"వీళ్ళయ్యా కాశీచరణ్... ఈ ఇంట్లో మనుషులు. మా అయన శశిభూషణ్ గారి విషయానికొస్తే నువ్వు అరగంట ఎకధాటీగా మాట్లాడితే, అయన ఒక్క నిమషమే మాట్లాడతారు. మా నాన్నగారొక్కరే మీకు కంపెనీ ఇవ్వగలిగితే ఏకైక వ్యక్తి ఇంకా ఈ బతతకి సంబంధించిన ఇంకో వ్యక్తి కరుణాకర్ ... రెండ్రోజులకొకసారి రాజమండ్రినుంచి వస్తుంటాడు. ఫన్నీ ఫెలో" అంది ప్రమద్వర.
కరుణాకర్ అంటే మాబావగారి అక్కయ్య కొడుకు. అతను కూడా చిన్నప్పటినుంచీ మా ఇంట్లోనే పెరిగాడు. రాజమండ్రీలో ఇంజనీరుగా పని చేస్తున్నాడు" అని చెప్పింది మధురిమ.
"మీరు మాట్లాడుకోండి. మేం వంటపనిలో పడతాం" అంటూ మధురిమను తీగుకుని కిచెన్ రూమ్ లోకి నడిచింది ప్రమద్వర. మధురిమకి అక్కడినుంచి వెళ్ళాలని లేకపోయినా తప్పలేదు.
"మావయ్యా! అర్జంటు పనుంది. రాత్రికి కలుస్తాను" అంటూ లేచ్జ్హాడు ప్రమద్వర భర్త శశిభూషణ్.
"అర్జంటు పనుంటే అక్కడికేకదా. ఇవాళ నేను రానులే. మన కాశీచరణ్ తో చాలా విషయాలు మాట్లాడాలి" కన్నుగోడుతూ అన్నాడు శ్రీమన్నారాయణ. ఆయన్ని బయటి వాళ్ళందరూ శ్రీగారూ అని అంటుంటారు.
అందరూ వెళ్ళిపోయాక_
"రావయ్యా... గార్డెన్లోకెళదాం" అన్నారు శ్రీగారు.
ఇంటివెనుక విశాలమైన పెరడు_ పిట్టగోడ_దానికి చిన్న గేటు_గేటుకి ముందు బావి_ గేటు దాటాక కూరగాయల పొలం.
"ఈ కనబడుతున్న పొలమంతా మనదే. అంటే నాదే_ యాభై ఎకరాలుంటుంది_ నా తదనంతరం యిది సగం ప్రమద్వరకు సగం మధురిమకు చెందుతుంది" అని చెప్పి "చూడబ్బాయ్... బొంబాయి వెళ్తే రేఖ మనతో మాట్లాడుతుండంటావా?" అని అడిగాడాయన సడన్ గా సీరియస్ గా.
"ఏ రేఖండీ?" బిత్తరపోతూ అడిగాడు కాశీచరణ్.
కాశీచరణ్ మాటకి పెద్దపెట్టున నవ్వాడాయన.
సినీ నందనవనంలో వున్నది ఒక్కటే రేఖయ్య బాబూ! నటి రేఖ."
"తెలీదండీ" అన్నాడు కాశీచరణ్.
"పోనీ... మమతాకులకర్ణి?"
"ఆ పేరు నేను వినలేదండి."
"పోనీ... సిల్కుస్మిత?"
"తెలీదండి."
"నువ్వు సినిమాల్లో పూర్ అన్నమాట_ పోనీ నీకు ఓల్ట్ ప్యాషన్ అమ్మయిలిష్టమా? మోడ్రన్ అమ్మాయిలంటే ఇష్టమా?"
"ఓల్ట్ ప్యాషన్ అమ్మాయిలంటే యిష్టం."
అంటే... మా మధురిమలాంటి వాళ్ళన్నమాట. పూర్ ఫెలో. నాటు అందాల్లో బ్యూటీ ఏమిటయ్యా. బ్యూటీ అంటే మోడ్రన్ లేడీస్ లోనే చూడాలి. అమెరికన్ లేడీస్ చూడు... ఆ ఫిగార్స్ చూడు... వారెవ్వా. ఎప్పటికప్పుడు అమెరికా వెళ్ళాలనే నా ప్రయత్నానికి నా కూతుర్లిద్దరూ గండికొట్టేస్తున్నరయ్యా..." బాధపడిపోతూ అన్నాడు శ్రీమన్నారాయణ.
"మీకి వయస్సులో మోడ్రన్ అమ్మాయిల మోజెంటి సార్..." నవ్వుతూ అడిగాడు కాశీచరణ్.
"నా వయస్సు ఏ తనుకున్నావ్? ఏభై అరెళ్ళేనయ్యా! ఏభైఆరేళ్ళంటే యిక్కడ ముసలితనంకింద లెక్కగానీ ఫర్లాన్లో కాదు. ఎప్పటి కైనా అక్కడి కెళ్ళిపోయి, ఇద్దరు దొరసాన్లాతోడ్యూయెట్లు పాడాలయ్యా... అడ్రీమ్ ఎప్పుడు నెరవేరుతుందో ఏమో" నిట్టూరుస్తూ అన్నాడాయన.
ఎంతో విచిత్రంగా కనిపిస్తున్నా ఆయనకేసి విస్మయంగా చూస్తూ న్నాడు కాశీచరణ్.
"వారానికి రెండుసార్లు నేను రాజమండ్రి వెళతాను_ ఇకనుంచి నువ్వే నాకు కంపెనీ... ముందే చెప్పెస్తాన్నా... అర్ధమైందా?"
"అలాగే సార్!" అన్నాడు కాశీచరణ్ నవ్వును దాచుకుంటూ.
అమ్మాయిల వేటకు సంబంధించి, తనకు ఎదురైనా రకరకాల ముచ్చట్లన్నీ చెబుతున్నాడు శ్రీగారు_ వాటన్నీట్నీఆశ్చర్యంగా వింటున్నాడు కాశీచరణ్.
"మనిషన్నాక కాస్తంత కళాపోషణ ఉండాలి ముత్యాలముగ్గు సినిమాలో రావుగోపాలరావు థియరీయే నాది కూడా_ ఇక్కడ నువ్వు ఎన్నాళ్ళయినా వుండు. నాకభ్యంతరం లేదు. కానీ విధిగా నువ్విక్కడ ఓ పని చేయాలి..." అన్నాడు అయన.
"ఏంటా పని?"
"ఇక్కడున్నప్పుడే నువ్వు ఎవర్నో ఒకర్ని ప్రేమించాలి" అన్నాడు.
"నేనా...? ప్రేమించాలా...?!"
"తప్పదు... నువ్విక్కడ ఎవర్నో ఒకర్ని ప్రేమించడం, ఆ ప్రేమ పెళ్ళి న చేతుల మీదుగా జరగడం..." అంటూ ఇంకా ఏదో చెప్పాబోతూ శశిభూషణ్ చూసి ఆపేశాడు. శ్రీగారు.
"మావయ్యా! మీ ప్రేమ సిద్దాంతాలన్నీటినీ పాపం కాశీచరణ్ మెదడులోకి ఎక్కించేశారా?"శశిభూషణ్ అడిగాడు కాశీచరణ్ కేసి జాలిగా చూస్తూ.
"నువుప్పుడు తిరిగొచ్చావ్?"
"ఇప్పుడే. ప్రెండ్స్ అందరూ రాజమండ్రి వెళ్ళారు."
"నేను అదే అనుకున్నానులే. ఆ చతుర్ముఖమేదో మనమే వేసుకుంటే పోలా. ఏవయ్యా! నీకు పేకాట వచ్చా?" కాశీచరణ్ ని అడిగాడు శ్రీగారు.
"రాదండి" అన్నాడు కాశీచరణ్ బిక్కమోహమేసి.
"మరి నీకేమొచ్చు ?" అని ఏదో అనబోతుండగా ___
"నాన్నా! కాశీచరణ్ అప్పుడే పాడుచేసేయకండి_ కాశీ!ఆపేద్ద మనిషుల కబుర్లను సీరియస్ గా పట్టించుకోకు" అంది అక్కడకు వచ్చిన ప్రమద్వర.