Previous Page Next Page 
యోధుడు పేజి 47

    "అందరూ వస్తారు... మరి ముఖ్యంగా మా నాన్నకి నాకు అస్సలు పడదు ఎందుకో తెలుసా? నేనంతా పాతకాలం... ఆయనంతా మోడ్రన్ టైఫ్... నేను అమెరికాలో సేటిలైతే. తనూ వచ్చేయవచ్చని చాలా ప్లాన్స్ వేశారు ఎందుకో తెలుసా?"

    "మీరే చెప్పండి" అన్నాడు కాశీచరణ్ నవ్వుతూ.

    "ఆయనకు జీప్స్ స్కర్టులు వేసుకునే అమ్మాయిలంటే చాలా ఇష్టం. చెడ్డ రోమాటింగ్ ఫిగర్ లేండి. ఇంగ్లీషు సినిమాలకోసం రాజమండ్రి వెళతారు. వెళ్ళాక అక్కడ మోడ్రన్ అమ్మాయిలకోసం వెతుకుతారు. కాలేజీల ముందు, కూరగాయల బజార్లో ను బీట్ కొడుతుంటారు. అయినా ఆ ముసలాయనవైపు ఎవరు చస్తారు చెప్పండి.

    మనవాళ్ళకు సోషల్ మూవింగ్, కల్చర్ట్ అస్సలు తేలీదని అయన తెగ బాధపడిపోతుంటారు. అదే అమెరికా అయితే, తను గొప్పగా వెలిగిపోతానని అయన అభిప్రాయం..." నవ్వుతూ అంది మధురిమ.

    "అసలు అయన ఇంటరెస్టుమిటి?"

    "అమ్మాయిలనుచూసి ఆనందించడం, తనతోపాటు రమ్మని అప్పుడప్పుడూ మా బావగార్ని వేపుకుని తినేస్తారు. అయన దగ్గర్నుంచితప్పించుకోవడానికి మా బావగారు ఎంత ఇదైపోతారో చూస్తె.... అదో పెద్ద ఎపిసోడ్..." పెద్దగా నవ్వుతూ చెప్పింది మధురిమ.

    "సరదాగా వుండటం ఆయనకిష్టమన్నమాట."

    "ఏవిష్టమో ఏమో.... మీరు అయన బారిన పడకుండా రక్షించుకోవడం ఇక్కడ పెద్ద సమస్య కావచ్చు."

    "నేనేం అమ్మాయిని కాదుగా."

    "తనతో ఏ రాజమండ్రో ఏ నిడదవోలో మిమ్మల్నితీసుకెళ్ళిపోయి అయన అమ్మాయిల పిచ్చని మీకు అంటగడితే..." అంది మధురిమ.

    "నన్ను ఏ అమ్మయీ లొంగదీసుకోలేదులేండి" అని కాశీచరణ్ అంటుండగా ప్రమద్వర రెండు జ్యూస్ గ్లాస్సులతో పైకొచ్చింది.

    "ఏమో!ఎవరు చెప్పావుచ్చారు, కఠోర తపస్సు చేస్తున్నా విశ్వామిత్రుడే ఆడది కవ్వించేసరికి ఈ వయస్సు ఎప్పుడో ఒకప్పుడు చేసుకో వచ్చునని ఆవిడ వెనక పడ్డాడు... నువ్వో లెక్కానాయనా..." అంటూ జ్యూస్ గ్లాసుల్ని మధురిమ, కాశీచరణ్ లకు అందించింది.

    "మధురిమా.... నువ్వేం వర్రీకాకు.... అమ్మాయిల గాలి అతనిమీద పడకుండా రుష్యశ్రుంగునిలా చూసే బాధ్యత నది" అంది ప్రమద్వర నవ్వుతూ.

    "మధ్యలో నేనెందుకు వర్రీ అవుతాను" అని కాశీచరణ్ కళ్ళల్లోకి సూటిగా చూడబోయి_ వెంటనే కనురెప్పల్ని వాల్చేసుకుని ప్రమద్వరతో పాటు కింద కిందకెళ్ళిపోయింది మధురిమ.

    అరగంట తర్వాత స్నానం ముగించి, తయారై హల్లోకొచ్చాడు కాశీచరణ్.

    అప్పటికే అక్కడ ప్రమద్వర భర్త శశిబూషణ్, మధురిమ తండ్రి శ్రీమన్నారాయణ, మధురిమ ప్రమద్వర కూర్చున్నారు.

    కాశీచరణ్ అందరకీ పరిచయం చేసింది మధురిమ.

    లోనికెళ్ళి పెద్ద ప్యాకెట్ ను బయటకి తెచ్చి, తను తెచ్చిన డ్రస్సుల్ని ప్రమద్వరకు, శశిభూషణ్ కు, శ్రీమన్నరాయనకు, మధురిమలకు పేరు పేరున ఇచ్చాడు కాశీచరణ్.

    "నాకెందుకు?" అంది మధురిమ ఒకింత ఇబ్బందిగా ఫీలవుతూ.

    "కుర్రాడుకదా... ప్రేమగా యిచ్చాడు. ప్రేమగా ఇచ్చినప్పుడు ఆడపిల్లలు కాదనాకూడదు" అన్నాడు శ్రీమన్నారాయణ నవ్వుతూ.

    "డాడీ..." చిరుకోపంతో అంది మధురిమ.

    "ఏం?"

     "అతను మన ప్యామిలీ ప్రెండ్ ."

    "నేనూ అంటున్నది అదేకదమ్మా" దీర్ఘం తీస్తూ అన్నాడాయన. ఇంతట్లో ఓ ప్యాకెట్ విప్పి, మిడ్డీ బయటకు తీశాడు కాశీచరణ్.

    "ప్రమిద్వరాగారూ... మీ అమ్మాయి కల్యాణి ఏదీ ?" అడిగాడు కాశీచరణ్.

    "ఇందాకే వచ్చింది" చెప్పి "కళ్యాణీ... కళ్యాణీ" అని పిల్చింది ప్రమద్వర.

     కాశీచరణ్ చేతిలోని మిడ్డీని ఆశ్చర్యంగా చూస్తూ_

    "ఈమిడ్డీ ఎవరికీ?" అని అడిగింది మధురిమ.

    "కళ్యాణికి... బావుందా?" అని అడిగాడు కాశీచరణ్.

    "కళ్యాణికి... ఈ మిడ్డియా... భలే... భలే... వండ్రపుల్" అంటూ శ్రీమన్నారాయణ పెద్దగా నవ్వాడు. ఆ మీడ్డీని చూస్తూ అక్కడున్నవారు అందరూ పెద్దగానవ్వసాగారు. వాళ్ళందరూ ఎందుకలా నవ్వుతున్నారో కాశీచరణ్ అర్ధంకాలేదు.

    "ఈ మీడ్డీ కళ్యాణికి తెచ్చావా?" నవ్వుతూనే అడిగింది ప్రమద్వర.

    "అవునండీ" అన్నాడు కాశీచరణ్ వాళ్ళలా ఎందుకు నవుతున్నారో అర్ధంకాక.

    "అయితే యివ్వు" అంటూ మెట్లమీదనుంచి వస్తున్న కళ్యాణి వైపు చూసింది ప్రమద్వర.

    ఇరవైఏళ్ళ కళ్యాణి, మెట్లమీదనుంచి టకటకమని కిందకు వచ్చింది.

    "ఈ విడగారే కళ్యాణి" అంది మధురిమ వస్తున్న నవ్వును బిగ బట్టుకుంటూ.

    "కళ్యాణి... పదేళ్ళ బేబీ అని... శివానందం చెప్పా... డే ?!" తేల్లబోతూ అన్నాడు కాశీచరణ్.
    కళ్యాణీతోపాటు, అందరూ నవ్వారు పెద్దగా.

    "అల్లరిలో అదింకా పదేళ్ళ పిల్లలాగే ప్రవర్తిస్తుంది కాబట్టి.... నువ్వు తెచ్చిన డ్రేస్సు దాని అల్లరి మనసుకన్నమాట" అంది నవ్వుతూ ప్రమద్వర.

    "మమ్మీ!" ఉక్రోషంగా అంది కల్యాణి.

    "ప్రస్తుతానికిది వుంచు. ఈసారి రాజమండ్రి వెళ్ళినప్పుడు కాశీచరణ్ శారీ తీసుకుంటార్లే " అంటూ ఆ మీడ్డీ మధురిమ కల్యాణికి కిచ్చింది.

    "ఎనీవే థాంక్యూ మిస్టర్ కాశీచరణ్. నాకర్జంటుగా విజ్జేశ్వరంలో పనుంది. మీతో తీరుబడిగా రేపు ఉదయం మాట్లాడుతాను" అని కాశీచరణ్తో, తర్వాత వాళ్ళా మమ్మీతో చెప్పి బయటకు పరుగు పరుగున వెళ్ళిపోయి కైనటిక్ గొండా స్టార్ట్ చేసింది కల్యాణి.

 Previous Page Next Page