"డాక్టర్.... సమ్ థింగ్ ఈజ్ రాంగ్... ఎవరో కావాలనే మీ పేషెంట్ చంపాలకుకున్నారు. నా జీఫ్ రావటం ఆలస్యమైనా, లేదా కారులో ఈవైపుకి మీ పేషెంట్ కాశీచరణ్ కూర్చుని విన్నా, అతనీపాటికి హత్యాగావింపబడేవాడు.
కాశీచరణ్ గురించి మీరు చెప్పిన దాన్ని బట్టి దాయాదులెవరో హత్యాప్రయత్నానికి పూనుకుని వుంటారానిపిస్తోంది.
ఏది ఏమైనా, వాళ్ళనంత తేలిగ్గా మేం వదలం. మీరనుకుంటున్నట్లు గానే పేషెంట్ ని వెంటనే వేరే చోటికి మార్చండి..." అన్నాడు సరూర్ నగర్ పోలీసు స్టేషన్ ఏస్.ఐ. అక్కడినుంచి బయటకి వెళ్ళబోతూ.
డాక్టర్ మధురిమ, కి ఆ భయోద్వేగం నుంచి బయటపడటానికి కొద్దినిముషాలు పట్టింది.
ముందుగా తేరుకున్న లాయర్ నీలకంఠన్_
"శివానందానికేలా వుంది?" అడిగాడు.
అప్పుడే వచ్చిన మేరీ కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ_
"ట్రీట్ మెంట్ వెంటనే అందబట్టి బతికిపోయాడు_ లేదంటే అందరినీ ఏప్పుడూ నవ్విస్తూ, నవ్వుతూ వుండే శివానందం మనకు దక్కేవాడు కాదు" అంది.
"శివానందం ధైర్యశాలే కాదు_ సూక్ష్మబుద్ధి_ మానవత్వం వున్నవాడు. లేదంటే కాశీచరణ్ మిగిలేవాడు కాదు" అన్నాడు నీలకంఠన్ నిట్టూరుస్తూ.
"కాశీచరణ్ పరిస్థితేమిటి?" అడిగింది డాక్టర్ మధురిమ ఆప్రయత్నంగా.
"సేడేటివ్ ఇచ్చాం మేడమ్! హి ఈజ్ ఇన్ డీస్ స్లీప్" అంది నర్సు మేరీ.
అప్పటికిగానీ మధురిమ తాను చాలసేపటినుండి అనుభావిస్తునా ఉద్రిక్తత నుంచి బయటపడలేదు.
"కాశీచరణ్ ఇకపై ఇక్కడ్నుంచి శ్రేయస్కరం కాదు. ఈ రోజు ప్రమాదం తప్పినా, మరో రోజు అది ఎదురుకాదని చెప్పలేం_ ఇలాంటి ప్రమాదాలు, అమ్నేషియా పేషెంట్ మీద మరింత ఒత్తిడి తెచ్చే అవకాశం లేకపోలేదు.
వెంటనే రహస్యంగా మీరతన్ని తీసుకుని బయలుదేరటం మంచిది_ నా క్లయింట్ విషయంలో మిమల్ని ఇబ్బందికి గురిచేస్తుంనందుకు నన్ను మీరు క్షమించాలి" అన్నాడు నీలకంఠన్ బాధపడుతూ.
ఫర్వాలేదన్నట్లుగా కళ్ళతోటే భావాన్ని వ్యక్తంచేసి లేచి నించుంది డాక్టర్ మధురిమ.
* * * *
క్రమంగా మత్తునించి బయటబడిన కాశీచరణ్ మెదడులో సవాలక్ష సందేహాలు... బలంగా, దృడంగా వుండటంలో కాశీచరణ్ ని సేడేటివ్స్ ఎక్కువసేపు మత్తులో వుంచలేకపోతున్నాయి.
తానెవరు? హు యామ్ ఐ? నిజంగా తను సుశీల కొడుకేనా? హాకీం సత్యమ్ మనవడేనా? డిల్లీనుంచి వస్తూ ఎలా ఏక్సిడెంట్ కు గురయ్యాడు?
డిల్లిలో తను యాడ్ ఏజెన్సీలో పనిచేసేవాడా? నిజంగా అర్చనతో తనకు పరిచయం వుందా? ఆమెను తను ప్రేమించడా? తనెం చదువుకున్నాడు? ఎక్కడ చదువుకున్నాడు?
అమ్నేషియా వ్యాధి నుంచి తను కోలుకుంటే తనేక్కడికి వెళ్తాడు? ఏం చేస్తాడు?
తానిప్పుడు కాశీచరణ్ కాకాపోతే, కాకీం సత్యం మనవడు కాకపోతే? సుశీల కొడుకు కాకపోతే... తన కోసం ఇప్పుడు ఖర్చవుతున్న అప్పుల్ని ఎలా తీర్చాలి? ఆస్తి కోసం తానెప్పుడూ ఆలోచించలేదు.
తనని వెంటాడింది ఎవరు? వాళ్ళు తనకు శత్రువులా? తనకెందుకు హతమార్చాలనుకున్నారు? తనని కాపాడటం కోసం శివానందం సీటు మార్చాడు. తన మీద అతనికెందుకంత ప్రేమ?
మధురిమకి తను దూరమయ్యేపోతాడా?
మదురిమ తనపట్ల చూపిస్తున్న ప్రేమకు కట్నం ఏమిటి? ఆమె తనపట్ల చూపిస్తున్న కారణం... తనపట్ల జాలేనా... కాదేమో.
ఆమె తనని ప్రేమిస్తోందా?
ఆ ఆలోచన అతని మనసులో ప్రవేశించగానే అచేతనుడయి పోయాడు.
ఆమె తనని ప్రేమిస్తోందని ఆలోచించడానికి గల కారణం ఏమిటి?
తను ఆమెను ఇష్టపడుతున్నాడా?
తనమీద మధురిమకు వ్యక్తిగతమైనా ప్రేమ లేకపోతే ఆమె ఏమ్న్దుకు తనని వాళ్ళవూరు తీసికేలుతుంది?
అవును...
మధురిమ తనమీద చూపిస్తున్న ప్రత్యేకమైన అభిమానానికి ప్రత్యెకమైనా కారణం వుండాలి.
వర్డ్ లాబీలో వినవచ్చిన అరుపులతో ఆలోచనల నుండి తేరుకుని చుట్టూ చూశాడు కాశీచరణ్. అది టని ట్రీట్ మెంట్ తీసుకుంటున్నా 202 రూమే...
అసహనంగా బెడ్ మీంచి లేచి కూర్చున్నాడు.
లాయర్ నీలకంఠన్ ... డాక్టర్ మధురిమ...
అర్చన... ఆమె అన్న అంకుష్ ... మేరీ...
శివానందం... కొత్తగా తనమీద హత్యాప్రయత్నం చేసిన ఇద్దరు యువకులు...
ఏమిటిదంతా... ఎందుకిలా జరుగుతోంది? తనేడైనా విషవలయంలో ఇరుక్కుపోయాడా?
ఆలోచనలో మెదడు వేడెక్కింది.
వెంటనే పక్కనే వున్న వాటర్ తీసుకుని, కొంత నీరు ముఖంమీద జల్లుకుని మరికొంత నీరు తాగి, తిరిగి బెడ్ మీద వాలిపోయాడు.
* * * *