ఇంకా పూర్తిగా తెల్లవారాలేదు.
నేషనల్ హైవే_9పై మారుతీ జిప్సీ వేగంగా దూసుకుపోతోంది.
వాతావరణం ఆహ్లాదకరంగా వుంది. జిప్సీని డాక్టర్ మధురిమ డ్రైవ్ చేస్తోంది. ఆమె పక్కన కూర్చున్నాడు కాశీచరణ్.
సడన్ గా ఆమె పైట గాలికి ఎగిరి అతని ముఖం మీద పడింది.
"సారీ..." అంటూ ఆ పైటచెంగు మరీ ఎగరకుండా నడుములో దోపుకుందామె.
"సూర్యాస్తమయ సమయంలో_ సూర్యోదయ సమయంలో ప్రయాణం చేయడం నాకు చాలా ఇష్టం. మసక వెలుగులో ఆ పల్లెటూళ్ళు ఏంట అందంగా కనిపిస్తున్నాయో చూడండి" అంటూ దూరంగా కనిపిస్తున్నా దృశ్యాన్ని చూపించాడతను.
ఆ మాటలంటున్న అతనివైపు విస్మయంగా చూసిందామె. " నాకు కూడా ఇలాంటి ప్రయాణలంటేనే ఇష్టం నగరాల్లో మనం కుత్రిమమైన బతుక్కి అలవాటు పడిపోతాం. మనం ఏంత కృత్రిమంగా బతుకుతున్నామో పల్లెటూళ్ళను చూస్తె తెలుస్తుంది..." అంది మధురిమ.
ప్రతిరాత్రి నిద్రపోవడం అంటే మరణానికి కాస్త దూరంలో వున్నట్టు లెక్క_ మనిషికి ప్రతి ఉదయం కొత్త జీవితం కిందే లెక్క. అందుకే ప్రతి మనిషి, ప్రతిరోజుని అనందంగా మలచుకోవాలి.
రాత్రి నిద్రలోకేళ్ళేముందు ఒక సంతృప్తితో పడుకోవాలి. లేనప్పుడు మనిషి వెయ్యేళ్ళు బ్రతికినా ఏం ఉపయోగం వుండదు.... ఏమంటారు?" ఆమె కేసే చూస్తూ అన్నాడు కాశీచరణ్.
కాశీచరణ్ లో వున్న తాత్విక దృష్టికి ఆశ్చర్యపోయింది డాక్టర్ మధురిమ.
"బావుకత ఫిలాసిఫీ అంటే మీకిష్టమా?"
"మనిషి జీవితంలోనే ఫిలాసఫీ కూడ అంతర్లీనంగా వుంటుంది. అయినా అనుభవానికి మించిన తత్త్వం, వేదాంతం యింకేమున్నాయి?" అన్నాడతను.
గుప్పెట్లోంచి దూదిపింజేలు గాల్లో కెగిరినట్టుగా వెలుతురూ తారకలు_ ఆ వెలుగులో మధురిమ వైపు చూశాడు కాశీచరణ్.
ఆ లేత కంటిలో మధురిమ వదనం అందాల బృందావనంలా వుంది.
తెల్లటి కాటన్ చీరపై నల్లటి డిజైన్, మ్యాచింగ్ గా నల్లటి ఎంబ్రాయిడరీ జాకెట్, గాలికి ఎగిరిపడుతున్న ముంగురులు.
ఓరకంట ఆమెవైపు చూస్తున్నాడు కాశీచరణ్.
"ఎంతలా చూస్తున్నారు?" అడిగింది మధురిమ ఓ రకమయిన యిబ్బంది ఫీలవతూ.
"ఏం డాక్టర్! చూడకూడదా?" అడిగాడతను.
సమాధానం చెప్పలేదు మధురిమ.
"నేనో ప్రశ్న అడుగుతాను డాక్టర్! మీరేమీ అనుకోరుగదా?" అన్నాడు కాశీచరణ్.
"ఫర్ యువర్ కైండ్ ఇన్ ఫర్మేషన్... నేను హాస్పిటల్ లోనే డాక్టర్ని... మీరన్నిచోట్లా డాక్టర్ డాక్టర్ అని పిలిస్తే నాకు కోపం వస్తుంది."
"అయితే ఏమని పిలవాలి?" ఆశ్చర్యంగా అడిగాడు.
"మధురిమా అని పిలవండి."
ఆ మాటకు తను పేషెంటు స్థాయినుంచి కొంచెం పైకి ఎదిగినట్టు అనిపించింది కాశీచరణ్ కి.
"అలాగే డాక్టర్... సారీ... మధురిమా... పూర్తిగా హాస్పిటల్ రోగులకు పరిమితమైపోయారు... బోరు కొట్టడంలేదా?" అని అడిగాడు.
అతని మనసులో ఉద్దేశ్యం అర్ధమైపోయిందామెకు. చాలా సున్నితమైనా ప్రశ్నను చాలా చాకచక్యంగా అడిగాడు.
"ఎందుకు కొట్టదు... అలవాటైపోతే మనిషికి ఎడారే బృందావన్ గార్డెన్ లా వుంటుంది."
"అంటే మీరిప్పుడు ఎడారిలో వున్నారా? బృందావన్ గార్డెన్స్ లో వున్నారా?"
"నేషనల్ హైవే మీద వున్నాం" నవ్వుతూ చెప్పింది.
"గుడ్ జోక్... కానీ మధురిమా! మీరింతవరకూ పెళ్ళి ఎందుకు చేసుకోలేదు?" ఠక్కున ప్రశ్నించాడు.
దానికి వెంటనే జవాబు చెప్పలేదు మధురిమ. సడన్ గా జీపును 'స్లో' చేసింది.
తనేసిన ప్రశ్నకు కోపం వచిందనుకున్నాడతను.
ఇంతలో జీపు రోడ్డు పక్కన ఆగింది.
జీపు ఎందుకు అపానో తెలుసా?ఇలాంటి ప్రయాణాల్లో రోడ్డు పక్కన పంజాబీదాదా హొటల్లో టీ తాగడం నాకిష్టం" అంటూ జీపు దిగిందామె.
కాశీచరణ్ అంతవరకూ గమనించలేదు రోడ్డుకు ఎడమ పక్కనున్న పంజాబీదాదాని.
ఇరవై నిమిషాలు గడిచాయి. టీతీసుకున్నాక ఇద్దరూ తిరిగి జిప్సీ ఎక్కారు.
"మీలాంటి డాక్టర్స్ ఇలాంటి రోడ్లపక్కనుండే హొటల్స్లో టీ తీసుకోవటం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. పరిశుబ్రత గురించి, కాలుష్యం గురించి, కంటేమినేషన్ గురించి తరచూ మాట్లాడే డాక్టర్స్..." అంటూ ఆగిపోయాడతాను.
అతనిమాటలకు ఆమె నవ్వేసింది.
"ఏం? డాక్టర్స్ మాత్రం మనుషులు కారా? చిరుజల్లుల్లో తడిసి ముద్దువటం ఆరోగ్యరీత్యా మంచింది కాకాపోవచ్చు. కానీ ఆ నుభూతి ఎన్ని లక్షలు పోసి కొంటే వస్తుంది?
ఇంట్లో కూర్చుని టీవీలో సినిమా చూడొచ్చు. ఎయిర్ పొల్యూషణన్ తక్కువుంటుంది. కానీ థియేటర్ కెళ్ళి సినిమా చూసినంత థ్రిల్లింగ్ గా వుంటుందా?
అలాగే యిది__
అనుభూతి సాంద్రత ఎక్కువుగా వున్నప్పుడు చిన్నపాటి అనారోగ్యం లెక్కచేయదగ్గది కాదు నా దృష్టిలో" అంది ఆమె ఓరగా అతని కేసి చూస్తూ.