Previous Page Next Page 
యోధుడు పేజి 42

    "నిజానికి యీ డబ్బు నాది కాదు_ఆ ఆస్తికి నేనే అసలైన వారసుడ్ని అని నమ్మి లాయర్ నీలకంఠన్  గారు యిస్తున్నా డబ్బు  ఆ వారసుడ్ని నేను కాకపోతే ఆ అప్పుని తీరాల్సిన బాధ్యత నాదే"అన్నాడు కాశీచరణ్ నిజాయితీగా.

    "సీరియస్ టాఫిక్ జోలికి వెళ్ళడం కొన్నాళ్ళపాటు మానుకోండి. రేపు మధ్యాహ్నం మనం నమ్మినశ్రగూడెం బయలుదేరుతున్నాం" అందామె అతనిలో దాగున్న నిజాయితీకి సంతోషిస్తూ.

    "ఇంతకీ ఎక్కడుంది. నిన్న అడగడం మర్చిపోయాను" అడిగాడతను.

    "పశ్చిమగోదావరిజిల్లాల్లో నిడదవోలు దగ్గర మా నాన్నగారు, అక్క, బావ అందరూ అక్కడే వుంటారు. అక్క పేరు ప్రమద్వర, కూతురు కళ్యాణి. చెప్పానుగా?"

    "మీ బావగారేం చేస్తుంటారు?"

    "వ్యవసాయం. ఊరు చాలా బావుంటుంది.చుట్టూ వరిచేలు, చెరకు తోటలు, కాలువ. ఆ కాలువలో ఎండనకా, వాననకా ఈతగొట్టే పిల్లలు, అక్కడి వాతావరణం మధ్య మనుషుల మధ్య చాలా ప్రశాంతంగా వుండొచ్చు మీరు" అన్నది మధురిమ.

    అలాంటి పల్లెటూళ్ళంటే నాకూ యిష్టమే. ఇంతకీ లాయర్ నీలకంఠన్  గారు ఏమన్నారు? అక్కడికి వెళ్ళాక  మీ అక్కగారు నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారో" సందేహాన్ని వ్యక్తం చేశాడు కాశీచరణ్..

    "మీరు ఏకాంత వాతావరణంలో వుండాలన్నదే లాయర్ నీలకంఠన్  గారి అభిప్రాయం కూడా. మా అక్క, బావ, కళ్యాణి అందరూ మంచి వాళ్ళే. మీరు అక్కడా మొహమాటం పడాల్సిన అవసరంలేదు.

    "నేనొక పేషెంట్ అనే విషయం వాళ్ళకు చెప్పాలి. అవునా? ఒక పేషెంట్ ను ఇంట్లో వుంచుకోవడానికి ఎవరైనా సమ్మతిస్తారా?"

    "అదా మీ భయం. మిమల్ని చూస్తె ఎవరూ పేషెంట్ అనుకోరు.అదే కాకుండా, మీ వ్యాధి తగ్గుముఖం పడుతోంది. అక్కడి వాతావరణంలో కెళ్ళాక, పూర్తిగా తగ్గిపోతుంది."

    అసలు నా గత మేమిటో, నేనెవరో మీ అక్కగారికి తెలవాలిగా పల్లెటూళ్ళలో ఇవేగా ముందు అడిగేది."

    "ఎవరూ మిమ్మల్ని అనవసరమైన విషయాలదిగి బాధపెట్టారు. ఇంట్లో మనిషిలా వుండొచ్చు. నేను మీతోపాటు సమ్మిశ్ర మగూడెం వచ్చాక రెండురోజులు వుండి వచ్చేస్తాను. వారానికోసారి డాక్టర్ చేకఫ్ కోసం రాజమండ్రి నుంచి ఒక డాక్టర్ వచ్చి మిమ్మల్ని చూసే ఏర్పాటు చేస్తాను. అక్కడ మీకు చాలా ఇంటరెస్టు కారెక్టర్ మా  నాన్నగారు" అంటూ ఆమె ఇంకేదో చెప్పబోతుండగా డోర్ తెరుచుకుని శివానందం లోనికి వచ్చాడు. అతన్ని చూశాకే ఆమెకి షాపింగ్ విషయం గుర్తొచ్చింది.

    "అయితే యివాళ మధ్యాహ్నం షాపింగ్ కి వెళతారా?"

    "అలాగే" అన్నాడు కాశీచరణ్

    "ఎలా వెళతారు?" అడిగింది మధురిమ.

    "ఆటోలో" సింపుల్ గా అన్నాడు కాశీచరణ్.

    "కాదు నా కారులో వెళ్ళండి. శివానందం కూడా మీకు తోడుగా వుంటాడు. కారు డ్రైవ్ చేయగలరనుకుంటాను" ప్రశ్నించిందామె.

    ఆ ప్రశ్నకు  కాశీచరణ్ జవాబు చెప్పలేదు.

    "కారు డ్రైవింగ్ రాదా మీకు?"

    "తెలీదు...జ్ఞాపకం లేదు..." అన్నాడు కాశీచరణ్.

    మధురిమ కావాలనే డ్రైవింగ్ గురించి  అడిగింది. మెమొరీ సేల్స్ రివైవ్ లో ప్రాసీస్ ఏక్టివేట్ అవుతుందని.

    మధ్యాహ్నం కాశీచరణ్ తో పాటు అబిడ్స్ కి వెళ్ళాలని శివానందానికి చెప్పి ఆ రూమ్ లోంచి బయటకు వెళ్ళిపోయింది డాక్టర్ మధురిమ.
   
                                                   *    *    *    *
   
    అంబులెన్స్ డ్రైవర్ తీసుకుని మధురిమ కారులో మధ్యాహ్నం మూడు గంటలకు అబిడ్స్ కు బయలుదేరాడు కాశీచరణ్, శివానందం.

    కాశీచరణ్ మనసు చాలా ఆనందంగా వుంది.  హైదరాబాదు చూడటం అది మొదటిసారో, కాదో అతనికి తెలీకపోయినా, గంటసేపు కార్లోనే ఊరంతా తిరిగాక, అబిడ్స్ సెంటర్ కొచ్చి కారు ఆగింది.

    "నువ్విక్కడే వుండు...మేం గంటలో వస్తాం..." చెప్పాడు డ్రయివర్ తో శివానందం. నలువైపులా చూస్తూ ముందుకు నడుస్తున్నాడు కాశీచరణ్.

    "రేమాండ్స్ సూట్ తీసుకుంటారా సార్...?" అడిగాడు శివానందం.

    "ఒక పేషెంట్ సూట్స్ వేసుకుని తిరిగితే ఏం బాగుంటుందయ్యా!"

    "అయితే చర్మాస్ లోకి వెళ్దాం పదండి..."

     "ముందు మంచి శారీ షాపుకెళదాం ..." అన్నాడు కాశీచరణ్.

    "అయితే పదండి..." అంటూ ఎదురుగావున్న ఓ సారీ షాపును చూపించాడు.

    సెంట్రల్ ఏ.సి.షాపు లోపలికి ప్రవేశించదు కాశీచరణ్. నేరుగా శారీ సెక్షన్ వైపు నడిచాడు. ఏం కావాలో అడిగి, సేల్స్ గర్ల్ రకరకాల చీరలు చూపిస్తోంది.

    మేఘం రంగు చీరని తీసి_

    "ఈ చీర ఎలా వుంటుంది?" అని శివనందాన్ని అడిగాడు కాశీచరణ్.

    "వండ్రపుల్ సార్... "అన్నాడు శివానందం.

    మీ మేడమ్ గారికే_ తను చామన చాయలో వుంటుందిగదా! ఇదే బావుంటుంది" అన్నాడు కాశీచరణ్ దానికేసి మక్కువుగా చూస్తూ.

    అది వింటూనే శివానందం కొద్ది క్షణాలు విస్మయానికి గురయ్యాడు.

    మధురిమకు చీర తీసుకున్నాక, మధురిమ అక్క ప్రమద్వరకు,   బావకు, మధురిమ నాన్నగారికి డ్రస్సులు తీసుకున్నాడు.

    రకరకాల దుస్తుల్లోంచి ఒక మిడ్డిని సెలక్ట్ చేశాడు_ మధురిమ అక్కకూతురు కళ్యాణికి.

    "ఓంటిరంగు ఏదైనా, ఈ మిడ్డీ బాగుంటుంది సార్..." సేల్స్ మెన్ కూడా చెప్పడంతో  ఆ మిడ్డీ ని కూడా తీసుకున్నాడు. తరువాత తనకు అవసరమైన బట్టలు తీసుకున్నాక_

 Previous Page Next Page