను. ధైర్య మీద వెళ్ళి పడింది. అదేమో శ్రీవిద్య మీద పడేసింది. ఇందులో ఎవరం కూడా కావాలని చేయలేదు. అదే అలా అలా....

 

    "గెట్ అవుట్ !" మహానందని చూస్తూ అన్నాడు చూపులు తన వేలిని శ్రీవిద్య ధైర్య వేపు కూడా సారించాడు.

 

    మహానంద శ్రీవిద్య ధైర్య ముగ్గురు లేచి తలకాయలు పూర్తిగా భూమిలో దించుకుని క్లాస్ రూమ్ వదిలారు.

 

    "బొద్దింకట బొద్దింక వీళ్ళ ముగ్గురు రాక్షసి బొద్దింకలు." గొణుక్కున్నాడు. కాని వాళ్ళు ముగ్గురూ తలలు  పెద్ద నేరం చేసిన వాళ్ళులా వంచుకుని క్లాస్ రూం విడవడం మాత్రం మహాను భావుడికి చాలా సంతోషం కలిగించింది. విషయం తెలిస్తే నిప్పు తొక్కిన కోతి అయేవాడు. అది వేరే విషయం. ఆ నిమిషాన ఆయనకి అనుమానం రాలేదు.

 

    వీళ్ళ ముగ్గురికి కావాల్సింది అదే.

 

    పిల్లుల్లాగా ముగ్గురూ క్లాస్ రూమ్ లోంచి బయటికి వచ్చారు. మోనంగా కాలేజి ఆవరణ దాటారు.

 

    అప్పుడు....అప్పుడు

 

    విరగబడి నవ్వుకున్నారు.

 

    "బొద్దింక," అంది మహానంద.


 
      "కాక్రోచ్" అంది శ్రీవిద్య.

 

    "భాష వేరైనా జీవి ఒకటే" అంది ధైర్య.

 

    కాలేజికి కొద్ది దూరంలోనే పార్క్ వుంది. ముగ్గురు మౌనంగా పార్క్ లోకి నడిచారు.

 

    పూర్తిగా సాయంత్రం కాకపోవడంతో పార్క్ లో జనం లేరు. పార్క్ లో ఓ పక్కగా వున్న గుబురు క్రోటన్స్ పోద దగ్గరకు వెళ్ళి మహానంద అటూ యిటూ చూసి "ఈ ప్లేస్ బాగుంది." అంది.

 

    "దేనికి?" శ్రీవిద్య అడిగింది.

 

    "కూర్చోడానికి." అంటూ మహానంద కూర్చుంది.

 

    ధైర్య శ్రీవిద్య నవ్వుతూ మహానంద ఎదురుగా కూర్చున్నారు.

 

    "సాక్ష్యం చూపిస్తాను, యీద్దరూ కళ్ళు మూసుకోండి." మహానంద వ్యానిటి బ్యాగ్ జిప్ లాగుతుంది.

 

    "నీవు చెప్పిన తరువాత ముసుకోక చస్తామా!" చిరునవ్వుతో సమాధానం చెప్పింది శ్రీవిద్య.

 

    "నోరేగా అంది ధైర్య


    మహానంద మాట్లాడకుండా బ్యాగ్ లోంచి సాక్ష్యాధారం పైకి తీసింది.

 

    ముందు ముందు ఓ భయంకర సంఘటన జరగటానికి అంకురం ఆ క్షణాన అక్కడ ఏర్పడింది.

 

    ఆ విషయం ఆ ముగ్గురికి తెలియదు.     

                                                 ౩

 

    "ఇదేనా మా దేశం ఇదా భారత దేశం!"

 

    తాతలనాటి పాత సినిమా "జీవితం"లోని పాట లౌడ్ స్పెకరులో చెవులు బద్దలయే సౌండ్ తో వినిపిస్తుంది.

 

    "జీవితం సినిమాలోది ఈ పాట ముదోసారో నలుగోసారో ఆ సినిమా వచ్చినప్పుడు అమ్మతో కలిసి వెళ్ళాడు. అప్పుడు తనకి నిండా పదేళ్ళు వున్నాయో లేదో! ఎందుకో తెలియదు ఆ పాటంటే మొదటినుంచి తనకి అమిత యిష్టం. ఆ రోజుల్లో పాటగా యిష్టపడ్డాడు. అదే ఈరోజుల్లో ఈ దేశం పోకడ చూసి రోజుకి ఒకసారి అయిన అనుకోకుండా వుండలేక పోతున్నాడు. ఇదేనా మా దేశం ఇదా భారత దేశం!"

 

    గౌతమబుద్ధ అలా ఆలోచిస్తూ ముందుకు సాగుతున్నాడు.

 Previous Page Next Page