"బావగారూ... కాశేచరణ్ ని నాన్నగారి బారినుంచి రక్షించే పూచీ మీదే..." అంది అక్కగారితో కలసి అక్కడికి వచ్చిన మధురిమ.
"నాకలాంటి పెద్ద పెద్ద బాధ్యతలు అప్పగించకు తల్లోయ్. అయన గారి బారినుండి నన్ను నేను రక్షించుకోవడానికే తలప్రాణం తోకకొస్తుంది" పెద్దగా నవ్వుతూ అన్నడతను.
అందరూ మనసారా నవ్వారు.
* * * *
రాత్రిఎనిమిది, తొమ్మిది గంటల మధ్య అందరూ కలసి భోజనం చేయడం ఆ ఇంటి అలవాటు.
పెద్ద డైనింగ్ టేబుల్ మీద కోడికూర, పలావు, పెరుగు, అరటిపళ్ళు పెట్టుకున్నాయి. కబుర్లు చెప్పుకుంటూ అందరూ భోంచేయసాగారు.
"కల్యాణీంకా రాలేదా?" అడిగింది మధురిమ.
"వచ్చేశాను" అంటూ పరుగు పరుగున లోనకొచ్చి, సింక్ దగ్గర చేతులు కడుక్కుని కాశీచరణ్ పక్కన కుర్చీలో కూర్చుంది కల్యాణి.
అప్పుడప్పుడే తను డిల్లీ వెళ్ళినప్పుడు ముచ్చట్లు అన్నీ చెబుతున్నాడు శ్రీగారు.
"ఆ డిల్లీ ముచ్చట్లు ఇప్పుడెందుకు నాన్నా?" ప్రమద్వర అ టాపిక్ ని కట్ చేసి, వేరే విషయాల గురించి మాట్లాడసాగింది.
ప్రమద్వర గొప్ప మనస్తత్వం కాశీచరణ్ కి అర్ధమైంది. అక్క డున్న వాళ్ళెవరూ కాశీచరణ్ జబ్బు గురించి మాట్లాడకుండా మేనేజ్ చేస్తోంది ప్రమద్వర.
"మిస్టర్ చరణ్... మీకు కారు నడపడం వచ్చా?" సడెన్ గా అడిగింది కల్యాణి.
"రాదు" చెప్పాడు అతను ఎక్కడో ఆలోచిస్తూ.
"పోనీ మారుతీ జిప్సీ?" అల్లరిగా వేసింది ప్రశ్న.
"అదేంటి... ఆ ప్రశ్న..."ప్రమద్వర వరించింది.
"కొంతమంది లారీలు తోలుతారు_కానీ కారుని తోలలేరు. అందుకన్నమాట. డోన్ట్ వర్రీ_ మీకు కారు డ్రైవింగ్ నేర్పటం నా పూచీ_రేపే స్టార్ట్ చేద్దాం. పీజు మాత్రం ఇవ్వాలి?" గబగబా అంది కల్యాణి.
"మనం ఎక్కడికైనా కారులో వెళితే ఏం బాగుంటుందయ్యా. అందాలన్నీ మిస్సవుతాం. అందుకని ఎక్కడి కెళ్ళాలన్నా మోటార్ బైక్ మేడే వెళ్ళాలన్నది నా థీరీ. సో... నువ్వు బైక్ డ్రవింగ్ నేర్చుకో.... అమ్మాయిలకు బాగా సైట్ కొట్టొచ్చు" అన్నాడు శ్రీగారు.
"నేను వచ్చిన గద్దర్నుంచి చూస్తున్నాను_ సైట్ కొట్టడం_బీట్ కొట్టడం అనే పదాల్ని కనీసం వందసార్లు ఉపయోగించి వుంటారు. వాటికర్ధం ఏమిటి?" అమాయకంగా అడిగాడు కాశీచరణ్.
అది వింటూనే అక్కడున్న అందరూ పగలబడి నవ్వారు.వాళ్ళు ఎందుకిలా నవ్వుతున్నారో కూడా అర్ధంకాలేదు అతనికి.
"నేను చెబుతానులేండి కంగారుపడకండి" అని చరణ్ కి చెప్పి, శ్రీగారి వైపు తిరిగి_ "తాతయ్యా! నువ్వు అమెరికా వెళతానంటున్నావ్. మోటార్ బైక్ మీదే వెళతావా?"కల్యాణి అడిగేసరికి అందరూ హాలుపైకప్పు ఎగిరిపోయేటట్లు నవ్వారు_ తిరిగి.
"చూడమ్మయ్! నువ్వసలు ఏం మాట్లాడటం లేదు. ఏంటి విశేషం?" అడిగాడు శ్రీగారు మధురిమను.
"ఆలోచిస్తున్నాను" అందామె ఓరగా కాశీచరణ్ కేసి చూస్తూ.
"దేని గురించి.... పలావు గురించా?"
పెద్దగా నవ్వింది కల్యాణి. మరికొంతసేపటికి భోజనాలు ముగిసిపోయాయి.
"గుడ్ నైట్" అని చెప్పి భోజనం ముగించి తలొంచుకుని క్రింద రూమ్ లోకి వెళ్ళిపోయాడు కాశీచరణ్.
"మిస్టర్ చరణ్! మార్నింగ్ ఆరు గంటలకల్లా లేపుతాను.... జాగింగ్ కి వెళదాం" అంటూ అక్కడినుండి వెళ్ళిపోయింది కల్యాణి.
ఒక్కొక్కరూ వెళ్ళిపోయాక హాల్లో మధురిమ, కాశీచరణ్ మాత్రమె మిగిలారు.
"ఎలా వుంది ఇక్కడ?" అడిగింది మధురిమ.
"ఎలావుందా? ఇక్కడే సెటిల్ అయిపోతానేమోనని భయంగా వుంది. అంత బావుందీ ప్రదేశం" అన్నాడు చరణ్ ఎంతో ఉద్వేగంగా.
అక్కడినుంచి లేచి ఇద్దరూ డాబామీదకు వెళ్ళారు.
"రేపు మధ్యాహ్నం నేను బయల్దేరుతాను. వారనుకో ఉత్తరం రాస్తుంటాను. నెలరోజుల తర్వాత కోలుకుంటరన్న నమ్మకం నాకుంది" అంది మధురిమ.
"ప్రపంచంలో యింత మంచి మనుషులుంటరా అన్పిస్తోంది వీళ్ళందర్నీ చూస్తుంటే... ఇలాంటి వాళ్ళమధ్య గడపగలిగే అదృష్టాన్ని కల్పించిన మీ మంచితనానికి ఏ విధంగా కృతజ్ఞులు తెలుపుకోవలో అర్ధం కావడంలేదు."
"ప్రతి వ్త్యక్తి, ఎవరో ఒకరికి ఎప్పుడో ఒకప్పుడు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన సమయం వస్తుంది_ అప్పుడు చెప్పొచ్చులేండి. అరైగ్య పరిస్థితుల దృష్ట్యా, మీకేప్పుడయినా అనీజీగా అన్పిస్తే మా అక్క ప్రమద్వరతో చెప్పండి_ డాక్టర్ దగ్గరకి తీసుకువెళుతుంది.
అలాగే మీ రూమ్ లో మెడికల్ కిట్ వుంచారు. అందులో టాబ్లెట్స్, టానిక్స్, అన్నీ వున్నాయి. నేను చెప్పినవన్నీ మర్చిపోకుండా, టైం ప్రకారం వేసుకోండి" అన్నదామె అతడ్ని విడిచిపోవలసి వస్తున్నాందుకు బాధపడుతూ.
ఎక్కడినుంచో మల్లెపూల సువాసన కలగవలసిన చల్లని గాలి....
మసకవెన్నెల్లో, మధురిమవైపు చూశాడు కాశీచరణ్
తెల్లటి చేర, జాకెట్టు...
అప్సరసలా వుందామె.
ఇద్దరి మధ్యా రెండడుగుల దూరం మాత్రమె వుంది. తన కళ్ళల్లోకి సూటిగా చూస్తున్నా మధురిమవైపు కన్నార్పకుండా చూస్తున్నాడు కాశీచరణ్.
ఈ వూళ్ళో రకరకాల అందమైన అమ్మాయిలున్నారు. ఎవరో హైదరాబాదు నుంచి అందమయిన కుర్రాడు ఈ యింటికొచ్చాదని ఇప్పటికే వాల్లందరకీ తెలిసిపోయి వుంటుంది.


