మండ్యాలో దాసప్ప అనే తన ఫ్రెండొకడున్నాడు. అతన్ని కలిసి జరిగింది చెప్పి, సహాయం అర్థించాలనే అక్కడికి బయలుదేరాడు.
సన్నటి చలిగాలి....
లేత నీలం బ్లూ వెలుగులో కంపార్ట్ మెంట్, నాటకం సెట్టింగ్ లా వుంది. అక్కడక్కడా వున్న ప్రయాణీకులు గాఢనిద్రలో వున్నారు. మైత్రేయ మనసు గందరగోళంగా వుంది.
ఒకవేపు మర్డర్ కేసు, రెండోవేపు పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకోవడం. రేపటినుంచి పోలీసులు తనకోసం సీరియస్ గా వెతకడం ప్రారంభిస్తారు.
మోహితను పట్టుకొని పోలీసులకు అప్పగిస్తేనే తప్ప, తను నిర్దోషిగా బయటపడలేదు.
సీటుకు చేరబడి సిగరెట్ తాగుతూ పరిపరివిధాలుగా ఆలోచిస్తున్నాడు మైత్రేయ.
అంతా టెన్షన్.... టెన్షన్..... కళ్ళు మూసుకున్నాడు.
చీకట్లో ట్రైన్ పరిగెడుతున్న చప్పుడు.
కళ్ళు మూసుకున్న మైత్రేయకి ఏవో చిన్నగా గుసగుసలు, గాజుల చప్పుడు విన్పించేసరికి చటుక్కున కళ్ళిప్పాడు.
అటూ, యిటూ చూశాడు.
ఎడమవేపు రెండో సీటుమీద భార్యాభర్తలు. ఇద్దరూ పాతికేళ్ళలోపు వారే.
పల్లెటూరి దంపతులు.
ఆ యువకుడి బలమయిన చేతులు, ఆ యువతి గుండెలమీదున్నాయి.
ఆ యువతి తన్మయత్వంతో ఇష్టంగా గుసగుసలాడుతోంది.
చూడటం తప్పనుకుంటూనే మానవ సహజమయిన ఆసక్తితో ఆ దృశ్యాన్ని చూస్తున్నాడు మైత్రేయ.
"ఎవరైనా చూస్తారు...." గిలగిల్లాడుతూ అంది ఆ యువతి.
"నువ్వు నా పెళ్ళానివి.... ఎవరేం అంటారు? అందరూ పడుకున్నార్లే...." చిలిపిగా ఆమె బుగ్గను కొరికి ఆమెమీదకు ఒరిగాడతను.
మైత్రేయకి ఆ అమ్మాయి ఒత్తయిన జుత్తు, అర్థనగ్నపు భుజాలు మాత్రమే కన్పిస్తున్నాయి.
ఆ అమ్మాయి తీపి బాధతో గిలగిల్లాడుతోంది. వేడివేడి నిట్టూర్పులు, మనిషి కూడా జంతువే. తన కామనను దాచుకాలేడు. ఆపుకోనూలేడు. సెక్స్ కోరి చాలా గొప్పది. ఆ కోరికలో పూర్తి సంతృప్తి పొందితేనే మనిషి ఏమయినా చెయ్యగలుగుతాడు.
పది నిమిషాల సేపు అలా ఆ కాంక్షా నగ్నత్వాన్ని చూస్తూ వుండిపోయాడు మైత్రేయ. ఆ తర్వాత కాసేపయ్యాక ఆ యువతి చీరను, జాకెట్టును సరిచేసుకుని కూర్చుంది. ఆ యువకుసు మగతగా నిద్రపోతున్నాడు.
మైత్రేయకి వళ్ళు వేడెక్కిపోయింది.
ఆ యువకుడు, ఆ యువతిని గాఢంగా చుంబించిన దృశ్యం మైత్రేయకి పదేపదే గుర్తుకు వస్తోంది.
ఆడ, మగల కలయిక ముద్దు ఒక మమతల వంతెన.
మగవాడికి గాని, ఆడపిల్లకుగానీ తొలిముద్దు, తొలి కౌగిలి, తొలి సంగమం, జీవితాంతం మధురమయిన అనుభూతుల్నిస్తాయి.
మేనమామ కూతురు ఇందుమతితో తొలిముద్దు అనుభవం అకస్మాత్తుగా గుర్తుకు వచ్చింది మైత్రేయకి.
* * *
మూడేళ్ళ క్రితం...
పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్స్ రాసి, మేనమామ ఊరు నందిగామ వెళ్ళాడు మైత్రేయ.
తల్లిదండ్రులు రెండేళ్ళక్రితం యాక్సిడెంట్ లో చనిపోయారు. ఒకే ఒక అక్క పెళ్ళయి ముంబాయిలో వుంటోంది. అన్నివిధాలుగా తన బాధ్యతను స్వీకరించి, తనకు సహాయపడింది మేనమామ ఒక్కడే. ఆ మేనమామ కూతురు ఇందుమతి.
సన్నగా, పొడవుగా వుంటుంది ఇందుమతి. ముఖంలో పల్లెటూరి ముగ్ధత్వం, తీర్చిదిద్దినట్టుండే పెదాలు, గుండ్రటి కళ్ళు, చెవులకు జూకాలు, పొడవాటి జడ.... కాళ్ళకు బంగారు పట్టీలు..... అణువణువునా తొణికిసలాడే హుషారు.
వరండాలో మేనమామలో మాట్లాడుతున్నాడు మైత్రేయ.
వంటగదిలో తల్లికి సహాయం చేస్తోంది ఇందుమతి. పేరుకి సహాయంగానీ, తల్లి కరివేపాకు ఇవ్వమని అడిగితే గోంగూరకట్ట తీసిచ్చింది. ఉప్పు యిమ్మంటే పంచదార డబ్బా యిచ్చింది.
"ఏంటీ..... అంత మతిమరుపు.... ఒకచోట వుండలేకపోతున్నావే. ఒక పని సరిగ్గా చెయ్యలేకపోతున్నావ్" విసుక్కుంది తల్లి.
"నీకు బావ ఉన్నాడా అమ్మా!" కొంటెగా అడిగింది ఇందుమతి.
"నాకు బావ వుండటం ఏమిటే? పిచ్చిమొద్దూ....." విసుక్కుంది తల్లి.
"ఇప్పుడు కాదులేవే... పెళ్ళికాకముందు...."
"ఆ ఊసులన్నీ నీకెందుగ్గానీ..... వెళ్ళి బావకేం కావాలో చూడు...." అంటూ పెరట్లోకి వెళ్ళగానే, తూనీగలా మధ్యగదిలో కొచ్చింది ఇందు. మేనమామతో మాట్లాడటానికి ఎవరో రావడంతో, అదే అదనుగా ఆయన నుంచి తప్పించుకుని గబగబా మధ్యగదిలో కొస్తున్న మైత్రేయని, పరుగు పరుగున వస్తున్న ఇందుమతి ఢీకొట్టింది.
"ఏయ్.... ఏంటది...." ఆమె భుజాలమీద చేతులు వేసి, ఆమె వేగానికి అడ్డుకట్ట వేసి, ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు మైత్రేయ.
బావ ఎదురుగా అంత దగ్గరగా నుంచోవడం అదే మొదటిసారి. పలకమారిన పడుచు ఉచ్ఛ్వాస- నిశ్వాసలు అతని గుండెలకు వేడిగా తగులు తున్నాయి.
"అయ్యబాబోయ్..... బావ...." తన భుజాలమీదున్న మైత్రేయ చేతుల్ని తీసేసి, కొంచెం వెనక్కి జరిగి, బావ స్పర్శకు మరి సిగ్గుతో ఎర్రబారిపోయిన తన ముఖాన్ని, ఎలా బావకు కన్పించకుండా చెయ్యాలో తెలీక ముందు రెండు చేతుల్నీ ముఖానికి అడ్డం పెట్టుకుని, అప్పటికీ బావ తనముఖంవేపే చూస్తున్నాడని మరింత కంగారుపడి, గబగబా కిందకు వంగి, పట్టులంగాను పైకెత్తి ముఖానికి ముసుగుగా వేసింది.
ఊహించని ఇందుమతి చేష్టకు బిత్తరపోయాడు మైత్రేయ.
ఒక్కక్షణంలో వాన తుంపర ఒంటిమీద పడినట్లుగా చిరుచెమటతో తడిసిపోయాడతను.
ఇందు ముఖాన్ని కప్పుకుంది కానీ, అరటి బోదెల్లాంటి పచ్చటి ఊరువులను అనాచ్ఛాదితంగా వదిలివేసిందని ఆమెకు తెలీదు.
అర్థనగ్నపు కాళ్ళ సౌందర్యాన్ని చూస్తున్న మైత్రేయ శరీరంలో వెయ్యి ఓల్టుల విద్యుత్ ప్రకంపనలు పరుగెడుతున్నాయి.
"ఏయ్.... పిల్లా..... ముఖాన్ని కాదు, కాళ్ళను కప్పుకో" గబగబా అనేసి ముందుకు పోబోయాడు మైత్రేయ.
అంతలో తేరుకుని, పైకి లేచిపోయిన తన లంగావేపు చూసుకుని, బోల్డంత సిగ్గుపడిపోయి లంగాను సర్దుకుని, ముందుకు వెళుతున్న మైత్రేయ కుడిచేతిని పట్టుకుని వెనక్కి లాగింది ఇందుమతి.
మైత్రేయ వెనక్కి తూలిపోబోయి, ఆమె నడుంమీద చెయ్యివేసి నిలదొక్కుకున్నాడు.
అతని చెయ్యి, ఆమె నడుం మడతల మీద పడగానే 'అబ్బా' అని మూలిగింది ఇందు.
ఇద్దరు ముఖాలూ దగ్గరి దగ్గరిగా వున్నాయి. ఒకరి ఉచ్ఛ్వాసలు ఇంకొకరికి గాఢంగా విన్పిస్తున్నాయి.
పదహారేళ్ళ ఇందు పెదవులు, శరీరం ప్రధమ పురుషస్పర్శ కారణంగా, చిరుగాలికి ఊగే లేతాకుల్లా సన్నగా వణుకుతున్నాయి.
తియ్యని బాధ, ఆ బాధను, ఆ స్పర్శను తట్టుకోలేకపోతోంది ఆ పిల్ల. మైత్రేయ భుజాలమీద రెండుచేతులూ వేసి, అతని కళ్ళల్లోకి ఆడపుల్లి చూసినట్టుగా చూసి, అతని నుదుటమీద, చేతులమీద, ఎర్రటి పెదిమిలమీద గబగబా గట్టిగా ముద్దులు పెట్టేసి.... చివరగా....
అతని పెదవులకు తన పెదవుల్ని అందించింది.
ఆ ముద్దులకు ఆమె పరవశించిపోతోంది.
ఒకరి వేళ్లు ఇంకొకరి వేళ్ళలో ఇరుక్కుపోయాయి. పరవశం, తాదాత్మ్యత, చప్పుడు చెయ్యకుండా మనసు కొడుతున్న కేరింతలు, వయసు వీణ నిశ్శబ్దంగా విన్పిస్తున్న పులకరింతలు, అణువణువునా వింత కంపన.
మూడే మూడు నిమిషాలు.....
బరువెక్కిన మనసుతో, కళ్ళిపి అతనివేపు తేరిపార చూసి, అతని చేతుల్నుంచి విడివడి మౌనంగా పెరట్లోకి పరుగెత్తింది ఇందుమతి.
గది మధ్యలో నిరుత్తరుడై నిలబడిపోయాడు మైత్రేయ.
* * *
ఎప్పుడు నిద్రపట్టేసిందో తెలియదు మైత్రేయకి.
సరిగ్గా ఉదయం ఐదు గంటలైంది. మాండ్యా రైల్వేస్టేషన్లో ట్రైన్ ఆగింది. స్టేషన్ లోంచి బయటికొచ్చాడు మైత్రేయ. అటూ యిటూ చూశాడు. దగ్గర్లో కన్పించిన రిక్షా ఎక్కి, దాసన్న ఇంటి అడ్రస్ చెప్పాడు. మరో అయిదు నిమిషాల్లో దాసప్ప ఇంట్లో వున్నాడు మైత్రేయ. జరిగిందంతా పదినిమిషాల్లో పూసా గుచ్చినట్లు చెప్పాడు మైత్రేయ. విని షాక్ తిన్నాడు దాసప్ప. అయినా క్షణాల్లో తేరుకుని మైత్రేయ ఇచ్చిన విజిటింగ్ కార్డు చూశాడు దాసప్ప.
రాజేంద్రకుమార్, ఫారెస్ట్ కంట్రాక్టర్ అనే అక్షరాలు చూస్తూనే దాసప్ప ఆశ్చర్యపోయాడు.
"ఈ రాజేంద్రకుమార్ ది ఈ ఊరే. బాగా డబ్బున్నవాడు. ముదుమలై, బండిపుర, మలై మహాదేశ్వరా హిల్స్, తితిమతి, నాగరహూలే అడవుల మీద నిజమైన పెత్తనం ఇతనిదే.
ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ సిబ్బందిని తన గుప్పెట్లో పెట్టుకుని, చూస్తుండగానే కోటీశ్వరుడైపోయాడు.
అతనికి మాండ్యాలోనే పెద్ద గెస్ట్ హౌస్ వుంది. ఇతనికి హైలెవెల్లో పోలిటికల్ కనెక్షన్స్ కూడా బాగా వున్నాయి.
"చూస్తూ చూస్తూ ఇందులో ఎలా ఇరుక్కువురా బాబూ?" నిట్టూరుస్తూ అన్నాడు దాసప్ప.
"ఏదో థ్రిల్ కోసం అలా చేశాను. ఇది ఇలా పరిణమిస్తుందని నేను వూహించలేదు" ఉద్రిక్తతను దాచుకుంటూ అన్నాడు మైత్రేయ.
* * *
కావాలనే దాసప్ప, మైత్రేయ రిక్షాలో బయలుదేరారు.
రాజేంద్రకుమార్ గెస్ట్ హౌస్ దగ్గరికి చేరుకునేసరికి అరగంట పట్టింది.
అది పాతకాలపు నాటి పెద్ద బంగ్లా.....
నల్లటి ఇనుపగేటు....
బంగ్లా చుట్టూరకరకాల చెట్లతో చిట్టడవిలా వుంది.
బిల్డింగంతా నిశ్శబ్దంగా వుంది.
గేటు తెరుచుకుని లోనికెళ్ళారిద్దరూ.
ఓ పనివాడు అక్కడేదో పనిచేస్తూ కనిపించాడు.
వీళ్ళిద్దరినీ చూస్తూనే పనాపేసి వాళ్ళకు ఎదురొచ్చాడు.
"ఎవరు కావాలి బాబూ?"
"రాజేంద్రకుమార్ గారు."
"అయ్యగారు ఢిల్లీ వెళ్ళారు కదా!"
"ఎప్పుడు?"
"వారం రోజులైంది."
"రెండు, మూడు రోజుల్లో రావాలి సార్."
"అమ్మగారున్నారా?"
"అమ్మగారా, ఎవరు?" తిరిగి ప్రశ్నించాడు పనివాడు.
"అదే... మోహిత..."