"ఇంకా ఏంకావాలక్కా! ఆమె బట్టలు ఎప్పుడయినా గమనించావా? చీర సరిగా వుంచుకోదు. పాదాలనుంచి నడుంవరకు అందరికీ కనిపిస్తూ వుంటుంది. జాకెట్టు బటన్లు వేసుకోదు. ఒకటి - రెండు బటన్లన్నీ వూడిపోయి లోపల అందాలన్నీ బయటపడి కనిపిస్తుంటాయి."
"అయ్యో పాపం-"
"అంతేకాదు -పనివాళ్ళముందే వికారంగా ప్రవర్తిస్తూ వుంటుంది. వాళ్ళు చూసినప్పుడు పైట తీసేస్తుంది. వాళ్ళకి భూపతిరెడ్డి అంటే భయం కానీ -లేకుంటేనా కనుగుడ్లు పేలిపోయేవరకు చూపు మరల్చేవాళ్ళు కాదు. మాటలూ అంతే. పనివాళ్ళ ముందు వికారంగా మాట్లాడుతుంది. మొన్నేం జరిగిందో తెలుసా?"
"ఏమిటి?"
"జయరాముడు అనే కుర్ర సేద్యగాడున్నాడు. వాడు బావిలోంచి నీళ్ళు తోడుతుంటే - వాడి దగ్గరికెళ్ళి ఏం చేసిందో వూహించగలవా?"
"ఏం చేసిందేమిటి?"
"రేయ్! స్నానంచేయాలి. నువ్వు నీళ్ళుతోడి నామీద పోస్తూండు" అని బావి చప్టామీద కూర్చుంది.
"తర్వాత?"
"వాడికేం చేయాలో తోచలేదు. ఆమె మాట వినకపోతే ఏం జరుగుతుందోనన్న భయం. నీళ్ళు పోయడం ఎవరయినా చూస్తే ఏం చేస్తారోనన్న జంకు. వీటిమధ్య వాడు నలిగిపోతుంటే తనుమాత్రం ఏం చలించకుండా చీర విప్పడం ప్రారంభించింది.
"అయ్యో!"
"వాడికి కాళ్ళూ చేతులూ ఆడలేదు. అక్కణ్నుంచి పారిపోవాలనుకున్నా కాళ్ళు రావడంలేదు. వణుకుతూ వుండిపోయాడు. అంతలో అమ్మాయి చీర విప్పేసింది. కేవలం లంగా, జాకెట్టుమీద వుంది.
అలాంటి సమయంలో భూపతిరెడ్డి వచ్చాడు. దాంతో జయరాముడు పారిపోయాడు. శశి కూడా లేచి చీర కట్టుకుని వచ్చేసింది"
"పెద్దింటిపిల్లకి ఎన్ని కష్టాలొచ్చాయో" చంద్రరేఖ సానుభూతిగా అంది.
"నిన్న సాయంకాలం పనంతా ముగించుకుని ఇంటికి బయల్దేరాను అప్పుడే చీకట్లు ముసురుకుంటున్నాయి. అందుకే త్వరత్వరగా బయట పడాలనే హడావుడిలో వున్నాను.
అదిగో అలాంటి సమయంలో శశమ్మ పిలిచింది. ఆమె గదిలోకి వెళ్ళాను లోపల లైట్ కూడా వేసుకోలేదు. చీకటితప్ప మరేమీ కనిపించడంలేదు.
'రాధా' అని పిలిస్తే లోపలికెళ్ళాలో లేదో తెలియక ద్వారందగ్గరే నిలుచుండిపోయాను.
'రమ్మంటుంటే' ఇక విధిలేక లోపలికి వెళ్ళాను. మంచంమీద కూర్చుని వుంది. "ఏయ్ రాధా! నువ్వో సాయం చేయాలే" అంది.
'ఏమిటమ్మా?' అనడిగాను.
నేనేం చేయాలో చెప్పింది.
ఆ మాటలకి నా కళ్ళు తిరిగాయి.
భయం శరీరాన్ని వణికించింది.
మౌనంగా నిలుచుండిపోయాను.
"ఏం అడిగిందే?" అని చంద్రరేఖ ప్రశ్నించింది.
"అంత పెద్దింట్లో పుట్టిన శశమ్మ నాతో ఏం అన్నదో తెలుసా? 'నాకింక మగవాళ్ళు కావాలి. మా ఆయన వాసూ ముసలివాడై పోయాడు కదా -అందుకు' అని కళ్ళను సాగదీసి చెబుతూంటే గాభరా పడిపోయాననుకో" రాధ ఆ ఉదంతం చెబుతూ అప్పుడే విన్నంత ఆశ్చర్యాన్ని ప్రకటించింది చంద్రరేఖ ముందు.
"అలానా" అని కాసేపాగి, "నిద్రొస్తోందే రాధా" అని పడుకుంది.చంద్రరేఖ. శశి గురించి ఇంకా వినాలంటే బాధగా వుంది.