Previous Page Next Page 
యోధుడు పేజి 43

    తాజ్ మహాల్ హొటల్లో కెళ్ళి కూర్చున్నారిద్దరూ.

    ఆ హొటల్లో బేరార్ తో మాట్లాడుతూ, తన వైపే ఒక వ్యక్తి తదేకంగా చూడడం గమనించాడు కాశీచరణ్.

    "శివానందం.... ఆ వ్యక్తి మనకు కారు పార్కింగ్ దగ్గర కన్పించాడు. క్లాత్ షాపు లో కనిపించాడు... తిరిగి హొటల్లో ప్రత్యక్ష్యమయ్యాడు  చూశావా?" అనుమనాస్పదంగా చూస్తూ అన్నాడు కాశీచరణ్.

    "నిజమేసార్...." ఆ వ్యక్తి వైపు చూసీ చూడనట్ట్లుగా చూస్తూ అన్నాడు శివానందం.

    "ఎవరైనా మనని ఫాలో అవుతున్నారంటారావా?"

    "మనకెందుకు ఫాలో అవుతారు సార్... అతను కూడా మనతోపాటు మామూలుగానే, తన పనిమీద వచ్చుండోచ్చుకదా?"

    శివానందం ప్రశ్నకు కాశీచరణ్ దగ్గర జవాబులేదు.

    అతని దగ్గర జవాబు లేకపోయినా_ శివానందంలోనూ ఒకింత సందేహం తలెత్తింది.

    కోట్లాది ఆస్తికి వారసుడు కాబోతున్న కాశీచరణ్ కి శత్రువులేవరైనా వున్నారా? ఉండే వుండవచ్చు. శివనందానికా అనుమానం రావటం తోటే ఓరగా, అతని కేసి పరిశీలనగా చూశాడు.

    మరికొద్దిసేపటికి ఇద్దరూ లేచి బిల్లు పే చేసి బయటకు నడిచాడు. వాళ్ళిద్దరూ పార్కింగ్ ప్లేస్ లో నిలబడి వుండగా ఒక యమహా మోటార్ బైక్ వేగంగా వచ్చి వారి పక్కనే సడన్ బ్రేక్ తో ఆగింది.

    ఆ శబ్దానికి ఇద్దరూ ఉలిక్కిపడి అటువైపు చూశారు.

    మోటార్ బైక్ సైద స్టాండ్ వేసి, ఇద్దరు యువకులు దూకారు దాని మీదనుంచి.

    వాళ్ళలో ఒక వ్యక్తి అవుట్ గెట్ దగ్గరున్న పాన్ షాపు కెళ్ళి, జర్దాపోట్లం తీసుకొచ్చాడు.

    ఫాన్ పరాగ్ గుట్కా పొట్లం అంచుని చింపి, ఇద్దరూ నోట్లో వేసుకున్నారు.

    ఇద్దరూజీప్స్ లో వున్నారు.

    అప్పటివరకు చుట్టుపక్కల పరిసరాల్ని నిశితంగా గమనించిన కాశీచరణ్, శివానందం హొటల్లో కనిపించిన వ్యక్తి తిరిగి కనిపించకపోవటంతొకారు పార్కింగ్ కేసి నడవసాగారు.

    మరికొద్ది నిముషాలకు వాళ్ళేక్కిన కారు నల్గొండ క్రాస్ రోడ్స్ దాటి, మలక్ పేట వైపు వెళుతోంది మెల్లగా.

    ఎందుకో యధాలాపంగా సైద మిర్రర్ లోకి చూసిన శివానందం ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు.

    హొటల్ పార్కింగ్ దగ్గర కనిపించిన యమహాబైక్ తమ కారునే ఫాలో అవుతోంది.

    అయినా ఆ విషయాన్ని కాశీచరణ్ దృష్టికి తీసుకోపోలేదు శివానందం.

    కారు కొత్తపేట జంక్షన్ కి చేరువవుతుండగా, వెనగ్గా వస్తున్న బైక్ వున్నట్లుండి సడన్ గా వేగం పుంజుకుని, కారు పక్కకి వచ్చేసింది.

    దానిపైన ఆ ఇద్దరు కుర్రాళ్ళే వున్నారు.

    ఏదైనా ప్రమాదం ముంచుకురాబోతుందా? ఆ విషయం కాశీచరణ్ కి చెప్పాలా? అసలే అమ్నేషియా పేషెంట్_ మరింత అందోళనకు గురయితే...? తట్టుకోగలడా కానీ శివానందానికెందుకోతన అనుమానం నిజమనిపిస్తోంది. ఎందుకయినా మంచిదని, కావాలనే ఏదో కారణం చేప్పి కాశీచరణ్ ఏడంవైపుకి రమ్మని, తను కుడివైపుకి జరిగాడు.

    అప్పటికే బైక్ మీదున్న ఇద్దరు వ్యక్తుల్లోని వెనక వ్యక్తి, మెరుపు వేగంగా రివాల్వర్ ని బయటకు తీసి, కారు బ్యాక్ సీటు కేసి గురిపేట్టి ఫైర్ చేశాడు.

    ఏం జరుగుతొందో తెలిసేలోపు, ఒక బుల్లేట్ కాశీచరణ్ వీపుని రాసుకుంటూ వెళ్ళిపోయింది.

    ఆ శబ్దాలు వింటూనే వెంటనే తేరుకుని, కారు డ్రైవర్ వేగాన్ని పెంచాడు. అదే వేగానందుకుంది కారు పక్కగా వస్తున్నా బైక్.

    అప్పటికిగాని కాశీచరణ్ కి అర్ధంకాలేదు_ నిజంగానే ప్రమాదం ముంచుకొచ్చేసిందని.

    అంతలో తిరిగి రివాల్వర్ పైకి లేచింది.

    అంటే... మరో ఆలోచన లేకుండా డోర్ కడ్డంగా జరిగాడు శివానందం.

     ఆ మరుక్షణం  రిలీజయిన బుల్లెట్ శివానందం భుజాన్ని చీల్చుకుంటూ వెళ్ళిపోయింది. ఆ మరుక్షణమే శివానందం బాధగా అరిచాడు. ఆ శబ్దాలు వుంటూనే రోడ్డుమీదున్న జనం షాక్ తిన్నారు.

    ప్యానిక్ డిజార్డర్ కి గురయిన కారు డ్రైవర్ ఎక్సిలేటర్ మీంచి కాలుతీసేసాడు_ అసంకల్పితంగానే.

    కాశీచరణ్ నిశ్చేష్టుడయిపోయాడు_ వెంటనే  ఏం చేయాలో తోచక.

    అప్పటికే జనంలో కలకలం చెలరేగింది.

    పూర్తిగా ఆగిపోయిన కారుని చూసి బైక్ ని డ్రైవ్ చేస్తున్నా వ్యక్తి బైక్ ని కారుకి అటువైపు తీసుకేళ్ళేందుకు ప్రయత్నిస్తుండగా, సరిగ్గా అప్పుడే పోలీస్ పెట్రోలింగ్ జీఫ్ సైరన్ చేస్తూ అటుగా రావటంతో_బైక్ మీదున్న వ్యక్తులు అలర్ట్ అయిపోయి, బైక్ ని పెను వేగంతో రివర్స్ చేసి వెనక్కీ దూసుకుపోసాగారు.

    అక్కడున్న జనం రివర్స్ అయి వెళ్ళిపోతున్న బైక్ నెంబర్ ప్లేట్ కేసి చూశారు_ ఆ నెంబర్ ప్లేట్ ఎఫ్బైఅర్ అనే ఇంగ్లీషు లెటర్స్ కనిపించాయి.

    ఫర్ రిజిస్ట్రేషన్....

    అప్పటికే అక్కడికి చేరుకున్న ఏస్.ఐ. ఫార్ రిజిస్ట్రేషన్ అనే నెంబర్ ప్లేట్ చూసి నిస్పృహగా తల విదిలించి, గాయపడిన శివానందం కేసి వేగంగా వెళ్ళిపోయాడు.

    అప్పటికే కాశీచరణ్ కారు బ్యాక్ సీటుమీదున్న లేస్ క్లాత్ ని శివానందం భుజానికి గట్టిగా కట్టి, మినరల్ బాటిల్ ని ఆ కట్టుపై వంచాడు.

    రక్తంతో నీళ్ళు కలసిపోయి కారు బ్యాక్ సిటంతా ఎర్రగా మారిపోయింది.

    గాయపడిన వ్యక్తికీ కాశీచరణ్ ఫస్ట్ ఎయిడ్ చేయడం చూసిన ఏస్.ఐ డ్రైవర్ని ఎలర్ట్ చేసి_ వైర లేస్ సెట్ అందుకుని, మిగతా పెట్రోలింగ్ ట్రూప్స్ కి ఫార్ రిజిస్ట్రెషన్ యమహా బైక్ గురించి ఇంఫర్మేషన్ అందించేశాడు. అంతా కొద్ది నిమిషాల్లో జరిగిపోయిన ఆ సంఘటనను చూసిన జనం తీవ్రమైన ఉద్రిక్తతకు గురయిపోయారు.
   
                                *    *    *    *

 Previous Page Next Page