Previous Page Next Page 
యోధుడు పేజి 46

    అతను ఆమెకేసి విస్మయంగా చూశాడు. జిప్సీ డెబ్భై కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతూనే వుంది.

    సరీగ్గా అదే సమయంలో అతను 'పరిశుబ్రత' కాలుష్యం, కంటెమిషన్' పదాల గురించే అలోచిస్తోంది. కాశీచరణ్ కి గతం తెలీక పోయినప్పటికీ  బాగా చదువుకున్న వాడేననిపించిందామెకు.

    ఉన్నట్టుంది "చాలామంది" అన్నాడతను.

    "ఏమిటి?" అడిగింది మధురిమ.

    "ఈ ఏరియా."

    "ఇలాంటి ప్రదేశాలు ఇంతకుపూర్వం మీరెప్పుడూ చూడలేదా?" అడిగిందామె. ఒక డాక్టర్ గా అతణ్ణి అ ప్రశ్న అడిగిందామె.

    "చూశాను" అన్నాడతను
   
    "ఎక్కడ?"ఆతృతగా అడిగిందామె.
            
        అతను ఇక్కడ చూశాడో చెప్తే, చాలా కీలకమైన ప్రశ్నకు పరిష్కారం లభిస్తుందని ఆమె ఆశ.

    రెండు క్షణాలు గడిచాక నెమ్మదిగా అన్నాడతను.

    "ఎక్కడో... గుర్తుకురావడంలేదు" మధురిమలో రవ్వంత అసంతృప్తి చోటుచేసుకుంది.

    "పాటలు వింటారా?" అంటూ ఓ ఆడియో క్యాసెట్ టేప్రికార్డర్లో పెట్టిందామె.

    స్పీకర్ లోంచి వినిపిస్తోంది ఘంటసాల గొంతు_

    మనసుగతి యింతే...
    మనిషి బ్రతుకింతే ...
    మనసున్న మనిషికి   
    సుఖము లేదంతే...

    "ఈ పాట ఎవరు రాశారో తెలుసా?" అడిగిందామె.

    "జ్ఞాపకంలేదు" బదులిచ్చాడు కాశీచరణ్.

    "ఆచార్య ఆత్రేయ_ నాలుగు తెలికైనా పదాలలో అద్బుతమయిన భావాన్ని అమర్చిన హార్ట్ స్పెషలిస్ట్ అయన. చివరకి హార్ట్ ఎటాక్ తో చనిపోవడం చాలా విచిత్రంగా అనిపిస్తోంది నాకెందుకో" అందామె ఎక్కడో అలోచిస్తూ.

    "మధురిమా! ఇంతకీ ప్రేమకీ, హార్ట్ కీ... అదే గుండెకి సంబంధం వుందంటారా?"

    "డాక్టర్ గా చెప్పనా?"

    "చెప్పండి."

    "మేడికల్ ఏనాఫిలిస్ ద్వారా చెప్పాలంటే ప్రేమలో పడ్డవారి హార్ట్ బీట్ ఎక్కువవుతుంది_

    PALPITATION_ అంటే ...మిగతా పక్రియల కన్నిటికీ మెదడే కేంద్ర స్థానంగా వుంటుంది. అందుకే కవులు అని హృదయనికి బదులు వాడడం_ కానీ ఇప్పటికీ లవ్ లెటర్స్ హార్ట్ ఫెన్ లోనే రాయడం ఫ్యాషన్. అలాగే హార్ట్ లో బాణం గుర్తు_ ఆ బాణం గుర్తు ఎందుకో, ఇప్పటికీ నాకర్ధంకాని ప్రశ్నగానే మిగిలిపోయింది."

    "బాణం గుర్తువిఫలమయిన ప్రేమకు గుర్తేమో?" అన్నాడతను చ్వ్హిరునవ్వుతో.

    "గుడ్ సైకలాజికల్ అబ్జర్వవేషన్" అన్నది మధురిమ,

    మధ్యాహ్నం లంచ్ వైరాలో తీసుకుని, జీపులో పెట్రోల్ పోయించుకుని ముందుకు కదిలారు మూడున్నర ప్రాంతంలో కోరుమామిడి గ్రామం చేరుకున్నారు.

    "గోదావరి జిల్లాల్లో ఓ ప్రత్యేకమైన అలవాటు వుంది. అది మీలాంటివారికీ ఆశ్చర్యంగా వుంటుంది" అంది మధురిమ.

    "ఏమిటది?" అని అడిగాడు కాశీచరణ్.

    "ఈ గోదావరి జిల్లాలవారిని సినిమా ఎలా వుంది? అని అడిగామనుకోండి_ మనమయితే ఫర్వాలేధనో, బావుంధనో అంటాం. వీళ్ళయితే రాజమండ్రి... ట్రీస్ ఎలా వుంది?" అడిగింది మధురిమ.

    "వెరీనైస్ " కాశీచరణ్ అనగానే మధురిమ నవ్వింది నిండుగా.
     రోడ్డుకు ఎడమపక్క ఇళ్ళు, కుడిపక్క చెరుకుతోటలు... జిప్సీ జీపు తెల్లటి బిల్డింగ్ ముందు  ఆగింది.
   
                        *    *    *    *
   
    జీప్సీ హరన్ వినగానే లోపలినుంచి ఓ వ్యక్తి పర్తుగు పరుగున బయటికొచ్చాడు.

    "అమ్మగారూ... డాటరమ్మగారు వచ్చారండోయ్ " అంటూ అరిచి మధురిమను అభిమానంగా పలకరించి, సూట్ కేస్ అందుకున్నాడు ఆ ఇంటి నౌకరు రాములు.

    "ఏం రాములూ బాగున్నావా?" పలకరించిందామె.

    లోపలినుంచి ఇంతలో ప్రమద్వర వచ్చింది.

    "ఈ విడేవరో చెప్పుకోండి" కాశీచరణ్ అడిగింది మధురిమ.

    "మీ అక్కగారు..." వినయంగా నమస్కరిస్తూ అన్నాడు కాశీచరణ్.

    "మీ గురించి మా మధురిమ ఉత్తరం రాసింది_ ఇక్కడ మీరు ఏ మాత్రం మోహమాటం లేకుండా హయిగా వుండొచ్చు" స్నానాలకోసం ఏర్పాట్లు చేయమని రాములుకి పని పురమాయిస్తూ ఇద్దర్నీ లోనికి తీసుకెళ్ళిందామె.

    లోపల పెద్ద హాలు... హాలు మధ్యన తూగుటూయ్యాల... అటూ ఇటూ గదులు... కిచెన్ రూమ్... పూజ గది... భోజనాలగది...రెండు పెద్ద పెద్ద స్నానాల గదులు, మేడమీద నలుగు గదులు... హాలు... ఇంటి వెనక విశాలమైన పెరడు. రకరకాల పూలమొక్కలు... ఒకపక్క బావి, ఏపుగా పెరిగిన రాతిచెట్లు, దూరంగా పచ్చగా కనిపిస్తున్న తాటిచెట్లు.

    మెడమీదకు తీసికెళ్ళి, కాశీచరణ్ కి ఓ గది చూపించి, కిందకు వచ్చేసింది ప్రమద్వర. ఇప్పుడా గదిలో కాశీచరణ్, మధురిమ మాత్రమే ఉన్నారు.

    "మీ నాన్నగారు... మీ బావగారు కల్యాణి... వాళ్ళెవరూ కనిపించడంలేదేమిటి?" అడిగాడు కాశీచరణ్.

 Previous Page Next Page